🌿 ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా పస్రాలో భారీ అవగాహన ర్యాలీ – మంత్రి సీతక్కతో పాటు అధికారులు పాల్గొన్నారు 🌿 ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం, పస్రా ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం గోవిందరావుపేట మండలం పస్రా అటవీ శాఖ కార్యాలయంలో అడవుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తదితరులు పాల్గొని అడవుల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అడవులు పర్యావరణ సమతౌల్యానికి ఎంతో అవసరమని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే, పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
🌿 ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా పస్రాలో భారీ అవగాహన ర్యాలీ – మంత్రి సీతక్కతో పాటు అధికారులు పాల్గొన్నారు 🌿 ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం, పస్రా ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం గోవిందరావుపేట మండలం పస్రా అటవీ శాఖ కార్యాలయంలో అడవుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ
మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తదితరులు పాల్గొని అడవుల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అడవులు పర్యావరణ సమతౌల్యానికి ఎంతో అవసరమని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే, పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
- గీసుగొండ వరంగల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గీసుగొండ మండలంలో కొమ్మల లక్ష్మీ నరసింహస్వామి వారిని నేడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు సతీమణి దొంతి శాలిని రెడ్డి గారు కూతురు దొంతి అనన్య రెడ్డి గారు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు,అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు.1
- హైదరాబాద్:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన నోటీసును అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను విజ్ఞప్తి చేశారు. అలాగే, బిల్లు నోటీసును అసెంబ్లీ సెక్రటరీకి కూడా కేటీఆర్ మరియు ఎమ్మెల్యేలు అందజేశారు.1
- హన్మకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం పలువురు అంగన్వాడీ టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.1
- మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం అర్పణపల్లి సమీపంలోని వట్టి వాగులో చేపల వేటకు వెళ్లిన అలవాల సాయి (28) మత్స్యకారుడు మృతి చెందారు. మృతుడు మహబూబాబాద్ పట్టణంలోని హనమ్మతుని గడ్డ వాసి గా గుర్తించబడ్డారు.1
- అపర భద్రాద్రిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలోని ఈనెల 27 న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జాతర ఘనంగా నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అడిషనల్ కలెక్టర్ లు ఆలయ సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. 13 రోజులపాటు జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలను రూట్ మ్యాప్ ను పరిశీలించారు. మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని అలాగే ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రంగా ఉండుటకు శానిటేషన్ ఎప్పటికప్పుడు చేయించాలని, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, భారీ గేట్లను ఏర్పాటుతో భక్తులు క్యూ లైన్ పద్ధతిలో వచ్చేలా చూసుకోవాలన్నారు. రాత్రి పగలు ఎంపీడీవో సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. నాలుగు అంబులెన్స్ ను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని ఆలయం మండపం వద్ద డోనర్ పాసులను, వివిఐపి పాసుల వద్ద వేరు వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీరామనవమికి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాస కాలనీలో శనివారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది.. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి బూర్గంపహాడ్ మండలం సారపాక పేపర్ బోర్డు కు పేపర్ కు సంబంధించిన రామ్ మెటీరియల్ బండిల్స్ తో వెళ్తున్న లారీ పాల్వంచ శ్రీనివాస కాలనీ లో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. తమిళనాడు రాష్ట్రం కు చెందిన లారీ డ్రైవర్ పెరుమాళ్ళకు గాయాలయ్యాయి.. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ప్రమాదానికి గల వివరాలు సేకరిస్తున్నారు..1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిరిసిల్ల కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోర్టు అధికారిక ఈమెయిల్‌కు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు సందేశం పంపడం కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగగా, ప్రత్యేక బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి కోర్టు ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి, కోర్టు పరిసరాలను పూర్తిగా సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, బెదిరింపు మెయిల్ పంపిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.1
- నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ మెయిన్ రోడ్డు,ద్వారక పేట మెయిన్ రోడ్డు నందు ఎలాంటి అనుమతులు లేకుండా ఎయిర్టెల్ నెట్వర్క్ వారు భారీ వైబ్రేటర్ మిషన్ వాహనంతో కేబుల్స్ వేసేందుకు తవ్వకాలు జరపడం జరిగింది.. అనుమతి లేకుండా,నిబంధనలకు విరుద్ధంగా రోడ్లను తవ్వడం వల్ల వాటర్ పైప్లైన్ పలిగిపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.. మున్సిపాలిటీ నుండి సరైన అనుమతి తీసుకోకుండా రాత్రికి రాత్రే తవ్వకాలు జరపడం సరైనది కాదు అంటూ మండిపడ్డారు.. పగిలిన పైప్ లైన్లను వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు జరిపిన ఎయిర్టెల్ నెట్వర్క్ యాజమాన్యంపై మున్సిపల్ చైర్ పర్సన్ గారు పోలీసులకు ఫిర్యాదు చేసి..వారిపై పల్లు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించడం జరిగింది.. ఇకముందు మిషన్లతో తవ్వకాలు జరపకూడదని..ప్రవేట్ సిబ్బంది చేతే పనులు చేయించాలని వారు హెచ్చరించారు.. రేపటిలోగా దెబ్బతిన్న పైప్‌లైన్లకు మరమ్మతులు పూర్తి చేయించి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్స్ బీరం భరత్ రెడ్డి,హనుమకొండ శ్రీధర్, బాణాల ప్రసన్న శ్రీనివాస్, పొన్నాల మనీషా ప్రకాష్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాట ప్రభాకర్,కీసర వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు మెరుగు కిరణ్,ఉప్పుల శాలూమ్, దేవోజ్ హేమంత్, చీకటి శివమణి,మున్సిపల్ టౌన్ వాటర్ లైన్ ఇంచార్జ్ కాట శ్రీను, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..2