logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మంచిర్యాల పట్టణంలో సోమవారం జరిగిన జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి సమావేశంలో జిల్లా బీసీ డిక్లరేషన్ సాధన కై సైకిల్ యాత్రకు పిలుపు మంచిర్యాల పట్టణంలో సోమవారం జరిగిన జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అమలు చేయడంలో నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 14 శుక్రవారం రోజున మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి హజిపూర్ వరకు సైకిల్ యాత్ర నిర్వహించబోతున్నామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక బీసీ అంశాలు చేర్చి, బీసీ ఓట్లతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 3 ఏళ్ళు అవుతున్న ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం అంటే బీసీల పట్ల వివక్షగా భావిస్తున్నామని, ప్రభుత్వాన్ని ఎండగట్టి బీసీ సమాజం ముందు దోషిగా నిలబెడుతామని హెచ్చరించారు. బీసీ వాదులు హాజరై సైకిల్ యాత్రను విజయవంతం చేయాలనీ కోరారు.

1 day ago
user_Bellamplly Ashok kumar
Bellamplly Ashok kumar
Local News Reporter కోటపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
1 day ago

మంచిర్యాల పట్టణంలో సోమవారం జరిగిన జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి సమావేశంలో జిల్లా బీసీ డిక్లరేషన్ సాధన కై సైకిల్ యాత్రకు పిలుపు మంచిర్యాల పట్టణంలో సోమవారం జరిగిన జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అమలు చేయడంలో నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 14 శుక్రవారం రోజున మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి హజిపూర్ వరకు సైకిల్ యాత్ర నిర్వహించబోతున్నామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక బీసీ అంశాలు చేర్చి, బీసీ ఓట్లతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 3 ఏళ్ళు అవుతున్న ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం అంటే బీసీల పట్ల వివక్షగా భావిస్తున్నామని, ప్రభుత్వాన్ని ఎండగట్టి బీసీ సమాజం ముందు దోషిగా నిలబెడుతామని హెచ్చరించారు. బీసీ వాదులు హాజరై సైకిల్ యాత్రను విజయవంతం చేయాలనీ కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • బొగ్గు గని కార్మికుల జీతాల పెంపు కోసం 12వ వేజ్ బోర్డు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి., జిఎం ఆఫీస్ ముందు ధర్నా చేసిన ఓఅత్య సంఘాలు బొగ్గు పరిశ్రమల్లో నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయొద్దని, బొగ్గు గని కార్మికుల జీతాల పెంపు కోసం 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను వెంటనే ప్రారంభించాలనీ డిమాండ్ తో సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి యాజమాన్యం కు వినతి పత్రం ఇచ్చిన జాతీయ కార్మిక సంఘాల నాయకులు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ బొగ్గు గని కార్మికుల కు జీతాల పెంపు కోసం 12 వ వేతన సవరణ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని, నాలుగు లేబర్ కోడ్ లను బొగ్గు పరిశ్రమల్లో అమలు చేయరాదని డిమాండ్ చేస్తూ సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించి యాజమాన్యం కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఏఐటియుసి నుంచి కొరిమి రాజ్ కుమార్, ఐఎన్టీయుసి నుంచి ధర్మపురి, సిఐటియు నుంచి ఎస్ వీరయ్య, హెచ్ ఎం ఎస్ నుంచి దబ్బెట సతీష్ లు పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఉన్న బొగ్గు గని కార్మికుల కు జూన్ 30 తో 11 వ వేజ్ బోర్డు కాలపరిమితి ముగిసిందని, 2026 జూలై 1 నుంచి 12 వ వేజ్ బోర్డు ప్రారంభం అయిందని, కానీ కోల్ ఇండియా యాజమాన్యం ఇంత వరకు వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంబించలేదని వారు ఆరోపించారు. గత కొన్ని నెలల క్రితం కోల్ ఇండియా యాజమాన్యం తో బొగ్గు గని కార్మిక సంఘాల తో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ ల అమలు గురించి ప్రస్తావించారని, 51 శాతం ఓట్లు వచ్చిన కార్మిక సంఘం తో వేతన సవరణ జరుపుతామని తెలుపగా కేంద్ర కార్మిక సంఘాల నాయకులు వ్యతిరేకించారని వారు పేర్కొన్నారు. గతంలో వలే 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంభించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ డిమాండ్ చేయగా కోల్ ఇండియా యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని తెలిపారని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను బొగ్గు పరిశ్రమల్లో అమలు చేయరాదని, వెంటనే 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంభించేందుకు తక్షణమే కోల్ ఇండియా యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉదృతం చేస్తామని అవసరమైతే నిరవధిక సమ్మె కు పిలుపు నిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు. ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను అద్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు మడ్డి ఎల్లా గౌడ్, తుమ్మల రాజిరెడ్డి, సదానందం తో పాటు జాతీయ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    బొగ్గు గని కార్మికుల జీతాల పెంపు కోసం 12వ వేజ్ బోర్డు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి.,
జిఎం ఆఫీస్ ముందు ధర్నా చేసిన ఓఅత్య సంఘాలు
బొగ్గు పరిశ్రమల్లో నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయొద్దని, బొగ్గు గని కార్మికుల జీతాల పెంపు కోసం 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను వెంటనే ప్రారంభించాలనీ డిమాండ్ తో
సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి యాజమాన్యం కు వినతి పత్రం ఇచ్చిన జాతీయ కార్మిక సంఘాల నాయకులు.
దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ బొగ్గు గని కార్మికుల కు జీతాల పెంపు కోసం 12 వ వేతన సవరణ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని, నాలుగు లేబర్ కోడ్ లను బొగ్గు పరిశ్రమల్లో అమలు చేయరాదని డిమాండ్ చేస్తూ సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించి యాజమాన్యం కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఏఐటియుసి నుంచి కొరిమి రాజ్ కుమార్, ఐఎన్టీయుసి నుంచి ధర్మపురి,  సిఐటియు నుంచి ఎస్ వీరయ్య, హెచ్ ఎం ఎస్ నుంచి దబ్బెట సతీష్ లు పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఉన్న బొగ్గు గని కార్మికుల కు జూన్ 30 తో 11 వ వేజ్ బోర్డు కాలపరిమితి ముగిసిందని, 2026 జూలై 1 నుంచి 12 వ వేజ్ బోర్డు ప్రారంభం అయిందని, కానీ కోల్ ఇండియా యాజమాన్యం ఇంత వరకు వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంబించలేదని వారు ఆరోపించారు. గత కొన్ని నెలల క్రితం కోల్ ఇండియా యాజమాన్యం తో బొగ్గు గని కార్మిక సంఘాల తో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ ల అమలు గురించి ప్రస్తావించారని, 51 శాతం ఓట్లు వచ్చిన కార్మిక సంఘం తో వేతన సవరణ జరుపుతామని తెలుపగా   కేంద్ర కార్మిక సంఘాల నాయకులు వ్యతిరేకించారని వారు పేర్కొన్నారు. గతంలో వలే 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంభించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ డిమాండ్ చేయగా కోల్ ఇండియా యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని తెలిపారని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను బొగ్గు పరిశ్రమల్లో అమలు చేయరాదని, వెంటనే 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంభించేందుకు తక్షణమే కోల్ ఇండియా యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉదృతం చేస్తామని అవసరమైతే నిరవధిక సమ్మె కు పిలుపు నిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు. ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను అద్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు మడ్డి ఎల్లా గౌడ్, తుమ్మల రాజిరెడ్డి, సదానందం తో పాటు జాతీయ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    22 hrs ago
  • మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ. మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఈరోజు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు.పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాక్ వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సరదా విషాధంగా మారకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సిబ్బంది ఉన్నారు.
    1
    మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ.
 మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా
తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఈరోజు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు.
ఈసందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు.పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
బ్యాక్ వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు.
పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సరదా విషాధంగా మారకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.
ఎస్పీ  వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సిబ్బంది ఉన్నారు.
    user_శ్రీధర్ సూర్య రిపోటర్
    శ్రీధర్ సూర్య రిపోటర్
    చొప్పదండి, కరీంనగర్, తెలంగాణ•
    1 day ago
  • మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఆషాడ వనభోజనాలు, హాజరైన కులస్తులు జన్నారం మండల కేంద్రంలోని మహేంద్ర సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆషాడమాస వనభోజనాలను నిర్వహించారు. ఆషాడ మాసం బోనాల ముగింపు సందర్భంగా మహేంద్ర సంఘం నాయకులు, కులస్తులు మంగళవారం సాయంత్రం పట్టణ శివారులోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయం ఆవరణలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతకుముందు వారు తమ కులదైవం కేతికి సంగమేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక భోజనాలు చేశారు.
    1
    మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఆషాడ వనభోజనాలు, హాజరైన కులస్తులు
జన్నారం మండల కేంద్రంలోని మహేంద్ర సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆషాడమాస వనభోజనాలను నిర్వహించారు. ఆషాడ మాసం బోనాల ముగింపు సందర్భంగా మహేంద్ర సంఘం నాయకులు, కులస్తులు మంగళవారం సాయంత్రం పట్టణ శివారులోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయం ఆవరణలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతకుముందు వారు తమ కులదైవం కేతికి సంగమేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక భోజనాలు చేశారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • కరీంనగర్‌లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవం, ఫ్రెషర్స్ పార్టీ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ 20వ వార్షికోత్సవ వేడుకలతో పాటు ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. సప్తగిరి కాలనీలోని వసుంధర గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని సరస్వతి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఒకేషనల్ విద్య ద్వారా విద్యార్థులకు నైపుణ్యాలతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఎంతోమంది విద్యార్థులు ఒకేషనల్ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు.
    2
    కరీంనగర్‌లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవం, ఫ్రెషర్స్ పార్టీ
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ 20వ వార్షికోత్సవ వేడుకలతో పాటు ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు.
సప్తగిరి కాలనీలోని వసుంధర గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని సరస్వతి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఒకేషనల్ విద్య ద్వారా విద్యార్థులకు నైపుణ్యాలతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఎంతోమంది విద్యార్థులు ఒకేషనల్ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • 27వ డివిజన్‌లో ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ భవనం కూల్చివేతపై తీవ్ర ఆందోళన.బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి (AIFB) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ ⁠ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ కూల్చివేత భవనం ముందు ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో ధర్నా చేసిన బాధితులను పారమర్శించిన జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్. - కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్‌లో మున్సిపల్ అధికారులు, భవన యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి 3 అంతస్తుల 'ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్' భవనాన్ని కూల్చివేసే క్రమంలో పక్కనే ఉన్న నివాస గృహాలకు భద్రత కల్పించడంలో సంబంధిత యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. భవనం కూల్చివేత పనులు ప్రారంభమైన సమయంలోనే పక్కనున్న ఇళ్లపై ఇటుకలు, కాంక్రీట్ ముక్కలు పడుతున్న విషయాన్ని సంబంధిత వారికి తెలియజేసి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా పనులు కొనసాగించారు. ఈ రోజు కూల్చివేత సమయంలో పెద్ద ఎత్తున ఇటుకలు, కాంక్రీట్ గోడ భాగాలు పక్కనే ఉన్న ఇంటిపై పడటంతో రేకులు తీవ్రంగా దెబ్బతిని, ఇంట్లోకి శిథిలాలు పడిపోయాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఒక మహిళకు ఇటుకలు తగిలి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పినప్పటికీ, ఆ కుటుంబానికి భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత కంటే ఏ నిర్మాణ పనులూ ముఖ్యమైనవి కావు. పలుకుబడి లేదా అధికార పరిచయాలు ఉన్నాయనే భావనతో ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. చట్టాలు – ఉల్లంఘనలు: నేషనల్ బిల్డింగ్ కోడ్ (NBC) & టౌన్ ప్లానింగ్ నిబంధనలు: బహుళ అంతస్తుల భవనాలను కూల్చివేసేటప్పుడు చుట్టుపక్కల ప్రజల రక్షణ కోసం ప్రామాణిక భద్రతా వలయాలు (Safety Nets), బారికేడ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. భారతీయ నైయాయిక సంహిత (BNS) - సెక్షన్ 125 & 324: నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరుల ప్రాణాలకు ముప్పు తలపెట్టడం, ఇతరుల ఆస్తికి తీవ్ర నష్టం కలిగించడం చట్టరీత్యా క్రిమినల్ నేరం. మున్సిపల్ యాక్ట్ 2019: ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉంది. అధికారుల బాధ్యతారాహిత్యం: ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని గత నెల 27నే మున్సిపల్ కమిషనర్‌కు పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం శోచనీయం. స్థానిక కార్పొరేటర్ స్వయంగా టౌన్ ప్లానింగ్ అధికారులు అశ్విని, శ్రీధర్‌లకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినా స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సదరు అధికారులు లంచాల మత్తులో తూగుతూ ప్రజాసమస్యలను గాలికొదిలేశారని ఆరోపించారు. AIFB ప్రధాన డిమాండ్లు: 1. అధికారులు వెంటనే ఘటనాస్థలిని పరిశీలించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితులకు తక్షణ న్యాయం చేయాలి. 2. భద్రతా నిబంధనలు పాటించకుండా కూల్చివేతలు చేపట్టి, మహిళ గాయపడటానికి కారణమైన ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ యాజమాన్యంపై చట్టపరమైన, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. 3. దెబ్బతిన్న బాధిత కుటుంబ ఇంటిని తక్షణమే హాస్పిటల్ యాజమాన్యంతో ఉచితంగా పునర్నిర్మించి ఇవ్వాలి. 4. ప్రజా ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు అశ్విని, శ్రీధర్‌లపై చట్టపరమైన, శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. ప్రజల భద్రత విషయంలో రాజీపడేది లేదు. 27వ డివిజన్ ప్రజలకు న్యాయం జరిగే వరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో బాధ్యతాయుతంగా మా పోరాటం కొనసాగుతుంది. ఈ కార్యక్రంలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
    2
    27వ డివిజన్‌లో ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ భవనం కూల్చివేతపై తీవ్ర ఆందోళన.బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి (AIFB) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్
⁠ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ కూల్చివేత భవనం ముందు ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో ధర్నా చేసిన బాధితులను పారమర్శించిన జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్.
- కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్‌లో మున్సిపల్ అధికారులు, భవన యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక్కడి 3 అంతస్తుల 'ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్' భవనాన్ని కూల్చివేసే క్రమంలో పక్కనే ఉన్న నివాస గృహాలకు భద్రత కల్పించడంలో సంబంధిత యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. భవనం కూల్చివేత పనులు ప్రారంభమైన సమయంలోనే పక్కనున్న ఇళ్లపై ఇటుకలు, కాంక్రీట్ ముక్కలు పడుతున్న విషయాన్ని సంబంధిత వారికి తెలియజేసి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా పనులు కొనసాగించారు.
ఈ రోజు కూల్చివేత సమయంలో పెద్ద ఎత్తున ఇటుకలు, కాంక్రీట్ గోడ భాగాలు పక్కనే ఉన్న ఇంటిపై పడటంతో రేకులు తీవ్రంగా దెబ్బతిని, ఇంట్లోకి శిథిలాలు పడిపోయాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఒక మహిళకు ఇటుకలు తగిలి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పినప్పటికీ, ఆ కుటుంబానికి భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత కంటే ఏ నిర్మాణ పనులూ ముఖ్యమైనవి కావు. పలుకుబడి లేదా అధికార పరిచయాలు ఉన్నాయనే భావనతో ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు.
చట్టాలు – ఉల్లంఘనలు:
నేషనల్ బిల్డింగ్ కోడ్ (NBC) & టౌన్ ప్లానింగ్ నిబంధనలు: బహుళ అంతస్తుల భవనాలను కూల్చివేసేటప్పుడు చుట్టుపక్కల ప్రజల రక్షణ కోసం ప్రామాణిక భద్రతా వలయాలు (Safety Nets), బారికేడ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. భారతీయ నైయాయిక సంహిత (BNS) - సెక్షన్ 125 & 324: నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరుల ప్రాణాలకు ముప్పు తలపెట్టడం, ఇతరుల ఆస్తికి తీవ్ర నష్టం కలిగించడం చట్టరీత్యా క్రిమినల్ నేరం.
మున్సిపల్ యాక్ట్ 2019: ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉంది.
అధికారుల బాధ్యతారాహిత్యం:
ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని గత నెల 27నే మున్సిపల్ కమిషనర్‌కు పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం శోచనీయం. స్థానిక కార్పొరేటర్ స్వయంగా టౌన్ ప్లానింగ్ అధికారులు అశ్విని, శ్రీధర్‌లకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినా స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సదరు అధికారులు లంచాల మత్తులో తూగుతూ ప్రజాసమస్యలను గాలికొదిలేశారని ఆరోపించారు.
AIFB ప్రధాన డిమాండ్లు:
1. అధికారులు వెంటనే ఘటనాస్థలిని పరిశీలించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితులకు తక్షణ న్యాయం చేయాలి.
2. భద్రతా నిబంధనలు పాటించకుండా కూల్చివేతలు చేపట్టి, మహిళ గాయపడటానికి కారణమైన ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ యాజమాన్యంపై చట్టపరమైన, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
3. దెబ్బతిన్న బాధిత కుటుంబ ఇంటిని తక్షణమే హాస్పిటల్ యాజమాన్యంతో ఉచితంగా పునర్నిర్మించి ఇవ్వాలి.
4. ప్రజా ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు అశ్విని, శ్రీధర్‌లపై చట్టపరమైన, శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
ప్రజల భద్రత విషయంలో రాజీపడేది లేదు. 27వ డివిజన్ ప్రజలకు న్యాయం జరిగే వరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో బాధ్యతాయుతంగా మా పోరాటం కొనసాగుతుంది.
ఈ కార్యక్రంలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    7 hrs ago
  • రామగుండం లో దశలవారీగా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తున్నాం : రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ముప్పయి ఐదవ డివిజన్ సప్తగిరి కాలనీ , రాజ్య లక్ష్మీ కాలనీలలో దశలవారీగా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. సోమవారం 35 వ డివిజన్ రాజ్య లక్ష్మీ కాలనీలో రూ.7.00 కోట్ల స్పెషల్ ఫండ్ ప్యాకేజీ పనుల్లో భాగంగా రూ 8.00 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన సి సి రోడ్డు నిర్మాణపనులను స్థానిక కార్పొరేటర్ జంగపల్లి రమాదేవి శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎం ఎల్ ఏ రాజ్ ఠాకూర్ తాను గెలిచిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం రాజ్యలక్ష్మి కాలనీ, సప్తగిరి కాలనీ వర్షా కాలంలో ముంపుకు గురి కాకుండా వరద నీటి కాలువ నిర్మించడం జరిగిందని అన్నారు. కొత్తగా ఏర్పడిన కాలనీ కావడంతో సరైన డ్రైనేజి వ్యవస్థ లేక మురుగునీరు రోడ్లపై పారేదని అన్నారు. ప్రస్తుతం డ్రైనేజి నిర్మాణo పూర్తయిందని ఎం ఎల్ ఏ ఆదేశాల మేరకు రూ 50.00 లక్షల అంచనా వ్యయంతో రాజ్యాలక్ష్మీ కాలనీ లో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఇటీవల తాను డివిజన్ లో వార్డు సందర్శన కార్యక్రమం చేపట్టి సమస్యలు గుర్తించామని ఒక్కటొక్కటిగా అన్ని సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దాసరి సాంబమూర్తి, డేవిడ్ రాజు, స్థానిక నాయకులు గడ్డం శ్రీనివాస్, పీచర శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.
    1
    రామగుండం లో దశలవారీగా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తున్నాం : రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి
ముప్పయి ఐదవ డివిజన్ సప్తగిరి కాలనీ , రాజ్య లక్ష్మీ కాలనీలలో దశలవారీగా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. సోమవారం 35 వ డివిజన్ రాజ్య లక్ష్మీ కాలనీలో రూ.7.00 కోట్ల స్పెషల్ ఫండ్ ప్యాకేజీ పనుల్లో భాగంగా రూ 8.00 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన సి సి రోడ్డు నిర్మాణపనులను స్థానిక కార్పొరేటర్ జంగపల్లి రమాదేవి శ్రీనివాస్ తో  కలిసి ప్రారంభించారు.ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎం ఎల్ ఏ  రాజ్ ఠాకూర్  తాను గెలిచిన వెంటనే ఇచ్చిన  మాట ప్రకారం రాజ్యలక్ష్మి కాలనీ, సప్తగిరి కాలనీ వర్షా కాలంలో ముంపుకు గురి కాకుండా వరద నీటి కాలువ నిర్మించడం జరిగిందని అన్నారు. కొత్తగా ఏర్పడిన కాలనీ కావడంతో సరైన డ్రైనేజి వ్యవస్థ లేక మురుగునీరు రోడ్లపై పారేదని అన్నారు. ప్రస్తుతం డ్రైనేజి నిర్మాణo పూర్తయిందని ఎం ఎల్ ఏ ఆదేశాల మేరకు రూ 50.00 లక్షల అంచనా వ్యయంతో రాజ్యాలక్ష్మీ కాలనీ లో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఇటీవల తాను డివిజన్ లో వార్డు సందర్శన కార్యక్రమం చేపట్టి సమస్యలు గుర్తించామని ఒక్కటొక్కటిగా అన్ని సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో  కార్పొరేటర్లు దాసరి సాంబమూర్తి, డేవిడ్ రాజు, స్థానిక నాయకులు గడ్డం శ్రీనివాస్, పీచర శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    22 hrs ago
  • మంచిర్యాల పట్టణంలోని హమాలివాడ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆషాడ మాసం వేడుకలు మంచిర్యాల పట్టణంలోని హమాలివాడ పెద్దమ్మ తల్లి ఆలయంలో మంగళవారం ఆషాడ మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల పట్టణ ముదిరాజ్ మహిళ అధ్యక్షురాలు తూటి విజయ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆషాడ గోరింటాకు వేడుకలు, లలిత పారాయణం, =కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు విశ్వేశ్వర శర్మ, అరుణాదేవి, జయ, రజిత, ప్రశాంతి, ప్రభావతితో కూడిన లలిత పారాయణ బృందం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    1
    మంచిర్యాల పట్టణంలోని హమాలివాడ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆషాడ మాసం వేడుకలు
మంచిర్యాల పట్టణంలోని హమాలివాడ పెద్దమ్మ తల్లి ఆలయంలో మంగళవారం ఆషాడ మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల పట్టణ ముదిరాజ్ మహిళ అధ్యక్షురాలు తూటి విజయ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆషాడ గోరింటాకు వేడుకలు, లలిత పారాయణం, =కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు విశ్వేశ్వర శర్మ, అరుణాదేవి, జయ, రజిత, ప్రశాంతి, ప్రభావతితో కూడిన లలిత పారాయణ బృందం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    user_Bellamplly Ashok kumar
    Bellamplly Ashok kumar
    Local News Reporter కోటపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.