logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చేరుకోవడంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు వికసిత్ భారత్ లక్ష్యాలను ప్రాజెక్టుల ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి విజ్ఞప్తి చేశారు. ✳️ వికసిత్ భారత్ లక్ష్యాలను వేగంగా సాధించేందుకు, జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సత్వర అనుమతులు లభించేలా ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రత్యేక ‘సింగిల్ విండో టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేయాలని కోరారు. ✳️ తెలంగాణలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ గారు, రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారితో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ✳️ ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు, శ్రీ బండి సంజయ్ గారు, రాష్ట్ర మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, లోక్‌సభ సభ్యుడు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ✳️ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, “2047 వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో తెలంగాణ తనవంతు భాగస్వామ్యం అందిస్తుంది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో కూడా తెలంగాణ రైజింగ్ - 2047 లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నాం” అని తెలిపారు. ✳️ “మీ సంకల్ప సాధనలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పయనించాలని తెలంగాణ ఆకాంక్షిస్తోంది. తెలంగాణకు సంబంధించిన రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైలు విస్తరణ, మూసీ నది పునరుజ్జీవం, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ - మచిలీపట్నం 12 వరుసల రహదారి వంటి ప్రతిపాదనలు మీ ముందుంచాం” అని ప్రధానమంత్రి గారికి గుర్తుచేశారు. ✳️ “నా రాష్ట్రం, నా ప్రజల కోసం ప్రాజెక్టుల విషయంలో నేను మిమ్మల్ని, కేంద్ర మంత్రులను అనేకసార్లు కలిశాను. తెలంగాణకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులకు అత్యవసర అనుమతులు, ఆమోదాలు అవసరం. రెండు గంటల సమయం కేటాయించి ఈ ప్రతిపాదనలన్నింటినీ సానుకూలంగా పరిశీలించాలి” అని కోరారు. ✳️ “దేశ ఆర్థిక వృద్ధి మహానగరాల్లో వేగంగా జరుగుతోంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలను అభివృద్ధి చేస్తేనే దేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుంది. యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయి” అని అన్నారు. ✳️ “దేశ అభివృద్ధి విషయంలో మేం మీతో కలిసి ఉన్నాం. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడపాలని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వికసిత్ భారత్ 2047 నాటికి దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని మీరు నిర్దేశించారు. ఆ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ నుంచి దేశ జీడీపీకి 10 శాతం వాటా అందించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలంగాణ రైజింగ్‌కు మీరు పూర్తి సహకారం అందిస్తారనే విశ్వాసం మాకుంది” అని పేర్కొన్నారు. ✳️ “కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మీకు పెద్ద మనస్సు ఉందని చెబుతున్నారు. తెలంగాణ ప్రజలకు కూడా మీపై అదే నమ్మకం ఉంది. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలు, ప్రాజెక్టులన్నింటినీ ఆమోదిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు” అని అన్నారు. ✳️ ఈ కార్యక్రమంలో వరంగల్‌లో నెలకొల్పిన పీఎం మిత్రా పార్క్ (కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్) ను ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారితో కలిసి ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. అలాగే సంగారెడ్డి - జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, మహబూబ్‌నగర్ - గూడబెల్లూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్ - 167), కాజిపేట - విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ మల్కాపూర్‌లో ఇండియన్ ఆయిల్ గ్రీన్‌ఫీల్డ్ టెర్మినల్‌ను జాతికి అంకితమిచ్చారు.

1 hr ago
user_M.RAJKIRAN REDDY
M.RAJKIRAN REDDY
Adilabad Rural, Telangana•
1 hr ago
7845c5f7-0416-4877-b5ac-90e11a3e33f9

చేరుకోవడంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు వికసిత్ భారత్ లక్ష్యాలను ప్రాజెక్టుల ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి విజ్ఞప్తి చేశారు. ✳️ వికసిత్ భారత్ లక్ష్యాలను వేగంగా సాధించేందుకు, జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సత్వర అనుమతులు లభించేలా ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రత్యేక ‘సింగిల్ విండో టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేయాలని కోరారు. ✳️ తెలంగాణలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ గారు, రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారితో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ✳️ ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు, శ్రీ బండి సంజయ్ గారు, రాష్ట్ర మంత్రి శ్రీ

8e04bbaf-d3f0-4c44-8e3a-41da9c132b49

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, లోక్‌సభ సభ్యుడు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ✳️ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, “2047 వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో తెలంగాణ తనవంతు భాగస్వామ్యం అందిస్తుంది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో కూడా తెలంగాణ రైజింగ్ - 2047 లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నాం” అని తెలిపారు. ✳️ “మీ సంకల్ప సాధనలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పయనించాలని తెలంగాణ ఆకాంక్షిస్తోంది. తెలంగాణకు సంబంధించిన రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైలు విస్తరణ, మూసీ నది పునరుజ్జీవం, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ - మచిలీపట్నం 12 వరుసల రహదారి వంటి ప్రతిపాదనలు మీ ముందుంచాం” అని ప్రధానమంత్రి గారికి గుర్తుచేశారు. ✳️ “నా రాష్ట్రం, నా ప్రజల కోసం ప్రాజెక్టుల విషయంలో నేను మిమ్మల్ని, కేంద్ర మంత్రులను అనేకసార్లు కలిశాను. తెలంగాణకు సంబంధించిన

83b37091-e9c7-4053-801c-b6e36c036d02

కొన్ని ప్రాజెక్టులకు అత్యవసర అనుమతులు, ఆమోదాలు అవసరం. రెండు గంటల సమయం కేటాయించి ఈ ప్రతిపాదనలన్నింటినీ సానుకూలంగా పరిశీలించాలి” అని కోరారు. ✳️ “దేశ ఆర్థిక వృద్ధి మహానగరాల్లో వేగంగా జరుగుతోంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలను అభివృద్ధి చేస్తేనే దేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుంది. యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయి” అని అన్నారు. ✳️ “దేశ అభివృద్ధి విషయంలో మేం మీతో కలిసి ఉన్నాం. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడపాలని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వికసిత్ భారత్ 2047 నాటికి దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని మీరు నిర్దేశించారు. ఆ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ నుంచి దేశ జీడీపీకి 10 శాతం వాటా అందించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలంగాణ రైజింగ్‌కు మీరు పూర్తి సహకారం

b4310925-2c7c-4545-8acf-1dfb7d497d9d

అందిస్తారనే విశ్వాసం మాకుంది” అని పేర్కొన్నారు. ✳️ “కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మీకు పెద్ద మనస్సు ఉందని చెబుతున్నారు. తెలంగాణ ప్రజలకు కూడా మీపై అదే నమ్మకం ఉంది. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలు, ప్రాజెక్టులన్నింటినీ ఆమోదిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు” అని అన్నారు. ✳️ ఈ కార్యక్రమంలో వరంగల్‌లో నెలకొల్పిన పీఎం మిత్రా పార్క్ (కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్) ను ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారితో కలిసి ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. అలాగే సంగారెడ్డి - జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, మహబూబ్‌నగర్ - గూడబెల్లూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్ - 167), కాజిపేట - విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ మల్కాపూర్‌లో ఇండియన్ ఆయిల్ గ్రీన్‌ఫీల్డ్ టెర్మినల్‌ను జాతికి అంకితమిచ్చారు.

More news from Telangana and nearby areas
  • స్వయం సేవక్‌గా, ఎబివిపి కార్యకర్తగా నా ప్రస్థానం మొదలైంది. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ పార్టీ జెండాను కింద పడనివ్వను. ఎన్ని కష్టాలొచ్చినా తలెత్తుకునే పని చేస్తాను కానీ, తలవంచే పని చేయను. ఈ ధర్మయుద్ధంలో నా వెంటే ఉన్న కార్యకర్తలకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి.
    1
    స్వయం సేవక్‌గా, ఎబివిపి కార్యకర్తగా నా ప్రస్థానం మొదలైంది.
నా ఊపిరి ఉన్నంత వరకు ఈ పార్టీ జెండాను కింద పడనివ్వను.
ఎన్ని కష్టాలొచ్చినా తలెత్తుకునే పని చేస్తాను కానీ, తలవంచే పని చేయను. 
ఈ ధర్మయుద్ధంలో నా వెంటే ఉన్న కార్యకర్తలకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    14 min ago
  • ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ (సీసీఐ)ని తక్షణమే తెరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు ముందే నిరసన జరిగింది. మోడీ పర్యాటకునిగా కాకుండా నిధులు, ప్రాజెక్టులతో రావాలని, లేదంటే పరిశ్రమ కోసం తీసుకున్న భూములు రైతులకు తిరిగి ఇవ్వాలని ఆందోళనకారులు స్పష్టం చేశారు.
    1
    ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ (సీసీఐ)ని తక్షణమే తెరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు ముందే నిరసన జరిగింది. మోడీ పర్యాటకునిగా కాకుండా నిధులు, ప్రాజెక్టులతో రావాలని, లేదంటే పరిశ్రమ కోసం తీసుకున్న భూములు రైతులకు తిరిగి ఇవ్వాలని ఆందోళనకారులు స్పష్టం చేశారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    9 hrs ago
  • జన్నారం మండలంలో కల్లాల్లోనే కన్నీరు: కవ్వాల్ రైతుకు తప్పని తిప్పలు! ​ అది జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలోని ఒక ధాన్యం కల్లం. అక్కడ పసుపు వర్ణంలో మెరుస్తున్న ధాన్యం కుప్పలు రైతు కష్టానికి నిదర్శనం. కానీ, దురదృష్టవశాత్తూ ఆ కష్టం ఇప్పుడు రైతు నోటి దాకా రావడం లేదు.. పశువుల నోటి పాలవుతోంది! ​నెల గడిచినా కదలని కొనుగోళ్లు ​పంట కోసి నెల రోజులు గడుస్తున్నా, కొనుగోలు కేంద్రాల గడప దాటి ఒక్క గింజ కూడా బయటకు వెళ్లడం లేదు. "అధికారులు వస్తారు.. కొంటారు.." అనే ఆశతో రైతులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కానీ, ఇటు అధికారుల పట్టింపులేమి, అటు పెరుగుతున్న వడ్డీల భారం రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ​రైతు కష్టాన్ని 'మేస్తున్న' పశువులు ​ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. రైతులు ఆరబోసిన వడ్లను, మొక్కజొన్నను పశువులు యధేచ్ఛగా తినేస్తున్నాయి. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. ​రక్షణ లేని పంట: బర్లు, ఎడ్ల మందలు కల్లాలపై పడి ధాన్యాన్ని నాశనం చేస్తున్నాయి. వాటిని అదిలించే ఓపిక లేక, తోలే దిక్కు లేక రైతులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారు. ​ప్రకృతి కన్నుగీటితే అంతే: ఒకవైపు పశువుల బెడద, మరోవైపు అకాల వర్షాల భయం. ఒక్క వాన పడితే నెలల కష్టం బురదపాలవుతుందని రైతులు వణికిపోతున్నారు. ​మిత్తి భారంతో కుదేలు ​"అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాం.. ఇప్పుడు వడ్లు అమ్మకపోతే అసలు సంగతి పక్కన పెడితే, మిత్తి (వడ్డీ) కట్టడానికే మా ఆస్తులు అమ్ముకోవాలి" అని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చినా కాసుల గలగలలు లేక కవ్వాల్ గ్రామంలో రైతు ఇళ్లు వెలవెలబోతున్నాయి. ​ ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా, తక్షణమే కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి.
    2
    జన్నారం మండలంలో కల్లాల్లోనే కన్నీరు: కవ్వాల్ రైతుకు తప్పని తిప్పలు!
​ అది జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలోని ఒక ధాన్యం కల్లం. అక్కడ పసుపు వర్ణంలో మెరుస్తున్న ధాన్యం కుప్పలు రైతు కష్టానికి నిదర్శనం. కానీ, దురదృష్టవశాత్తూ ఆ కష్టం ఇప్పుడు రైతు నోటి దాకా రావడం లేదు.. పశువుల నోటి పాలవుతోంది!
​నెల గడిచినా కదలని కొనుగోళ్లు
​పంట కోసి నెల రోజులు గడుస్తున్నా, కొనుగోలు కేంద్రాల గడప దాటి ఒక్క గింజ కూడా బయటకు వెళ్లడం లేదు. "అధికారులు వస్తారు.. కొంటారు.." అనే ఆశతో రైతులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కానీ, ఇటు అధికారుల పట్టింపులేమి, అటు పెరుగుతున్న వడ్డీల భారం రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
​రైతు కష్టాన్ని 'మేస్తున్న' పశువులు
​ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. రైతులు ఆరబోసిన వడ్లను, మొక్కజొన్నను పశువులు యధేచ్ఛగా తినేస్తున్నాయి. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు.
​రక్షణ లేని పంట: బర్లు, ఎడ్ల మందలు కల్లాలపై పడి ధాన్యాన్ని నాశనం చేస్తున్నాయి. వాటిని అదిలించే ఓపిక లేక, తోలే దిక్కు లేక రైతులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారు.
​ప్రకృతి కన్నుగీటితే అంతే: ఒకవైపు పశువుల బెడద, మరోవైపు అకాల వర్షాల భయం. ఒక్క వాన పడితే నెలల కష్టం బురదపాలవుతుందని రైతులు వణికిపోతున్నారు.
​మిత్తి భారంతో కుదేలు
​"అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాం.. ఇప్పుడు వడ్లు అమ్మకపోతే అసలు సంగతి పక్కన పెడితే, మిత్తి (వడ్డీ) కట్టడానికే మా ఆస్తులు అమ్ముకోవాలి" అని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చినా కాసుల గలగలలు లేక కవ్వాల్ గ్రామంలో రైతు ఇళ్లు వెలవెలబోతున్నాయి.
​
ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా, తక్షణమే కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
  • కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరిన హనుమాన్ దీక్షపరులు..... జన్నారం మండలంలోని బాదంపల్లి నుండి 25 మంది హనుమాన్ దీక్షపరులు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. పెద్ద హనుమాన్ జయంతి పురస్కరించుకొని గ్రామానికి చెందిన యువకులు హనుమాన్ దీక్షను స్వీకరించారు. పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో ఆదివారం సాయంత్రం వారు బాదంపల్లి నుండి కొండగట్టు దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు.
    1
    కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరిన హనుమాన్ దీక్షపరులు.....
జన్నారం మండలంలోని బాదంపల్లి నుండి 25 మంది హనుమాన్ దీక్షపరులు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. పెద్ద హనుమాన్ జయంతి పురస్కరించుకొని గ్రామానికి చెందిన యువకులు హనుమాన్ దీక్షను స్వీకరించారు. పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో ఆదివారం సాయంత్రం వారు బాదంపల్లి నుండి కొండగట్టు దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • సికింద్రాబాద్‌లో బీజేపీ నాయకుల ర్యాలీ......................... హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ప్రత్యేక రైలులో చేరుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు సిర్పూర్ ఎమ్మెల్యే స్వాగతం పలికారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా పరేడ్ గ్రౌండ్ సభాస్థలికి చేరుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు.
    1
    సికింద్రాబాద్‌లో బీజేపీ నాయకుల ర్యాలీ.........................
హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ప్రత్యేక రైలులో చేరుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు సిర్పూర్ ఎమ్మెల్యే స్వాగతం పలికారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా పరేడ్ గ్రౌండ్ సభాస్థలికి చేరుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • మోర్తాడ్‌లో రైతులతో,బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం... బాల్కొండ ఎమ్మెల్యేవేముల పిలుపు.... ప్రభుత్వ వైఫల్యంతో ప్రవేట్ వ్యాపారులకు ఎక్కువగా వడ్లు అమ్ముకుంటున్న రైతన్నలు – క్వింటాల్‌కు రూ. 500 నష్ట పోతున్నారు. రైస్ మిల్లర్ల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ప్రభుత్వం.. 45 కిలోల తరుగు పేరుతో క్వింటాల్‌కు 12.5 కిలోల దోపిడీ... నెల రోజులుగా కళ్ళాల దగ్గరే రైతులు.. కాంగ్రెస్ హయాంలో అన్నదాతలకు తప్పని తిప్పలు... జిల్లా కలెక్టర్ ఫోన్ ఎత్తడం లేదు.. శాసనసభ్యుడికే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల మాటేంటి? వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనతను ఎండగట్టిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి... నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్లు అత్యంత నత్తనడకన సాగుతున్నాయని, రైతులు పంటను అమ్ముకోవడానికి గత నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో రైతుల కోరిక మేరకు పర్యటించి పలు కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి, రైతులతో కలిసి నేడు సోమవారం రోజున నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైనమోర్తాడ్ లో రైతు లతో కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రైతులు, బి.ఆర్.ఎస్ .నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ, వేల్పూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తూ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేస్తామని ప్రకటించి, సెంటర్లు తెరిచేసరికి 15 రోజులు, గన్నీ బ్యాగులు వచ్చేసరికి వారం, కాంటా పెట్టేసరికి మరో వారం అన్నట్లుగా 20 రోజుల పాటు కావాలనే జాప్యం చేసిందని విమర్శించారు. మద్దతు ధర రూ. 2390 ఉండగా, ప్రభుత్వ జాప్యం భరించలేక రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యక్తులకు రూ. 1750 నుండి 1900 లకే అమ్ముకుంటున్నారని, దీనివల్ల ఎకరాకు సుమారు రూ. 15,000 నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, తరుగు పేరుతో 40 కిలోలకు 5 కిలోల అదనపు వడ్లు (క్వింటాల్‌కు 12.5 కిలోలు) దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇది కేవలం 1.5 కిలోలు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. రైతుల సమస్యలపై మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేస్తే, ఫోన్ ఎత్తడం లేదని, కనీసం స్పందించే తీరిక కూడా లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ పాలిసీ లో భాగమేన అని ఆయన దుయ్యబట్టారు. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి, వడ్ల రవాణాకు లారీలను పెంచాలి. గన్నీ బ్యాగుల కొరత తీర్చాలి. తరుగును తగ్గించి, పాత పద్ధతిలోనే వడ్లు సేకరించాలి. దొడ్డు రకానికి గ్రేడ్-1 రేటుతో పాటు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలిఅని ప్రభుత్వానికి పలు డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి రైతులకు న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు మోర్తాడ్‌లో ప్రభుత్వ వైఖరికి నిరసనగ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని రైతులందరూ, బీఆర్ఎస్ కార్యకర్తలు, పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నిరసనను విజయవంతం చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
    1
    మోర్తాడ్‌లో రైతులతో,బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం...
బాల్కొండ ఎమ్మెల్యేవేముల పిలుపు....

ప్రభుత్వ వైఫల్యంతో ప్రవేట్ వ్యాపారులకు ఎక్కువగా వడ్లు అమ్ముకుంటున్న రైతన్నలు – క్వింటాల్‌కు రూ. 500 నష్ట పోతున్నారు.
రైస్ మిల్లర్ల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ప్రభుత్వం.. 45 కిలోల తరుగు పేరుతో క్వింటాల్‌కు 12.5 కిలోల దోపిడీ...
నెల రోజులుగా కళ్ళాల దగ్గరే రైతులు.. కాంగ్రెస్ హయాంలో అన్నదాతలకు తప్పని తిప్పలు...
జిల్లా కలెక్టర్ ఫోన్ ఎత్తడం లేదు.. శాసనసభ్యుడికే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల మాటేంటి?
వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనతను ఎండగట్టిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి...
నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్లు అత్యంత నత్తనడకన సాగుతున్నాయని, రైతులు పంటను అమ్ముకోవడానికి గత నెల రోజులుగా  ఇబ్బందులు పడుతున్నారని 
దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో రైతుల కోరిక మేరకు పర్యటించి పలు కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి, రైతులతో కలిసి నేడు సోమవారం రోజున నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైనమోర్తాడ్ లో రైతు లతో కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రైతులు, బి.ఆర్.ఎస్ .నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ, వేల్పూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తూ పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,
ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేస్తామని ప్రకటించి, సెంటర్లు తెరిచేసరికి 15 రోజులు, గన్నీ బ్యాగులు వచ్చేసరికి వారం, కాంటా పెట్టేసరికి మరో వారం అన్నట్లుగా 20 రోజుల పాటు కావాలనే జాప్యం చేసిందని విమర్శించారు.
మద్దతు ధర రూ. 2390 ఉండగా, ప్రభుత్వ జాప్యం భరించలేక రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యక్తులకు రూ. 1750 నుండి 1900 లకే అమ్ముకుంటున్నారని, దీనివల్ల ఎకరాకు సుమారు రూ. 15,000 నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైస్ మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, తరుగు పేరుతో 40 కిలోలకు 5 కిలోల అదనపు వడ్లు (క్వింటాల్‌కు 12.5 కిలోలు) దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇది కేవలం 1.5 కిలోలు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు.
రైతుల సమస్యలపై మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేస్తే, ఫోన్ ఎత్తడం లేదని, కనీసం స్పందించే తీరిక కూడా లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ పాలిసీ లో భాగమేన అని ఆయన దుయ్యబట్టారు.
వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి, వడ్ల రవాణాకు లారీలను పెంచాలి.
గన్నీ బ్యాగుల కొరత తీర్చాలి.
తరుగును తగ్గించి, పాత పద్ధతిలోనే వడ్లు సేకరించాలి.
దొడ్డు రకానికి గ్రేడ్-1 రేటుతో పాటు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలిఅని ప్రభుత్వానికి పలు డిమాండ్ చేశారు.
రైతుల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి రైతులకు న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు మోర్తాడ్‌లో ప్రభుత్వ వైఖరికి నిరసనగ  కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని రైతులందరూ, బీఆర్ఎస్ కార్యకర్తలు, పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నిరసనను విజయవంతం చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి  పిలుపునిచ్చారు.
    user_MOHAMMAD SHAIK HUSSAIN
    MOHAMMAD SHAIK HUSSAIN
    బాల్కొండ, నిజామాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.
    1
    జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • జర్నలిస్ట్ జితేందర్ కవ్వాల్ గ్రామంలో వైభవంగా ఇందూర్ పోచమ్మ బోనాలు... మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో ఆదివారం ఇందూర్ పోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో జరిగింది. ఏటా నిర్వహించే ఈ సంప్రదాయ వేడుకలో గ్రామస్తులందరూ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ​ఘనంగా బోనాల ఊరేగింపు ​ఉదయం నుండే గ్రామమంతా పండగ వాతావరణం నెలకొంది. గ్రామంలోని మహిళలు నూతన వస్త్రాలు ధరించి, పసుపు కుంకుమలతో అలంకరించిన మట్టి కుండల్లో (బోనాలు) నైవేద్యాన్ని సిద్ధం చేసుకున్నారు. తలపై బోనాలను పెట్టుకుని, వేపాకులతో అలంకరించిన ఘటాలతో వీధుల గుండా ప్రదర్శనగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ​శివసత్తుల పూనకాలు - డప్పు చప్పుళ్లు ​ఈ వేడుకలో స్థానిక కళాకారుల డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పుల దరువులకు అనుగుణంగా యువకులు, గ్రామస్తులు ఉత్సాహంగా నృత్యం చేశారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల మధ్య ఊరేగింపు కోలాహలంగా సాగింది. ​మొక్కులు తీర్చుకున్న భక్తులు ​ఆలయానికి చేరుకున్న మహిళలు అమ్మవారికి బోనం సమర్పించి, తమ కుటుంబాలు చల్లగా ఉండాలని, గ్రామం పాడిపంటలతో వర్ధిల్లాలని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
    1
    జర్నలిస్ట్ జితేందర్ కవ్వాల్ గ్రామంలో వైభవంగా ఇందూర్ పోచమ్మ బోనాలు...
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో ఆదివారం ఇందూర్ పోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో జరిగింది. ఏటా నిర్వహించే ఈ సంప్రదాయ వేడుకలో గ్రామస్తులందరూ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
​ఘనంగా బోనాల ఊరేగింపు
​ఉదయం నుండే గ్రామమంతా పండగ వాతావరణం నెలకొంది. గ్రామంలోని మహిళలు నూతన వస్త్రాలు ధరించి, పసుపు కుంకుమలతో అలంకరించిన మట్టి కుండల్లో (బోనాలు) నైవేద్యాన్ని సిద్ధం చేసుకున్నారు. తలపై బోనాలను పెట్టుకుని, వేపాకులతో అలంకరించిన ఘటాలతో వీధుల గుండా ప్రదర్శనగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
​శివసత్తుల పూనకాలు - డప్పు చప్పుళ్లు
​ఈ వేడుకలో స్థానిక కళాకారుల డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పుల దరువులకు అనుగుణంగా యువకులు, గ్రామస్తులు ఉత్సాహంగా నృత్యం చేశారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల మధ్య ఊరేగింపు కోలాహలంగా సాగింది.
​మొక్కులు తీర్చుకున్న భక్తులు
​ఆలయానికి చేరుకున్న మహిళలు అమ్మవారికి బోనం సమర్పించి, తమ కుటుంబాలు చల్లగా ఉండాలని, గ్రామం పాడిపంటలతో వర్ధిల్లాలని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.