Shuru
Apke Nagar Ki App…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన ప్రవాస ఆంధ్రుల వారధి శ్రీ కోమటి జయరాం ఆత్మీయ అభినందన సభలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు , జోనల్ ఇంచార్జి మరియు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర,మన మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రవాస ఆంధ్రులు మరియు రాష్ట్ర అభివృద్ధి మధ్య వారధిగా జయరాం గారు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు..
P.VEERANNA
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన ప్రవాస ఆంధ్రుల వారధి శ్రీ కోమటి జయరాం ఆత్మీయ అభినందన సభలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు , జోనల్ ఇంచార్జి మరియు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర,మన మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రవాస ఆంధ్రులు మరియు రాష్ట్ర అభివృద్ధి మధ్య వారధిగా జయరాం గారు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు..
More news from తెలంగాణ and nearby areas
- ధరూర్: మండలంలోని జంపల్లి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కెనాల్ సమీపాన అంతర్ రాష్ట్ర రహదారిపై బ్రిడ్జి నిర్మించాలని ప్రయాణికులు తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే 4 ఫీట్ల వరకు రోడ్డుపై నీరు నిలిచిపోయి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారుతుంది అన్నారు. అక్కడ గుంతలు ఏర్పడిన కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేశారు. సంబంధిత అధికారులు స్పందించాలని ప్రజలు కోరారు.1
- బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో నాగుపాముల సందడి నెలకొంది. సుబ్బయ్య కాలనీలోని శివ ఇంటి పరిసరాల్లో రెండు పాములు కనిపించడంతో స్నేక్ క్యాచర్స్ జగన్, కార్తీక్ రంగంలోకి దిగారు. గాయపడిన ఒక పాముకు తక్షణ వైద్యం అందించి, రెండింటినీ బుద్ధారం ఫారెస్ట్ ఏరియాలో వదిలేశారు. సమయానికి స్పందించి వన్యప్రాణులను సంరక్షించిన స్నేక్ క్యాచర్ల సాహసాన్ని గ్రామస్తులు కొనియాడారు3
- మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ప్రత్యేకంగా యంబ నరసింహులు గారు తన కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకుని, సర్వలోక క్షేమం కోరుతూ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొని భక్తి భావంతో సేవలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.4
- నాచారం కు చెందిన చెల్లా లక్ష్మీనారాయణ(72) రిటైర్డ్ ఉద్యోగి ఈరోజు ఉదయం హబ్సిగూడలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి వచ్చి డిపాజిట్ స్లిప్ నింపుతుండగా స్ట్రోక్ రావడంతో కిందపపడిపోయిన లక్ష్మీనారాయణ. వెంటనే బ్యాంక్ సిబ్బంది 108 కు సమాచారం ఇవ్వడంతో..108 సిబ్బంది వచ్చి సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఓయూ పోలీసులు.1
- మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్ మల్లన్న గుట్ట వద్ద ఉన్న క్వారీలో మంగళవారం ఈతకు వెళ్లి గల్లంతైన బీకాం రెండో సంవత్సరం విద్యార్థి సూరజ్ (22) మృతదేహాన్ని డీఆర్ఎఫ్ బృందం వెలికితీసింది. మహారాష్ట్రకు చెందిన సూరజ్, తన నలుగురు స్నేహితులతో కలిసి క్వారీలో ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.1
- వైయస్‌ఆర్‌సీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారి అరె*స్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం దుర్మా*ర్గంగా వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఈ అ*రెస్ట్ సాక్ష్యం రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు లేదా? -వరుదు కళ్యాణి గారు, వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.....1
- ఎమ్మిగనూరులో స్కూల్ అభివృద్ధికి శ్రీకారం – తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ1
- బిజినేపల్లి మండలం మంగనూరులో నిర్వహించిన పూలే-అంబేద్కర్ స్మారక క్రీడా టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్వరం నాగయ్య, ఉపసర్పంచ్ బోట్క చంద్రశేఖర్ , జిల్లా, మండల నేతలు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. బీసీ ఎస్సీ ఎస్టీ జాకు గ్రామ అధ్యక్షులు అల్వాల శ్రీకాంత్ గౌడ్,ఉపాధ్యక్షులు బందెల కృష్ణ,తిమ్మగల్లు ఆంజనేయులు జాలం శ్రీను, ప్రధాన కార్యదర్శి ఆవుల కృష్ణ,కోశాధికారి అప్పల తిరుపతయ్య,మరియు తిమ్మగల గోపీనాథ్,అప్పల పులేందర్ మంగనూరు విజ్ఞాన వేదిక ఫౌండర్ బోట్క కొండయ్య,బోట్క రాజు, మండల బీసీ సంఘం అధ్యక్షులు సత్యశీల సాగర్, గ్రామ బీసీ సంఘం అధ్యక్షులు మేకల యాదయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు చిన్నగాల పరశురాములు మరియు గౌడ సంఘం నాయకులు కురుమూర్తి గౌడ్, జాలం,తిరుపతయ్య, వెంకటయ్య మహనీయుల స్మారక టోర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్లు వ్యవహరించిన మేకల మాసయ్య, తిమ్మగళ్ల మల్లికార్జున్,రవి పులిందర్ మరియు గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.l1
- ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించడం సంతోషంగా ఉంది. విజ్ఞానమే సామాజిక ప్రగతికి చిహ్నం అని చెప్పిన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని అమరావతిలో క్వాంటం చరిత్రను ప్రారంభించుకున్నాం. #QuantumRevolutionInAP #AmaravatiQuantumValley1