Shuru
Apke Nagar Ki App…
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో హోలీ సంబరాలు అంతంత మాత్రమే జరిగాయి. మంగళవారం రోజున పాఠశాలలకు,ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో పిల్లలు మాత్రమే హోలీ సంబరాలు జరుపుకున్నారు. నేడు చంద్రగ్రహణం కారణంగా హోలీ ఆడటానికి పెద్దలు అంతగా ఆసక్తి కనపరచలేదు.
వేణు విలేకరి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో హోలీ సంబరాలు అంతంత మాత్రమే జరిగాయి. మంగళవారం రోజున పాఠశాలలకు,ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో పిల్లలు మాత్రమే హోలీ సంబరాలు జరుపుకున్నారు. నేడు చంద్రగ్రహణం కారణంగా హోలీ ఆడటానికి పెద్దలు అంతగా ఆసక్తి కనపరచలేదు.
More news from తెలంగాణ and nearby areas
- ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కాల్వపెల్లి గ్రామంలో పోడు భూముల విషయంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. గుంతలు తవ్వేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులను, జేసీబీని పోడు రైతులు అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న ఆదివాసీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపించగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.1
- సిరిసిల్ల పట్టణంలో స్థానిక 26వ వార్డు కౌన్సిలర్ నెల్లుట్ల నరేష్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.ఇఫ్తార్ విందు కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నరసింగ రావు, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి , మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.1
- వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం,ముత్తోజిపేటలోని హోలీ పండుగకు ముందు రాత్రి మహిళలు సంప్రదాయ కముడు ఆటలను ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఈ కముడు ఆటలు గ్రామీణ సంస్కృతి, ఐక్యతను చాటుతూ పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చాయి. చిన్నారులు, యువతీ యువకులు కూడా వీక్షకులుగా పాల్గొని సంబరాల్లో భాగమయ్యారు. హోలీ పండుగను కుటుంబ సభ్యులంతా కలసి ఆనందంగా జరుపుకోవాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబించింది.2
- Jangaon పట్టణంలో బంజారా జ్యోతి Sant Sevalal Maharaj 287వ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్, సభాధ్యక్షులు అజ్మీరా స్వామి నాయక్ నేతృత్వం వహించారు. కార్యక్రమం సందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ, వందల ఏళ్ల క్రితమే వ్యసనాలకు దూరంగా ఉండాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, శాకాహార జీవనం గడపాలని సేవాలాల్ మహారాజ్ బోధించిన సూత్రాలు నేటి యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, నైతిక విలువలు, ఆధ్యాత్మికత పెంపొందించేందుకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. బంజారా సంస్కృతి, భాష, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అజ్మీరా స్వామి నాయక్ మాట్లాడుతూ బంజారా సమాజ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వేడుకల్లో బంజారా సంఘాల ప్రతినిధులు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సాంప్రదాయ దుస్తుల్లో హాజరైన యువతులు, యువకులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జనగామ పట్టణంలో నిర్వహించిన ఈ జయంతి వేడుకలు భక్తి, ఐక్యత, సంస్కృతి పరిరక్షణకు నిదర్శనంగా నిలిచాయి.1
- Post by Ravi Poreddy1
- కీసర, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని రాంపల్లి దాయరలో వెలసిన హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో మంగళవారం గిరి ప్రదక్షిణ, పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమి రోజున జరిగే ఈ కార్యక్రమం హోలీ పర్వదినం, లక్ష్మీ అమ్మవారి జయంతి యోగం సందర్భంగా విశేషంగా జరిగింది.ఉదయం ఐదు గంటలకు వేదోత్తములు ఆదిత్య శర్మ, శ్రీనివాస్ శర్మల మార్గదర్శకత్వంలో స్వామి వారి విశేష పూజలు నిర్వహించి అనంతరం పల్లకి సేవతో గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు భజనలు, భక్తి గీతాలతో గోవింద నామస్మరణ చేస్తూ వెంకులోనిగుట్ట గిరులను మార్మోగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, శ్రీ సాయి ధామం దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రామానంద ప్రభూజీ స్వామి పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం లక్ష్మీ అమ్మవారి జయంతి యోగం సందర్భంగా విశేష లక్ష్మీ పూజను ఆలయ చైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి దంపతులు, ఆలయ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారికి గవ్వలతో అభిషేకం చేసి, అనంతరం స్వామీజీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా భక్తులకు లక్ష్మీ గవ్వలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటిలో లక్ష్మీ గవ్వలు ఉండడం అష్టైశ్వర్య సిద్ధికి కారణమని వేద పండితులు తెలిపారు.వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన నిర్వాహకులను ప్రముఖులు ప్రశంసించారు. కార్యక్రమంలో కెఎల్‌ఆర్ ఇండస్ట్రియల్ పార్క్ అసోసియేషన్ సభ్యులు, మన్నె ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులు, అలియాబాద్ మున్సిపాలిటీ చైర్మన్, వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ ట్రస్టు సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.3
- జగిత్యాల జిల్లాలో కోరిక కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని మూసివేశారు. కేతు గ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దేవస్థాన ప్రధాన ఆచార్యులు కపింద్ర శర్మ మాట్లాడుతూ ఉదయం 7:30 గంటలకు స్వామివారికి నివేదన నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారబందనం చేశామని తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యగా ఉదయం 7:00 గంటల నుంచే అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. గ్రహణం ముగిసిన అనంతరం సాయంత్రం 7:00 గంటలకు పుణ్యాహవచనం, సంప్రోక్షణ, తిరుమంజనం, ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రేపు బుధవారం ఉదయం నుంచి భక్తులకు యథావిధిగా సర్వదర్శనం మరియు ఆర్జిత సేవలు పునఃప్రారంభం అవుతాయని అధికారులు స్పష్టం చేశారు.2
- ములుగు జిల్లా కేంద్రంలో హోళీ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మంగళవారం నిర్వహించిన సంబరాల్లో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పాల్గొని పోలీసు సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుని స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలు సురక్షితంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.1
- జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సతీమణి భీమేశ్వర స్వామి దర్శించుకున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ సతీమణి వర్ష స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించారు.1