నంద్యాల పి.యస్.సి&కె.వి.యస్.సి ప్రభుత్వ కళాశాలలో మాయమైన విద్యార్థిని విద్యార్థుల 15 మొబైల్ ఫోన్లు నంద్యాల పట్టణంలోని ప్రముఖ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ పి.యస్.సి&కె.వి.యస్.సి కళాశాల నందు డిగ్రీ రెండవ సంవత్సరం పరీక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రాం(ఎగ్జామ్స్ సెంటర్)లో విద్యార్థుల మొబైల్ ఫోన్లు అనుమతి లేనందున అందరూ ఒకే కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు కావడంతో తమ15 మొబైల్ ఫోన్లు ఒక స్కూటీ డిక్కీలో పెట్టి మూడు గంటలు పరీక్షలు రాసి వచ్చి చూడగా 15 మొబైలు కనిపించకపోవడంతో మొదట పరిక్ష కేంద్రంలో ఫిర్యాదు చేయగా కళాశాల నిర్వాహకులు మాకు ఎలాంటి సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో నంద్యాల మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు విద్యార్థినీ విద్యార్థులు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన సిఐ ఫిర్యాదును స్వీకరించి తప్పనిసరిగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.ప్రభుత్వ పియస్సి&కెవియస్సి కళాశాల (పరీక్షల కేంద్రంలో) సీసీ కెమెరాలు ఉండి కూడా మొబైల్ ఫోన్లు దొంగిలించడం ఆశ్చర్యానికి గురి చేసింది.విద్యార్థినీ విద్యార్థులు తమ ఫోన్లో దొంగలించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విద్యార్థిని విద్యార్థులు మూడవ పట్టణ పోలీసులను కోరారు.

- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అధికారులు సోమవారం నంద్యాలలో మహానంది జూవెలర్ దుకాణంలో తనిఖీలు చేశారు. ఆల్ మార్కు లేని 3 కేజీల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిసి నంద్యాలలో ఉన్న అన్ని బంగారు దుకాణాలు మూసివేశారు.1
- ఆకాశంలో ఫైటింగ్ రైల్వే స్టేషన్లో రచ్చ.. కరెంట్ తీగలు ఎక్కి మరీ ఫైట్! "గురూజీ.. మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొడతా" అని ఓ మూవీలో డైలాగ్ చెప్పినట్టు ఛాలెంజ్ చేసుకున్నారేమో.. దారా చూసుకుందాం అంటూ కొందరు ఆకతాయిలు గొడవను నెక్స్ లెవల్కు తీసుకెళ్లారు. మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్లో కొందరు హై-టెన్షన్ తీగలు ఎక్కి కొట్టుకున్నారు. కిందకి దిగమని పోలీసులు హెచ్చరిస్తున్నా వినలేదు. దీంతో కాసేపు స్టేషన్లో హైడ్రామా నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.1
- యాంకర్ వాయిస్: వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి. కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి. భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు1
- Hi1
- మండలంలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కోడేరు వైద్యాధికారి రాఘవేంద్ర తెలిపారు. 16 గ్రామ పంచాయతీల పరిధిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు నీడపట్టునే ఉండాలని సూచించారు. దాహం వేయకున్నా తరచూ మంచినీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్‌ను నివారించవచ్చన్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, lఅనారోగ్యంగా అనిపిస్తే కాలయాపన చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.1
- రైతు భరోసా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. దానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం ఈరోజు రైతు భరోసా విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది కానీ ఈ వీడియో అంతకుముందు షూట్ చేశాం.1
- బద్వేలు:సరస్వతి శిశు మందిరంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితభావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ వేదికపై ఘనంగా సన్మానం జరిగింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానంతో పాటు, విద్యా విలువలను చాటిచెప్పే పలు కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. క్రమశిక్షణ, విద్య మరియు సంస్కృతుల కలయికగా సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది. ఈ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న పలువురికి సరస్వతి శిశు మందిరం కమిటీ సభ్యులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు, అనంతరం శిశు మందిరం వార్షికోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులతో పాటు కమిటీ సభ్యులు పలువురు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు2
- బనగానపల్లె మండలం మైన్ ప్రాథమిక పాఠశాల యందు జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో బడిబాట విశిష్టత హెచ్ఎం మల్లికార్జున రావుకు సన్మానం, విద్యార్థులకు బహుమతులు ప్రధాన ఉత్సవం, అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది, ముందుగా బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పిల్లల కోసం మధ్యాహ్న భోజనం మంచి పౌష్టికాహారం బూట్లు పుస్తకాలు అమ్మ ఒడి రూ. 15000 మొదలగునవి మీకోసం అమలు చేస్తుందని మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కృషి చేయాలని బడిబాటి బంగారు బాట అన్నారు. అనంతరం హెచ్ ఎం మల్లికార్జునరావు ఘనంగా సన్మానించి విద్యార్థులకు బహుమతులు అందించారు. హెచ్ఎం మల్లికార్జునరావు ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ.. పిల్లలు మా పాఠశాలలో చేర్పించండి చదువు చెప్పడం మా వంతు అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకుడు వల్లపు శంకర్, ఉపాధ్యాయులు, మధు కిషోర్, సురేష్, మల్లేశ్వరుడు, మల్లికార్జున , పలుకూరు గ్రామస్తులు పాల్గొన్నారు.1