Shuru
Apke Nagar Ki App…
బాసర రైల్వేస్టేషన్ వద్ద కారు బైక్ ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. బాసర శివాజీ చౌక్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై కారు - బైక్ సోమవారం మధ్యాహ్నం ఢీకొన్నాయి. ఈ ప్రమాదం లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్సు లో భైన్సా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. బాసర మండలం కిర్గుల్ (బి) గ్రామానికి చెందిన ట్రైనింగ్ డీఎస్పీ మహేందర్ కు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
RP
బాసర రైల్వేస్టేషన్ వద్ద కారు బైక్ ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. బాసర శివాజీ చౌక్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై కారు - బైక్ సోమవారం మధ్యాహ్నం ఢీకొన్నాయి. ఈ ప్రమాదం లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్సు లో భైన్సా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. బాసర మండలం కిర్గుల్ (బి) గ్రామానికి చెందిన ట్రైనింగ్ డీఎస్పీ మహేందర్ కు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- బాసర త్రిబుల్ ఐటీ లో ఘనంగా విద్యా వారోత్సవాలు.. డిజిటల్ ఐసిటి తరగతి గదులు ప్రారంభించిన వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్.. విద్యా వారోత్సవాల్లో భాగంగా బాసర RGUKTలో సోమవారం అత్యాధునిక డిజిటల్ ICT తరగతి గదులు ప్రారంభమయ్యాయి. విసి ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ ప్రారంభించారు. ఒకేసారి 300 మంది విద్యార్థులు లైవ్ క్లాసుల్లో పాల్గొనేలా స్మార్ట్ బోధన, హై-క్వాలిటీ ఆడియో-విజువల్ సిస్టమ్స్‌తో ఈ గదులను తీర్చిదిద్దారు. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విద్య అందించడమే లక్ష్యమని విసి తెలిపారు. స్మార్ట్ బోధన, హైటెక్ వసతులు, డిజిటల్ హై క్వాలిటీ ఆడియో, వీడియో సిస్టమ్ కల్పించారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఏర్పడే సవాళ్లను సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సిబ్బందితో పాటు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.1
- ముధోల్ మండలం విటోలి గ్రామంలో సోమవారం విషాదం ఇద్దరు బాలురు మృతి నిర్మల్ జిల్లా ముధోల్ మండలం విటోలి గ్రామంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిఖిల్(15), స్వరాజ్ (14) అనే ఇద్దరు బాలురు స్నేహితులతో కలిసి సరదాగా గ్రామం శివారులోని రంగారికుంట చెరువులో ఈతకు వెళ్లారు. ఈత కొడుతున్ న క్రమంలో నిఖిల్, స్వరాజ్ నీట మునిగి మృతిచెందారు. విషయం తెలుసుకున్ న ఎస్ఐ పెర్సీస్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.1
- రోడ్డెక్కిన రైతన్న ఉధృతంగా మారిన ధర్నా ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం నిజామాబాద్ జిల్లాలో భగ్గుమన్న రైతులు నెల రోజులుగా కల్లాల్లోనే ధాన్యం కుప్పలు ప్రభుత్వ తీరుపై అన్నదాతల ఆగ్రహం. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా కల్లాల్లోనే ధాన్యం కుప్పలు పెట్టుకుని ఎదురుచూస్తున్నా. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నేడు రోడ్డెక్కారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి 63పై రైతులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు.మండూటి ఎండను కూడా లెక్కచేయకుండా రైతులు చేపట్టిన ఈ నిరసనలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు: గత కేసీఆర్ ప్రభుత్వంలో క్వింటాల్‌కు 41.5 కిలోల చొప్పున తూకం వేసేవారని, కానీ ఇప్పుడు రైస్ మిల్లర్లు 45 కిలోలు కావాలని రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు. ధాన్యం తరలించడానికి గన్నీ బ్యాగుల కొరత వేధిస్తోందని, లారీల సంఖ్య తక్కువగా ఉండటంతో రవాణా పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. ఎర్రటి ఎండలో అన్నదాతలు ఆకలితో రోడ్ల మీద కూర్చోవాల్సిన దుస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి. గన్నీ బ్యాగులు, లారీల సంఖ్యను తక్షణమే పెంచాలి. గతంలో మాదిరిగానే 41.5 కిలోల తూకాన్నే అమలు చేయాలి, మిల్లర్ల అక్రమాలను అరికట్టాలి. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనలను రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రైతులు, బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.1
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా లొ బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించి కేంద్ర మంత్రి బండి సంజయ్ అతని కుమారుడు సాయి బాగిరథ్ ఫొటోలు ఉన్న ప్లే కార్డులను దగ్ధం చేశారు.బండి సంజయ్, కుమారుడు సాయి భగిరథ్ ప్లే కార్డులను దగ్ధం చేసే సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో బిఆర్ఎస్ నాయకులు,పోలీసుల మధ్య కొద్ది సేపు తోపులాట జరిగింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికను 3 నెలల నుండి అత్యాచారం చేస్తే కటీనమైన కేసులు పెట్టడం పోయి సిఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సాయి బాగిరథ్ ను వెంటనే అరెస్ట్ చెయ్యాలని,బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు బఆర్ఎస్ నాయకులు. బిఆర్ఎస్ నాయకులు2
- కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని 161వ జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తా పడింది. టైరు పేలడంతో రుశేగావ్ గేట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ మైనర్ బాలికకు న్యాయం చేయాలని, బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేసి పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు… ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ… గత మూడు రోజులుగా ఘటనపై ఎలాంటి స్పందన లేకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మైనర్ బాలికకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. “రక్షకుడే భక్షకుడు అయ్యాడు” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.పోక్సో చట్టం ప్రకారం 24 గంటల్లోనే అరెస్ట్ చేయాల్సి ఉండగా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. సాధారణ వ్యక్తి అయితే వెంటనే అరెస్ట్ చేసే పోలీసులు, అధికార పార్టీకి చెందిన వారి విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు..బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలని, బాలికకు పూర్తి రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గాని, కేంద్ర మంత్రులు గాని ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు.బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నాయకులు ఈ ఘటనపై స్పందించి ఆ చిన్నారికి న్యాయం జరిగేలా ముందుకు రావాలని కోరారు..మహిళల భద్రతపై పెద్ద పెద్ద మాటలు చెప్పే నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు…1
- ఐఎఫ్బి ఎస్ ఐ డి పి ఎస్ బోధనతో నాణ్యమైన విద్య డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమాసింగ్ ఐఎఫ్బి ఎస్ ఐ డి పి ఎస్ బోధనతో నాణ్యమైన విద్య-భవిష్యత్తుకు నాంది కలెక్టర్ ప్రతిమా సింగ్99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ను సందర్శించిన కలెక్టర్ డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను క్లాస్ రూమ్ బోర్డులను ప్రారంభించిన కలెక్టర్ ప్రారంభించారు.కలెక్టర్ చేగుంట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ఐ ఎఫ్ పి ఎస్ ఐ డి పి ఎస్ బోధనతో నాణ్యమైన విద్య-భవిష్యత్తుకు నాంది కార్యక్రమంలో భాగంగా డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యార్థుల కోసం డిజిటల్ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఐ ఎఫ్ పి ఎస్ ఐ డి పి ఎస్ బోధనను ప్రవేశపెడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు .ఈ కార్యక్రమంలోశ్యాంసుందర్, -భౌతికశాస్త్ర బోధనతో అధ్యాపకులు -ఇంచార్జి ప్రిన్సిపాల్స్వర్ణలత ,-వృక్షశాస్త్ర అధ్యాపకులు అరవింద్ రెడ్డి, -రసాయనశాస్త్ర అధ్యాపకులువెంకటేశ్వర్లు -అర్ధశాస్త్ర అధ్యాపకులుప్రమోద్కుమార్ -కంప్యూటర్ అధ్యాపకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు1
- బాసర రైల్వేస్టేషన్ వద్ద కారు బైక్ ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. బాసర శివాజీ చౌక్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై కారు - బైక్ సోమవారం మధ్యాహ్నం ఢీకొన్నాయి. ఈ ప్రమాదం లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్సు లో భైన్సా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. బాసర మండలం కిర్గుల్ (బి) గ్రామానికి చెందిన ట్రైనింగ్ డీఎస్పీ మహేందర్ కు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.1