Shuru
Apke Nagar Ki App…
డిగ్రీ తో అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఎలాంటి exam లేదు ఫుల్ డీటెయిల్స్ వీడియో today evening 6:15pm comming in my YouTube channel 🤝🤝🤝🤝👇👇don't Miss all 👌👌🤝🤝
Chandraiah Pochampally
డిగ్రీ తో అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఎలాంటి exam లేదు ఫుల్ డీటెయిల్స్ వీడియో today evening 6:15pm comming in my YouTube channel 🤝🤝🤝🤝👇👇don't Miss all 👌👌🤝🤝
- Chandraiah PochampallyJadcherla, Mahabubnagarfull details link :https://youtu.be/Y0ijGcnRxos?si=vAms5PVFCO5eWjiT20 hrs ago
More news from తెలంగాణ and nearby areas
- పోమాలపల్లిలో ఫ్లెక్సీల చించివేత ఘటన కలకలం రేపింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించివేయడాన్ని యువకులు, పాలకవర్గం తీవ్రంగా ఖండించారు. ఉప సర్పంచ్ ఫోటోనే లక్ష్యంగా దాడి చేశారని ఆరోపించారు. గ్రామంలో కక్షపూరిత రాజకీయాలు తగవని హెచ్చరిస్తూ, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.1
- *మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవి ప్రసాద్, మద్యం మత్తులో తన భార్య శిరీషపై దారుణంగా దాడి చేశారు. శిరీష గుడిపేట బెటాలియన్‌లో సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ మంచిర్యాలలోని రెడ్డి కాలనీలో నివసిస్తున్నారు.* అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన రవి ప్రసాద్, అనుమానంతో భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో కేవలం లోదుస్తులతో (అర్ధనగ్నంగా) రోడ్డుపైకి వచ్చి, అందరూ చూస్తుండగానే ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తూ తీవ్రంగా కొట్టాడు. బాధితురాలు ప్రాధేయపడుతున్నా, చుట్టుపక్కల వారు ఆపడానికి ప్రయత్నించినా అతను వినకుండా వీరంగం సృష్టించాడు. బాధిత భార్య శిరీష తన భర్తపై మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రవి ప్రసాద్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఒక రక్షక భటుడే ఇలా బాధ్యతారాహిత్యంగా, అమానవీయంగా ప్రవర్తించడం పట్ల స్థానికులు మరియు ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.1
- GDWL: కేటీ దొడ్డి మండలంలోని మైలగడ్డ స్టేజి నుంచి పాతపాలెం, ఈర్ల బండ, గంగనిపల్లె తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గంలో ప్రమాదకరంగా బావి ఉంది. రోడ్డు పక్కన బావి ఉండడం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం అదుపు తప్పితే నేరుగా బావిలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది. అధికారుల సమస్యపై స్పందించాలని ప్రయాణికులు కోరారు.1
- అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద *పులిహోర పంపిణీ కార్యక్రమం* *తేదీ 03-02-2025 మంగళవారం ఉదయం 9-30 గంటలకు* సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ రేపు దాతగా పేరు:- శ్రీమతి & శ్రీ *నాయిని సత్యలక్ష్మి యాదగిరి* *దంపతులు మరియు* *వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక అంగడిపేట హనుమాన్ మందిరం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమం కలదు కావున అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు *జై హనుమాన్ జై జై హనుమాన్* ఈ కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గందె సంతోష్ దూబగుంట లచ్చల్, భైరయ్య సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు4
- హైదరాబాద్, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ నితిన్ నబీన్ కి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో నితిన్ నబీన్ నాయకత్వం కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ స్వాగత కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికలపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.1
- సంగారెడ్డిలో మున్సిపల్ ఎన్నికల లో పోటీ చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బి ఫారం లను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ కార్యాలయంలో అందజేశారు. 38 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు.1
- చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 07వ వార్డులో గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ మాట్లాడుతూ – గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు… కానీ నేడు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేషన్ కార్డు వచ్చి, సన్నబియ్యం తో అన్నం తింటున్నాం అని ఆనందంగా తెలిపింది.1
- కేశంపేట మండలంలోని గ్రామాల్లో తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు చలికి వణుకుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు దుప్పట్లు, మఫ్లర్లతో చలిని తట్టుకుంటున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకోవడంతో రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణిస్తున్నారు. చలి ప్రభావంతో జ్వరాలు, దగ్గు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.1