logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కడప జిల్లా రోడ్డు ప్రమాదాల నివారణకు నిబంధనలను కఠిన తరం చేయాలి *కడప జిల్లా......* *రోడ్డు ప్రమాదాల నివారణకు నిబంధనలను కఠినతరం చేయాలి..!* * *జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి* * *జిల్లా ఎస్పీ తోకలిసి జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ (డీఆర్‌ఎస్‌సీ) సమావేశంలో సమీక్ష* కడప, జూలై 31 : జిల్లాలో రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రమాదాలకు దారితీసే కారణాలను గుర్తించి వెంటనే శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో.. జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్, కమిటీ చైర్మన్ డా. శ్రీధర్ చెరుకూరి తోపాటు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హాజరయ్యారు. జిల్లా రహదారి భద్రత కమిటీ (డీఆర్‌ఎస్‌సీ) సమావేశంలో అజెండాలోని రవాణా, పోలీసు, జాతీయ రహదారుల సంస్థ, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్, వైద్య తదితర శాఖల అధికారులతో కలిసి రహదారి భద్రత, ప్రమాదాల నివారణ చర్యలు, జీరో ఫ్యాటాలిటీ జిల్లా కార్యక్రమం, జాతీయ రహదారులపై ఆక్రమణల తొలగింపు, పాఠశాలల పరిసరాల్లో భద్రతా చర్యలపై ఆయా శాఖల అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో 2025-26 సంవత్సర (జూలై 26 వరకు) కాలంలో రోడ్డు ప్రమాదాల గణాంకాలను కలెక్టర్ సమీక్షించారు. ** ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 2026లో ఇప్పటివరకు మొత్తం 480 ప్రమాదాలు సంభవించగా, 241 మంది ప్రాణాలు కోల్పోయారని సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య అత్యధిక ప్రమాదాలు నమోదవుతున్న నేపథ్యంలో ఆ సమయంలో ప్రత్యేక నిఘా, ట్రాఫిక్ అమలు చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, హిట్ అండ్ రన్ ఘటనలు, పాదచారుల ప్రమాదాలు వంటి కారణాలతో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని సమీక్షలో వెల్లడైంది. హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగంపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. జీరో ఫాటాలిటీ జిల్లా కార్యక్రమం పురోగతిపై సమీక్షిస్తూ, పోలీసు, రవాణా, రోడ్లు-భవనాలు, ఎన్‌హెచ్‌ఏఐ తదితర శాఖలు సమన్వయంతో ప్రమాద ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తక్కువ వ్యయంతో అధిక ఫలితాలు ఇచ్చే చర్యలను వెంటనే అమలు చేయడంతో పాటు దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలని సూచించారు. జాతీయ రహదారులపై ఆక్రమణల తొలగింపు, ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యల అమలుపై కూడా కలెక్టర్ సమీక్షించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జాతీయ రహదారులపై ఆక్రమణలను పూర్తిగా తొలగించి, రహదారి భద్రతా ఆడిట్లను వేగవంతం చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన 92 ప్రమాదకర ప్రాంతాల్లో అవసరమైన హెచ్చరిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, సోలార్ బ్లింకర్లు, ఇతర భద్రతా మౌలిక వసతుల ఏర్పాటును నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పనుల పురోగతిపై శాఖల వారీగా ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ వంటి తీవ్రమైన ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అవసరమైన చోట డ్రైవింగ్ లైసెన్సుల సస్పెన్షన్‌తో పాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జూలై నెలలో నిబంధనలు అతిక్రమించిన 26 మంది డ్రైవింగ్ లైసెన్సులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు సమావేశంలో వెల్లడించారు. పాఠశాలల పరిసర ప్రాంతాల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. విద్యాశాఖ, పోలీసు, రవాణా, ఇంజినీరింగ్ శాఖలు సంయుక్తంగా ప్రతి పాఠశాల పరిసరాల్లో అవసరమైన ట్రాఫిక్ నియంత్రణ, హెచ్చరిక బోర్డులు, భద్రతా మౌలిక వసతులు కల్పించి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ** జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సూచించారు. ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ, సాయంత్రం వేళల్లో ప్రత్యేక నిఘా, ట్రాఫిక్ నిబంధనల కఠిన అమలు, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, మొబైల్ ఫోన్ వినియోగం వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రమాద ప్రాంతాల్లో పోలీసు, రవాణా, రోడ్లు-భవనాల శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి, హెచ్చరిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, సోలార్ బ్లింకర్లు, ఇతర భద్రతా మౌలిక వసతులను అత్యవసరంగా ఏర్పాటు చేయాలని, ప్రజల్లో రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ వీర్రాజు, కేఎంసి కమిషనర్ భవానీ ప్రసాద్, డిఎంహెచ్ఓ డా. యుగంధర్, డిసిహెచ్ఎస్ డా. హిమదేవి, డిపివో రామచంద్ర, ఆర్ అండ్ బి శాఖ ఎస్.ఈ. చంద్రశేఖర్, ఆర్టీసీ ఆర్ఎం రమేష్, కమిటీ సభ్యులైన విద్యుత్ శాఖల ఎస్.ఈ.లు, మున్సిపల్ కమిషనర్లు, నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు, ట్రాఫిక్, పోలీసు, రవాణా శాఖ అధికారులు, రోడ్ సేఫ్టీ డి.ఎస్.పి, ఐరాడ్ జిల్లా కోఆర్డినేటర్, రోడ్డు భద్రత ఎన్.జి.ఓ.ల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు...

15 hrs ago
user_అశోక్ కుమార్ రెడ్డి
అశోక్ కుమార్ రెడ్డి
Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
15 hrs ago
c63bb319-fff2-4cd9-86ec-9e08c91170ee

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
    1
    వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి
కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026:
ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
    user_Kalikiri Nestham Tv (Sufi)
    Kalikiri Nestham Tv (Sufi)
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • ఆర్టీసీ డిపో మేనేజర్‌ని సస్పెండ్ చేయాలి: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న నందికొట్కూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సస్పెండ్ చేయాలని సీపీఐ (యం ఎల్) లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన తమపై డిపో మేనేజర్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టమన్నారు. అపరిశుభ్రత మురుగునీటి సమస్య ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు.
    1
    ఆర్టీసీ డిపో మేనేజర్‌ని సస్పెండ్ చేయాలి: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు
ప్రజా సమస్యలను పరిష్కరించకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న నందికొట్కూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సస్పెండ్ చేయాలని సీపీఐ (యం ఎల్) లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన తమపై డిపో మేనేజర్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టమన్నారు. అపరిశుభ్రత మురుగునీటి సమస్య ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    37 min ago
  • ఘనంగా "శనివారం గుడి పిలుస్తోంది" కార్యక్రమం, దిగ్విజయంగా 21 వారం ఘనంగా "శనివారం గుడి పిలుస్తోంది" కార్యక్రమం, దిగ్విజయంగా 21 వారం హిందువులం వారి బంధువులం.. పత్తికొండ అభయాంజనేయస్వామి ఆలయంలో మహిళల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహణ బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. రామ్మోహన్ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళా భక్తులు పత్తికొండ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న "గుడి పిలుస్తోంది" కార్యక్రమం ఈ వారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తులు తరలివచ్చి అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సమరసత్ సేవ ఫౌండేషన్, గిడ్డయ్య అన్నగారు, స్వామివారికి అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి గురిచేశాయి. గ్రామం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మహిళల కోసం నిర్వహించిన డీఐపీ కార్యక్రమం విశేష ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో పాల్గొన్న మహిళల్లో లాటరీ విధానంలో రంగమ్మ అనే మహిళ అదృష్టవంతురాలిగా ఎంపిక కావడంతో ఆమెకు చీరను బహూకరించి సత్కరించారు. చీర అందుకున్న రంగమ్మ ఆనందం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఇతర మహిళలు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. రామ్మోహన్ మాట్లాడుతూ, దేవాలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ప్రతి కుటుంబం వారానికి కనీసం ఒకరోజు ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలని సూచించారు. "గుడి పిలుస్తోంది" కార్యక్రమం ద్వారా కుటుంబాల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెరగడంతో పాటు సమాజంలో ఐక్యత, పరస్పర ప్రేమాభిమానాలు బలపడతాయని అన్నారు. మహిళల భాగస్వామ్యంతో కార్యక్రమం మరింత విజయవంతమైందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడంతో కార్యక్రమం ముగిసింది.
    1
    ఘనంగా "శనివారం గుడి పిలుస్తోంది" కార్యక్రమం, దిగ్విజయంగా 21 వారం
ఘనంగా "శనివారం గుడి పిలుస్తోంది" కార్యక్రమం, దిగ్విజయంగా 21 వారం హిందువులం వారి బంధువులం.. పత్తికొండ అభయాంజనేయస్వామి ఆలయంలో మహిళల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహణ
బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. రామ్మోహన్ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమం
పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళా భక్తులు
పత్తికొండ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న "గుడి పిలుస్తోంది" కార్యక్రమం ఈ వారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తులు తరలివచ్చి అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో,  ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సమరసత్ సేవ ఫౌండేషన్, గిడ్డయ్య అన్నగారు, స్వామివారికి అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి గురిచేశాయి. గ్రామం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మహిళల కోసం నిర్వహించిన డీఐపీ కార్యక్రమం విశేష ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో పాల్గొన్న మహిళల్లో లాటరీ విధానంలో రంగమ్మ అనే మహిళ అదృష్టవంతురాలిగా ఎంపిక కావడంతో ఆమెకు చీరను బహూకరించి సత్కరించారు. చీర అందుకున్న రంగమ్మ ఆనందం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఇతర మహిళలు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. రామ్మోహన్ మాట్లాడుతూ, దేవాలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ప్రతి కుటుంబం వారానికి కనీసం ఒకరోజు ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలని సూచించారు. "గుడి పిలుస్తోంది" కార్యక్రమం ద్వారా కుటుంబాల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెరగడంతో పాటు సమాజంలో ఐక్యత, పరస్పర ప్రేమాభిమానాలు బలపడతాయని అన్నారు. మహిళల భాగస్వామ్యంతో కార్యక్రమం మరింత విజయవంతమైందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడంతో కార్యక్రమం ముగిసింది.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    15 min ago
  • విమానయాన శాఖ మంత్రిగా ఉత్తరాంధ్రకి చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్నా.. మన రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. 2024-25లో ప్రధాన విమానాశ్రయాల్లో 11% ఉన్న సర్వీసులు.. 2025-26 నాటికి 2% పడిపోయింది. అలానే ప్రయాణికులు కూడా తగ్గిపోయారు. -పుత్తా శివశంకర్ రెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి విమానయాన శాఖ మంత్రిగా ఉత్తరాంధ్రకి చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్నా.. మన రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. 2024-25లో ప్రధాన విమానాశ్రయాల్లో 11% ఉన్న సర్వీసులు.. 2025-26 నాటికి 2% పడిపోయింది. అలానే ప్రయాణికులు కూడా తగ్గిపోయారు. -పుత్తా శివశంకర్ రెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి
    1
    విమానయాన శాఖ మంత్రిగా ఉత్తరాంధ్రకి చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్నా.. మన రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. 2024-25లో ప్రధాన విమానాశ్రయాల్లో 11% ఉన్న  సర్వీసులు.. 2025-26 నాటికి 2% పడిపోయింది. అలానే ప్రయాణికులు కూడా తగ్గిపోయారు.

-పుత్తా శివశంకర్ రెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి

    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    18 min ago
  • ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జివర్యులు గౌరవనీయులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం 10 వార్డు లో ఎన్టీఆర్ బరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ సయ్యద్ ఇబ్రాహీం మరియు జనరల్ సెక్రటరీ నాసిర్ బాషా, పాల్గొని, పెన్షన్స్ ఇవ్వడం జరిగింది, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జివర్యులు గౌరవనీయులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం 10 వార్డు లో ఎన్టీఆర్ బరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ సయ్యద్ ఇబ్రాహీం మరియు జనరల్ సెక్రటరీ నాసిర్ బాషా, పాల్గొని, పెన్షన్స్ ఇవ్వడం జరిగింది,
    2
    ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జివర్యులు గౌరవనీయులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం 10 వార్డు లో 
 ఎన్టీఆర్ బరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ సయ్యద్ ఇబ్రాహీం మరియు జనరల్ సెక్రటరీ నాసిర్ బాషా,  పాల్గొని, పెన్షన్స్ ఇవ్వడం జరిగింది,

    user_MAA PGR NEWS
    MAA PGR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ఆశ కార్యకర్తలు ధర్నా... అన్నమయ్య జిల్లా. మదనపల్లి తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ధర్నాలో పాల్గొన్న కార్యకర్తలు తమకు నెలకు కనీస వేతనంగా రూ.26 వేల చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న తమకు గ్రాట్యూటీ, పింఛన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఇతర ఉద్యోగ భద్రతా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం తాము అందుకుంటున్న పారితోషికంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని, పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని వారు పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ధర్నా నేపథ్యంలో కలెక్టరేట్ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. కార్యక్రమం శాంతియుతంగా కొనసాగింది.
    1
    మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ఆశ కార్యకర్తలు ధర్నా...
అన్నమయ్య జిల్లా.
మదనపల్లి తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ధర్నాలో పాల్గొన్న కార్యకర్తలు తమకు నెలకు కనీస వేతనంగా రూ.26 వేల చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న తమకు గ్రాట్యూటీ, పింఛన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఇతర ఉద్యోగ భద్రతా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రస్తుతం తాము అందుకుంటున్న పారితోషికంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని, పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని వారు పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ధర్నా నేపథ్యంలో కలెక్టరేట్ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. కార్యక్రమం శాంతియుతంగా కొనసాగింది.
    user_S Reddy Raghavendra Raju
    S Reddy Raghavendra Raju
    Photographer Punganur, Chittoor•
    13 hrs ago
  • సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు జూపాడు బంగ్లా మండలం మండ్లెం సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలని సీపీఎం నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. పంట నష్టపరిహారం నమోదు చేసుకోవడానికి పలువురు రైతులు వచ్చారని అయితే నాలుగు గంటలకే సచివాలయ సిబ్బంది రైతు కేంద్రాలకు తాళం వేసి ఉండడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యమన్నారు. సచివాలయ సిబ్బందికి ఫోన్ చేసి సంప్రదించిన ఫోన్ ఎత్తలేదని విచారణ వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి వీరిని సస్పెండ్ చేయాలన్నారు.
    1
    సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు
జూపాడు బంగ్లా మండలం మండ్లెం సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలని సీపీఎం నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. పంట నష్టపరిహారం నమోదు చేసుకోవడానికి పలువురు రైతులు వచ్చారని అయితే నాలుగు గంటలకే సచివాలయ సిబ్బంది రైతు కేంద్రాలకు తాళం వేసి ఉండడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యమన్నారు. సచివాలయ సిబ్బందికి ఫోన్ చేసి సంప్రదించిన ఫోన్ ఎత్తలేదని విచారణ వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి వీరిని సస్పెండ్ చేయాలన్నారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    42 min ago
  • అమరావతి ప్రాంతంలో పేదలు ఉండకూడదని అంటున్నారు. వైయస్ జగన్ గారు పేదల కోసం అమరావతిలో పేదలకు ఇళ్లు కేటాయిస్తే.. మీరు అధికారంలోకి రాగానే ఆ ఇళ్లను క్యాన్సిల్ చేసిన మాట వాస్తవం కాదా చంద్రబాబూ? సీఆర్‌డీఏ చట్టాన్ని మీరు అసలు గౌరవిస్తున్నారా చంద్రబాబూ? మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బినామీలు మాత్రమే అమరావతిలో ఉండాలా? -దేవినేని అవినాష్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు అమరావతి ప్రాంతంలో పేదలు ఉండకూడదని అంటున్నారు. వైయస్ జగన్ గారు పేదల కోసం అమరావతిలో పేదలకు ఇళ్లు కేటాయిస్తే.. మీరు అధికారంలోకి రాగానే ఆ ఇళ్లను క్యాన్సిల్ చేసిన మాట వాస్తవం కాదా చంద్రబాబూ? సీఆర్‌డీఏ చట్టాన్ని మీరు అసలు గౌరవిస్తున్నారా చంద్రబాబూ? మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బినామీలు మాత్రమే అమరావతిలో ఉండాలా? -దేవినేని అవినాష్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు
    1
    అమరావతి ప్రాంతంలో పేదలు ఉండకూడదని అంటున్నారు. వైయస్ జగన్ గారు పేదల కోసం అమరావతిలో పేదలకు ఇళ్లు కేటాయిస్తే.. మీరు అధికారంలోకి రాగానే ఆ ఇళ్లను క్యాన్సిల్ చేసిన మాట వాస్తవం కాదా చంద్రబాబూ? సీఆర్‌డీఏ చట్టాన్ని మీరు అసలు గౌరవిస్తున్నారా చంద్రబాబూ? మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బినామీలు మాత్రమే అమరావతిలో ఉండాలా? 

-దేవినేని అవినాష్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు
అమరావతి ప్రాంతంలో పేదలు ఉండకూడదని అంటున్నారు. వైయస్ జగన్ గారు పేదల కోసం అమరావతిలో పేదలకు ఇళ్లు కేటాయిస్తే.. మీరు అధికారంలోకి రాగానే ఆ ఇళ్లను క్యాన్సిల్ చేసిన మాట వాస్తవం కాదా చంద్రబాబూ? సీఆర్‌డీఏ చట్టాన్ని మీరు అసలు గౌరవిస్తున్నారా చంద్రబాబూ? మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బినామీలు మాత్రమే అమరావతిలో ఉండాలా? 
-దేవినేని అవినాష్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    28 min ago
  • విశేష అలంకారం లో ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి. పుంగనూరు బస్టాండ్ కు సమీపాన వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి ఆలయంలో శనివారం నాడు ఉదయత్పూర్వమే పంచామృతాలు, సుగంధ ద్రవ్యములతో అభిషేకము గావించి,ఫల పుష్పాలను సమర్పించి అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అలంకరణ చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. ఆపై ఆలయ అర్చకులు అమ్మవారి తీర్ధప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు.
    1
    విశేష అలంకారం లో ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి. 
పుంగనూరు  బస్టాండ్ కు సమీపాన వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి ఆలయంలో శనివారం నాడు ఉదయత్పూర్వమే పంచామృతాలు, సుగంధ ద్రవ్యములతో అభిషేకము గావించి,ఫల పుష్పాలను సమర్పించి అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అలంకరణ చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. ఆపై  ఆలయ అర్చకులు అమ్మవారి తీర్ధప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.