గుడ్‌లైఫ్ స్కూల్‌లో చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలోవిద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు గుడ్‌లైఫ్ స్కూల్‌లో చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం హైదరాబాద్: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గుడ్‌లైఫ్ స్కూల్‌లో చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వైద్య సలహాలు, మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి చైతన్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుంటి శాంసన్, అలకొండ శరణ్ బసవప్ప ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారంపై అవగాహన పెంపొందించుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కాలనీ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, వీర శివ లింగాయత్ ప్రెసిడెంట్ ఆలకొండ శరన్ బసప్ప, మాజీ కార్పొరేటర్ భీరప్ప, బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, ఆర్టీసీ కాలనీ గౌరవ అధ్యక్షుడు కిషన్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవలో భాగంగా విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం చైతన్య ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు. వైద్య శిబిరంలో నిపుణులైన వైద్యులు విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై నిరంతరం శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు మరియు చైతన్య ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
గుడ్‌లైఫ్ స్కూల్‌లో చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలోవిద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు గుడ్‌లైఫ్ స్కూల్‌లో చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం హైదరాబాద్: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గుడ్‌లైఫ్ స్కూల్‌లో చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వైద్య
సలహాలు, మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి చైతన్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుంటి శాంసన్, అలకొండ శరణ్ బసవప్ప ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారంపై అవగాహన పెంపొందించుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక వ్యాధులను
ముందుగానే గుర్తించి నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కాలనీ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, వీర శివ లింగాయత్ ప్రెసిడెంట్ ఆలకొండ శరన్ బసప్ప, మాజీ కార్పొరేటర్ భీరప్ప, బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, ఆర్టీసీ కాలనీ గౌరవ అధ్యక్షుడు కిషన్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవలో భాగంగా విద్యార్థుల
ఆరోగ్య సంరక్షణ కోసం చైతన్య ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు. వైద్య శిబిరంలో నిపుణులైన వైద్యులు విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై నిరంతరం శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు మరియు చైతన్య ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
- కెసిఆర్ సీఎం అయినాకే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి వచ్చింది: మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయ్యాక ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు 04 ఆగస్ట్ 2016లో నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చింది.. ఇవ్వాల్టితో పదేళ్లు పూర్తయింది ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు అప్పుడు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది.. అయినా కూడా ఒప్పందం కుదుర్చుకోలేకపోయారు కేసీఆర్ గారు లౌక్యం ప్రదర్శించి ఒప్పందం కుదుర్చుకున్నారు ఈరోజు కన్నెపల్లి దగ్గర నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి NDSAను సాకుగా చూపించి ఎత్తిపోయడం లేదు • మాజీ మంత్రి జీవన్ రెడ్డి1
- గుడ్‌లైఫ్ స్కూల్‌లో చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలోవిద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు గుడ్‌లైఫ్ స్కూల్‌లో చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం హైదరాబాద్: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గుడ్‌లైఫ్ స్కూల్‌లో చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వైద్య సలహాలు, మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి చైతన్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుంటి శాంసన్, అలకొండ శరణ్ బసవప్ప ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారంపై అవగాహన పెంపొందించుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కాలనీ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, వీర శివ లింగాయత్ ప్రెసిడెంట్ ఆలకొండ శరన్ బసప్ప, మాజీ కార్పొరేటర్ భీరప్ప, బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, ఆర్టీసీ కాలనీ గౌరవ అధ్యక్షుడు కిషన్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవలో భాగంగా విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం చైతన్య ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు. వైద్య శిబిరంలో నిపుణులైన వైద్యులు విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై నిరంతరం శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు మరియు చైతన్య ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.4
- Emotional Appeal: Mother Seeks Missing Son Sheikh Baba Fakhar An emotional appeal has been made by a mother searching for her missing son, Sheikh Baba Fakhar. According to the family, the mother has travelled to Hyderabad in the hope of meeting her son. In her heartfelt message, she requests him to contact her, saying: "My son, wherever you are, please come and meet me once. At least call me or send me a message so I know you are safe. I have come to Hyderabad to see you. Please contact me. I am waiting for you." Anyone with information about Sheikh Baba Fakhar is requested to contact the family.1
- ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను మోసం చేయొద్దు: శ్రీ చైతన్య యాజమాన్యానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హెచ్చరిక హైదరాబాద్ నారాయణగూడలోని శ్రీ చైతన్య కళాశాలను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సందర్శించారు. పత్రికల్లో ర్యాంకుల పేరుతో ప్రకటనలు ప్రచురిస్తూ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన నేరుగా కళాశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు ప్రచారాలతో విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తే సహించబోమని హెచ్చరించారు. విద్యను వ్యాపారంగా మార్చి ప్రజలను మభ్యపెట్టే చర్యలు వెంటనే నిలిపివేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.1
- వర్షం, ఉప్పల్ ఫ్లైఓవర్ పనులతో ఘట్‌కేసర్–ఉప్పల్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ నిన్న కురిసిన వర్షం కారణంగా పలువురు ఉద్యోగులు ప్రజా రవాణాకు బదులుగా తమ సొంత వాహనాల్లో విధులకు వెళ్లడంతో రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. అదే సమయంలో ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండటం కూడా ట్రాఫిక్ జామ్‌కు ప్రధాన కారణంగా మారింది. ఈ రెండు కారణాలతో ఘట్‌కేసర్ నుండి ఉప్పల్ వెళ్లే మార్గంలో భారీ ట్రాఫిక్ నిలిచిపోయి, వాహనాలు గంటల తరబడి నెమ్మదిగా కదిలాయి. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు4
- ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను మోసం చేయొద్దు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ర్యాంకుల ప్రకటనల పేరుతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యాన్ని కలిసి హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన అంశాల్లో పారదర్శకత పాటించాలని, తప్పుడు ప్రచారాలతో తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ర్యాంకులు, ఫలితాల విషయంలో వాస్తవ సమాచారమే ప్రచారం చేయాలని ఆయన కోరారు. విద్యా రంగంలో నాణ్యమైన బోధన, విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని యాజమాన్యానికి తీన్మార్ మల్లన్న సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిపారు.1
- కార్మికులకు అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ* రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల హక్కుల కోసం బస్ భవన్‌లో గళమెత్తిన *టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* బస్ భవన్,హైదరాబాద్: హైదరాబాద్‌లోని బస్ భవన్‌ను ముట్టడించిన టి.జి.ఎస్.ఆర్.టి.సి విశ్రాంతి ఉద్యోగుల ఆందోళన మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. రిటైర్డ్ ఉద్యోగులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బస్ భవన్‌కు చేరుకోగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చివరకు మల్లన్నతో పాటు ఐదుగురు రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులకు మాత్రమే అధికారులను కలిసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. *2013, 2017,2021 వేతన సవరణ మరియు PF బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్* *ప్రభుత్వానికి తీన్మార్ మల్లన్న డెడ్ లైన్* *వారం రోజుల్లో బెనిఫిట్స్ ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక* *అవసరమైతే కార్మికులతో కలిసి అసెంబ్లీ ముట్టడి...* *ఆర్టీసీ ఎన్నికల్లోనూ పోరాటానికి సిద్ధమని మల్లన్న స్పష్టం* *రేవంత్ రెడ్డి చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి* *మహేష్ కుమార్ గౌడ్,పొన్నం సమాధానం చెప్పాలి* * అనంతరం ఆర్టీసీ అధికారులతో జరిగిన సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై వారిని మల్లన్న నిలదీశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన PF, EPS-95, PF కాంట్రిబ్యూషన్, డీఏ, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంచడం అన్యాయమని మండిపడ్డారు. 2013లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఎంప్లాయర్ వాటా PF ఇప్పటికీ చెల్లించలేదని, 2017 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు 2021 నుంచి రావాల్సిన బకాయిలు విడుదల కాలేదని పేర్కొన్నారు. ఉద్యోగులు జీవితాంతం సంస్థ కోసం కష్టపడితే, రిటైర్మెంట్ తర్వాత వారికి రావాల్సిన కష్టార్జిత సొమ్మును నిలిపివేయడం అమానుషమని అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై మల్లన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని,సమ్మె సమయంలో కార్మికులకు అండగా ఉన్నట్లు చెప్పుకున్న ప్రభుత్వం,తర్వాత వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఢిల్లీ మాదిరి ఉద్యమం ఈ తెలంగాణలో పుట్టిస్తానని మల్లన్న స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి లాంటి ఒక సన్నాసి దద్దమ్మ ముఖ్యమంత్రి ఉన్నందు వలన ఆర్టీసీ కార్మికులకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఇలాంటి ముఖ్యమంత్రి మన తెలంగాణకు ఉండడం దురదృష్టకరమని అన్నారు. రాబోయే రోజుల్లో ఇదే ఆర్టీసీ కార్మికులు రేవంత్ సర్కార్ ను బొందపెడుతుందని హెచ్చరించారు. "17 వేల మంది రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు అండగా తీన్మార్ మల్లన్న ఉన్నాడని,వారి హక్కుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. అవసరమైతే బస్ భవన్ ను అర్రాస్ పాట పెట్టి అమ్మైనా సరే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించుకుంటామని ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం చూసుకోవాలని స్పష్టం చేశారు. వారం రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బెనిఫిట్స్ విడుదల చేయాలని, లేకుంటే డిల్లీ తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కేవలం వారం రోజులే రేవంత్ సర్కార్ కు డెడ్ లైన్ అని హెచ్చరించారు. అవసరమైతే రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించారు. ఆర్టీసీ ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తూ "దమ్ముంటే ఎన్నికలకు రండి... నేను ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల తరఫున వస్తా...రేవంత్ తన బొమ్మతో,కాంగ్రెస్ పార్టీ జెండాతో రావాలని... కార్మికులే తీర్పు చెబుతారు" అంటూ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. "కార్మికులను మోసం చేస్తే ప్రభుత్వం, అధికారులు ఇద్దరూ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని,ఆర్టీసీ ఉద్యోగులను నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు" అని మల్లన్న హెచ్చరించారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేయడంతో పాటు అసెంబ్లీ ముట్టడి సహా భారీ ఉద్యమాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం వహిస్తుందని ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన నిలుస్తుందని, వారి హక్కుల సాధన కోసం శాసనమండలిలో, ప్రజాక్షేత్రంలోనూ తీన్మార్ మల్లన్నగా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజ్ ,రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ సాజిద్,గ్రేటర్ హైదరాబాద్ జోన్ BWU గౌరవ అధ్యక్షుడు TVR,తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క,సహాయ కార్యదర్శి గిరిగాని బిక్షపతి గౌడ్,రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు4
- ప్రభుత్వ సంస్థలకు ఒకే వర్గం పేర్లు సరికావు : తీన్మార్ మల్లన్న తెలంగాణలో ప్రభుత్వ సంస్థలు, ప్రాజెక్టులకు ఒకే వర్గానికి చెందిన నాయకుల పేర్లు పెట్టడం సరికాదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శించారు. సనత్‌నగర్‌లో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)కు మర్రి చెన్నారెడ్డి పేరు కాకుండా తెలంగాణ వీరుడు పండుగ సాయన్న లేదా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమానికి సేవలందించిన మహనీయుల పేర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో బీసీలకు తగిన రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని, బీసీల పట్ల వివక్ష కొనసాగితే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు.1