logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అత్యంత విచారకరమని సంగారెడ్డి జిల్లా టీజేఏసీ (TJAC) చైర్మన్ వై. అశోక్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు ఉద్యమకారులు పిలుపునిచ్చిన 'చలో అసెంబ్లీ' కార్యక్రమాన్ని అడ్డుకోవడం, నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు. ​అనారోగ్య కారణాల దృష్ట్యా జిల్లా చైర్మన్ వై. అశోక్ కుమార్ గారిని పోలీసులు ఇంటి వద్దనే లేఖ ద్వారా బైండోవర్ చేయగా, జిల్లా కోఆర్డినేటర్ శ్రీధర్ మహేంద్ర, నేటివ్ ఇండియా ఛానల్ అధినేత బీరయ్య యాదవ్, ఉద్యమ నాయకులు కుమ్మరి సాయిలు, గుల్లని మల్లయ్య గార్లను అరెస్ట్ చేసి సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో బంధించడాన్ని కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. *​ప్రభుత్వానికి డిమాండ్లు:* కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్క ఉద్యమకారుడిని గుర్తించి, వారికి తక్షణమే 'గుర్తింపు కార్డులు' జారీ చేయాలని, ఉద్యమకారుల కుటుంబాలకు నెలకు రూ. 25,000 గౌరవ భృతి (పెన్షన్) అందించాలన్న హామీని నెరవేర్చాలని, ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలంతో పాటు, ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలని, ఉద్యమకారుల పిల్లలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలి. ​"అధికారంలోకి రాకముందు ఉద్యమకారులే మా ప్రాణం అన్న కాంగ్రెస్ నేతలు, నేడు గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని అరెస్టులతో అణచివేయాలని చూడటం తగదు. హామీలు నెరవేర్చే వరకు మా పోరాటం ఆగదు." జిల్లా కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.

11 hrs ago
user_Mahesh Kumar
Mahesh Kumar
Sangareddy, Telangana•
11 hrs ago
c956e690-1717-4792-bc6f-71de9e0bba0d

తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అత్యంత విచారకరమని సంగారెడ్డి జిల్లా టీజేఏసీ (TJAC) చైర్మన్ వై. అశోక్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు ఉద్యమకారులు పిలుపునిచ్చిన 'చలో అసెంబ్లీ' కార్యక్రమాన్ని అడ్డుకోవడం, నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు. ​అనారోగ్య కారణాల దృష్ట్యా జిల్లా చైర్మన్ వై. అశోక్ కుమార్ గారిని పోలీసులు ఇంటి వద్దనే లేఖ ద్వారా బైండోవర్ చేయగా, జిల్లా కోఆర్డినేటర్ శ్రీధర్ మహేంద్ర, నేటివ్ ఇండియా ఛానల్ అధినేత బీరయ్య యాదవ్, ఉద్యమ నాయకులు కుమ్మరి సాయిలు, గుల్లని మల్లయ్య గార్లను అరెస్ట్ చేసి సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో బంధించడాన్ని కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. *​ప్రభుత్వానికి డిమాండ్లు:* కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్క ఉద్యమకారుడిని గుర్తించి, వారికి తక్షణమే 'గుర్తింపు కార్డులు' జారీ చేయాలని, ఉద్యమకారుల కుటుంబాలకు నెలకు రూ. 25,000 గౌరవ భృతి (పెన్షన్) అందించాలన్న హామీని నెరవేర్చాలని, ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలంతో పాటు, ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలని, ఉద్యమకారుల పిల్లలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలి. ​"అధికారంలోకి రాకముందు ఉద్యమకారులే మా ప్రాణం అన్న కాంగ్రెస్ నేతలు, నేడు గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని అరెస్టులతో అణచివేయాలని చూడటం తగదు. హామీలు నెరవేర్చే వరకు మా పోరాటం ఆగదు." జిల్లా కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • ప్రజావాణిలో 50 అర్జీలు, నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రావీణ్య
    1
    ప్రజావాణిలో 50 అర్జీలు, నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రావీణ్య
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ సాయి డెంటల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ పేరిట వేధిస్తున్న సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. ర్యాగింగ్ చేస్తున్న అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్ లిస్ట్ సిపిఎం వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున డెంటల్ కళాశాల యజమాన్యానికి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ర్యాగింగ్ చేస్తున్న విద్యార్థుల పై ర్యాగింగ్ గురవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారని, వెంటనే పోలీసులు కళాశాల సిబ్బందితో విద్యార్థులతో అవేర్నెస్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి ర్యాగింగ్లు ఎక్కడ జరగకుండా జాగ్రత్త తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
    1
    వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ సాయి డెంటల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ పేరిట వేధిస్తున్న సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. ర్యాగింగ్ చేస్తున్న అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్ లిస్ట్ సిపిఎం వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున డెంటల్ కళాశాల యజమాన్యానికి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ర్యాగింగ్ చేస్తున్న విద్యార్థుల పై ర్యాగింగ్ గురవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారని, వెంటనే పోలీసులు కళాశాల సిబ్బందితో విద్యార్థులతో అవేర్నెస్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి ర్యాగింగ్లు ఎక్కడ జరగకుండా జాగ్రత్త తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    7 hrs ago
  • ఆదివారం రోజున కౌడిపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో. శ్రీ సీతారాములవారి పల్లకి సేవలను నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలు అందరూ కలిసి శ్రీ సీతారాములవారి పల్లకినీ గ్రామంలో ఆటపాటలతో, వివిధ రకాల వేషధారణలతో శ్రీరామ భజన చేస్తూ కనుల పండుగగ నిర్వహించినరూ. ఇలాంటి వేడుకలను నిర్వహించినందుకు గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ కు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ గారు, ఉపసర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్ గారు, వాడు సభ్యులు మబ్బులు ,మురళి, దేవేందర్ ,రమేష్, మరియు గ్రామ పెద్దలు చంద్రం , మల్లేష్ ,దుర్గయ్య గౌడ్ ,టీ మల్లేష్, శ్రీనివాస్ గుప్తా, ఉడుత కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
    4
    ఆదివారం రోజున కౌడిపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో. శ్రీ సీతారాములవారి పల్లకి సేవలను నిర్వహించడం జరిగింది. 
గ్రామ ప్రజలు అందరూ కలిసి శ్రీ సీతారాములవారి పల్లకినీ గ్రామంలో ఆటపాటలతో, వివిధ రకాల వేషధారణలతో శ్రీరామ భజన చేస్తూ కనుల పండుగగ నిర్వహించినరూ. 
ఇలాంటి వేడుకలను నిర్వహించినందుకు గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ కు అభినందనలు తెలిపారు.
ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ గారు, ఉపసర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్ గారు, వాడు సభ్యులు మబ్బులు ,మురళి, దేవేందర్ ,రమేష్, మరియు గ్రామ పెద్దలు చంద్రం , మల్లేష్ ,దుర్గయ్య గౌడ్ ,టీ మల్లేష్, శ్రీనివాస్ గుప్తా, ఉడుత కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
    user_Vishwanath Goud
    Vishwanath Goud
    Grocer కౌడిపల్లి, మెదక్, తెలంగాణ•
    17 hrs ago
  • తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3లక్షల కోట్లతో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అందరికీ అనుకూలమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఓయూ జేఏసీ నాయకుడు సలీం హర్షం వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కల చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగులు, మహిళలు, రైతులకు భారీ నిధుల కేటాయింపుతో పాటు, సామాజిక న్యాయానికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. సామాన్యుడి పై ఆర్థిక భారం పడకుండా బడ్జెట్ ను రూపొందించారు అన్నారు. భట్టి విక్రమార్క వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు ఎలాంటి పాలన అందించాలని తెలుసుకున్న వ్యక్తి అని కొనియాడారు.
    2
    తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3లక్షల కోట్లతో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అందరికీ అనుకూలమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఓయూ జేఏసీ నాయకుడు సలీం హర్షం వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కల చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు  మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగులు, మహిళలు, రైతులకు భారీ నిధుల కేటాయింపుతో పాటు, సామాజిక న్యాయానికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. సామాన్యుడి పై ఆర్థిక భారం పడకుండా బడ్జెట్ ను రూపొందించారు అన్నారు. భట్టి విక్రమార్క వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు ఎలాంటి పాలన అందించాలని తెలుసుకున్న వ్యక్తి అని కొనియాడారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • హనుమకొండలో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ ఉద్ధృతం: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల రాకపై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన! ​హనుమకొండ: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని నిరసిస్తూ హనుమకొండలో బస్టాండ్ వద్ద టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుల వెంకన్న ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.​ఈ సందర్భంగా ఈదుల వెంకన్న మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఆర్టీసీని ప్రైవేటీకరించడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.​ఆర్టీసీని కాపాడుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
    1
    హనుమకొండలో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ ఉద్ధృతం: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల రాకపై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన!
​హనుమకొండ: ప్రైవేటు ఎలక్ట్రిక్  బస్సుల ప్రవేశాన్ని నిరసిస్తూ హనుమకొండలో  బస్టాండ్ వద్ద టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుల వెంకన్న ఆధ్వర్యంలో కార్మికులు   అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.​ఈ సందర్భంగా ఈదుల వెంకన్న మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఆర్టీసీని ప్రైవేటీకరించడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.​ఆర్టీసీని కాపాడుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • మెదక్ మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్న మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్ అధ్యక్షతన జరిగింది సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అధికారుల తీరును కౌన్సిలర్ ఆంజనేయులు విమర్శించారు ఈ సమావేశంలో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ డి ఈ మహేష్ ఏఈ అధికారులుకౌషన్సిలర్లు తధితరులు పాల్గొన్నారు
    1
    మెదక్ మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్న మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్ అధ్యక్షతన జరిగింది సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అధికారుల తీరును కౌన్సిలర్ ఆంజనేయులు విమర్శించారు ఈ సమావేశంలో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ డి ఈ మహేష్ ఏఈ అధికారులుకౌషన్సిలర్లు తధితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    7 hrs ago
  • "Auto drivers struggling due to gas shortage." ​"No gas, no work: Auto drivers in distress." ​"Fuel crisis hitting auto drivers hard."
    1
    "Auto drivers struggling due to gas shortage."
​"No gas, no work: Auto drivers in distress."
​"Fuel crisis hitting auto drivers hard."
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • తమిళనాట మొదలైన ఎన్నికల కురుక్షేత్రం: నామినేషన్ దాఖలు చేసిన టీవీకే (TVK) అధినేత విజయ్! చెన్నై/హైదరాబాద్:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక అడుగు వేశారు. సోమవారం నాడు ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుండి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ​తన తొలి ఎన్నికల బరిలో విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి చెన్నైలోని పెరంబూర్ కాగా, మరొకటి తిరుచ్చి (ఈస్ట్) నియోజకవర్గం. భారీ భద్రత నడుమ, వేలాది మంది అభిమానులు మరియు పార్టీ కార్యకర్తల కోలాహలం మధ్య విజయ్ రిటర్నింగ్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన పెరంబూర్ నియోజకవర్గంలో భారీ ఎన్నికల ర్యాలీని ప్రారంభించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ​సీఎం స్టాలిన్ వర్సెస్ విజయ్: మరోవైపు, ఇదే రోజున తమిళనాడు ముఖ్యమంత్రి మరియు డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్ కూడా తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరు నుండి నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి మరియు రాష్ట్రంలో ఎదుగుతున్న కొత్త రాజకీయ శక్తి విజయ్ ఒకే రోజు నామినేషన్లు వేయడంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ​రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తోందని, అవినీతి రహిత పాలనే తన లక్ష్యమని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఎన్నికల్లో యువత మరియు మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.
    1
    తమిళనాట మొదలైన ఎన్నికల కురుక్షేత్రం: నామినేషన్ దాఖలు చేసిన టీవీకే (TVK) అధినేత విజయ్!
చెన్నై/హైదరాబాద్:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక అడుగు వేశారు. సోమవారం నాడు ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుండి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
​తన తొలి ఎన్నికల బరిలో విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి చెన్నైలోని పెరంబూర్ కాగా, మరొకటి తిరుచ్చి (ఈస్ట్) నియోజకవర్గం. భారీ భద్రత నడుమ, వేలాది మంది అభిమానులు మరియు పార్టీ కార్యకర్తల కోలాహలం మధ్య విజయ్ రిటర్నింగ్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన పెరంబూర్ నియోజకవర్గంలో భారీ ఎన్నికల ర్యాలీని ప్రారంభించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
​సీఎం స్టాలిన్ వర్సెస్ విజయ్:
మరోవైపు, ఇదే రోజున తమిళనాడు ముఖ్యమంత్రి మరియు డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్ కూడా తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరు నుండి నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి మరియు రాష్ట్రంలో ఎదుగుతున్న కొత్త రాజకీయ శక్తి విజయ్ ఒకే రోజు నామినేషన్లు వేయడంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
​రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తోందని, అవినీతి రహిత పాలనే తన లక్ష్యమని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఎన్నికల్లో యువత మరియు మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.