logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బొగ్గు గని కార్మికుల జీతాల పెంపు కోసం 12వ వేజ్ బోర్డు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి., జిఎం ఆఫీస్ ముందు ధర్నా చేసిన ఓఅత్య సంఘాలు బొగ్గు పరిశ్రమల్లో నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయొద్దని, బొగ్గు గని కార్మికుల జీతాల పెంపు కోసం 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను వెంటనే ప్రారంభించాలనీ డిమాండ్ తో సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి యాజమాన్యం కు వినతి పత్రం ఇచ్చిన జాతీయ కార్మిక సంఘాల నాయకులు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ బొగ్గు గని కార్మికుల కు జీతాల పెంపు కోసం 12 వ వేతన సవరణ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని, నాలుగు లేబర్ కోడ్ లను బొగ్గు పరిశ్రమల్లో అమలు చేయరాదని డిమాండ్ చేస్తూ సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించి యాజమాన్యం కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఏఐటియుసి నుంచి కొరిమి రాజ్ కుమార్, ఐఎన్టీయుసి నుంచి ధర్మపురి, సిఐటియు నుంచి ఎస్ వీరయ్య, హెచ్ ఎం ఎస్ నుంచి దబ్బెట సతీష్ లు పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఉన్న బొగ్గు గని కార్మికుల కు జూన్ 30 తో 11 వ వేజ్ బోర్డు కాలపరిమితి ముగిసిందని, 2026 జూలై 1 నుంచి 12 వ వేజ్ బోర్డు ప్రారంభం అయిందని, కానీ కోల్ ఇండియా యాజమాన్యం ఇంత వరకు వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంబించలేదని వారు ఆరోపించారు. గత కొన్ని నెలల క్రితం కోల్ ఇండియా యాజమాన్యం తో బొగ్గు గని కార్మిక సంఘాల తో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ ల అమలు గురించి ప్రస్తావించారని, 51 శాతం ఓట్లు వచ్చిన కార్మిక సంఘం తో వేతన సవరణ జరుపుతామని తెలుపగా కేంద్ర కార్మిక సంఘాల నాయకులు వ్యతిరేకించారని వారు పేర్కొన్నారు. గతంలో వలే 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంభించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ డిమాండ్ చేయగా కోల్ ఇండియా యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని తెలిపారని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను బొగ్గు పరిశ్రమల్లో అమలు చేయరాదని, వెంటనే 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంభించేందుకు తక్షణమే కోల్ ఇండియా యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉదృతం చేస్తామని అవసరమైతే నిరవధిక సమ్మె కు పిలుపు నిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు. ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను అద్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు మడ్డి ఎల్లా గౌడ్, తుమ్మల రాజిరెడ్డి, సదానందం తో పాటు జాతీయ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

21 hrs ago
user_Telangana reporter
Telangana reporter
Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
21 hrs ago

బొగ్గు గని కార్మికుల జీతాల పెంపు కోసం 12వ వేజ్ బోర్డు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి., జిఎం ఆఫీస్ ముందు ధర్నా చేసిన ఓఅత్య సంఘాలు బొగ్గు పరిశ్రమల్లో నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయొద్దని, బొగ్గు గని కార్మికుల జీతాల పెంపు కోసం 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను వెంటనే ప్రారంభించాలనీ డిమాండ్ తో సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి యాజమాన్యం కు వినతి పత్రం ఇచ్చిన జాతీయ కార్మిక సంఘాల నాయకులు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ బొగ్గు గని కార్మికుల కు జీతాల పెంపు కోసం 12 వ వేతన సవరణ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని, నాలుగు లేబర్ కోడ్ లను బొగ్గు పరిశ్రమల్లో అమలు చేయరాదని డిమాండ్ చేస్తూ సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించి యాజమాన్యం కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఏఐటియుసి నుంచి కొరిమి రాజ్ కుమార్, ఐఎన్టీయుసి నుంచి ధర్మపురి, సిఐటియు నుంచి ఎస్ వీరయ్య, హెచ్ ఎం ఎస్ నుంచి దబ్బెట సతీష్ లు పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఉన్న బొగ్గు గని కార్మికుల కు జూన్ 30 తో 11 వ వేజ్ బోర్డు కాలపరిమితి ముగిసిందని, 2026 జూలై 1 నుంచి 12 వ వేజ్ బోర్డు ప్రారంభం అయిందని, కానీ కోల్ ఇండియా యాజమాన్యం ఇంత వరకు వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంబించలేదని వారు ఆరోపించారు. గత కొన్ని నెలల క్రితం కోల్ ఇండియా యాజమాన్యం తో బొగ్గు గని కార్మిక సంఘాల తో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ ల అమలు గురించి ప్రస్తావించారని, 51 శాతం ఓట్లు వచ్చిన కార్మిక సంఘం తో వేతన సవరణ జరుపుతామని తెలుపగా కేంద్ర కార్మిక సంఘాల నాయకులు వ్యతిరేకించారని వారు పేర్కొన్నారు. గతంలో వలే 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంభించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ డిమాండ్ చేయగా కోల్ ఇండియా యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని తెలిపారని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను బొగ్గు పరిశ్రమల్లో అమలు చేయరాదని, వెంటనే 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంభించేందుకు తక్షణమే కోల్ ఇండియా యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉదృతం చేస్తామని అవసరమైతే నిరవధిక సమ్మె కు పిలుపు నిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు. ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను అద్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు మడ్డి ఎల్లా గౌడ్, తుమ్మల రాజిరెడ్డి, సదానందం తో పాటు జాతీయ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • కోతీరాంపూర్‌లో ఘనంగా మైసమ్మ తల్లి బోనాలు దసరా నాటికి నూతన ఆలయం నిర్మిస్తాం: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతీరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన వెలిసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు మంగళవారం కన్నులపండువగా జరిగాయి. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ​ఘన స్వాగతం.. బోనం ఎత్తుకున్న ఎమ్మెల్యే ​బోనాల వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఆయనకు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి బోనం ఎత్తుకున్న గంగుల.. ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకాల మధ్య సాగిన ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగాయి. ​అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ​ఎల్లమ్మ తల్లి కలలో వచ్చి స్థానిక పెంట కుప్పలో వెలిశానని తెలపడంతో.. కాలనీవాసులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్టించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, యాట పిల్లలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు ​ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్ పాల్గొన్నారు. ​వీరితో పాటు బీఆర్ఎస్ నాయకులు మిడిదొడ్డి నవీన్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, జీపీ స్వామి, స్థానిక కాలనీవాసులు ఎల్లయ్య, బాల్ రెడ్డి, శేఖర్, సుధాకర్, మల్లయ్య తదితరులు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు
    1
    కోతీరాంపూర్‌లో ఘనంగా మైసమ్మ తల్లి బోనాలు దసరా నాటికి నూతన ఆలయం నిర్మిస్తాం: ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతీరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన వెలిసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు మంగళవారం కన్నులపండువగా జరిగాయి. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
​ఘన స్వాగతం.. బోనం ఎత్తుకున్న ఎమ్మెల్యే
​బోనాల వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఆయనకు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి బోనం ఎత్తుకున్న గంగుల.. ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకాల మధ్య సాగిన ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగాయి.
​అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.
​ఎల్లమ్మ తల్లి కలలో వచ్చి స్థానిక పెంట కుప్పలో వెలిశానని తెలపడంతో.. కాలనీవాసులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్టించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, యాట పిల్లలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు 
​ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్ పాల్గొన్నారు.
​వీరితో పాటు బీఆర్ఎస్ నాయకులు మిడిదొడ్డి నవీన్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, జీపీ స్వామి, స్థానిక కాలనీవాసులు ఎల్లయ్య, బాల్ రెడ్డి, శేఖర్, సుధాకర్, మల్లయ్య తదితరులు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    6 hrs ago
  • కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా లక్ష ఓట్లు ఔట్... ఈ నెల 17న ఓటర్ల ముసాయిదా జాబితా ఓటర్ సమగ్ర సవరణ సర్ ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు లక్షల 92 వేల 298 ఓట్లు తొలగించబడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 లక్షల 97 వేల 973 మంది ఓటర్లు ఇదివరకు ఉన్నారు. ఓటర్ల సమగ్ర సవరణ సర్ ప్రక్రియతో అందరికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేశారు. గత అర్ధరాత్రి గడువు ముగిసేసరికి ఉమ్మడి జిల్లాలో 26 లక్షల 5 వేల 675 మంది ఓటర్లు తమ ఫామ్స్ బి ఎల్ వో లకు అప్పగించారు. వాటిని డిజిటలైజేషన్ చేశారు. మిగతా మూడు లక్షల 92 వేల 298 మంది ఎన్యూమరెషన్ ఫామ్స్ అప్పగించలేదు. దీంతో వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించినట్లే అవుతుంది. అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష 854 ఓట్లు తొలగిపోతున్నాయి. డబల్ ఎంట్రీ, చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగిపోతున్నాయి. ప్రస్తుతం డిజిటలైజేషన్ అయిన ఓటర్ల ముసాయిదా జాబితా ఈ నెల 17న ప్రకటిస్తారు. ఓటర్ జాబితా పై అభ్యంతరాలను స్వీకరించి సెప్టెంబర్ 17 వరకు పరిష్కరిస్తారు. ఓటర్ ఫైనల్ జాబితా అక్టోబర్ 19న ప్రకటించనున్నారు. తాజా ఓటర్ జాబితాలో పేర్లు రానివారు కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఓటర్ నమోదు కావాలంటే ఫామ్ 6 తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ 2002 లేదా 2026 సర్ ఫ్యామిలీ మ్యాపింగ్ డిటేల్స్ సమర్పించాల్సి ఉంటుంది. స్పాట్...
    1
    కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా లక్ష ఓట్లు ఔట్... ఈ నెల 17న ఓటర్ల ముసాయిదా జాబితా
ఓటర్ సమగ్ర సవరణ సర్ ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు లక్షల 92 వేల 298 ఓట్లు తొలగించబడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 లక్షల 97 వేల 973 మంది ఓటర్లు ఇదివరకు ఉన్నారు. ఓటర్ల సమగ్ర సవరణ సర్ ప్రక్రియతో అందరికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేశారు. గత అర్ధరాత్రి గడువు ముగిసేసరికి ఉమ్మడి జిల్లాలో 26 లక్షల 5 వేల 675 మంది ఓటర్లు తమ ఫామ్స్ బి ఎల్ వో లకు అప్పగించారు. వాటిని డిజిటలైజేషన్ చేశారు. మిగతా మూడు లక్షల 92 వేల 298 మంది ఎన్యూమరెషన్ ఫామ్స్  అప్పగించలేదు. దీంతో వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించినట్లే అవుతుంది. అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష 854 ఓట్లు తొలగిపోతున్నాయి. డబల్ ఎంట్రీ, చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగిపోతున్నాయి. ప్రస్తుతం డిజిటలైజేషన్ అయిన ఓటర్ల ముసాయిదా జాబితా ఈ నెల 17న ప్రకటిస్తారు. 
ఓటర్ జాబితా పై అభ్యంతరాలను స్వీకరించి సెప్టెంబర్ 17 వరకు పరిష్కరిస్తారు. ఓటర్ ఫైనల్ జాబితా అక్టోబర్  19న ప్రకటించనున్నారు. తాజా ఓటర్ జాబితాలో పేర్లు రానివారు కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఓటర్ నమోదు కావాలంటే ఫామ్ 6 తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ 2002 లేదా 2026 సర్ ఫ్యామిలీ మ్యాపింగ్ డిటేల్స్ సమర్పించాల్సి ఉంటుంది.
స్పాట్...
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • మార్పు రావాలని లక్ష్యంతోనే సిపిఐ పోరుయాత్ర: సిపిఐ నాయకులు మార్పు సిపిఐ పోరు యాత్ర చేపట్టడం జరిగిందని సిపిఐ జిల్లా నాయకులు మేకల దాసు అన్నారు. పోరు యాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా పోరు యాత్ర ఉంటుందని, అందులో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జన్నారం మండల కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు.
    1
    మార్పు రావాలని లక్ష్యంతోనే సిపిఐ పోరుయాత్ర: సిపిఐ నాయకులు
మార్పు  సిపిఐ పోరు యాత్ర చేపట్టడం జరిగిందని సిపిఐ జిల్లా నాయకులు మేకల దాసు అన్నారు. పోరు యాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా పోరు యాత్ర ఉంటుందని, అందులో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జన్నారం మండల కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • తల్లిపాలపై అవగాహన కల్పించిన అంగన్వాడీ సిబ్బంది .... వడ్లూరులో తల్లిపాల వారోత్సవాలు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం, తొలి ఆరు నెలలు తల్లిపాలను మాత్రమే అందించడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడని వివరించారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. తల్లులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పులి రమేష్, గ్రామ కార్యదర్శి పద్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
    2
    తల్లిపాలపై అవగాహన కల్పించిన అంగన్వాడీ సిబ్బంది .... వడ్లూరులో తల్లిపాల వారోత్సవాలు
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు 
గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం, తొలి ఆరు నెలలు తల్లిపాలను మాత్రమే అందించడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడని వివరించారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. తల్లులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పులి రమేష్, గ్రామ కార్యదర్శి పద్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
  • అధ్వానంగా రోడ్డు..ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు:బీజేపీ నేతలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం నుంచి రూరల్ మండలంలోని జయవరం,మల్లారం,హన్మాజీపేట గ్రామాలకు వెళ్లే బ్రిడ్జి రోడ్డు అధ్వానంగా ఉందని బీజేపీ రూరల్ మండల బీజేపీ అధ్యక్షుడు పరమేశ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.రోడ్డును బాగు చేయించి, అభివృద్ధి ప్రజలపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ప్రధాని మోదీ,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్డును బాగు చేయించి సమస్యల పరిష్కరించాలన్నారు.
    1
    అధ్వానంగా రోడ్డు..ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు:బీజేపీ నేతలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం నుంచి రూరల్ మండలంలోని జయవరం,మల్లారం,హన్మాజీపేట గ్రామాలకు వెళ్లే బ్రిడ్జి రోడ్డు అధ్వానంగా ఉందని బీజేపీ రూరల్ మండల బీజేపీ అధ్యక్షుడు పరమేశ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.రోడ్డును బాగు చేయించి, అభివృద్ధి ప్రజలపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ప్రధాని మోదీ,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్డును బాగు చేయించి సమస్యల పరిష్కరించాలన్నారు.
    user_Hari
    Hari
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • జైలు బరో లో ఎర్ర జెండా పార్టీలు., రాజీవ్ రహదారిపై ఆందోళన ధర్నా చేపట్టిన జెఎసి నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసన గా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహించారు. జెఎసి నాయకులు సీఐటీయూ, iftu నాయకులు ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై ఆందోళన ధర్నా చేశారు.
    1
    జైలు బరో లో ఎర్ర జెండా పార్టీలు., రాజీవ్ రహదారిపై ఆందోళన ధర్నా చేపట్టిన జెఎసి నాయకులు
కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసన గా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహించారు. జెఎసి నాయకులు సీఐటీయూ, iftu నాయకులు ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై ఆందోళన ధర్నా చేశారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    21 hrs ago
  • గతంలో సోమిడి వేణు కార్పొరేటర్ పై దాడి జరుగుతే ఎప్పుడు రాజకీయ కోణంలో చూడలేదు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాజకీయ కోణంలో చూస్తున్నాడు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు ప్రెస్ మీట్. కిసాన్ నగర్ లో వ్యక్తిగతంగా దాడి జరుగుతే పార్టీ సంబంధం లేదు. గతంలో సోమిడి వేణు కార్పొరేటర్ పై దాడి జరుగుతే ఎప్పుడు రాజకీయ కోణంలో చూడలేదు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాజకీయ కోణంలో చూస్తున్నాడు. గొడవలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. వ్యక్తిగత గొడవలను పార్టీలపై రుద్దద్దు. కరీంనగర్కు మేయర్ అప్పచెప్పితే దాడులు జరుగుతున్నాయి అనడం విడ్డూరం. మీ 10 సంవత్సరాల పాలనలో ఎన్ని గొడవలు జరిగాయో అందరికీ తెలుసు. మీ పార్టీ నాయకులపై కేసులయి జైలుకు పోయొచ్చారు దానికి బాధ్యత మీరు వహిస్తారా. కరీంనగర్ లో మీరు శాంతిని నెలకొల్పితే ప్రజలు ఎందుకు ఆదరించలేదు. అభివృద్ధి మా ఎజెండా, దాడులు మా ఏజెండా కాదు. కార్పొరేటర్ వేణు ప్రసాద్ పై కుటుంబ కారుతో బుద్ధి హత్య విక్రం చేసేందుకు ప్రయత్నించారు. దాడి జరిగిన సమయంలో వేణు ప్రసాద్ అక్కడ లేడు కదా. పోలీస్ ఎఫ్ ఐ ఆర్ లో మాత్రం పేరు ఉంది.విచారణ జరుగుతుంది. ఎమ్మెల్యే క్యాప్ ఆఫీస్ లో వేరే వ్యక్తులు వచ్చి మీరు రాజకీయాలు ఎలా చేస్తారు. బండి సంజయ్ ఎప్పుడు కూడా ఇలాంటివి సహించరు...
    3
    గతంలో సోమిడి వేణు కార్పొరేటర్ పై దాడి జరుగుతే ఎప్పుడు రాజకీయ కోణంలో చూడలేదు.  కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాజకీయ కోణంలో చూస్తున్నాడు. 
డిప్యూటీ మేయర్ సునీల్ రావు ప్రెస్ మీట్. కిసాన్ నగర్ లో వ్యక్తిగతంగా దాడి జరుగుతే పార్టీ సంబంధం లేదు. గతంలో సోమిడి వేణు కార్పొరేటర్ పై దాడి జరుగుతే ఎప్పుడు రాజకీయ కోణంలో చూడలేదు.  కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాజకీయ కోణంలో చూస్తున్నాడు. 
గొడవలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. 
వ్యక్తిగత గొడవలను పార్టీలపై రుద్దద్దు. 
కరీంనగర్కు మేయర్ అప్పచెప్పితే దాడులు జరుగుతున్నాయి అనడం విడ్డూరం. మీ 10 సంవత్సరాల పాలనలో ఎన్ని గొడవలు జరిగాయో అందరికీ తెలుసు. 
మీ పార్టీ నాయకులపై కేసులయి జైలుకు పోయొచ్చారు దానికి బాధ్యత మీరు వహిస్తారా. కరీంనగర్ లో మీరు శాంతిని నెలకొల్పితే ప్రజలు ఎందుకు ఆదరించలేదు.
అభివృద్ధి మా ఎజెండా, దాడులు మా ఏజెండా కాదు. కార్పొరేటర్ వేణు ప్రసాద్ పై కుటుంబ కారుతో బుద్ధి హత్య విక్రం చేసేందుకు ప్రయత్నించారు.
దాడి జరిగిన సమయంలో వేణు ప్రసాద్ అక్కడ లేడు కదా. పోలీస్ ఎఫ్ ఐ ఆర్ లో మాత్రం  పేరు ఉంది.విచారణ జరుగుతుంది. ఎమ్మెల్యే క్యాప్ ఆఫీస్ లో వేరే వ్యక్తులు వచ్చి  మీరు రాజకీయాలు ఎలా చేస్తారు.
బండి సంజయ్ ఎప్పుడు కూడా ఇలాంటివి సహించరు...
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    7 hrs ago
  • కోతిరాంపూర్‌లో ఘనంగా మైసమ్మతల్లి బోనాలు...బోనమెత్తిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లోని కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన వెలిసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు కన్నుల పండువలా నిర్వహించారు. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ​బోనాల వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఆయనకు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి బోనం ఎత్తుకున్న గంగుల.. ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకాల మధ్య సాగిన ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగాయి. ​అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ​ఎల్లమ్మ తల్లి కలలో వచ్చి స్థానిక పెంట కుప్పలో వెలిశానని తెలపడంతో. కాలనీవాసులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్టించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, యాట పిల్లలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు ​ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్ పాల్గొన్నారు. ​
    1
    కోతిరాంపూర్‌లో ఘనంగా మైసమ్మతల్లి బోనాలు...బోనమెత్తిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ లోని కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన వెలిసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు కన్నుల పండువలా నిర్వహించారు. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ​బోనాల వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఆయనకు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి బోనం ఎత్తుకున్న గంగుల.. ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకాల మధ్య సాగిన ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగాయి.
​అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ​ఎల్లమ్మ తల్లి కలలో వచ్చి స్థానిక పెంట కుప్పలో వెలిశానని తెలపడంతో. కాలనీవాసులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్టించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, యాట పిల్లలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు 
​ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్ పాల్గొన్నారు.
​
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • మంచిర్యాల పట్టణంలో సోమవారం జరిగిన జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి సమావేశంలో జిల్లా బీసీ డిక్లరేషన్ సాధన కై సైకిల్ యాత్రకు పిలుపు మంచిర్యాల పట్టణంలో సోమవారం జరిగిన జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అమలు చేయడంలో నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 14 శుక్రవారం రోజున మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి హజిపూర్ వరకు సైకిల్ యాత్ర నిర్వహించబోతున్నామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక బీసీ అంశాలు చేర్చి, బీసీ ఓట్లతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 3 ఏళ్ళు అవుతున్న ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం అంటే బీసీల పట్ల వివక్షగా భావిస్తున్నామని, ప్రభుత్వాన్ని ఎండగట్టి బీసీ సమాజం ముందు దోషిగా నిలబెడుతామని హెచ్చరించారు. బీసీ వాదులు హాజరై సైకిల్ యాత్రను విజయవంతం చేయాలనీ కోరారు.
    1
    మంచిర్యాల పట్టణంలో సోమవారం జరిగిన జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి సమావేశంలో జిల్లా
బీసీ డిక్లరేషన్ సాధన కై సైకిల్ యాత్రకు పిలుపు
మంచిర్యాల పట్టణంలో సోమవారం జరిగిన జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అమలు చేయడంలో నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 14 శుక్రవారం రోజున మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి హజిపూర్ వరకు సైకిల్ యాత్ర నిర్వహించబోతున్నామని  పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక బీసీ అంశాలు చేర్చి, బీసీ ఓట్లతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 3 ఏళ్ళు అవుతున్న ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం అంటే బీసీల పట్ల వివక్షగా భావిస్తున్నామని, ప్రభుత్వాన్ని ఎండగట్టి బీసీ సమాజం ముందు దోషిగా నిలబెడుతామని హెచ్చరించారు. బీసీ వాదులు హాజరై సైకిల్ యాత్రను విజయవంతం చేయాలనీ కోరారు.
    user_Bellamplly Ashok kumar
    Bellamplly Ashok kumar
    Local News Reporter కోటపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    1 day ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.