రామగుండం లో దశలవారీగా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తున్నాం : రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ముప్పయి ఐదవ డివిజన్ సప్తగిరి కాలనీ , రాజ్య లక్ష్మీ కాలనీలలో దశలవారీగా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. సోమవారం 35 వ డివిజన్ రాజ్య లక్ష్మీ కాలనీలో రూ.7.00 కోట్ల స్పెషల్ ఫండ్ ప్యాకేజీ పనుల్లో భాగంగా రూ 8.00 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన సి సి రోడ్డు నిర్మాణపనులను స్థానిక కార్పొరేటర్ జంగపల్లి రమాదేవి శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎం ఎల్ ఏ రాజ్ ఠాకూర్ తాను గెలిచిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం రాజ్యలక్ష్మి కాలనీ, సప్తగిరి కాలనీ వర్షా కాలంలో ముంపుకు గురి కాకుండా వరద నీటి కాలువ నిర్మించడం జరిగిందని అన్నారు. కొత్తగా ఏర్పడిన కాలనీ కావడంతో సరైన డ్రైనేజి వ్యవస్థ లేక మురుగునీరు రోడ్లపై పారేదని అన్నారు. ప్రస్తుతం డ్రైనేజి నిర్మాణo పూర్తయిందని ఎం ఎల్ ఏ ఆదేశాల మేరకు రూ 50.00 లక్షల అంచనా వ్యయంతో రాజ్యాలక్ష్మీ కాలనీ లో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఇటీవల తాను డివిజన్ లో వార్డు సందర్శన కార్యక్రమం చేపట్టి సమస్యలు గుర్తించామని ఒక్కటొక్కటిగా అన్ని సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దాసరి సాంబమూర్తి, డేవిడ్ రాజు, స్థానిక నాయకులు గడ్డం శ్రీనివాస్, పీచర శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.
రామగుండం లో దశలవారీగా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తున్నాం : రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ముప్పయి ఐదవ డివిజన్ సప్తగిరి కాలనీ , రాజ్య లక్ష్మీ కాలనీలలో దశలవారీగా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. సోమవారం 35 వ డివిజన్ రాజ్య లక్ష్మీ కాలనీలో రూ.7.00 కోట్ల స్పెషల్ ఫండ్ ప్యాకేజీ పనుల్లో భాగంగా రూ 8.00 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన సి సి రోడ్డు నిర్మాణపనులను స్థానిక కార్పొరేటర్ జంగపల్లి రమాదేవి శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎం ఎల్ ఏ రాజ్ ఠాకూర్ తాను గెలిచిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం రాజ్యలక్ష్మి కాలనీ, సప్తగిరి కాలనీ వర్షా కాలంలో ముంపుకు గురి కాకుండా వరద నీటి కాలువ నిర్మించడం జరిగిందని అన్నారు. కొత్తగా ఏర్పడిన కాలనీ కావడంతో సరైన డ్రైనేజి వ్యవస్థ లేక మురుగునీరు రోడ్లపై పారేదని అన్నారు. ప్రస్తుతం డ్రైనేజి నిర్మాణo పూర్తయిందని ఎం ఎల్ ఏ ఆదేశాల మేరకు రూ 50.00 లక్షల అంచనా వ్యయంతో రాజ్యాలక్ష్మీ కాలనీ లో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఇటీవల తాను డివిజన్ లో వార్డు సందర్శన కార్యక్రమం చేపట్టి సమస్యలు గుర్తించామని ఒక్కటొక్కటిగా అన్ని సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దాసరి సాంబమూర్తి, డేవిడ్ రాజు, స్థానిక నాయకులు గడ్డం శ్రీనివాస్, పీచర శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.
- కోతీరాంపూర్‌లో ఘనంగా మైసమ్మ తల్లి బోనాలు దసరా నాటికి నూతన ఆలయం నిర్మిస్తాం: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతీరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన వెలిసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు మంగళవారం కన్నులపండువగా జరిగాయి. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఘన స్వాగతం.. బోనం ఎత్తుకున్న ఎమ్మెల్యే బోనాల వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఆయనకు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి బోనం ఎత్తుకున్న గంగుల.. ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకాల మధ్య సాగిన ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగాయి. అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఎల్లమ్మ తల్లి కలలో వచ్చి స్థానిక పెంట కుప్పలో వెలిశానని తెలపడంతో.. కాలనీవాసులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్టించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, యాట పిల్లలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు బీఆర్ఎస్ నాయకులు మిడిదొడ్డి నవీన్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, జీపీ స్వామి, స్థానిక కాలనీవాసులు ఎల్లయ్య, బాల్ రెడ్డి, శేఖర్, సుధాకర్, మల్లయ్య తదితరులు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు1
- శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో 5లక్షల రూ.ప్రభుత్వ నిధులతో అభివ్రుద్ది పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల : జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 5 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య , amc చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ అడువల జ్యోతి లక్ష్మణ్ తో కలిసి భూమిపూజ చేశారు. అంతకుముందు ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మెన్ కాటిపెళ్ళి గంగారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, పార్టీ నాయకులు బండ శంకర్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్, కౌన్సిలర్ లు పవిత్ర, సాయి కిరణ్ ,వేముల శ్రీనివాస్, సంఘం అధ్యక్షులు భోగ గంగాధర్ కార్యవర్గ సభ్యులు మరియు పంచాయతీ రాజ్ డీ ఈ మిలింద్, Ae విజయ్ తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ కిసాన్ నగర్ ఘర్షణ దాడి కేసులో కార్పొరేటర్ తో సహా 7 గురు అరెస్టు...శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిక కరీంనగర్ లోని 29 వ డివిజన్ కిసాన్ నగర్ లో రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణ దాడి కేసులో కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ తో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయ కక్షలతో కిసాన్ నగర్ లో గత కొంతకాలంగా బిఆర్ఎస్ బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఆదివారం రాత్రి బిజెపికి చెందిన కార్యకర్తలు టిఆర్ఎస్ కు చెందిన శ్రీకాంత్ శేఖర్ ల పై దాడి చేశారు. దాడిలో శ్రీకాంత్ కు రక్త గాయాలు కావడంతో శ్రీకాంత్ తో పాటు శేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు స్థానిక కార్పొరేటర్ వేణు ప్రసాద్ తోపాటు నాగేందర్, మధు, భానుచందర్, వేణు, శశిధర్ పై హత్నాయత్నంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఏడుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించామని అడిషనల్ డిసిపి వెంకటరమణ ప్రకటించారు.2
- మార్పు రావాలని లక్ష్యంతోనే సిపిఐ పోరుయాత్ర: సిపిఐ నాయకులు మార్పు సిపిఐ పోరు యాత్ర చేపట్టడం జరిగిందని సిపిఐ జిల్లా నాయకులు మేకల దాసు అన్నారు. పోరు యాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా పోరు యాత్ర ఉంటుందని, అందులో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జన్నారం మండల కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు.1
- ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్,ప్రధాని మోదీ గురించి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తూ.. మంగళవారం వేములవాడ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే తన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి నేతలు,కార్యకర్తలు ఉన్నారు.1
- తల్లిపాలపై అవగాహన కల్పించిన అంగన్వాడీ సిబ్బంది .... వడ్లూరులో తల్లిపాల వారోత్సవాలు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం, తొలి ఆరు నెలలు తల్లిపాలను మాత్రమే అందించడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడని వివరించారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. తల్లులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పులి రమేష్, గ్రామ కార్యదర్శి పద్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.2
- జైలు బరో లో ఎర్ర జెండా పార్టీలు., రాజీవ్ రహదారిపై ఆందోళన ధర్నా చేపట్టిన జెఎసి నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసన గా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహించారు. జెఎసి నాయకులు సీఐటీయూ, iftu నాయకులు ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై ఆందోళన ధర్నా చేశారు.1
- గతంలో సోమిడి వేణు కార్పొరేటర్ పై దాడి జరుగుతే ఎప్పుడు రాజకీయ కోణంలో చూడలేదు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాజకీయ కోణంలో చూస్తున్నాడు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు ప్రెస్ మీట్. కిసాన్ నగర్ లో వ్యక్తిగతంగా దాడి జరుగుతే పార్టీ సంబంధం లేదు. గతంలో సోమిడి వేణు కార్పొరేటర్ పై దాడి జరుగుతే ఎప్పుడు రాజకీయ కోణంలో చూడలేదు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాజకీయ కోణంలో చూస్తున్నాడు. గొడవలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. వ్యక్తిగత గొడవలను పార్టీలపై రుద్దద్దు. కరీంనగర్కు మేయర్ అప్పచెప్పితే దాడులు జరుగుతున్నాయి అనడం విడ్డూరం. మీ 10 సంవత్సరాల పాలనలో ఎన్ని గొడవలు జరిగాయో అందరికీ తెలుసు. మీ పార్టీ నాయకులపై కేసులయి జైలుకు పోయొచ్చారు దానికి బాధ్యత మీరు వహిస్తారా. కరీంనగర్ లో మీరు శాంతిని నెలకొల్పితే ప్రజలు ఎందుకు ఆదరించలేదు. అభివృద్ధి మా ఎజెండా, దాడులు మా ఏజెండా కాదు. కార్పొరేటర్ వేణు ప్రసాద్ పై కుటుంబ కారుతో బుద్ధి హత్య విక్రం చేసేందుకు ప్రయత్నించారు. దాడి జరిగిన సమయంలో వేణు ప్రసాద్ అక్కడ లేడు కదా. పోలీస్ ఎఫ్ ఐ ఆర్ లో మాత్రం పేరు ఉంది.విచారణ జరుగుతుంది. ఎమ్మెల్యే క్యాప్ ఆఫీస్ లో వేరే వ్యక్తులు వచ్చి మీరు రాజకీయాలు ఎలా చేస్తారు. బండి సంజయ్ ఎప్పుడు కూడా ఇలాంటివి సహించరు...3
- దివ్యాంగుల కోసం ఈ నెల 13న గురువారం కోరుట్లలో సహాయక శిబిరం ఏర్పాటు జగిత్యాల జిల్లా:- దివ్యాంగుల కోసం ఈ నెల 13న గురువారం కోరుట్లలో సహాయక శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి డా. ఆడెపు భాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవతో ALIMCO సంస్థ మరియు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన కోరుట్ల నియోజకవర్గ దివ్యాంగులకు వీల్ చైర్లు, ట్రై సైకిల్, వాకర్లు, వినికిడి పరికరాలు, చేతి కర్రలు, కృత్రిమ అవయవాలు తదితర సహాయ ఉపకరణాలు దివ్యాంగులను పరిశీలించి వారికి అనుగుణంగా ఉపకరణాలు అందజేయబడుతుందని ఆయన తన ప్రకటనలో తెలిపారు. కాగా, దివ్యాంగుల సంక్షేమ కార్యాలయ సిబ్బంది , మరియు జిల్లా దివ్యాంగ కమిటీ సభ్యులు అలాగే కోరుట్ల నియోజకవర్గ బిజెపి సభ్యులతో కలిసి ఈ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని జిల్లా సంక్షేమ అధికారి డా.ఏ.భాస్కర్ తన ప్రకటనలో వివరించారు. కావున కోరుట్ల నియోజకవర్గ దివ్యాంగులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని సహాయ ఉపకరణాలను పొందవలసిందిగా కోరారు.1