logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మెట్ పల్లిలో ఘనంగా తిరంగా ర్యాలీ...500 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించిన బిజేపి కార్యకర్తలు జగిత్యాల జిల్లా మెట్‌ పల్లిలో బిజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు జెండాను పట్టుకొని ర్యాలీలో 500 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. జాతీయ రహదారితో పాటు, పట్టణ ప్రధాన వీధుల మీదుగా తిరంగా ర్యాలీ సాగింది. వందేమాతరం అంటూ దేశభక్తి నినాదాలతో మెట్ పల్లి పట్టణంలో మార్మోగింది. అధిక సంఖ్యలో విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

1 hr ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
1 hr ago

మెట్ పల్లిలో ఘనంగా తిరంగా ర్యాలీ...500 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించిన బిజేపి కార్యకర్తలు జగిత్యాల జిల్లా మెట్‌ పల్లిలో బిజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు జెండాను పట్టుకొని ర్యాలీలో 500 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. జాతీయ రహదారితో పాటు, పట్టణ ప్రధాన వీధుల మీదుగా తిరంగా ర్యాలీ సాగింది. వందేమాతరం అంటూ దేశభక్తి నినాదాలతో మెట్ పల్లి పట్టణంలో మార్మోగింది. అధిక సంఖ్యలో విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం .... విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి వలస శంకరయ్య జ్ఞాపకార్థం వాలీబాల్ నెట్టు స్కిప్పింగ్ టెన్నిస్కై పంపిణీ చేసిన దండి లక్ష్మి మున్సిపల్ చైర్ పర్సన్ హుస్నాబాద్ *హుస్నాబాద్ పట్టణంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో మేరా యువభారత్ (మైభారత్ ) మరియు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్షవాడ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు ఒకటో తారీకు నుండి 15 వరకు సిద్దిపేట జిల్లా స్థాయి స్వచ్ఛత పక్షవాడ కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛభారత్ పరిసరాల పరిశుభ్రతతో విద్యార్థుల పాత్రను అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు గెలుపొందిన విజేతలకు హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి గారి చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది అదేవిధంగా వలస శంకరయ్య జ్ఞాపకార్థం విద్యార్థులకు వాలీబాల్ నెట్టు స్కిప్పింగ్ తెన్ని కాయిన్ వితరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఆమె విద్యార్థులతో అన్నారు క్రమశిక్షణ గల విద్యార్థులుగా పాఠశాలకు చదువులో రాణించి పేరు ప్రఖ్యాతలు తీసుకోవాలని ఆమె విద్యార్థులతో అన్నారు చదువు ద్వారానే సమాజంలో గుర్తింపు పడతారని తల్లిదండ్రుల కలలు నిజం చేసేందుకు కృషి చేయాలని అన్నారు మహాత్మా గాంధీ జి స్వచ్ఛ తో పాటు పరిశుభ్రమైన అభివృద్ధి చెందిన భారతదేశాన్ని కలగన్నారు భరతమాతను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత అని విద్యార్థులతో అన్నారు నేను పరిశుభ్రత పట్ల ఎల్లప్పుడు నిబద్ధతతో ఉంటాన నేను పరిశుభ్రతతో కోసం నా సమయాన్ని కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేసినట్టు వారు విద్యార్థులతో తెలిపారు హుస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛతమైన పట్టణాన్ని తీర్చినందుకు కృషి చేస్తున్నట్టు ఆమె తెలిపారు స్వచ్ఛతమైన పట్టణ కోసం ప్రజలు విద్యార్థులు మేధావులు అందరూ కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు పట్టణంలో స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు ఆమె తెలిపారు పట్టణంలో స్వచ్ఛత కార్యక్రమములో యువజన సంఘాలు మహిళా సంఘాలు యువత విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు అందరూ భాగ్యస్యం కావాలని ఆమె పిలుపుని ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు సంకల్ప స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ కౌన్సిలర్లు అనూష తిరుపతి కస్తూర్బా గాంధీ విద్యాలయం ప్రత్యేక అధికారిని రాగుల మమత ఉపాధ్యాయురాలు విద్యార్థినిలు పాల్గొన్నారు*
    2
    వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం .... విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి 
వలస శంకరయ్య జ్ఞాపకార్థం వాలీబాల్ నెట్టు స్కిప్పింగ్ టెన్నిస్కై పంపిణీ చేసిన
దండి లక్ష్మి మున్సిపల్ చైర్ పర్సన్ హుస్నాబాద్
*హుస్నాబాద్ పట్టణంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో మేరా యువభారత్ (మైభారత్ ) మరియు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్షవాడ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు ఒకటో తారీకు నుండి 15 వరకు సిద్దిపేట జిల్లా స్థాయి స్వచ్ఛత పక్షవాడ కార్యక్రమాల్లో భాగంగా   స్వచ్ఛభారత్   పరిసరాల పరిశుభ్రతతో విద్యార్థుల పాత్రను అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు గెలుపొందిన విజేతలకు హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి గారి చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది అదేవిధంగా వలస శంకరయ్య జ్ఞాపకార్థం విద్యార్థులకు వాలీబాల్ నెట్టు స్కిప్పింగ్ తెన్ని కాయిన్ వితరణ చేయడం జరిగింది  ఈ సందర్భంగా హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతనే సంపూర్ణ ఆరోగ్యంగా  ఉంటారని ఆమె విద్యార్థులతో అన్నారు క్రమశిక్షణ గల విద్యార్థులుగా పాఠశాలకు చదువులో రాణించి పేరు ప్రఖ్యాతలు తీసుకోవాలని ఆమె విద్యార్థులతో అన్నారు చదువు ద్వారానే సమాజంలో గుర్తింపు పడతారని తల్లిదండ్రుల కలలు నిజం చేసేందుకు కృషి చేయాలని అన్నారు  మహాత్మా గాంధీ జి స్వచ్ఛ తో పాటు పరిశుభ్రమైన అభివృద్ధి చెందిన భారతదేశాన్ని కలగన్నారు భరతమాతను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత అని విద్యార్థులతో అన్నారు నేను పరిశుభ్రత పట్ల ఎల్లప్పుడు నిబద్ధతతో ఉంటాన నేను పరిశుభ్రతతో కోసం నా సమయాన్ని కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేసినట్టు వారు విద్యార్థులతో తెలిపారు హుస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛతమైన పట్టణాన్ని తీర్చినందుకు కృషి చేస్తున్నట్టు ఆమె తెలిపారు స్వచ్ఛతమైన పట్టణ కోసం ప్రజలు విద్యార్థులు మేధావులు అందరూ కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు      పట్టణంలో స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు ఆమె తెలిపారు   పట్టణంలో స్వచ్ఛత కార్యక్రమములో యువజన సంఘాలు మహిళా సంఘాలు యువత విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు అందరూ భాగ్యస్యం కావాలని ఆమె పిలుపుని ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు సంకల్ప స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ కౌన్సిలర్లు అనూష తిరుపతి కస్తూర్బా గాంధీ  విద్యాలయం ప్రత్యేక అధికారిని రాగుల మమత ఉపాధ్యాయురాలు విద్యార్థినిలు పాల్గొన్నారు*
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • కోతీరాంపూర్‌లో ఘనంగా మైసమ్మ తల్లి బోనాలు దసరా నాటికి నూతన ఆలయం నిర్మిస్తాం: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతీరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన వెలిసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు మంగళవారం కన్నులపండువగా జరిగాయి. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ​ఘన స్వాగతం.. బోనం ఎత్తుకున్న ఎమ్మెల్యే ​బోనాల వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఆయనకు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి బోనం ఎత్తుకున్న గంగుల.. ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకాల మధ్య సాగిన ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగాయి. ​అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ​ఎల్లమ్మ తల్లి కలలో వచ్చి స్థానిక పెంట కుప్పలో వెలిశానని తెలపడంతో.. కాలనీవాసులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్టించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, యాట పిల్లలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు ​ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్ పాల్గొన్నారు. ​వీరితో పాటు బీఆర్ఎస్ నాయకులు మిడిదొడ్డి నవీన్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, జీపీ స్వామి, స్థానిక కాలనీవాసులు ఎల్లయ్య, బాల్ రెడ్డి, శేఖర్, సుధాకర్, మల్లయ్య తదితరులు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు
    1
    కోతీరాంపూర్‌లో ఘనంగా మైసమ్మ తల్లి బోనాలు దసరా నాటికి నూతన ఆలయం నిర్మిస్తాం: ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతీరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన వెలిసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు మంగళవారం కన్నులపండువగా జరిగాయి. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
​ఘన స్వాగతం.. బోనం ఎత్తుకున్న ఎమ్మెల్యే
​బోనాల వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఆయనకు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి బోనం ఎత్తుకున్న గంగుల.. ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకాల మధ్య సాగిన ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగాయి.
​అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.
​ఎల్లమ్మ తల్లి కలలో వచ్చి స్థానిక పెంట కుప్పలో వెలిశానని తెలపడంతో.. కాలనీవాసులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్టించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, యాట పిల్లలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు 
​ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్ పాల్గొన్నారు.
​వీరితో పాటు బీఆర్ఎస్ నాయకులు మిడిదొడ్డి నవీన్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, జీపీ స్వామి, స్థానిక కాలనీవాసులు ఎల్లయ్య, బాల్ రెడ్డి, శేఖర్, సుధాకర్, మల్లయ్య తదితరులు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
  • భీమేశ్వర ఆలయంలో ఈవో ఆకస్మిక తనిఖీ భక్తుల సౌకర్యాలు, వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి వివిధ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయంలో కొబ్బరికాయలు కొట్టే ప్రదేశానికి భక్తుల మాదిరిగా వెళ్లి అక్కడ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. భక్తులను డబ్బులు అడుగుతున్నారనే విషయంపై ఆరా తీసి, అక్కడి పరిస్థితులను భక్తులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఆలయంలో దీపాలు విక్రయించే ప్రదేశాన్ని పరిశీలించి, భక్తులకు నాణ్యమైన దీపాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. విక్రయ కేంద్రాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. వికలాంగులు, చిన్నారులు, వృద్ధులు సులభంగా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారా, వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే విషయాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. దర్శన ఏర్పాట్లను పరిశీలిస్తూ అవసరమైన సూచనలు చేశారు. ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఈవో రమాదేవి గారు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఆలయ పరిసరాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ తనిఖీలో డీఈఓ నవీన్, డి ఈ రామ్ కిషన్ రావు, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నరేందర్, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
    2
    భీమేశ్వర ఆలయంలో ఈవో  ఆకస్మిక తనిఖీ
భక్తుల సౌకర్యాలు, వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి వివిధ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయంలో కొబ్బరికాయలు కొట్టే ప్రదేశానికి భక్తుల మాదిరిగా వెళ్లి అక్కడ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. భక్తులను డబ్బులు అడుగుతున్నారనే విషయంపై ఆరా తీసి, అక్కడి పరిస్థితులను భక్తులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఆలయంలో దీపాలు విక్రయించే ప్రదేశాన్ని పరిశీలించి, భక్తులకు నాణ్యమైన దీపాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. విక్రయ కేంద్రాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. వికలాంగులు, చిన్నారులు, వృద్ధులు సులభంగా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారా, వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే విషయాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. దర్శన ఏర్పాట్లను పరిశీలిస్తూ అవసరమైన సూచనలు చేశారు.
ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఈవో రమాదేవి గారు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఆలయ పరిసరాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ తనిఖీలో డీఈఓ నవీన్,  డి ఈ రామ్ కిషన్ రావు, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నరేందర్, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
  • 56 ఏళ్ల రాహుల్ గాంధీ ఫిట్నెస్ సీక్రెట్............. ఇదే 56 ఏళ్ల వయసులోనూ ఫిట్గా ఉండటం వెనుక సీక్రెట్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. “ఎంత బిజీగా ఉన్నా రోజూ కనీసం గంటపాటు మార్షల్ ఆర్ట్స్, ఈత, రన్నింగ్, యోగా, ఏరోబిక్ వంటివి చేస్తా. అనారోగ్యకరమైన అలవాట్లను వ్యాయామంతో సరిదిద్దలేం. క్రమశిక్షణతో కూడిన శ్రమ, ఆరోగ్యకర ఆహారంతో ఫిట్నెస్ సాధించవచ్చు. స్నాక్స్ ఎక్కువగా తినడం మానుకోవాలి. లిక్కర్ అలవాటు ఉంటే పరిమితంగా తీసుకోవాలి' అని సూచించారు.
    1
    56 ఏళ్ల రాహుల్ గాంధీ ఫిట్నెస్ సీక్రెట్............. ఇదే
56 ఏళ్ల వయసులోనూ ఫిట్గా ఉండటం వెనుక సీక్రెట్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. “ఎంత బిజీగా ఉన్నా రోజూ కనీసం గంటపాటు మార్షల్ ఆర్ట్స్, ఈత, రన్నింగ్, యోగా, ఏరోబిక్ వంటివి చేస్తా. అనారోగ్యకరమైన అలవాట్లను వ్యాయామంతో సరిదిద్దలేం. క్రమశిక్షణతో కూడిన శ్రమ, ఆరోగ్యకర ఆహారంతో ఫిట్నెస్ సాధించవచ్చు. స్నాక్స్ ఎక్కువగా తినడం మానుకోవాలి. లిక్కర్ అలవాటు ఉంటే పరిమితంగా తీసుకోవాలి' అని సూచించారు.
    user_Reporter Gaddam Kiran
    Reporter Gaddam Kiran
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    21 hrs ago
  • గుప్తనిధుల పేరుతో క్షుద్ర పూజ చేస్తామంటూ కలరింగ్ గుప్తనిధుల పేరుతో మోసం పాల్పడుతున్న ముఠాగట్టురట్టు నలుగురు నిందితుల అరెస్టు *గుప్తనిధుల పేరుతో క్షుద్రపూజ చేస్తానంటూ కలరింగ్..!* శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ – 'గుప్త నిధుల' పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు – నలుగురు నిందితుల అరెస్ట్* *స్వాధీనం చేసుకున్న సొత్తు: 02 కార్లు, 01 ఆటో, 02 మోటార్ సైకిళ్లు, 04 సెల్ ఫోన్లు, నకిలీ బంగారు నాణేలు మరియు బొగ్గు.* హైదరాబాదు:: రాజేంద్రనగర్ పోలీసుల భాగస్వామ్యంతో శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను నమ్మించి మోసగిస్తున్న ఒక ముఠాను విజయవంతంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు (04) నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి పలు వాహనాలను మరియు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. *అరెస్టయిన నిందితుల వివరాలు:* మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా (36) – తండ్రి: మహ్మద్ అన్వర్, వృత్తి: కార్ల డెంటింగ్ & పెయింటింగ్, నివాసం: గుడిమల్కాపూర్, హైదరాబాద్. సయ్యద్ అలీ అష్రఫ్ (40) – తండ్రి: సయ్యద్ మూసా, వృత్తి: ఎలక్ట్రీషియన్, నివాసం: ఫర్హాన్ నగర్, జవహర్ నగర్, ECIL, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా. మహ్మద్ హాజీ (25) – తండ్రి: మహ్మద్ ఖాజా, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం: బాలాజీ నగర్, జవహర్ నగర్, ECIL, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా. మహ్మద్ సల్మాన్ (29) – తండ్రి: మహ్మద్ అన్వర్, వృత్తి: బైక్ మెకానిక్, నివాసం: యాదగిరిపల్లి (గ్రామం), కీసర (మండలం), మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా. *స్వాధీనం చేసుకున్న వస్తువులు:* 02 నాలుగు చక్రాల వాహనాలు (కార్లు) 01 ఆటో రిక్షా 02 మోటార్ సైకిళ్లు 04 సెల్ ఫోన్లు 25 నకిలీ (బంగారు పూత పూసిన) నాణేలు 6 కేజీల బొగ్గు 4 కేజీల మట్టి పూజా సామగ్రి ప్రధాన నిందితుడు మునావర్ పాత నేరాల చరిత్ర: బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 01 మోసం (Cheating) కేసు నమోదు. *నేరం చేసిన తీరు (Modus Operandi):* ప్రధాన నిందితుడు మహ్మద్ మునావర్ హైదరాబాద్‌లో జన్మించి పెరిగాడు. చదువు పూర్తయిన తర్వాత కార్ల డెంటింగ్ మరియు పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చులకు సరిపోకపోవడంతో, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక కుట్ర పన్నుతాడు. ఇళ్ల కింద పూడ్చిపెట్టిన గుప్త నిధులను బయటకు తీసే ప్రత్యేక విద్య తనకు వచ్చు అని ప్రచారం చేసుకుంటూ అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో మునావర్ తన స్నేహితులైన సయ్యద్ అలీ అష్రఫ్, మహ్మద్ హాజీ, మహ్మద్ సల్మాన్‌లను సంప్రదించి తన పథకాన్ని వివరించాడు. ఈ అక్రమ మార్గంలో సులభంగా డబ్బు సంపాదించవచ్చని భావించిన వారు కూడా ఇందుకు అంగీకరించారు. ఆ తర్వాత, నిందితులు అమాయక ప్రజలను సమీపించి, తమకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని, వారి నివాస స్థలాల కింద భూమిలో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించేవారు. వారు సూచించిన ప్రదేశంలో గుంత తీసిన తర్వాత, ముందే సిద్ధం చేసుకున్న బొగ్గు మరియు నకిలీ బంగారు నాణేలు ఉన్న సంచిని రహస్యంగా అందులో ఉంచేవారు. ఆ తర్వాత, పూజలు చేసి, ఆ బొగ్గు బంగారంగా మారడానికి కొంత సమయం పడుతుందని చెప్పి నిందితులు అక్కడ నుండి పరారయ్యేవారు. ఈ ముఠా వివిధ ప్రాంతాల్లో దాదాపు 11 మందిని మోసం చేసి, సుమారు రూ. 1 కోటి వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 916/2026, బిఎన్ఎస్ (BNS) చట్టంలోని సెక్షన్లు 318(4), 351(2), 61(2) r/w 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలకు విజ్ఞప్తి: ఇటీవలి కాలంలో కొందరు కేటుగాళ్లు వీధులు, గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ కొన్ని ప్రాంతాల్లో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని తీసి ఇస్తామని చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. కాబట్టి, సదరు మోసగాళ్లను, వారి మాటలను నమ్మి ప్రజలెవరూ మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఇటువంటి అక్రమ లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరడమైనది. హైదరాబాద్ సిటీ శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ కె. రవి, సబ్‌ఇన్స్‌పెక్టర్లు కె. మన్సూర్ అలీ, నర్సింగరావు, ఎస్. శేషు, ఇతర టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మరియు రాజేంద్రనగర్ పోలీసుల సమన్వయంతో ఈ ముఠాను పట్టుకోవడం జరిగింది. (కె.ఎస్. రావు) అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, టాస్క్‌ఫోర్స్, రాజేంద్రనగర్ & శంషాబాద్ జోన్స్, హైదరాబాద్ సిటీ.
    1
    గుప్తనిధుల పేరుతో క్షుద్ర పూజ చేస్తామంటూ కలరింగ్ గుప్తనిధుల పేరుతో మోసం పాల్పడుతున్న ముఠాగట్టురట్టు నలుగురు నిందితుల అరెస్టు 
*గుప్తనిధుల పేరుతో క్షుద్రపూజ చేస్తానంటూ కలరింగ్..!* 
శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ – 'గుప్త నిధుల' పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు – నలుగురు నిందితుల అరెస్ట్*
*స్వాధీనం చేసుకున్న సొత్తు: 02 కార్లు, 01 ఆటో, 02 మోటార్ సైకిళ్లు, 04 సెల్ ఫోన్లు, నకిలీ బంగారు నాణేలు మరియు బొగ్గు.*
హైదరాబాదు:: రాజేంద్రనగర్ పోలీసుల భాగస్వామ్యంతో శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను నమ్మించి మోసగిస్తున్న ఒక ముఠాను విజయవంతంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు (04) నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి పలు వాహనాలను మరియు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
*అరెస్టయిన నిందితుల వివరాలు:*
మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా (36) – తండ్రి: మహ్మద్ అన్వర్, వృత్తి: కార్ల డెంటింగ్ & పెయింటింగ్, నివాసం: గుడిమల్కాపూర్, హైదరాబాద్.
సయ్యద్ అలీ అష్రఫ్ (40) – తండ్రి: సయ్యద్ మూసా, వృత్తి: ఎలక్ట్రీషియన్, నివాసం: ఫర్హాన్ నగర్, జవహర్ నగర్, ECIL, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా.
మహ్మద్ హాజీ (25) – తండ్రి: మహ్మద్ ఖాజా, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం: బాలాజీ నగర్, జవహర్ నగర్, ECIL, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా.
మహ్మద్ సల్మాన్ (29) – తండ్రి: మహ్మద్ అన్వర్, వృత్తి: బైక్ మెకానిక్, నివాసం: యాదగిరిపల్లి (గ్రామం), కీసర (మండలం), మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా.
*స్వాధీనం చేసుకున్న వస్తువులు:*
02 నాలుగు చక్రాల వాహనాలు (కార్లు)
01 ఆటో రిక్షా
02 మోటార్ సైకిళ్లు
04 సెల్ ఫోన్లు
25 నకిలీ (బంగారు పూత పూసిన) నాణేలు
6 కేజీల బొగ్గు
4 కేజీల మట్టి
పూజా సామగ్రి
ప్రధాన నిందితుడు మునావర్ పాత నేరాల చరిత్ర: 
బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 01 మోసం (Cheating) కేసు నమోదు.
*నేరం చేసిన తీరు (Modus Operandi):*
ప్రధాన నిందితుడు మహ్మద్ మునావర్ హైదరాబాద్‌లో జన్మించి పెరిగాడు. చదువు పూర్తయిన తర్వాత కార్ల డెంటింగ్ మరియు పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చులకు సరిపోకపోవడంతో, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక కుట్ర పన్నుతాడు. ఇళ్ల కింద పూడ్చిపెట్టిన గుప్త నిధులను బయటకు తీసే ప్రత్యేక విద్య తనకు వచ్చు అని ప్రచారం చేసుకుంటూ అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు.
ఈ క్రమంలో మునావర్ తన స్నేహితులైన సయ్యద్ అలీ అష్రఫ్, మహ్మద్ హాజీ, మహ్మద్ సల్మాన్‌లను సంప్రదించి తన పథకాన్ని వివరించాడు. ఈ అక్రమ మార్గంలో సులభంగా డబ్బు సంపాదించవచ్చని భావించిన వారు కూడా ఇందుకు అంగీకరించారు. ఆ తర్వాత, నిందితులు అమాయక ప్రజలను సమీపించి, తమకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని, వారి నివాస స్థలాల కింద భూమిలో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించేవారు. వారు సూచించిన ప్రదేశంలో గుంత తీసిన తర్వాత, ముందే సిద్ధం చేసుకున్న బొగ్గు మరియు నకిలీ బంగారు నాణేలు ఉన్న సంచిని రహస్యంగా అందులో ఉంచేవారు. ఆ తర్వాత, పూజలు చేసి, ఆ బొగ్గు బంగారంగా మారడానికి కొంత సమయం పడుతుందని చెప్పి నిందితులు అక్కడ నుండి పరారయ్యేవారు.
ఈ ముఠా వివిధ ప్రాంతాల్లో దాదాపు 11 మందిని మోసం చేసి, సుమారు రూ. 1 కోటి వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 916/2026, బిఎన్ఎస్ (BNS) చట్టంలోని సెక్షన్లు 318(4), 351(2), 61(2) r/w 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజలకు విజ్ఞప్తి:
ఇటీవలి కాలంలో కొందరు కేటుగాళ్లు వీధులు, గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ కొన్ని ప్రాంతాల్లో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని తీసి ఇస్తామని చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. కాబట్టి, సదరు మోసగాళ్లను, వారి మాటలను నమ్మి ప్రజలెవరూ మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఇటువంటి అక్రమ లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరడమైనది.
హైదరాబాద్ సిటీ శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ కె. రవి, సబ్‌ఇన్స్‌పెక్టర్లు కె. మన్సూర్ అలీ, నర్సింగరావు, ఎస్. శేషు, ఇతర టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మరియు రాజేంద్రనగర్ పోలీసుల సమన్వయంతో ఈ ముఠాను పట్టుకోవడం జరిగింది.
(కె.ఎస్. రావు)
అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్,
టాస్క్‌ఫోర్స్, రాజేంద్రనగర్ & శంషాబాద్ జోన్స్,
హైదరాబాద్ సిటీ.
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ జిల్లా నారాయణపూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు ఆందోళన దిగారు. రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి మాట్లాడుతు నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు పెడుతూ గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడిపల్లి సత్యం గ్రామానికి వచ్చి ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తారని హామీ ఇచ్చిన మాట నిజం కదా అని గుర్తు చేశారు.శమేడిపల్లి సత్యం ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఈ రిలే నిరాహార దీక్షను జిల్లా కేంద్రానికి తరలించి ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పోలీసులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యముకు కొమ్ముకాస్తూ నారాయణపూర్ గ్రామస్తులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే వారిపై పెట్టిన అక్రమ కేసులను తీసివేయాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామంగా ప్రకటించేంతవరకు గ్రామస్థులకు అండగా ఉంటామన్నారు.
    1
    కరీంనగర్ జిల్లా నారాయణపూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు ఆందోళన దిగారు. రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 
గంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి మాట్లాడుతు నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు పెడుతూ గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడిపల్లి సత్యం గ్రామానికి వచ్చి ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తారని హామీ ఇచ్చిన మాట నిజం కదా అని గుర్తు చేశారు.శమేడిపల్లి సత్యం ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
లేనియెడల ఈ రిలే నిరాహార దీక్షను జిల్లా కేంద్రానికి తరలించి ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పోలీసులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యముకు కొమ్ముకాస్తూ నారాయణపూర్ గ్రామస్తులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే వారిపై పెట్టిన అక్రమ కేసులను తీసివేయాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామంగా ప్రకటించేంతవరకు గ్రామస్థులకు అండగా ఉంటామన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    20 hrs ago
  • ప్రతి ఇంట జాతీయ జెండా ఎగరాలి .... బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు మాచర్ల కుమారస్వామి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేసేలా ప్రజలను చైతన్యపరచాలని సిద్దిపేట జిల్లా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, అక్కన్న పేట మండల ఇన్‌చార్జి మాచర్ల కుమారస్వామి పిలుపునిచ్చారు. సోమవారం అక్కన్నపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు రామంచ మహేందర్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ మండల కార్యవర్గ సమావేశం, ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికీ జాతీయ జెండాలను పంపిణీ చేసి జాతీయ స్ఫూర్తిని నింపాలని కార్యకర్తలకు సూచించారు. అక్కన్నపేట మండలంలో సర్ ప్రక్రియ దాదాపు 100 శాతం పూర్తయిందని, మిగిలిన ఫారాలను బి ఎల్ ఓ లతో మాట్లాడి పూర్తి చేయించాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ చేరుకుని ప్రజలతో సంబంధాలు పెంచుకోవాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు నునావత్ మోహన్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శులు చెరుకు సంపత్, మడక రవికుమార్, ఉపాధ్యక్షులు అర్జున్ నాయక్, సాంకే సంతోష్, కార్యదర్శులు వేముల ప్రసాద్, జన్నారపు కళ్యాణ్ విష్ణు, లావుడ్య రైనా నాయక్, వివిధ మోర్చాల అధ్యక్షులు ఇరుగుదినుల రాజకుమార్, మాలోత్ రాజునాయక్, గేరుమల రాజు, గంగుల కుమార్, బీజేవైఎం అధ్యక్షుడు సలేంద్ర తిరుపతి, సోషల్ మీడియా కన్వీనర్ జంగపల్లి శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ప్రతి ఇంట జాతీయ జెండా ఎగరాలి ....  బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు మాచర్ల కుమారస్వామి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేసేలా ప్రజలను చైతన్యపరచాలని సిద్దిపేట జిల్లా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, అక్కన్న పేట మండల ఇన్‌చార్జి మాచర్ల కుమారస్వామి పిలుపునిచ్చారు. సోమవారం అక్కన్నపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు రామంచ మహేందర్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ మండల కార్యవర్గ సమావేశం, ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికీ జాతీయ జెండాలను పంపిణీ చేసి జాతీయ స్ఫూర్తిని నింపాలని కార్యకర్తలకు సూచించారు. అక్కన్నపేట మండలంలో సర్ ప్రక్రియ దాదాపు 100 శాతం పూర్తయిందని, మిగిలిన ఫారాలను బి ఎల్ ఓ లతో మాట్లాడి పూర్తి చేయించాలని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ చేరుకుని ప్రజలతో సంబంధాలు పెంచుకోవాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు నునావత్ మోహన్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శులు చెరుకు సంపత్, మడక రవికుమార్, ఉపాధ్యక్షులు అర్జున్ నాయక్, సాంకే సంతోష్, కార్యదర్శులు వేముల ప్రసాద్, జన్నారపు కళ్యాణ్ విష్ణు, లావుడ్య రైనా నాయక్, వివిధ మోర్చాల అధ్యక్షులు ఇరుగుదినుల రాజకుమార్, మాలోత్ రాజునాయక్, గేరుమల రాజు, గంగుల కుమార్, బీజేవైఎం అధ్యక్షుడు సలేంద్ర తిరుపతి, సోషల్ మీడియా కన్వీనర్ జంగపల్లి శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    21 hrs ago
  • గతంలో సోమిడి వేణు కార్పొరేటర్ పై దాడి జరుగుతే ఎప్పుడు రాజకీయ కోణంలో చూడలేదు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాజకీయ కోణంలో చూస్తున్నాడు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు ప్రెస్ మీట్. కిసాన్ నగర్ లో వ్యక్తిగతంగా దాడి జరుగుతే పార్టీ సంబంధం లేదు. గతంలో సోమిడి వేణు కార్పొరేటర్ పై దాడి జరుగుతే ఎప్పుడు రాజకీయ కోణంలో చూడలేదు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాజకీయ కోణంలో చూస్తున్నాడు. గొడవలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. వ్యక్తిగత గొడవలను పార్టీలపై రుద్దద్దు. కరీంనగర్కు మేయర్ అప్పచెప్పితే దాడులు జరుగుతున్నాయి అనడం విడ్డూరం. మీ 10 సంవత్సరాల పాలనలో ఎన్ని గొడవలు జరిగాయో అందరికీ తెలుసు. మీ పార్టీ నాయకులపై కేసులయి జైలుకు పోయొచ్చారు దానికి బాధ్యత మీరు వహిస్తారా. కరీంనగర్ లో మీరు శాంతిని నెలకొల్పితే ప్రజలు ఎందుకు ఆదరించలేదు. అభివృద్ధి మా ఎజెండా, దాడులు మా ఏజెండా కాదు. కార్పొరేటర్ వేణు ప్రసాద్ పై కుటుంబ కారుతో బుద్ధి హత్య విక్రం చేసేందుకు ప్రయత్నించారు. దాడి జరిగిన సమయంలో వేణు ప్రసాద్ అక్కడ లేడు కదా. పోలీస్ ఎఫ్ ఐ ఆర్ లో మాత్రం పేరు ఉంది.విచారణ జరుగుతుంది. ఎమ్మెల్యే క్యాప్ ఆఫీస్ లో వేరే వ్యక్తులు వచ్చి మీరు రాజకీయాలు ఎలా చేస్తారు. బండి సంజయ్ ఎప్పుడు కూడా ఇలాంటివి సహించరు...
    3
    గతంలో సోమిడి వేణు కార్పొరేటర్ పై దాడి జరుగుతే ఎప్పుడు రాజకీయ కోణంలో చూడలేదు.  కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాజకీయ కోణంలో చూస్తున్నాడు. 
డిప్యూటీ మేయర్ సునీల్ రావు ప్రెస్ మీట్. కిసాన్ నగర్ లో వ్యక్తిగతంగా దాడి జరుగుతే పార్టీ సంబంధం లేదు. గతంలో సోమిడి వేణు కార్పొరేటర్ పై దాడి జరుగుతే ఎప్పుడు రాజకీయ కోణంలో చూడలేదు.  కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాజకీయ కోణంలో చూస్తున్నాడు. 
గొడవలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. 
వ్యక్తిగత గొడవలను పార్టీలపై రుద్దద్దు. 
కరీంనగర్కు మేయర్ అప్పచెప్పితే దాడులు జరుగుతున్నాయి అనడం విడ్డూరం. మీ 10 సంవత్సరాల పాలనలో ఎన్ని గొడవలు జరిగాయో అందరికీ తెలుసు. 
మీ పార్టీ నాయకులపై కేసులయి జైలుకు పోయొచ్చారు దానికి బాధ్యత మీరు వహిస్తారా. కరీంనగర్ లో మీరు శాంతిని నెలకొల్పితే ప్రజలు ఎందుకు ఆదరించలేదు.
అభివృద్ధి మా ఎజెండా, దాడులు మా ఏజెండా కాదు. కార్పొరేటర్ వేణు ప్రసాద్ పై కుటుంబ కారుతో బుద్ధి హత్య విక్రం చేసేందుకు ప్రయత్నించారు.
దాడి జరిగిన సమయంలో వేణు ప్రసాద్ అక్కడ లేడు కదా. పోలీస్ ఎఫ్ ఐ ఆర్ లో మాత్రం  పేరు ఉంది.విచారణ జరుగుతుంది. ఎమ్మెల్యే క్యాప్ ఆఫీస్ లో వేరే వ్యక్తులు వచ్చి  మీరు రాజకీయాలు ఎలా చేస్తారు.
బండి సంజయ్ ఎప్పుడు కూడా ఇలాంటివి సహించరు...
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
  • ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీజేపీ శ్రేణుల డిమాండ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వేములవాడ పట్టణ బిజెపి ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు.పట్టణ బిజెపి అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ..భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ,కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానించినందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
    1
    ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీజేపీ శ్రేణుల డిమాండ్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వేములవాడ పట్టణ బిజెపి ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు.పట్టణ బిజెపి అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ..భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ,కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానించినందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
    user_Hari
    Hari
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.