Shuru
Apke Nagar Ki App…
మార్పు రావాలని లక్ష్యంతోనే సిపిఐ పోరుయాత్ర: సిపిఐ నాయకులు మార్పు సిపిఐ పోరు యాత్ర చేపట్టడం జరిగిందని సిపిఐ జిల్లా నాయకులు మేకల దాసు అన్నారు. పోరు యాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా పోరు యాత్ర ఉంటుందని, అందులో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జన్నారం మండల కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు.
P.G. Murthy
మార్పు రావాలని లక్ష్యంతోనే సిపిఐ పోరుయాత్ర: సిపిఐ నాయకులు మార్పు సిపిఐ పోరు యాత్ర చేపట్టడం జరిగిందని సిపిఐ జిల్లా నాయకులు మేకల దాసు అన్నారు. పోరు యాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా పోరు యాత్ర ఉంటుందని, అందులో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జన్నారం మండల కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఆషాడ వనభోజనాలు, హాజరైన కులస్తులు జన్నారం మండల కేంద్రంలోని మహేంద్ర సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆషాడమాస వనభోజనాలను నిర్వహించారు. ఆషాడ మాసం బోనాల ముగింపు సందర్భంగా మహేంద్ర సంఘం నాయకులు, కులస్తులు మంగళవారం సాయంత్రం పట్టణ శివారులోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయం ఆవరణలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతకుముందు వారు తమ కులదైవం కేతికి సంగమేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక భోజనాలు చేశారు.1
- కాలనీలో పారిశుద్ధ్యం దోమల నివారణ సులభం... కాలనీలో అన్ని డ్రైనేజీలలో ముండ్ల పొదలపై పిచ్చి మొక్కలపై స్ప్రే తో దోమల నిర్మూలన కార్యక్రమం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో సోమవారం మున్సిపల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం పరిశుభ్రత పనులను చేపట్టారు ఈ సందర్భంగా కార్మికులతో కాలనీలోని అన్ని చోట్లల్లో గడ్డితో ఉన్న ముళ్ళ పొదలు, డ్రైనేజీలలో జామైన పూడికను తొలగించి పారిశుద్ధ్యం పనులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మానాల శంకర్ కార్మికులు పాల్గొన్నారు1
- ఖానాపూర్ మున్సిపాలిటీ నిర్లక్ష్యం శ్రీరామ్ నగర్ లో పేరుకుపోయిన చెత్త ఖానాపూర్ మున్సిపాలిటీ శ్రీరామ్ నగర్ లో గత 45 రోజులుగా చెత్త పేరుకుపోయి ఉంటే మునిసిపాలిటీ చెత్త బండి చూసి చూడనట్టు వెళ్తుందని శ్రీరామ్ నగర్ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు చెత్త పేరుకుపోయి దుర్వాసన రావడంతో కాలనీవాసులు చిన్నపిల్లలు ఇబ్బంది పడుతూ వెళ్తున్నారని కాలనీవాసులు తెలియజేశారు ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి చెత్తను వెంటనే తొలగించాలని కాలని వాసులు తెలియజేశారు1
- బొగ్గు గని కార్మికుల జీతాల పెంపు కోసం 12వ వేజ్ బోర్డు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి., జిఎం ఆఫీస్ ముందు ధర్నా చేసిన ఓఅత్య సంఘాలు బొగ్గు పరిశ్రమల్లో నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయొద్దని, బొగ్గు గని కార్మికుల జీతాల పెంపు కోసం 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను వెంటనే ప్రారంభించాలనీ డిమాండ్ తో సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి యాజమాన్యం కు వినతి పత్రం ఇచ్చిన జాతీయ కార్మిక సంఘాల నాయకులు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ బొగ్గు గని కార్మికుల కు జీతాల పెంపు కోసం 12 వ వేతన సవరణ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని, నాలుగు లేబర్ కోడ్ లను బొగ్గు పరిశ్రమల్లో అమలు చేయరాదని డిమాండ్ చేస్తూ సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించి యాజమాన్యం కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఏఐటియుసి నుంచి కొరిమి రాజ్ కుమార్, ఐఎన్టీయుసి నుంచి ధర్మపురి, సిఐటియు నుంచి ఎస్ వీరయ్య, హెచ్ ఎం ఎస్ నుంచి దబ్బెట సతీష్ లు పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఉన్న బొగ్గు గని కార్మికుల కు జూన్ 30 తో 11 వ వేజ్ బోర్డు కాలపరిమితి ముగిసిందని, 2026 జూలై 1 నుంచి 12 వ వేజ్ బోర్డు ప్రారంభం అయిందని, కానీ కోల్ ఇండియా యాజమాన్యం ఇంత వరకు వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంబించలేదని వారు ఆరోపించారు. గత కొన్ని నెలల క్రితం కోల్ ఇండియా యాజమాన్యం తో బొగ్గు గని కార్మిక సంఘాల తో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ ల అమలు గురించి ప్రస్తావించారని, 51 శాతం ఓట్లు వచ్చిన కార్మిక సంఘం తో వేతన సవరణ జరుపుతామని తెలుపగా కేంద్ర కార్మిక సంఘాల నాయకులు వ్యతిరేకించారని వారు పేర్కొన్నారు. గతంలో వలే 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంభించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ డిమాండ్ చేయగా కోల్ ఇండియా యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని తెలిపారని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను బొగ్గు పరిశ్రమల్లో అమలు చేయరాదని, వెంటనే 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంభించేందుకు తక్షణమే కోల్ ఇండియా యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉదృతం చేస్తామని అవసరమైతే నిరవధిక సమ్మె కు పిలుపు నిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు. ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను అద్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు మడ్డి ఎల్లా గౌడ్, తుమ్మల రాజిరెడ్డి, సదానందం తో పాటు జాతీయ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.1
- మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ. మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఈరోజు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు.పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాక్ వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సరదా విషాధంగా మారకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సిబ్బంది ఉన్నారు.1
- ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్,ప్రధాని మోదీ గురించి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తూ.. మంగళవారం వేములవాడ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే తన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి నేతలు,కార్యకర్తలు ఉన్నారు.1
- తాంసీలో సీపీఐ ప్రజా చైతన్య పాదయాత్ర.. ప్రభుత్వాల వైఫల్యాలపై నిరసన తాంసీ మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లయినా ప్రజలు ఇంకా దారిద్య్రంలోనే మగ్గుతున్నారన్నారు. కార్మికుల క్రమబద్ధీకరణ, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, కుంటల రాముడు, షేక్ పాషా, గిడం సురేష్ తదితరులు పాల్గొన్నారు.1
- మార్పు రావాలని లక్ష్యంతోనే సిపిఐ పోరుయాత్ర: సిపిఐ నాయకులు మార్పు సిపిఐ పోరు యాత్ర చేపట్టడం జరిగిందని సిపిఐ జిల్లా నాయకులు మేకల దాసు అన్నారు. పోరు యాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా పోరు యాత్ర ఉంటుందని, అందులో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జన్నారం మండల కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు.1