Shuru
Apke Nagar Ki App…
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: SP అఖిల్ మహాజన్ నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గురువారం ఇచ్చోడ మండలంలోని మాదాపూర్ లో సర్పంచ్ షేక్ ఇమ్రాన్ తో గ్రామంలో ఏర్పాటు చేసిన 13 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Mallaiah Potta
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: SP అఖిల్ మహాజన్ నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గురువారం ఇచ్చోడ మండలంలోని మాదాపూర్ లో సర్పంచ్ షేక్ ఇమ్రాన్ తో గ్రామంలో ఏర్పాటు చేసిన 13 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
More news from తెలంగాణ and nearby areas
- ఆగస్టు 27, 2026_ఆదిలాబాదు: *గుంజాలలో వాటర్ షెడ్ ప్రాజెక్టు పనులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా* పత్రిక ప్రకటన భూగర్భ జలాలను పెంపొందించడం ద్వారా రైతులకు రెండో పంట సాగు అవకాశాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం నార్నూర్ మండలం గుంజాల గ్రామంలో నిర్వహించిన వాటర్ షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై గ్రామసభ, అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని న్యూట్రిగార్డెన్ నిర్వహణను పరిశీలించి అభినందించిన కలెక్టర్, అనంతరం వన మహోత్సవంలో భాగంగా స్వయంగా మొక్కనాటి నీరు పోశారు. ఈ మొక్కకు గ్రామస్తులు కలెక్టర్ పేరుతో నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో ముసాయిదా ఓటరు జాబితా, ఏఎస్‌డీ జాబితాలను బిఎల్ఓ లక్ష్మీ చదివి వినిపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గుంజాల గ్రామం నుండి ప్రారంభమైన ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ భవిష్యత్తులో మండలంలోని మిగతా 11 గ్రామాలకు దశలవారీగా విస్తరించబడుతుందని తెలిపారు. భూగర్భ జలాలను పెంపొందించడం, వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా రైతులు రెండు పంటలు వేసుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని, కేరళ తరహాలో నాబార్డ్ సహకారంతో జియో ట్యాగింగ్ (GPS, GIS) పద్ధతుల్లో పారదర్శకతతో ఈ పనులు చేపట్టడం జరుగుతోందని స్పష్టం చేశారు. అలాగే రైతుల విద్యుత్ సౌకర్యం కొరకు 1 కిలోమీటర్ పరిధిలో 20 పోల్స్ వరకు ఎలాంటి అదనపు డెవలప్‌మెంట్ చార్జీలు లేకుండా కేవలం రూ.9,150/- చెల్లిస్తే విద్యుత్ శాఖ ద్వారా ఉచితంగా పోల్స్, లైన్లు వేయబడతాయని తెలిపారు. చివరి ఇళ్లకు సైతం తక్కువ ఖర్చుతో విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయించుకోవచ్చని వెల్లడించారు. హస్తాపూర్ - నార్నూర్ రహదారి పనులతో పాటు పెండింగ్‌లో ఉన్న రోడ్లకు త్వరలో నిధులు మంజూరు చేయడం, గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో సిఆర్‌టి ఉపాధ్యాయుల కొరతను తీర్చడం, పాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడం, వృద్ధులు, దివ్యాంగుల పింఛన్ల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిడిఎం అబ్దుల్ రౌఫ్, ధాన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు నీలేష్, పంచాయతీ రాజ్ ఈఈ శివరాం, ఎంపీడీవో పుల్లరావు, ఏంఆర్ఓ రాజలింగు, ఏంఈఓ మనోహర్, డిఎల్పిఓ ప్రభాకర్, సర్పంచ్ జ్ఞానేశ్వర్, పాఠశాల ఉపాధ్యాయులు రామారావు, పంచాయతీ కార్యదర్శి రాధిక, బిఎల్ఓ లక్ష్మీ, గ్రామస్తులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.1
- ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేయాలి... ADB: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని కొమరం భీమ్ చౌక్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.1
- అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలి: మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. ఏ ఒక్క ఓటు కోల్పోకుండా జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణలు చేపట్టాలని కోరారు. ప్రత్యేక తీవ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా మావల, తాంసి, భీంపూర్ మండలాల్లో ఆయన పర్యటించి పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొన్నారు. తాంసి మండలం గోట్కూరి గ్రామంలో జరిగిన గ్రామసభలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ, యువకుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. జాబితాలో పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాల్లో తప్పులుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవాలన్నారు. ప్రతి కుటుంబం తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని, అర్హులైన వారి పేర్లు లేకుంటే వెంటనే నమోదు చేయించాలని కోరారు. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పుల్లేకుండా రూపొందించేందుకు ప్రజలు, బీఎల్‌ఓలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు గణేష్ జాదవ్, రమేష్, మావల ఎంపీడీఓ ముత్యం రావు, సర్పంచులు ధర్మపురి చంద్రశేఖర్, మతీన్, నాయకులు ఎండి ఖమరుద్దీన్ ఖాన్, బెజ్జంకి రోహిత్, ఉప సర్పంచ్ నిమ్మల మల్లయ్య, మార్కెట్ డైరెక్టర్ తాటి అశోక్, బత్తుల కిరణ్, బీఎల్‌ఓలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- లక్షెట్టిపేటలో బిజెపి నాయకుల ఆందోళన, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ విద్యార్థుల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ లక్షేట్టిపేట పట్టణంలో బిజెపి నాయకులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా వారు గురువారం పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా ప్రధాన రహదారిపై ఆందోళన చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులకు, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- నందిపేట్ మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ ఏ.లక్ష్మాన్, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. ప్రజల నుంచి 12 ఫిర్యాదులు అందాయని ఎండీఓ తెలిపారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. నేడు వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా తెలిసింది.1
- చింతామని గణపతి ఆలయం లో దాత దావు సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.. అన్నదానం... బాసర లోని చింతామని గణపతి ఆలయం లో బాసర కు చెందిన దాత దావు సంతోష్ ఆధ్వర్యంలో శ్రావణమాసం పౌర్ణమి ని పురస్కరించుకొని అన్నదానం నిర్వహించారు. స్థానికులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అన్నదానం స్వీకరించారు. ప్రతి పౌర్ణమి నాడు బాసర కు చెందిన దాతల సహకారం తో అన్నదానం నిర్వహిస్తామని, ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని వేసుకున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.1
- ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి: TGEJAC ADB: ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకై TGEJAC ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గురువారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు PRC అమలు, పెండింగ్ DA, బకాయిల చెల్లింపు, CPS రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడి డిమాండ్లను సాధించుకోవాలని నేతలు పిలుపునిచ్చారు.1
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ తాడ్కోల్ రోడ్డు చౌరస్తా లొ రోడ్డు ప్రమాదం. బైక్ ను వెనుక నుండి ఢీ కొట్టిన లారీ. బైక్ పై తండ్రి వెనుక కూర్చున్న జైనబ్ ఫాతిమా 4 సం యుకెజి తలపై ఎక్కిన లారీ స్పాట్ లోనే మృతి. స్కూల్ కు వెళ్తుండగా ఘటన.1