కోతిరాంపూర్‌లో ఘనంగా మైసమ్మతల్లి బోనాలు...బోనమెత్తిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లోని కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన వెలిసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు కన్నుల పండువలా నిర్వహించారు. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోనాల వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఆయనకు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి బోనం ఎత్తుకున్న గంగుల.. ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకాల మధ్య సాగిన ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగాయి. అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఎల్లమ్మ తల్లి కలలో వచ్చి స్థానిక పెంట కుప్పలో వెలిశానని తెలపడంతో. కాలనీవాసులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్టించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, యాట పిల్లలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్ పాల్గొన్నారు.
కోతిరాంపూర్‌లో ఘనంగా మైసమ్మతల్లి బోనాలు...బోనమెత్తిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లోని కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన వెలిసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు కన్నుల పండువలా నిర్వహించారు. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోనాల వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఆయనకు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి బోనం ఎత్తుకున్న గంగుల.. ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకాల మధ్య సాగిన ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగాయి. అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఎల్లమ్మ తల్లి కలలో వచ్చి స్థానిక పెంట కుప్పలో వెలిశానని తెలపడంతో. కాలనీవాసులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్టించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, యాట పిల్లలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్ పాల్గొన్నారు.
- కోతిరాంపూర్‌లో ఘనంగా మైసమ్మతల్లి బోనాలు...బోనమెత్తిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లోని కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన వెలిసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు కన్నుల పండువలా నిర్వహించారు. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోనాల వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఆయనకు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి బోనం ఎత్తుకున్న గంగుల.. ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకాల మధ్య సాగిన ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగాయి. అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఎల్లమ్మ తల్లి కలలో వచ్చి స్థానిక పెంట కుప్పలో వెలిశానని తెలపడంతో. కాలనీవాసులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్టించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, యాట పిల్లలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్ పాల్గొన్నారు. 1
- తల్లిపాలపై అవగాహన కల్పించిన అంగన్వాడీ సిబ్బంది .... వడ్లూరులో తల్లిపాల వారోత్సవాలు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం, తొలి ఆరు నెలలు తల్లిపాలను మాత్రమే అందించడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడని వివరించారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. తల్లులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పులి రమేష్, గ్రామ కార్యదర్శి పద్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.2
- కరీంనగర్‌లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవం, ఫ్రెషర్స్ పార్టీ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ 20వ వార్షికోత్సవ వేడుకలతో పాటు ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. సప్తగిరి కాలనీలోని వసుంధర గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని సరస్వతి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఒకేషనల్ విద్య ద్వారా విద్యార్థులకు నైపుణ్యాలతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఎంతోమంది విద్యార్థులు ఒకేషనల్ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు.2
- 27వ డివిజన్‌లో ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ భవనం కూల్చివేతపై తీవ్ర ఆందోళన.బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి (AIFB) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ కూల్చివేత భవనం ముందు ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో ధర్నా చేసిన బాధితులను పారమర్శించిన జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్. - కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్‌లో మున్సిపల్ అధికారులు, భవన యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి 3 అంతస్తుల 'ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్' భవనాన్ని కూల్చివేసే క్రమంలో పక్కనే ఉన్న నివాస గృహాలకు భద్రత కల్పించడంలో సంబంధిత యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. భవనం కూల్చివేత పనులు ప్రారంభమైన సమయంలోనే పక్కనున్న ఇళ్లపై ఇటుకలు, కాంక్రీట్ ముక్కలు పడుతున్న విషయాన్ని సంబంధిత వారికి తెలియజేసి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా పనులు కొనసాగించారు. ఈ రోజు కూల్చివేత సమయంలో పెద్ద ఎత్తున ఇటుకలు, కాంక్రీట్ గోడ భాగాలు పక్కనే ఉన్న ఇంటిపై పడటంతో రేకులు తీవ్రంగా దెబ్బతిని, ఇంట్లోకి శిథిలాలు పడిపోయాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఒక మహిళకు ఇటుకలు తగిలి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పినప్పటికీ, ఆ కుటుంబానికి భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత కంటే ఏ నిర్మాణ పనులూ ముఖ్యమైనవి కావు. పలుకుబడి లేదా అధికార పరిచయాలు ఉన్నాయనే భావనతో ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. చట్టాలు – ఉల్లంఘనలు: నేషనల్ బిల్డింగ్ కోడ్ (NBC) & టౌన్ ప్లానింగ్ నిబంధనలు: బహుళ అంతస్తుల భవనాలను కూల్చివేసేటప్పుడు చుట్టుపక్కల ప్రజల రక్షణ కోసం ప్రామాణిక భద్రతా వలయాలు (Safety Nets), బారికేడ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. భారతీయ నైయాయిక సంహిత (BNS) - సెక్షన్ 125 & 324: నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరుల ప్రాణాలకు ముప్పు తలపెట్టడం, ఇతరుల ఆస్తికి తీవ్ర నష్టం కలిగించడం చట్టరీత్యా క్రిమినల్ నేరం. మున్సిపల్ యాక్ట్ 2019: ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉంది. అధికారుల బాధ్యతారాహిత్యం: ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని గత నెల 27నే మున్సిపల్ కమిషనర్‌కు పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం శోచనీయం. స్థానిక కార్పొరేటర్ స్వయంగా టౌన్ ప్లానింగ్ అధికారులు అశ్విని, శ్రీధర్‌లకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినా స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సదరు అధికారులు లంచాల మత్తులో తూగుతూ ప్రజాసమస్యలను గాలికొదిలేశారని ఆరోపించారు. AIFB ప్రధాన డిమాండ్లు: 1. అధికారులు వెంటనే ఘటనాస్థలిని పరిశీలించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితులకు తక్షణ న్యాయం చేయాలి. 2. భద్రతా నిబంధనలు పాటించకుండా కూల్చివేతలు చేపట్టి, మహిళ గాయపడటానికి కారణమైన ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ యాజమాన్యంపై చట్టపరమైన, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. 3. దెబ్బతిన్న బాధిత కుటుంబ ఇంటిని తక్షణమే హాస్పిటల్ యాజమాన్యంతో ఉచితంగా పునర్నిర్మించి ఇవ్వాలి. 4. ప్రజా ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు అశ్విని, శ్రీధర్‌లపై చట్టపరమైన, శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. ప్రజల భద్రత విషయంలో రాజీపడేది లేదు. 27వ డివిజన్ ప్రజలకు న్యాయం జరిగే వరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో బాధ్యతాయుతంగా మా పోరాటం కొనసాగుతుంది. ఈ కార్యక్రంలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.2
- మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ. మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఈరోజు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు.పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాక్ వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సరదా విషాధంగా మారకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సిబ్బంది ఉన్నారు.1
- అధ్వానంగా రోడ్డు..ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు:బీజేపీ నేతలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం నుంచి రూరల్ మండలంలోని జయవరం,మల్లారం,హన్మాజీపేట గ్రామాలకు వెళ్లే బ్రిడ్జి రోడ్డు అధ్వానంగా ఉందని బీజేపీ రూరల్ మండల బీజేపీ అధ్యక్షుడు పరమేశ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.రోడ్డును బాగు చేయించి, అభివృద్ధి ప్రజలపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ప్రధాని మోదీ,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్డును బాగు చేయించి సమస్యల పరిష్కరించాలన్నారు.1
- కాజిపేట్ చౌరస్తా లో పెద్ది సుదర్శన్ రెడ్డి భారీ చిత్రపటానికి నివాళులు అర్పించిన దాస్యం వినయ్ భాస్కర్ *పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ ఘన నివాళులు* * *దాస్యం వినయభాస్కర్* * *ఈరోజు కాజీపేట చౌరస్తాలో బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధానకార్యదర్శి గబ్బేట శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో* జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిధిగా దాస్యం వినయ్ భాస్కర్ గారు పాల్గొని ఉద్యమ నాయకులు నర్సంపేట మాజీ శాసనసభ్యులు క్రీ:శే : పెద్ది సుదర్శన్ రెడ్డి గారి భారీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఛీప్ విప్ హనుమకొండ బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ బాస్కర్ గారు అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ మాట్లాడుతూ పెద్ది లేని లోటు పూడ్చలేనిది పెద్ది విగ్రహ ఏర్పాటు గద్దె కూల్చివేత దుర్మార్గం *ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు* కాజీపేట చౌరస్తాలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు, ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి యాదిలో కార్యక్రమాన్ని సోమవారం రోజున నిర్వహించారు మొదట పెద్ది చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ నిస్వార్ధమైన గొప్ప తెలంగాణ ఉద్యమకారుడు, గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు పెద్దితో నాకు ఉన్నది ఉద్యమ అనుబంధం తెలంగాణ కోసం కలిసి పోరాడం ఇదే కాజీపేట కేంద్రంగా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, బంద్లు, వంటా వార్పులు చేశాం ఎన్నో రాస్తారోకోలు, రైల్ రోకోలు చేశాము ఎన్నో కేసులు ఎదుర్కొని కోర్టులకు వెళ్ళాం పెద్ది మనల్ని విడిచి వెళ్లడం బాధాకరం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఇద్దరం కలిసి పోరాడిన సందర్భాలు అనేకం నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ది విగ్రహ ఏర్పాటు గద్దె కూల్చివేత దుర్మార్గం స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన గద్దె గుల్చివేత కూల్చివేత దుర్మార్గం ఒక ఉద్యమకారుడు, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ ప్రజాప్రతినిధి విగ్రహ ఏర్పాటును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వమే పెద్ది విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.. ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* సుంచు కృష్ణ మాజీ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్ మాజీ కార్పొరేటర్లు సంకు నర్సింగరావు సోద కిరణ్ వద్దిరాజు గణేష్ ఎండి అఫ్జల్ ఎండి హుస్సేన్ బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పాలడుగుల శివకుమార్ దువ్వ కనకరాజ్ బెదురుకోట రంజిత్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు *గబ్బేట కరుణ్ (సిద్దు)* బరిగెల వినయ్ ఎస్.కె మహమూద్ దువ్వ నరేష్ (కిట్టు)మాచర్ల ప్రభాకర్ కంజర్ల మనోజ్ కొండ శంకర్ మరియాల కృష్ణ తండముల వేణు రాబర్ట్ సయ్యద్ యాకూబ్ మంద రాజ్ కుమార్ బండి రామచందర్ పడిదల శేఖర్ బరబరి శ్రీకాంత్ గౌరీ శంకర్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించినారు.. 🙏🙏🙏🙏🙏 **మీ..* *గబ్బేట శ్రీనివాస్* *బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధానకార్యదర్శి వరంగల్**1
- మెట్ పల్లిలో ఘనంగా తిరంగా ర్యాలీ...500 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించిన బిజేపి కార్యకర్తలు జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో బిజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు జెండాను పట్టుకొని ర్యాలీలో 500 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. జాతీయ రహదారితో పాటు, పట్టణ ప్రధాన వీధుల మీదుగా తిరంగా ర్యాలీ సాగింది. వందేమాతరం అంటూ దేశభక్తి నినాదాలతో మెట్ పల్లి పట్టణంలో మార్మోగింది. అధిక సంఖ్యలో విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1