Shuru
Apke Nagar Ki App…
రూ.9.08 కోట్ల కంపెన్సేషన్ ఇవ్వకపోవడంతో ఆర్డీఓ కార్యాలయం జప్తు.. జనగామ జిల్లాలో కంపెన్సేషన్ చెల్లింపుల విషయంలో జిల్లా కోర్టు ఆర్డీఓ కార్యాలయం జప్తుకు ఆదేశాలు జారీ చేసింది. బాధితులకు ఇవ్వాల్సిన రూ.9.08 కోట్ల పరిహారం చెల్లించకపోవడంతో కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఏసీలు జప్తు చేయాలని పేర్కొంది. 1981లో సిద్ధిపేట రోడ్డులోని 18.10 ఎకరాల భూమిని ఏపీ హౌజింగ్ బోర్డు స్వాధీనం చేసుకోగా, సుప్రీంకోర్టు గజానికి రూ.39 చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ పరిహారం అందకపోవడంతో బాధితులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. నెలలోపు చెల్లించాలని ఇచ్చిన గడువు ముగియడంతో బాధితులు ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేశారు. అడ్డుకున్న ఆర్డీవో కార్యాలయ సిబ్బంది.
M D Azizuddin
రూ.9.08 కోట్ల కంపెన్సేషన్ ఇవ్వకపోవడంతో ఆర్డీఓ కార్యాలయం జప్తు.. జనగామ జిల్లాలో కంపెన్సేషన్ చెల్లింపుల విషయంలో జిల్లా కోర్టు ఆర్డీఓ కార్యాలయం జప్తుకు ఆదేశాలు జారీ చేసింది. బాధితులకు ఇవ్వాల్సిన రూ.9.08 కోట్ల పరిహారం చెల్లించకపోవడంతో కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఏసీలు జప్తు చేయాలని పేర్కొంది. 1981లో సిద్ధిపేట రోడ్డులోని 18.10 ఎకరాల భూమిని ఏపీ హౌజింగ్ బోర్డు స్వాధీనం చేసుకోగా, సుప్రీంకోర్టు గజానికి రూ.39 చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ పరిహారం అందకపోవడంతో బాధితులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. నెలలోపు చెల్లించాలని ఇచ్చిన గడువు ముగియడంతో బాధితులు ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేశారు. అడ్డుకున్న ఆర్డీవో కార్యాలయ సిబ్బంది.
More news from తెలంగాణ and nearby areas
- హన్మకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం పలువురు అంగన్వాడీ టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.1
- నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ మెయిన్ రోడ్డు,ద్వారక పేట మెయిన్ రోడ్డు నందు ఎలాంటి అనుమతులు లేకుండా ఎయిర్టెల్ నెట్వర్క్ వారు భారీ వైబ్రేటర్ మిషన్ వాహనంతో కేబుల్స్ వేసేందుకు తవ్వకాలు జరపడం జరిగింది.. అనుమతి లేకుండా,నిబంధనలకు విరుద్ధంగా రోడ్లను తవ్వడం వల్ల వాటర్ పైప్లైన్ పలిగిపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.. మున్సిపాలిటీ నుండి సరైన అనుమతి తీసుకోకుండా రాత్రికి రాత్రే తవ్వకాలు జరపడం సరైనది కాదు అంటూ మండిపడ్డారు.. పగిలిన పైప్ లైన్లను వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు జరిపిన ఎయిర్టెల్ నెట్వర్క్ యాజమాన్యంపై మున్సిపల్ చైర్ పర్సన్ గారు పోలీసులకు ఫిర్యాదు చేసి..వారిపై పల్లు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించడం జరిగింది.. ఇకముందు మిషన్లతో తవ్వకాలు జరపకూడదని..ప్రవేట్ సిబ్బంది చేతే పనులు చేయించాలని వారు హెచ్చరించారు.. రేపటిలోగా దెబ్బతిన్న పైప్‌లైన్లకు మరమ్మతులు పూర్తి చేయించి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్స్ బీరం భరత్ రెడ్డి,హనుమకొండ శ్రీధర్, బాణాల ప్రసన్న శ్రీనివాస్, పొన్నాల మనీషా ప్రకాష్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాట ప్రభాకర్,కీసర వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు మెరుగు కిరణ్,ఉప్పుల శాలూమ్, దేవోజ్ హేమంత్, చీకటి శివమణి,మున్సిపల్ టౌన్ వాటర్ లైన్ ఇంచార్జ్ కాట శ్రీను, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..2
- ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం, పస్రా ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం గోవిందరావుపేట మండలం పస్రా అటవీ శాఖ కార్యాలయంలో అడవుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తదితరులు పాల్గొని అడవుల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అడవులు పర్యావరణ సమతౌల్యానికి ఎంతో అవసరమని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే, పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.2
- మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం అర్పణపల్లి సమీపంలోని వట్టి వాగులో చేపల వేటకు వెళ్లిన అలవాల సాయి (28) మత్స్యకారుడు మృతి చెందారు. మృతుడు మహబూబాబాద్ పట్టణంలోని హనమ్మతుని గడ్డ వాసి గా గుర్తించబడ్డారు.1
- సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగిన గ్రామీణ ప్రజలు మూడ నమ్మకాల్లోనే మునిగితేలుతున్నారు. రోగం వచ్చినా, నొప్పి లేచిన భగవంతునిపై భారంవేసే పల్లె ప్రజలు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామస్థులు వింత ఆచారాన్ని పాటించారు. మూడు నెలల్లో 28 మంది మృతి చెందడంతో గ్రామానికి కీడు సోకిందని ఊరును ఖాళీ చేశారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఊరు బయటనే వంటావార్పుతో కీడు వంటలు చేసుకుని విందు భోజనాలు ఆరగించారు. ఆషాడం, శ్రావణ మాసాల్లో లేదా కార్తీక మాసంలో వన భోజనాలకు వెళ్లడం సహజం. కానీ గండ్రపల్లిలో గత మూడు నెలల్లో వివిధ కారణాలతో 28 మంది మృతి చెందడంతో గ్రామానికి కీడు సోకిందని ఊరంతా గ్రామాన్ని వదిలేశారు. ఒకరి దినవారం వెళ్లక ముందే మరొకరు ఆరోగ్యంతోనే యాక్సిడెంట్ లోనో మరే ఇతర కారణాలతోనో ప్రాణాలు కోల్పోయారు. వరుస మరణాలకు గ్రామానికి కీడని భావించారు గ్రామస్తులు. ఇలా ఎందుకు అవుతుందని బ్రాహ్మణుడిని అడిగితే కీడువంటలకు వెళ్లాలని సెలవిచ్చాడట. ఇంకేముంది గ్రామస్తులు, గ్రామ పెద్దలు ఓ రోజంతా గ్రామాన్ని వదిలి కీడు వంటలకు ఊరు బయటకు వెళ్లాలని నిర్ణయించి చాటింపు చేశారు. పెద్దల నిర్ణయంతో గండ్రపల్లి వాసులంతా సూర్యోదయం కంటే ముందే ఇళ్లకు తాళాలు వేసి, గ్రామాన్ని ఖాళీ చేసి ఊరు బయటకు వెళ్ళిపోయి రోజంతా ఊరు బయట వంట వార్పుతో గడిపారు. కుల మతాలకు అతీతంగా ఊరు బయట రైల్వే బ్రిడ్జి వద్ద కీడువంటలు చేసుకుని విందు భోజనాలు ఆరాగించారు. చుక్క, ముక్కతో ప్రత్యేకతను చాటుకున్నారు. వారిని కదిలిస్తే ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. గ్రామంలో వరుస మరణాలు జరగడంతో కీడు సోకిందని బ్రాహ్మణుడు చెప్పడంతో పెద్దమనుషుల నిర్ణయం మేరకు కీడు వంటలకు వచ్చామని తెలిపారు. ఇలా కీడు వంటలు చేసుకోవడం ఇది మొదటిసారి కాదట. గతంలో గ్రామంలో వరస మరణాలు సంభవిస్తే కీడు వంటలకు వెళ్లడం వల్ల మరణాలు ఆగిపోయాయని గ్రామస్తులు భావిస్తున్నారు. అందుకే ఈసారి సైతం గ్రామ పురోహితుని సూచన మేరకు పెద్దమనుషుల నిర్ణయం ప్రకారం కీడు వంటలకు వచ్చామని చెబుతున్నారు. ఇలా కీడు వంటలు చేసుకోవడం ఇది నాలుగోసారని చెప్పారు. పెద్దలు చెప్పినట్లు స్థల మార్పిడితో కొంత ఉపశమనంతో పాటు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. గ్రామస్తుల నమ్మకం ఎలా ఉన్నా, మరణాలు ఆగిపోవడానికి ఊరును ఖాళీ చేసి కీడు వంటలకు వెళ్ళడం విచిత్రంగా మారింది. చదువుకున్న వారు సైతం అజ్ఞానంగా ఆలోచించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏ గ్రామంలోనైనా వనభోజనాలకు వెళ్లడం సహజమే కానీ, గండ్రపల్లి వాసులు కీడు వంటలని చెప్పడం పలురకాలుగా జనం చర్చించుకుంటున్నారు.1
- నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే జీవన్ రెడ్డి ఇంటి ముందు వెలసిన పోస్టర్1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిరిసిల్ల కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోర్టు అధికారిక ఈమెయిల్‌కు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు సందేశం పంపడం కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగగా, ప్రత్యేక బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి కోర్టు ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి, కోర్టు పరిసరాలను పూర్తిగా సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, బెదిరింపు మెయిల్ పంపిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.1
- జనగామ జిల్లాలో కంపెన్సేషన్ చెల్లింపుల విషయంలో జిల్లా కోర్టు ఆర్డీఓ కార్యాలయం జప్తుకు ఆదేశాలు జారీ చేసింది. బాధితులకు ఇవ్వాల్సిన రూ.9.08 కోట్ల పరిహారం చెల్లించకపోవడంతో కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఏసీలు జప్తు చేయాలని పేర్కొంది. 1981లో సిద్ధిపేట రోడ్డులోని 18.10 ఎకరాల భూమిని ఏపీ హౌజింగ్ బోర్డు స్వాధీనం చేసుకోగా, సుప్రీంకోర్టు గజానికి రూ.39 చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ పరిహారం అందకపోవడంతో బాధితులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. నెలలోపు చెల్లించాలని ఇచ్చిన గడువు ముగియడంతో బాధితులు ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేశారు. అడ్డుకున్న ఆర్డీవో కార్యాలయ సిబ్బంది.1