logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆర్మీ లెఫ్టినెంట్ గా నల్గొండ ఎన్జీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ చిలుముల సుధాకర్ నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న చిలుముల సుధాకర్ , నేషనల్ కేడెట్ కార్ప్స్ (NCC) లో అసోసియేట్ NCC ఆఫీసర్ (ANO)గా సేవలందించేందుకు అర్హత సాధించి, లెఫ్టినెంట్ హోదాతో ఆర్మీ ఆఫీసర్ ర్యాంకును పొందడం జరిగింది. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఉన్న ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో జనవరి 5 నుండి ఏప్రిల్ 4 వరకు మూడు నెలలపాటు అత్యంత కఠినమైన సైనిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఆర్మీ శిక్షణలో భాగంగా ఫైరింగ్, వెపన్ హ్యాండ్లింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్, డ్రిల్, ఫిజికల్ ట్రైనింగ్, నాయకత్వ లక్షణాల అభివృద్ధి వంటి అంశాలలో సమగ్ర శిక్షణ పొందారు. అలాగే, NCC క్యాడెట్లను భారత సైన్యంలో చేరేందుకు ప్రోత్సహించడం, వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందించడం, సైనిక జీవన విధానం పట్ల అవగాహన కల్పించడం వంటి ముఖ్య అంశాలపై కూడా ప్రత్యేకంగా శిక్షణ పొందారు. శిక్షణ అనంతరం, చిలుముల సుధాకర్ లెఫ్టినెంట్ గా ఆర్మీ అధికారి గా నియామకం తో కళాశాలకు గర్వకారణంగా నిలిచారు. లెఫ్టినెంట్ ర్యాంక్ తో విద్యార్థులకు, NCC క్యాడెట్ లకు ప్రేరణగా నిలుస్తూ, NCC ద్వారా క్యాడెట్లను శారీరక దృఢత్వం , డ్రిల్ మరియు క్రమశిక్షణ , ఆయుధ వినియోగం, ఫైరింగ్ శిక్షణ (Weapon Training & Firing), ఫీల్డ్ క్రాఫ్ట్, మ్యాప్ రీడింగ్, సివిల్ డిఫెన్స్, విపత్తు నిర్వహణ , నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవా కార్యక్రమాలు , అలాగే దేశభక్తి , జాతీయ సమగ్రత వంటి అంశాలలో శిక్షణ . అదనంగా, ఆర్మీలో చేరడానికి అవసరమైన అవగాహన, ఇంటర్వ్యూ సంసిద్ధత, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టేలా ఈ శిక్షణ ద్వారా క్యాడెట్లను ఉత్తమ పౌరులుగా, భవిష్యత్ రక్షణ సిబ్బందిగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు, అంతర్గత నాణ్యతా వైస్ప్రిన్సిపాల్స్ డా. పరంగి రవి కుమార్, ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, తెలుగు శాఖ అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్ వివిధ విభాగాల అధ్యక్షులు డా. ఎ. మల్లేశం, డా. జ్యోత్స్న, శివరాణి, ఇతర అధ్యాపకులు సుధాకర్ ను హృదయపూర్వకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

6 hrs ago
user_Journalist pk
Journalist pk
Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
6 hrs ago
84e9c577-a531-40e1-888b-6148e347ebf6

ఆర్మీ లెఫ్టినెంట్ గా నల్గొండ ఎన్జీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ చిలుముల సుధాకర్ నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న చిలుముల సుధాకర్ , నేషనల్ కేడెట్ కార్ప్స్ (NCC) లో అసోసియేట్ NCC ఆఫీసర్ (ANO)గా సేవలందించేందుకు అర్హత సాధించి, లెఫ్టినెంట్ హోదాతో ఆర్మీ ఆఫీసర్ ర్యాంకును పొందడం జరిగింది. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఉన్న ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో జనవరి 5 నుండి ఏప్రిల్ 4 వరకు మూడు నెలలపాటు అత్యంత కఠినమైన సైనిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఆర్మీ శిక్షణలో భాగంగా ఫైరింగ్, వెపన్ హ్యాండ్లింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్, డ్రిల్, ఫిజికల్ ట్రైనింగ్, నాయకత్వ లక్షణాల అభివృద్ధి వంటి అంశాలలో సమగ్ర శిక్షణ పొందారు. అలాగే, NCC క్యాడెట్లను భారత సైన్యంలో చేరేందుకు ప్రోత్సహించడం, వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందించడం, సైనిక జీవన విధానం పట్ల అవగాహన కల్పించడం వంటి ముఖ్య అంశాలపై కూడా ప్రత్యేకంగా శిక్షణ పొందారు. శిక్షణ అనంతరం, చిలుముల సుధాకర్ లెఫ్టినెంట్ గా ఆర్మీ అధికారి గా నియామకం తో కళాశాలకు గర్వకారణంగా నిలిచారు. లెఫ్టినెంట్ ర్యాంక్ తో విద్యార్థులకు, NCC క్యాడెట్ లకు ప్రేరణగా నిలుస్తూ,

a668c57e-4f24-45e5-94ee-fe880d824521

NCC ద్వారా క్యాడెట్లను శారీరక దృఢత్వం , డ్రిల్ మరియు క్రమశిక్షణ , ఆయుధ వినియోగం, ఫైరింగ్ శిక్షణ (Weapon Training & Firing), ఫీల్డ్ క్రాఫ్ట్, మ్యాప్ రీడింగ్, సివిల్ డిఫెన్స్, విపత్తు నిర్వహణ , నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవా కార్యక్రమాలు , అలాగే దేశభక్తి , జాతీయ సమగ్రత వంటి అంశాలలో శిక్షణ . అదనంగా, ఆర్మీలో చేరడానికి అవసరమైన అవగాహన, ఇంటర్వ్యూ సంసిద్ధత, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టేలా ఈ శిక్షణ ద్వారా క్యాడెట్లను ఉత్తమ పౌరులుగా, భవిష్యత్ రక్షణ సిబ్బందిగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు, అంతర్గత నాణ్యతా వైస్ప్రిన్సిపాల్స్ డా. పరంగి రవి కుమార్, ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, తెలుగు శాఖ అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్ వివిధ విభాగాల అధ్యక్షులు డా. ఎ. మల్లేశం, డా. జ్యోత్స్న, శివరాణి, ఇతర అధ్యాపకులు సుధాకర్ ను హృదయపూర్వకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

More news from Telangana and nearby areas
  • నల్గొండ: నల్గొండ నుంచి దేవరకొండ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్లు వాహనదారులకు, పాదచారులకు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుంటారు. ఎండిన చెట్ల కొమ్మలు విరిగి పడతాయనే భయంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కతాల్ గూడ నుంచి నల్గొండ వైపు వెళ్లే మార్గంలో కూడా ఇలాంటి ఎండిన చెట్లు ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాడిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై పడితేనే.. పట్టించుకుంటారా..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    1
    నల్గొండ: నల్గొండ నుంచి దేవరకొండ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్లు వాహనదారులకు, పాదచారులకు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుంటారు. ఎండిన చెట్ల కొమ్మలు విరిగి పడతాయనే భయంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కతాల్ గూడ నుంచి నల్గొండ వైపు వెళ్లే మార్గంలో కూడా ఇలాంటి ఎండిన చెట్లు ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాడిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై పడితేనే.. పట్టించుకుంటారా..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    8 hrs ago
  • నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో *సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం..* ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి... మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణం వైద్యరంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్ష... లాభాపేక్ష కాకుండా మానవతా దృక్పథంతో సేవలు అందించాలి... పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలి... డబ్బు కోసం కాకుండా మనశ్శాంతి కోసం వైద్యం చేయాలి.. అంటూ డాక్టర్లకు సూచన... అత్యాధునిక సదుపాయాలతో ఆస్పత్రి ఏర్పాటుపై హర్షం వ్యక్తం... అత్యవసర వైద్యం 24 గంటలు హాస్పిటల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి... గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సేవలు విస్తరించాలి... ప్రభుత్వం కూడా వైద్య రంగ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుంది... కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
    1
    నల్లగొండ బ్రేకింగ్:
నల్లగొండ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో *సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం..*
ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...
మంత్రి మాట్లాడుతూ..
నల్లగొండ పట్టణం వైద్యరంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్ష...
లాభాపేక్ష కాకుండా మానవతా దృక్పథంతో సేవలు అందించాలి...
పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలి...
డబ్బు కోసం కాకుండా మనశ్శాంతి కోసం వైద్యం చేయాలి.. అంటూ డాక్టర్లకు సూచన...
అత్యాధునిక సదుపాయాలతో ఆస్పత్రి ఏర్పాటుపై హర్షం వ్యక్తం...
అత్యవసర వైద్యం 24 గంటలు హాస్పిటల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి...
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సేవలు విస్తరించాలి...
ప్రభుత్వం కూడా వైద్య రంగ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుంది...
కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    22 hrs ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    2 hrs ago
  • ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలంటూ కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా టెలికాం కమిటీ సమావేశంలో అండర్గ్రౌండ్ కేబుల్స్ రక్షణ కోసం ‘కాల్ బిఫోర్ యు డిగ్’ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించారు. టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పెండింగ్ అనుమతులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. టవర్ అనుమతులు, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.
    1
    ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలంటూ కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా టెలికాం కమిటీ సమావేశంలో అండర్గ్రౌండ్ కేబుల్స్ రక్షణ కోసం ‘కాల్ బిఫోర్ యు డిగ్’ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించారు. టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పెండింగ్ అనుమతులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. టవర్ అనుమతులు, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను లోబరుచుకుని, అత్యాచారం చేసిన నిందితుణ్ణి మహబూబాబాద్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. టౌన్ పోలీసుల కథనం ప్రకారం…నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన నిందితుడు చిలుకబత్తిని రంజిత్, S/o వెంకన్న, 19 సం,,లు, వృత్తి:డెకరేషన్ వర్క్, అనే యువకుడు, 15 సం,,ల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. గత సోమవారం మహబూబాబాద్ కు వచ్చిన బాలికను తన బైక్ పై ఎక్కించుకుని వెళ్ళిపోయినాడు. ఈ విషయమై బాలిక తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితున్ని అదుపులోకి తీసుకుని, అతనిపై కిడ్నాప్ మరియు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించినామని టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.*
    1
    ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను లోబరుచుకుని, అత్యాచారం చేసిన నిందితుణ్ణి మహబూబాబాద్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. టౌన్ పోలీసుల కథనం ప్రకారం…నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన నిందితుడు చిలుకబత్తిని రంజిత్, S/o వెంకన్న, 19 సం,,లు, వృత్తి:డెకరేషన్ వర్క్, అనే యువకుడు, 15 సం,,ల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. గత సోమవారం మహబూబాబాద్ కు వచ్చిన బాలికను తన బైక్ పై ఎక్కించుకుని వెళ్ళిపోయినాడు. ఈ విషయమై బాలిక తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితున్ని అదుపులోకి తీసుకుని, అతనిపై కిడ్నాప్ మరియు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించినామని టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.*
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిమ్మి రెడ్డి, నెంటూరి కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ పాండవుల బాలరాజ్ ముదిరాజ్, మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో చైతన్యం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, వెంకట్ ముదిరాజ్, భాస్కర్ యాదవ్, హరీష్ గౌడ్, పెద్దోళ్ళ బాలయ్య, ఏముల రాములు, పొట్ట మల్లేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దాసరి వెంకటేష్, చిత్ర ఆర్ట్స్ నర్సింలు. పొట్ట రాజు చేబర్తి వెంకటేష్ పొట్ట కరుణాకర్ పాపయ్య, తిమ్మకపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.అలాగే శ్రీగిరిపల్లి గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
    4
    సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిమ్మి రెడ్డి, నెంటూరి కుమార్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ పాండవుల బాలరాజ్ ముదిరాజ్, మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో చైతన్యం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, వెంకట్ ముదిరాజ్, భాస్కర్ యాదవ్, హరీష్ గౌడ్, పెద్దోళ్ళ బాలయ్య, ఏముల రాములు, పొట్ట మల్లేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దాసరి వెంకటేష్, చిత్ర ఆర్ట్స్ నర్సింలు. పొట్ట రాజు చేబర్తి వెంకటేష్ పొట్ట కరుణాకర్ పాపయ్య, తిమ్మకపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.అలాగే శ్రీగిరిపల్లి గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    21 hrs ago
  • పీఎం సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు సూర్యాంధ్ర ప్ర‌గ‌తి శ‌క‌టాల ద్వారా విస్తృత ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో పలు గృహాలపై అమర్చిన సౌర విద్యుత్ ఫలకాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పరిశీలించారు.
    1
    పీఎం సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు సూర్యాంధ్ర ప్ర‌గ‌తి శ‌క‌టాల ద్వారా విస్తృత ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో పలు గృహాలపై అమర్చిన సౌర విద్యుత్ ఫలకాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పరిశీలించారు.
    user_Narasimha Rao Senior Journalist Damala
    Narasimha Rao Senior Journalist Damala
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Post by Tagore
    3
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.