logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వర్షం, ఉప్పల్ ఫ్లైఓవర్ పనులతో ఘట్‌కేసర్–ఉప్పల్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ నిన్న కురిసిన వర్షం కారణంగా పలువురు ఉద్యోగులు ప్రజా రవాణాకు బదులుగా తమ సొంత వాహనాల్లో విధులకు వెళ్లడంతో రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. అదే సమయంలో ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండటం కూడా ట్రాఫిక్ జామ్‌కు ప్రధాన కారణంగా మారింది. ఈ రెండు కారణాలతో ఘట్‌కేసర్ నుండి ఉప్పల్ వెళ్లే మార్గంలో భారీ ట్రాఫిక్ నిలిచిపోయి, వాహనాలు గంటల తరబడి నెమ్మదిగా కదిలాయి. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు

6 hrs ago
user_CHERUKU RAMESH
CHERUKU RAMESH
Chiropractor మేడిపల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
6 hrs ago
214a7038-4d54-4932-9146-8c12d0f846ed
074fd259-24b0-46a1-b1d3-ab43f74ef070
3cd6290c-dc54-4423-a3a4-8121ced3f1a0

వర్షం, ఉప్పల్ ఫ్లైఓవర్ పనులతో ఘట్‌కేసర్–ఉప్పల్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ నిన్న కురిసిన వర్షం కారణంగా పలువురు ఉద్యోగులు ప్రజా రవాణాకు బదులుగా తమ సొంత వాహనాల్లో విధులకు వెళ్లడంతో రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. అదే సమయంలో ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండటం కూడా ట్రాఫిక్ జామ్‌కు ప్రధాన కారణంగా మారింది. ఈ రెండు కారణాలతో ఘట్‌కేసర్ నుండి ఉప్పల్ వెళ్లే మార్గంలో భారీ ట్రాఫిక్ నిలిచిపోయి, వాహనాలు గంటల తరబడి నెమ్మదిగా కదిలాయి. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • కాంగ్రెస్ ‘6 గ్యారెంటీలు’ గాలికి.. ‘6 సీ’లతో తెలంగాణ దోపిడీ: ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా పాలనలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ విమర్శించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించి, కొత్తగా ‘6 సీ’ల దోపిడీ పాలనను సాగిస్తోందని ఆరోపించారు. నేరాలు, అవినీతి, కమీషన్లు, కాంట్రాక్టులు, హైకమాండ్‌కు కప్పం, ప్రభుత్వ వ్యవస్థలపై ఆధిపత్యం అనే ‘6 సీ’లతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అప్పులు పెరుగుతుండగా ప్రభుత్వ ఆస్తులు తగ్గిపోతున్నాయని, మంత్రుల ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయని ఆరోపించారు. రెండున్నరేళ్లలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను 40 సార్లకు పైగా బదిలీ చేశారని, ప్రభుత్వానికి పరిపాలనపై పట్టు లేదని విమర్శించారు. అవినీతి కేసుల్లో తెలంగాణ అధికారులు అగ్రస్థానంలో ఉన్నారని, గత మూడు నెలల్లో ఏసీబీ 67 కేసులు నమోదు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, ఫార్ములా-ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్ తదితర కేసుల విచారణలను నీరుగార్చిందని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ప్రతి మండలంలో బీజేపీ శ్రేణులు నిలదీస్తాయని డాక్టర్ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ తెలిపారు.
    1
    కాంగ్రెస్ ‘6 గ్యారెంటీలు’ గాలికి.. ‘6 సీ’లతో తెలంగాణ దోపిడీ: ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా పాలనలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ విమర్శించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించి, కొత్తగా ‘6 సీ’ల దోపిడీ పాలనను సాగిస్తోందని ఆరోపించారు.
నేరాలు, అవినీతి, కమీషన్లు, కాంట్రాక్టులు, హైకమాండ్‌కు కప్పం, ప్రభుత్వ వ్యవస్థలపై ఆధిపత్యం అనే ‘6 సీ’లతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అప్పులు పెరుగుతుండగా ప్రభుత్వ ఆస్తులు తగ్గిపోతున్నాయని, మంత్రుల ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయని ఆరోపించారు.
రెండున్నరేళ్లలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను 40 సార్లకు పైగా బదిలీ చేశారని, ప్రభుత్వానికి పరిపాలనపై పట్టు లేదని విమర్శించారు. అవినీతి కేసుల్లో తెలంగాణ అధికారులు అగ్రస్థానంలో ఉన్నారని, గత మూడు నెలల్లో ఏసీబీ 67 కేసులు నమోదు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, ఫార్ములా-ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్ తదితర కేసుల విచారణలను నీరుగార్చిందని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ప్రతి మండలంలో బీజేపీ శ్రేణులు నిలదీస్తాయని డాక్టర్ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ తెలిపారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
  • వర్షం, ఉప్పల్ ఫ్లైఓవర్ పనులతో ఘట్‌కేసర్–ఉప్పల్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ నిన్న కురిసిన వర్షం కారణంగా పలువురు ఉద్యోగులు ప్రజా రవాణాకు బదులుగా తమ సొంత వాహనాల్లో విధులకు వెళ్లడంతో రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. అదే సమయంలో ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండటం కూడా ట్రాఫిక్ జామ్‌కు ప్రధాన కారణంగా మారింది. ఈ రెండు కారణాలతో ఘట్‌కేసర్ నుండి ఉప్పల్ వెళ్లే మార్గంలో భారీ ట్రాఫిక్ నిలిచిపోయి, వాహనాలు గంటల తరబడి నెమ్మదిగా కదిలాయి. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు
    4
    వర్షం, ఉప్పల్ ఫ్లైఓవర్ పనులతో ఘట్‌కేసర్–ఉప్పల్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్
నిన్న కురిసిన వర్షం కారణంగా పలువురు ఉద్యోగులు ప్రజా రవాణాకు బదులుగా తమ సొంత వాహనాల్లో విధులకు వెళ్లడంతో రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది.
అదే సమయంలో ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండటం కూడా ట్రాఫిక్ జామ్‌కు ప్రధాన కారణంగా మారింది. ఈ రెండు కారణాలతో ఘట్‌కేసర్ నుండి ఉప్పల్ వెళ్లే మార్గంలో భారీ ట్రాఫిక్ నిలిచిపోయి, వాహనాలు గంటల తరబడి నెమ్మదిగా కదిలాయి.
దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు
    user_CHERUKU RAMESH
    CHERUKU RAMESH
    Chiropractor మేడిపల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    6 hrs ago
  • Emotional Appeal: Mother Seeks Missing Son Sheikh Baba Fakhar An emotional appeal has been made by a mother searching for her missing son, Sheikh Baba Fakhar. According to the family, the mother has travelled to Hyderabad in the hope of meeting her son. In her heartfelt message, she requests him to contact her, saying: "My son, wherever you are, please come and meet me once. At least call me or send me a message so I know you are safe. I have come to Hyderabad to see you. Please contact me. I am waiting for you." Anyone with information about Sheikh Baba Fakhar is requested to contact the family.
    1
    Emotional Appeal: Mother Seeks Missing Son Sheikh Baba Fakhar
An emotional appeal has been made by a mother searching for her missing son, Sheikh Baba Fakhar.
According to the family, the mother has travelled to Hyderabad in the hope of meeting her son. In her heartfelt message, she requests him to contact her, saying:
"My son, wherever you are, please come and meet me once. At least call me or send me a message so I know you are safe. I have come to Hyderabad to see you. Please contact me. I am waiting for you."
Anyone with information about Sheikh Baba Fakhar is requested to contact the family.
    user_Abdul Samad
    Abdul Samad
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను మోసం చేయొద్దు: శ్రీ చైతన్య యాజమాన్యానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హెచ్చరిక హైదరాబాద్ నారాయణగూడలోని శ్రీ చైతన్య కళాశాలను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సందర్శించారు. పత్రికల్లో ర్యాంకుల పేరుతో ప్రకటనలు ప్రచురిస్తూ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన నేరుగా కళాశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు ప్రచారాలతో విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తే సహించబోమని హెచ్చరించారు. విద్యను వ్యాపారంగా మార్చి ప్రజలను మభ్యపెట్టే చర్యలు వెంటనే నిలిపివేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
    1
    ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను మోసం చేయొద్దు: శ్రీ చైతన్య యాజమాన్యానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హెచ్చరిక
హైదరాబాద్ నారాయణగూడలోని శ్రీ చైతన్య కళాశాలను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సందర్శించారు. పత్రికల్లో ర్యాంకుల పేరుతో ప్రకటనలు ప్రచురిస్తూ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన నేరుగా కళాశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు ప్రచారాలతో విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తే సహించబోమని హెచ్చరించారు. విద్యను వ్యాపారంగా మార్చి ప్రజలను మభ్యపెట్టే చర్యలు వెంటనే నిలిపివేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
    user_Jeetender
    Jeetender
    Mobile Phone Accessory Shop సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    57 min ago
  • కెసిఆర్ సీఎం అయినాకే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి వచ్చింది: మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయ్యాక ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు 04 ఆగస్ట్ 2016లో నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చింది.. ఇవ్వాల్టితో పదేళ్లు పూర్తయింది ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు అప్పుడు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది.. అయినా కూడా ఒప్పందం కుదుర్చుకోలేకపోయారు కేసీఆర్ గారు లౌక్యం ప్రదర్శించి ఒప్పందం కుదుర్చుకున్నారు ఈరోజు కన్నెపల్లి దగ్గర నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి NDSAను సాకుగా చూపించి ఎత్తిపోయడం లేదు • మాజీ మంత్రి జీవన్ రెడ్డి
    1
    కెసిఆర్ సీఎం అయినాకే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి వచ్చింది: మాజీ మంత్రి జీవన్ రెడ్డి 
కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయ్యాక ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చాడు
ఎల్లంపల్లి ప్రాజెక్టు 04 ఆగస్ట్ 2016లో నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చింది.. ఇవ్వాల్టితో పదేళ్లు పూర్తయింది
ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు
అప్పుడు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది.. అయినా కూడా ఒప్పందం కుదుర్చుకోలేకపోయారు
కేసీఆర్ గారు లౌక్యం ప్రదర్శించి ఒప్పందం కుదుర్చుకున్నారు
ఈరోజు కన్నెపల్లి దగ్గర నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి NDSAను సాకుగా చూపించి ఎత్తిపోయడం లేదు
• మాజీ మంత్రి జీవన్ రెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    3 hrs ago
  • కార్మికులకు అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ* రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల హక్కుల కోసం బస్ భవన్‌లో గళమెత్తిన *టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* బస్ భవన్,హైదరాబాద్: హైదరాబాద్‌లోని బస్ భవన్‌ను ముట్టడించిన టి.జి.ఎస్.ఆర్.టి.సి విశ్రాంతి ఉద్యోగుల ఆందోళన మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. రిటైర్డ్ ఉద్యోగులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బస్ భవన్‌కు చేరుకోగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చివరకు మల్లన్నతో పాటు ఐదుగురు రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులకు మాత్రమే అధికారులను కలిసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. *2013, 2017,2021 వేతన సవరణ మరియు PF బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్* *ప్రభుత్వానికి తీన్మార్ మల్లన్న డెడ్ లైన్* *వారం రోజుల్లో బెనిఫిట్స్ ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక* *అవసరమైతే కార్మికులతో కలిసి అసెంబ్లీ ముట్టడి...* *ఆర్టీసీ ఎన్నికల్లోనూ పోరాటానికి సిద్ధమని మల్లన్న స్పష్టం* *రేవంత్ రెడ్డి చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి* *మహేష్ కుమార్ గౌడ్,పొన్నం సమాధానం చెప్పాలి* * అనంతరం ఆర్టీసీ అధికారులతో జరిగిన సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై వారిని మల్లన్న నిలదీశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన PF, EPS-95, PF కాంట్రిబ్యూషన్, డీఏ, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంచడం అన్యాయమని మండిపడ్డారు. 2013లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఎంప్లాయర్ వాటా PF ఇప్పటికీ చెల్లించలేదని, 2017 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు 2021 నుంచి రావాల్సిన బకాయిలు విడుదల కాలేదని పేర్కొన్నారు. ఉద్యోగులు జీవితాంతం సంస్థ కోసం కష్టపడితే, రిటైర్మెంట్ తర్వాత వారికి రావాల్సిన కష్టార్జిత సొమ్మును నిలిపివేయడం అమానుషమని అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై మల్లన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని,సమ్మె సమయంలో కార్మికులకు అండగా ఉన్నట్లు చెప్పుకున్న ప్రభుత్వం,తర్వాత వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఢిల్లీ మాదిరి ఉద్యమం ఈ తెలంగాణలో పుట్టిస్తానని మల్లన్న స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి లాంటి ఒక సన్నాసి దద్దమ్మ ముఖ్యమంత్రి ఉన్నందు వలన ఆర్టీసీ కార్మికులకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఇలాంటి ముఖ్యమంత్రి మన తెలంగాణకు ఉండడం దురదృష్టకరమని అన్నారు. రాబోయే రోజుల్లో ఇదే ఆర్టీసీ కార్మికులు రేవంత్ సర్కార్ ను బొందపెడుతుందని హెచ్చరించారు. "17 వేల మంది రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు అండగా తీన్మార్ మల్లన్న ఉన్నాడని,వారి హక్కుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. అవసరమైతే బస్ భవన్ ను అర్రాస్ పాట పెట్టి అమ్మైనా సరే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించుకుంటామని ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం చూసుకోవాలని స్పష్టం చేశారు. వారం రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బెనిఫిట్స్ విడుదల చేయాలని, లేకుంటే డిల్లీ తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కేవలం వారం రోజులే రేవంత్ సర్కార్ కు డెడ్ లైన్ అని హెచ్చరించారు. అవసరమైతే రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించారు. ఆర్టీసీ ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తూ "దమ్ముంటే ఎన్నికలకు రండి... నేను ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల తరఫున వస్తా...రేవంత్ తన బొమ్మతో,కాంగ్రెస్ పార్టీ జెండాతో రావాలని... కార్మికులే తీర్పు చెబుతారు" అంటూ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. "కార్మికులను మోసం చేస్తే ప్రభుత్వం, అధికారులు ఇద్దరూ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని,ఆర్టీసీ ఉద్యోగులను నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు" అని మల్లన్న హెచ్చరించారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేయడంతో పాటు అసెంబ్లీ ముట్టడి సహా భారీ ఉద్యమాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం వహిస్తుందని ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన నిలుస్తుందని, వారి హక్కుల సాధన కోసం శాసనమండలిలో, ప్రజాక్షేత్రంలోనూ తీన్మార్ మల్లన్నగా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజ్ ,రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ సాజిద్,గ్రేటర్ హైదరాబాద్ జోన్ BWU గౌరవ అధ్యక్షుడు TVR,తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క,సహాయ కార్యదర్శి గిరిగాని బిక్షపతి గౌడ్,రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
    4
    కార్మికులకు అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ*

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల హక్కుల కోసం బస్ భవన్‌లో గళమెత్తిన *టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*

బస్ భవన్,హైదరాబాద్:
హైదరాబాద్‌లోని బస్ భవన్‌ను ముట్టడించిన టి.జి.ఎస్.ఆర్.టి.సి విశ్రాంతి ఉద్యోగుల ఆందోళన మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. రిటైర్డ్ ఉద్యోగులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బస్ భవన్‌కు చేరుకోగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చివరకు మల్లన్నతో పాటు ఐదుగురు రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులకు మాత్రమే అధికారులను కలిసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు.

*2013, 2017,2021 వేతన సవరణ మరియు  PF  బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్*
*ప్రభుత్వానికి తీన్మార్ మల్లన్న డెడ్ లైన్*
*వారం రోజుల్లో బెనిఫిట్స్ ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక*
*అవసరమైతే కార్మికులతో కలిసి అసెంబ్లీ ముట్టడి...*
*ఆర్టీసీ ఎన్నికల్లోనూ పోరాటానికి సిద్ధమని మల్లన్న స్పష్టం*
*రేవంత్ రెడ్డి చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి*
*మహేష్ కుమార్ గౌడ్,పొన్నం సమాధానం చెప్పాలి*
*
అనంతరం ఆర్టీసీ అధికారులతో జరిగిన సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై వారిని మల్లన్న నిలదీశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన PF, EPS-95, PF కాంట్రిబ్యూషన్, డీఏ, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంచడం అన్యాయమని మండిపడ్డారు.
2013లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఎంప్లాయర్ వాటా PF ఇప్పటికీ చెల్లించలేదని, 2017 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు 2021 నుంచి రావాల్సిన బకాయిలు విడుదల కాలేదని పేర్కొన్నారు. ఉద్యోగులు జీవితాంతం సంస్థ కోసం కష్టపడితే, రిటైర్మెంట్ తర్వాత వారికి రావాల్సిన కష్టార్జిత సొమ్మును నిలిపివేయడం అమానుషమని అన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై మల్లన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని,సమ్మె సమయంలో కార్మికులకు అండగా ఉన్నట్లు చెప్పుకున్న ప్రభుత్వం,తర్వాత వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఢిల్లీ మాదిరి ఉద్యమం ఈ తెలంగాణలో పుట్టిస్తానని మల్లన్న స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి లాంటి ఒక సన్నాసి దద్దమ్మ ముఖ్యమంత్రి ఉన్నందు వలన ఆర్టీసీ కార్మికులకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఇలాంటి ముఖ్యమంత్రి మన తెలంగాణకు ఉండడం దురదృష్టకరమని అన్నారు. రాబోయే  రోజుల్లో ఇదే ఆర్టీసీ కార్మికులు రేవంత్ సర్కార్ ను బొందపెడుతుందని హెచ్చరించారు.
"17 వేల మంది రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు అండగా తీన్మార్ మల్లన్న ఉన్నాడని,వారి హక్కుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. అవసరమైతే బస్ భవన్ ను అర్రాస్ పాట పెట్టి అమ్మైనా సరే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించుకుంటామని ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం చూసుకోవాలని స్పష్టం చేశారు.
వారం రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బెనిఫిట్స్ విడుదల చేయాలని, లేకుంటే డిల్లీ తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కేవలం వారం రోజులే రేవంత్ సర్కార్ కు డెడ్ లైన్ అని  హెచ్చరించారు. అవసరమైతే రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించారు.
ఆర్టీసీ ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తూ "దమ్ముంటే ఎన్నికలకు రండి... నేను ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల తరఫున వస్తా...రేవంత్ తన బొమ్మతో,కాంగ్రెస్ పార్టీ జెండాతో రావాలని... కార్మికులే తీర్పు చెబుతారు" అంటూ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు.
"కార్మికులను మోసం చేస్తే ప్రభుత్వం, అధికారులు ఇద్దరూ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని,ఆర్టీసీ ఉద్యోగులను నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు" అని మల్లన్న హెచ్చరించారు.
రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేయడంతో పాటు అసెంబ్లీ ముట్టడి సహా భారీ ఉద్యమాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం వహిస్తుందని ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన నిలుస్తుందని, వారి హక్కుల సాధన కోసం శాసనమండలిలో, ప్రజాక్షేత్రంలోనూ తీన్మార్ మల్లన్నగా  పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బహుజన్ వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజ్ ,రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ సాజిద్,గ్రేటర్ హైదరాబాద్ జోన్ BWU గౌరవ అధ్యక్షుడు TVR,తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క,సహాయ కార్యదర్శి గిరిగాని బిక్షపతి గౌడ్,రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
    user_SAI KIRAN TRP
    SAI KIRAN TRP
    కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    3 hrs ago
  • గుడ్‌లైఫ్ స్కూల్‌లో చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలోవిద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు గుడ్‌లైఫ్ స్కూల్‌లో చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం హైదరాబాద్: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గుడ్‌లైఫ్ స్కూల్‌లో చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వైద్య సలహాలు, మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి చైతన్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుంటి శాంసన్, అలకొండ శరణ్ బసవప్ప ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారంపై అవగాహన పెంపొందించుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కాలనీ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, వీర శివ లింగాయత్ ప్రెసిడెంట్ ఆలకొండ శరన్ బసప్ప, మాజీ కార్పొరేటర్ భీరప్ప, బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, ఆర్టీసీ కాలనీ గౌరవ అధ్యక్షుడు కిషన్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవలో భాగంగా విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం చైతన్య ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు. వైద్య శిబిరంలో నిపుణులైన వైద్యులు విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై నిరంతరం శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు మరియు చైతన్య ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
    4
    గుడ్‌లైఫ్ స్కూల్‌లో చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలోవిద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు 
గుడ్‌లైఫ్ స్కూల్‌లో చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
హైదరాబాద్: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గుడ్‌లైఫ్ స్కూల్‌లో చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వైద్య సలహాలు, మందులను ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమానికి చైతన్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుంటి శాంసన్, అలకొండ శరణ్ బసవప్ప ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారంపై అవగాహన పెంపొందించుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కాలనీ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, వీర శివ లింగాయత్ ప్రెసిడెంట్ ఆలకొండ శరన్ బసప్ప, మాజీ కార్పొరేటర్ భీరప్ప, బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, ఆర్టీసీ కాలనీ గౌరవ అధ్యక్షుడు కిషన్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవలో భాగంగా విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం చైతన్య ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు.
వైద్య శిబిరంలో నిపుణులైన వైద్యులు విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై నిరంతరం శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు మరియు చైతన్య ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • కేటీఆర్‌ను కలిసిన మాజీ కార్పొరేటర్ నిరుగొండ జగదీష్ గౌడ్ మల్కాజ్‌గిరిలో ఈ నెల 10వ తేదీన జరగనున్న మహంకాళి జాతర ఫలారం బండి ఊరేగింపుకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ కార్పొరేటర్ నిరుగొండ జగదీష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తన మిత్రుడు నల్లవెల్లి కార్తీక్‌ను కేటీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీలో చేర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అరుణ్ తేజ, నవీన్, కార్తీక్ పాల్గొన్నారు.
    1
    కేటీఆర్‌ను కలిసిన మాజీ కార్పొరేటర్ నిరుగొండ జగదీష్ గౌడ్
మల్కాజ్‌గిరిలో ఈ నెల 10వ తేదీన జరగనున్న మహంకాళి జాతర ఫలారం బండి ఊరేగింపుకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ కార్పొరేటర్ నిరుగొండ జగదీష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తన మిత్రుడు నల్లవెల్లి కార్తీక్‌ను కేటీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీలో చేర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అరుణ్ తేజ, నవీన్, కార్తీక్ పాల్గొన్నారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.