logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత… అంగన్వాడీ సిబ్బంది అరెస్టు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం పలువురు అంగన్వాడీ టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

3 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
3 hrs ago

హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత… అంగన్వాడీ సిబ్బంది అరెస్టు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం పలువురు అంగన్వాడీ టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

More news from తెలంగాణ and nearby areas
  • హన్మకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం పలువురు అంగన్వాడీ టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
    1
    హన్మకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం పలువురు అంగన్వాడీ టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • గీసుగొండ వరంగల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గీసుగొండ మండలంలో కొమ్మల లక్ష్మీ నరసింహస్వామి వారిని నేడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు సతీమణి దొంతి శాలిని రెడ్డి గారు కూతురు దొంతి అనన్య రెడ్డి గారు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు,అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు.
    1
    గీసుగొండ 
వరంగల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గీసుగొండ మండలంలో కొమ్మల లక్ష్మీ నరసింహస్వామి వారిని నేడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు సతీమణి దొంతి శాలిని రెడ్డి గారు కూతురు దొంతి అనన్య రెడ్డి గారు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు,అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    37 min ago
  • హైదరాబాద్:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన నోటీసును అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను విజ్ఞప్తి చేశారు. అలాగే, బిల్లు నోటీసును అసెంబ్లీ సెక్రటరీకి కూడా కేటీఆర్ మరియు ఎమ్మెల్యేలు అందజేశారు.
    1
    హైదరాబాద్:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన నోటీసును అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు అందజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను విజ్ఞప్తి చేశారు.
అలాగే, బిల్లు నోటీసును అసెంబ్లీ సెక్రటరీకి కూడా కేటీఆర్ మరియు ఎమ్మెల్యేలు అందజేశారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం అర్పణపల్లి సమీపంలోని వట్టి వాగులో చేపల వేటకు వెళ్లిన అలవాల సాయి (28) మత్స్యకారుడు మృతి చెందారు. మృతుడు మహబూబాబాద్ పట్టణంలోని హనమ్మతుని గడ్డ వాసి గా గుర్తించబడ్డారు.
    1
    మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం అర్పణపల్లి సమీపంలోని వట్టి వాగులో చేపల వేటకు వెళ్లిన అలవాల సాయి (28) మత్స్యకారుడు మృతి చెందారు. మృతుడు మహబూబాబాద్ పట్టణంలోని హనమ్మతుని గడ్డ వాసి గా గుర్తించబడ్డారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • అపర భద్రాద్రిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలోని ఈనెల 27 న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జాతర ఘనంగా నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అడిషనల్ కలెక్టర్ లు ఆలయ సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. 13 రోజులపాటు జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలను రూట్ మ్యాప్ ను పరిశీలించారు. మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని అలాగే ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రంగా ఉండుటకు శానిటేషన్ ఎప్పటికప్పుడు చేయించాలని, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, భారీ గేట్లను ఏర్పాటుతో భక్తులు క్యూ లైన్ పద్ధతిలో వచ్చేలా చూసుకోవాలన్నారు. రాత్రి పగలు ఎంపీడీవో సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. నాలుగు అంబులెన్స్ ను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని ఆలయం మండపం వద్ద డోనర్ పాసులను, వివిఐపి పాసుల వద్ద వేరు వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీరామనవమికి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
    1
    అపర భద్రాద్రిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలోని ఈనెల 27 న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జాతర ఘనంగా నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా  సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అడిషనల్ కలెక్టర్ లు ఆలయ సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. 13 రోజులపాటు జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలను రూట్ మ్యాప్ ను పరిశీలించారు. మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని అలాగే ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రంగా ఉండుటకు శానిటేషన్ ఎప్పటికప్పుడు చేయించాలని, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, భారీ గేట్లను ఏర్పాటుతో భక్తులు క్యూ లైన్ పద్ధతిలో వచ్చేలా చూసుకోవాలన్నారు. రాత్రి పగలు ఎంపీడీవో సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. నాలుగు అంబులెన్స్ ను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని ఆలయం మండపం వద్ద డోనర్ పాసులను, వివిఐపి పాసుల వద్ద వేరు వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీరామనవమికి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే జీవన్ రెడ్డి ఇంటి ముందు వెలసిన పోస్టర్
    1
    నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లే
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే జీవన్ రెడ్డి ఇంటి ముందు వెలసిన పోస్టర్
    user_Tagore
    Tagore
    Newspaper publisher Yadagirigutta, Yadadri Bhuvanagiri•
    20 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిరిసిల్ల కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోర్టు అధికారిక ఈమెయిల్‌కు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు సందేశం పంపడం కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగగా, ప్రత్యేక బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి కోర్టు ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి, కోర్టు పరిసరాలను పూర్తిగా సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, బెదిరింపు మెయిల్ పంపిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిరిసిల్ల కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోర్టు అధికారిక ఈమెయిల్‌కు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు సందేశం పంపడం కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగగా, ప్రత్యేక బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి కోర్టు ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి, కోర్టు పరిసరాలను పూర్తిగా సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, బెదిరింపు మెయిల్ పంపిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • జనగామ జిల్లాలో కంపెన్సేషన్ చెల్లింపుల విషయంలో జిల్లా కోర్టు ఆర్డీఓ కార్యాలయం జప్తుకు ఆదేశాలు జారీ చేసింది. బాధితులకు ఇవ్వాల్సిన రూ.9.08 కోట్ల పరిహారం చెల్లించకపోవడంతో కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఏసీలు జప్తు చేయాలని పేర్కొంది. 1981లో సిద్ధిపేట రోడ్డులోని 18.10 ఎకరాల భూమిని ఏపీ హౌజింగ్ బోర్డు స్వాధీనం చేసుకోగా, సుప్రీంకోర్టు గజానికి రూ.39 చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ పరిహారం అందకపోవడంతో బాధితులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. నెలలోపు చెల్లించాలని ఇచ్చిన గడువు ముగియడంతో బాధితులు ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేశారు. అడ్డుకున్న ఆర్డీవో కార్యాలయ సిబ్బంది.
    1
    జనగామ జిల్లాలో కంపెన్సేషన్ చెల్లింపుల విషయంలో జిల్లా కోర్టు ఆర్డీఓ కార్యాలయం జప్తుకు ఆదేశాలు జారీ చేసింది. బాధితులకు ఇవ్వాల్సిన రూ.9.08 కోట్ల పరిహారం చెల్లించకపోవడంతో కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఏసీలు జప్తు చేయాలని పేర్కొంది.
1981లో సిద్ధిపేట రోడ్డులోని 18.10 ఎకరాల భూమిని ఏపీ హౌజింగ్ బోర్డు స్వాధీనం చేసుకోగా, సుప్రీంకోర్టు గజానికి రూ.39 చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ పరిహారం అందకపోవడంతో బాధితులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. నెలలోపు చెల్లించాలని ఇచ్చిన గడువు ముగియడంతో బాధితులు ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేశారు. అడ్డుకున్న ఆర్డీవో కార్యాలయ సిబ్బంది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.