Shuru
Apke Nagar Ki App…
అనంతారం దేవాలయంలో ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ దేవి .... భూదేవి సమేత శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి దేవాలయ..21 వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 5 వ తేది నుంచి 10 వ తేది వరకుఆలయ నిర్వాహకులు వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో పుణ్యహావచనం, రక్షాబంధనం,ధ్వజారోహణం, నిత్య పూర్ణాహుతి బలిహరణ, శ్రీ పద్మావతి భూదేవి సమేత శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి కళ్యాణం,108 కలుశముల అభిషేకం, చక్రస్నానం, వసంతోత్సవాలు వేలాది భక్తుల సందడి నడుమ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు నుంచి కాక నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Mogulagani Mahendar Mogulagani Mahendar
అనంతారం దేవాలయంలో ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ దేవి .... భూదేవి సమేత శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి దేవాలయ..21 వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 5 వ తేది నుంచి 10 వ తేది వరకుఆలయ నిర్వాహకులు వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో పుణ్యహావచనం, రక్షాబంధనం,ధ్వజారోహణం, నిత్య పూర్ణాహుతి బలిహరణ, శ్రీ పద్మావతి భూదేవి సమేత శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి కళ్యాణం,108 కలుశముల అభిషేకం, చక్రస్నానం, వసంతోత్సవాలు వేలాది భక్తుల సందడి నడుమ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు నుంచి కాక నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- మహబూబాబాద్ జిల్లా::: కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ వనదేవత ఉత్సవాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఉన్న భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. జాతరలో భాగంగా మొదటి రోజు అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా భక్తులు తెల్లవారుజాము నుంచే పవిత్ర స్నానాలు ఆచరించి, కొత్త కుండలలో నైవేద్యాన్ని వండి, వేపాకులతో అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, మంగళహారతుల మధ్య అడవి మార్గమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది.1
- shining glitter lamination photo frame acrylic photo frames LED photo frames Digital Art photo frames mug print, pillow print, tshirts print, Readymade gifts, LED lighting boards, Steel letters birthday gifts, marriage gifts, Anniversary gifts...1
- వరంగల్ జిల్లా.దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభ బండ్లను నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. జాతర సందర్భాన్ని పురస్కరించుకుని గులాబీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో పార్టీ శక్తిని మరింత బలోపేతం చేయాలని, ప్రతి గ్రామంలో కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జాతర వేళ ప్రభ బండ్ల ద్వారా ప్రజల్లో ఉత్సాహం నింపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ, నియోజకవర్గ యూత్ కన్వీనర్, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, క్లస్టర్ బాధ్యులు, మండల నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.7
- .వరంగల్ జిల్లా గీసిగొండ మండలంలోని శ్రీ కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం జాతర సందర్భంగా ప్రభ బండ్లు ఘనంగా వెళ్లాయి. పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభ బండ్ల ఊరేగింపు భక్తిశ్రద్ధలతో సాగగా, జాతర ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.1
- మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహామూద్‌పట్నం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందించాల్సిన మెనూను పాటించకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. KGBV స్పెషల్ ఆఫీసర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమంపై రాజీ ఉండదని స్పష్టం చేసిన కలెక్టర్, పాఠశాలల నిర్వహణలో ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.1
- జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గణితశాస్త్రం పేపర్–IIA, వృక్షశాస్త్రం పేపర్–II, రాజకీయ శాస్త్రం పేపర్–II పరీక్షలు జిల్లాలోని 37 కేంద్రాల్లో నిర్వహించబడ్డాయి. మొత్తం 8,805 మంది విద్యార్థులకు గాను 8,584 మంది హాజరై, 221 మంది గైర్హాజరయ్యారు. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.1
- కొండ సుస్మిత పటేల్ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మంగళవారం రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం కొమ్మల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద కొండ సుస్మిత పటేల్ మాట్లాడుతూ తన రాజకీయ జీవితం ఇక్కడి నుంచే మొదలు పెట్టబోతున్నట్లు చేసిన సంచలనం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బుధవారం రోజు ఉదయం 10:30 నుంచి కొండా సుస్మిత పటేల్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి తాను కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తానని ప్రజలకు సేవ చేస్తానని అనడం కోసమెరుపు9
- భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ దేవి .... భూదేవి సమేత శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి దేవాలయ..21 వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 5 వ తేది నుంచి 10 వ తేది వరకుఆలయ నిర్వాహకులు వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో పుణ్యహావచనం, రక్షాబంధనం,ధ్వజారోహణం, నిత్య పూర్ణాహుతి బలిహరణ, శ్రీ పద్మావతి భూదేవి సమేత శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి కళ్యాణం,108 కలుశముల అభిషేకం, చక్రస్నానం, వసంతోత్సవాలు వేలాది భక్తుల సందడి నడుమ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు నుంచి కాక నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.1