పంచాంగ శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనమే మిన్న తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం కమలానగర్ ఆఫీస్ ప్రాంగణంలో ప్రకృతి పండగ ఉగాది సందర్భంగా "పంచాంగ శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం మిన్న" కార్యక్రమం జరిగింది. స్ఫూర్తి గ్రూపు బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. అధ్యక్షులు గొడుగు యాదగిరి రావు మాట్లాడుతూ తెలుగువారి ముంగిట వసంతకాలం సందర్భంగా ఉగాది పండుగను ప్రజలందరూ జరుపుకుంటారు. దానికి మత ప్రక్రియలు అంటగట్టి పంచాంగం పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించడం నిరంతరాయంగా జరుగుతున్నది. భారత రాజ్యాంగం ఏర్పరచుకొని మనుషులందరూ ఒక్కటే అని చెప్పింది. మూఢనమ్మకాలకు అతీతంగా ప్రజలు జీవించాలని రాజ్యాంగం బోధించింది. అశాస్త్రీయమైన మూఢనమ్మకాలను విడనాడాలని కోరారు. జయరాజు మాట్లాడుతూ మతతత్వాన్ని దాంట్లో భాగమైన కులతత్వాన్ని పెంచి పోషించే మనువాదాన్ని పక్కన పెట్టాలని కోరారు. పంచాంగం ప్రజలకు ఎంతో హాని చేస్తుందని అన్నారు. భారత రాజ్యాంగం ప్రజల అభ్యున్నతికి పాటుపడే గొప్ప సాధనమని అన్నారు. అందరం రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలని దాన్ని ఆచరణలో పెట్టాలని కోరారు. పూలే స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ వ్యవస్థాపకులు కే మల్లేశం మాట్లాడుతూ ప్రజలలో మూఢనమ్మకాలను నేటి ప్రభుత్వం పెంచి పోషిస్తున్నదని దాని ఫలితంగా ప్రజలలో మూఢనమ్మకాలు ప్రబలిపోతున్నాయని అన్నారు. శాస్త్రీయ దృక్పథం ఆలవాటు చేయడం కొరకు అందరూ గట్టిగా కృషి చేయాలని కోరారు. అభ్యుదయవాదులు కమ్యూనిస్టులు మరింతగా కృషి చేసి మూఢనమ్మకాలను పారదోలాలని చెప్పారు. భారత రాజ్యాంగం ఇచ్చిన రక్షణను నిలబెట్టుకోవాలని కోరారు. అనంతరం ఎం భాస్కర్ రావు, అనురాధ, శారద, చల్లా లీలావతి, యాదగిరి, గద్దల నరసింహారావు, శ్రీమన్నారాయణ, కొమ్ముల మల్లేశం, గోవింద్, ఎం శ్రీనివాసరావు, జి శ్రీనివాసులు, కృష్ణమాచార్యులు ప్రసంగించారు. చివరగా కోమటి రవి మాట్లాడుతూ వేల సంవత్సరాలపాటు మనువాదం రాజ్యమైలిందని అన్నారు. అంతరాలతో కూడిన వ్యవస్థ ప్రజలను చిన్నభిన్నం చేసిందని చెప్పారు. భారత రాజ్యాంగం బాబా సాహెబ్ అంబేద్కర్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలందరూ సమానంగా చూడటం చట్టబద్ధం చేశారు. అలాగే మానవులందరూ ఒక్కటేనని అన్ని అవకాశాలు వారికి ఉండాలని రూపొందించారు. అయితే నేడు దానిని పూర్తిగా తుడిచివేసి అంతరాలతో కూడిన మనువాదాన్ని తీసుకురావాలని కుట్ర చేస్తున్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియను సర్ పద్ధతి ద్వారా కోట్ల ఓట్లు తీసివేస్తున్నారు. పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని నీరు కారుస్తున్నారు అని అన్నారు. ప్రజల సమిష్టిగా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సభ్యులందరికీ చేత రాజ్యాంగ పీఠికను సీనియర్ నాయకులు శ్రీమన్నారాయణ ప్రతిజ్ఞ రూపంగా అందరితో చేయించారు. మనువాదం నశించాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలని అందరూ నినాదాలు చేశారు. ప్రకృతి పండుగకు జేజేలు పలికారు. తెలుగువారు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నవతెలంగాణ రవి అద్భుతమైన పాటతో ఉత్తేజాన్ని ఇచ్చారు.అనంతరం స్ఫూర్తి గ్రూపు నాయకురాలు తయారు చేసుకుని వచ్చిన ఉగాది పచ్చడిని అందరూ సేవించారు. ఈ కార్యక్రమంలో హెచ్ వి స్వామి, పార్థసారథి, చంద్రశేఖర్, నారాయణరావు, లక్ష్మయ్య, కోమటి రవి, ఎం భాస్కర్ రావు, గద్దల సుబ్బారావు, గోవింద్, యాదగిరి, కొమ్ముల మల్లేశం, శారద, లీలావతి, అనురాధ, జయరాజు, శ్రీమన్నారాయణ, కర్రె మల్లేశం, నవతెలంగాణ రవి, శ్రీనివాసరావు, శ్రీనివాస్, కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

- Anwarul Uloom College, Mallepally Hyderabad Ki Yaadgaar Shaam | Nawab Shah Alam Khan Memorial 9th All India Mushaira 2026 | Dil Ko Chhoo Lene Wali Shayari #HyderabadMushaira #NawabShahAlamKhan #AllIndiaMushaira #Mushaira2026 #Hyderabad #MushairaLive #UrduShayari #ShayariLovers #AdabiMehfil #HyderabadCulture #PoetryEvent #LiveMushaira #IndianPoets #EmotionalShayari #TrendingMushaira #ViralVideo #YouTubeIndia #ShortsViral #ReelsIndia #Hindustan1
- ఈనెల 20 నుండి సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు1
- Post by Tagore1
- కౌడిపల్లి నివాసిస్తుడు రెడ్డి నర్సింహులు అయినా పూరి గుడిసె నిప్పు అంటుకొని మొత్తం గుడిసె దగ్ధం అయిపోయింది. అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన వచ్చి మంటలు చిల్లరేగకుండా ఆపివేయడం జరిగింది. అయినప్పటికీ పూరి గుడిసె మొత్తం దగ్ధమైపోయింది.2
- వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్పర్సన్ గడ్డం అనన్య అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి వైస్ చైర్పర్సన్ అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 14 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా పురపాలక సంఘ పరిధిలో ఎక్కడ కూడా నీటి సరఫరా సమస్యలు లేకుండా చూడాలని వీధి దీపాల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను సరిగా చేయాలని అధికారులకు ఆదేశించారు.1
- ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను అందజేత పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకం తెచ్చామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట రైతు వేదికలో శనివారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 88 మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.*సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు* ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు గాను ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందనిమెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. శనివారం చిన్న శంకరంపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 88 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రోహిత్ రావు అందజేశారు. అలాగే నార్సింగ్ మండలం కళ్యాణ లక్ష్మి చెక్కులు20, చిన్నశంకరంపేట మండలంకు సీఎంఆర్ ఎఫ్ చెక్కులు 50 మందికి, నార్సింగి మండలంకు చెందిన 20 కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇల్లు లేని పేదవాడికి ఇల్లు నిర్మించుకునే విధంగా కృషి చేస్తుందని అన్నారు. అర్హత కలిగిన వారికి ఎవరికైనా ఇల్లు రానిక రాలేక పోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విడుతల వారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేసేందుకు గాను ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పేదలకు సొంతింటి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే రోహిత్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.1
- లోక రక్షకుడు యేసుక్రీస్తు పునరుత్థాన సందేశాన్ని చాటి చెబుతూ మెదక్ లో 'రన్ ఫర్ జీసస్' 2026 ర్యాలీ ని సిఎస్ఐ సంఘం ఆద్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ప్రార్థన చేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ చర్చ్ నుంచి పట్టణ పుర వీధుల గుండా సాగింది. ర్యాలీ లో యువతి, యువకులు, చిన్నారులు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం నినాదాలు చేస్తూ యేసు క్రీస్తు పాటలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య మాట్లాడుతూ ఈస్టర్ పండుగకు ముందు వచ్చే మహా శనివారం రోజు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం రన్ ఫర్ జీసస్ ర్యాలీ జరుపుతారని అన్నారు. ఈ ర్యాలీ ప్రతి సంవత్సరం సీఎస్ఐ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న, పెద్ద తేడా లేకుండా లోక రక్షకుడి తిరిగి రాకడ కోసం చేసుకోనున్న ర్యాలీ గా చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంట సంపత్, చర్చ్ కమిటీ సభ్యులు, గురువులు పాల్గొన్నారు.1
- Post by Tagore3