Shuru
Apke Nagar Ki App…
ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను మోసం చేయొద్దు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ర్యాంకుల ప్రకటనల పేరుతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యాన్ని కలిసి హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన అంశాల్లో పారదర్శకత పాటించాలని, తప్పుడు ప్రచారాలతో తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ర్యాంకులు, ఫలితాల విషయంలో వాస్తవ సమాచారమే ప్రచారం చేయాలని ఆయన కోరారు. విద్యా రంగంలో నాణ్యమైన బోధన, విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని యాజమాన్యానికి తీన్మార్ మల్లన్న సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిపారు.
AlluriMahesh
ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను మోసం చేయొద్దు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ర్యాంకుల ప్రకటనల పేరుతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యాన్ని కలిసి హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన అంశాల్లో పారదర్శకత పాటించాలని, తప్పుడు ప్రచారాలతో తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ర్యాంకులు, ఫలితాల విషయంలో వాస్తవ సమాచారమే ప్రచారం చేయాలని ఆయన కోరారు. విద్యా రంగంలో నాణ్యమైన బోధన, విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని యాజమాన్యానికి తీన్మార్ మల్లన్న సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను మోసం చేయొద్దు: శ్రీ చైతన్య యాజమాన్యానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హెచ్చరిక హైదరాబాద్ నారాయణగూడలోని శ్రీ చైతన్య కళాశాలను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సందర్శించారు. పత్రికల్లో ర్యాంకుల పేరుతో ప్రకటనలు ప్రచురిస్తూ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన నేరుగా కళాశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు ప్రచారాలతో విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తే సహించబోమని హెచ్చరించారు. విద్యను వ్యాపారంగా మార్చి ప్రజలను మభ్యపెట్టే చర్యలు వెంటనే నిలిపివేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.1
- కెసిఆర్ సీఎం అయినాకే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి వచ్చింది: మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయ్యాక ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు 04 ఆగస్ట్ 2016లో నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చింది.. ఇవ్వాల్టితో పదేళ్లు పూర్తయింది ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు అప్పుడు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది.. అయినా కూడా ఒప్పందం కుదుర్చుకోలేకపోయారు కేసీఆర్ గారు లౌక్యం ప్రదర్శించి ఒప్పందం కుదుర్చుకున్నారు ఈరోజు కన్నెపల్లి దగ్గర నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి NDSAను సాకుగా చూపించి ఎత్తిపోయడం లేదు • మాజీ మంత్రి జీవన్ రెడ్డి1
- ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను మోసం చేయొద్దు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ర్యాంకుల ప్రకటనల పేరుతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యాన్ని కలిసి హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన అంశాల్లో పారదర్శకత పాటించాలని, తప్పుడు ప్రచారాలతో తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ర్యాంకులు, ఫలితాల విషయంలో వాస్తవ సమాచారమే ప్రచారం చేయాలని ఆయన కోరారు. విద్యా రంగంలో నాణ్యమైన బోధన, విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని యాజమాన్యానికి తీన్మార్ మల్లన్న సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిపారు.1
- గుడ్‌లైఫ్ స్కూల్‌లో చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలోవిద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు గుడ్‌లైఫ్ స్కూల్‌లో చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం హైదరాబాద్: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గుడ్‌లైఫ్ స్కూల్‌లో చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వైద్య సలహాలు, మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి చైతన్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుంటి శాంసన్, అలకొండ శరణ్ బసవప్ప ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారంపై అవగాహన పెంపొందించుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కాలనీ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, వీర శివ లింగాయత్ ప్రెసిడెంట్ ఆలకొండ శరన్ బసప్ప, మాజీ కార్పొరేటర్ భీరప్ప, బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, ఆర్టీసీ కాలనీ గౌరవ అధ్యక్షుడు కిషన్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవలో భాగంగా విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం చైతన్య ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు. వైద్య శిబిరంలో నిపుణులైన వైద్యులు విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై నిరంతరం శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు మరియు చైతన్య ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.4
- కాంగ్రెస్ ‘6 గ్యారెంటీలు’ గాలికి.. ‘6 సీ’లతో తెలంగాణ దోపిడీ: ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా పాలనలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ విమర్శించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించి, కొత్తగా ‘6 సీ’ల దోపిడీ పాలనను సాగిస్తోందని ఆరోపించారు. నేరాలు, అవినీతి, కమీషన్లు, కాంట్రాక్టులు, హైకమాండ్‌కు కప్పం, ప్రభుత్వ వ్యవస్థలపై ఆధిపత్యం అనే ‘6 సీ’లతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అప్పులు పెరుగుతుండగా ప్రభుత్వ ఆస్తులు తగ్గిపోతున్నాయని, మంత్రుల ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయని ఆరోపించారు. రెండున్నరేళ్లలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను 40 సార్లకు పైగా బదిలీ చేశారని, ప్రభుత్వానికి పరిపాలనపై పట్టు లేదని విమర్శించారు. అవినీతి కేసుల్లో తెలంగాణ అధికారులు అగ్రస్థానంలో ఉన్నారని, గత మూడు నెలల్లో ఏసీబీ 67 కేసులు నమోదు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, ఫార్ములా-ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్ తదితర కేసుల విచారణలను నీరుగార్చిందని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ప్రతి మండలంలో బీజేపీ శ్రేణులు నిలదీస్తాయని డాక్టర్ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ తెలిపారు.1
- వర్షం, ఉప్పల్ ఫ్లైఓవర్ పనులతో ఘట్‌కేసర్–ఉప్పల్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ నిన్న కురిసిన వర్షం కారణంగా పలువురు ఉద్యోగులు ప్రజా రవాణాకు బదులుగా తమ సొంత వాహనాల్లో విధులకు వెళ్లడంతో రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. అదే సమయంలో ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండటం కూడా ట్రాఫిక్ జామ్‌కు ప్రధాన కారణంగా మారింది. ఈ రెండు కారణాలతో ఘట్‌కేసర్ నుండి ఉప్పల్ వెళ్లే మార్గంలో భారీ ట్రాఫిక్ నిలిచిపోయి, వాహనాలు గంటల తరబడి నెమ్మదిగా కదిలాయి. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు4
- *అరుదైన గుండె లోపాలతో బాధపడుతున్న 8 నెలల ఆఫ్రికా చిన్నారికి అత్యాధునిక గుండె శస్త్రచికిత్స ద్వారా పునర్జన్మ అందించిన మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైద్యులు*1
- ప్రభుత్వ సంస్థలకు ఒకే వర్గం పేర్లు సరికావు : తీన్మార్ మల్లన్న తెలంగాణలో ప్రభుత్వ సంస్థలు, ప్రాజెక్టులకు ఒకే వర్గానికి చెందిన నాయకుల పేర్లు పెట్టడం సరికాదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శించారు. సనత్‌నగర్‌లో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)కు మర్రి చెన్నారెడ్డి పేరు కాకుండా తెలంగాణ వీరుడు పండుగ సాయన్న లేదా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమానికి సేవలందించిన మహనీయుల పేర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో బీసీలకు తగిన రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని, బీసీల పట్ల వివక్ష కొనసాగితే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు.1