Shuru
Apke Nagar Ki App…
యాగర్లపల్లి ఏలూరు కాలువలో 4 ఏళ్ల బాలుడు గల్లంతు - ముమ్మరంగా గాలింపు చర్యలు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయిన బాలుడు కోసం ముమ్మరంగా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టుతున్నారు లభ్యం కానీ బాలుడు ఆచూకీ ఈ ఉదయం 6:30 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టి గాలింపు చర్యలు చేపట్టడమైనది. బాలుడు సజీవంగా దొరుకుతాడని ఎంతో ఆశతో తల్లిదండ్రులు కన్నీటితో ఎదురుచూస్తున్నారు.
అయితం ప్రసాద్
యాగర్లపల్లి ఏలూరు కాలువలో 4 ఏళ్ల బాలుడు గల్లంతు - ముమ్మరంగా గాలింపు చర్యలు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయిన బాలుడు కోసం ముమ్మరంగా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టుతున్నారు లభ్యం కానీ బాలుడు ఆచూకీ ఈ ఉదయం 6:30 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టి గాలింపు చర్యలు చేపట్టడమైనది. బాలుడు సజీవంగా దొరుకుతాడని ఎంతో ఆశతో తల్లిదండ్రులు కన్నీటితో ఎదురుచూస్తున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తొలి దశలో 25 లేబర్ అడ్డాలను ఏర్పాటు ,.రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ మరో 200 లేబర్ అడ్డాలు రాష్ట్రంలో ఏర్పాటుకు అవకాశం తాడేపల్లిగూడెం , గణేష్ నగర్ లో రూ.26లక్షలు ఏర్పాటు చేస్తున్న లేబర్ అడ్డా పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే, తాడేపల్లిగూడెంలో ఎక్కువ మంది కార్మికులు ఉండటంతో ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాపీ, వడ్రంగి, ప్లంబర్, ఎలక్ట్రికల్ కార్మికులంతా ఒక్క చోటకు చేరుకునే ప్రాంతమే లేబర్ అడ్డా అని పేర్కొన్నారు. లేబర్ అడ్డా ముఖ్యోద్దేశాన్ని లేబర్ కమిషనర్, ఇతర అధికారులు రూపొందించడం జరిగిందన్నారు. తమిళనాడులో ముందుగా 50 లేబర్ అడ్డాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లేబర్ అడ్డా నమూనాకు సీఎం చంద్రబాబు రూపకల్పన చేశారన్నారు. మరో 200 లేబర్ అడ్డాలు రాష్ట్రంలో ఏర్పాటుకు అవకాశం కల్పించారన్నారు. లేబర్ అడ్డాలలో ఒక కంప్యూటర్ ఆపరేటర్, కోఆర్డినేటర్, ముగ్గురు వాచ్ మెన్ , వ్యాను, డ్రైవర్, స్వీపర్ ఉంటారన్నారు. లేబర్ అడ్డాకు సంబంధించి ప్రత్యేకమైన యాప్ రూపొందించినట్లు తెలిపారు. ప్రజలు తమ అవసరాలకు యాప్ ద్వారా కార్మికులను వినియోగించుకోవచ్చన్నారు. లేబర్ అడ్డా ప్రారంభానికి ముందుగానే విధివిధానాలు త్వరలో తెలియజేస్తామన్నారు. సీఎం సమక్షంలో జరిగే సమీక్ష సమావేశంలో విషయాలను వెల్లడిస్తారన్నారు. రాజమహేంద్రవరం, మంగళగిరిలో లేబర్ అడ్డాలు సిద్ధమయ్యాయని బాబ్జీ వివరించారు. సీఎం అపాయింట్ మెంట్ రాగానే 25 లేబర్ అడ్డాలను ప్రారంభిస్తామన్నారు. ప్రధానంగా లేబర్ అడ్డాలలో రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాలు, కార్మికుల గుర్తింపు కార్డు నవీకరణ, నైపుణ్య శిక్షణ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడును స్పూర్తిగా తీసుకొని మిగిలిన రాష్ట్రాల్లో లేబర్ అడ్డాలు ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారన్నారు. లేబర్ అడ్డాల ద్వారా తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలు మన రాష్ట్రం అమలుకు ఏపీబీవోసీడబ్ల్యూడబ్ల్యూ బోర్డు, కార్మిక శాఖ మంత్రి సుభాష్, కమిషనర్, సెక్రటరీ తరపున కృషి చేస్తామన్నారు. ఇక్కడ మంచి స్థలం సమకూర్చిన తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక శాఖ అధికారి గోపి కుమార్, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, బ్రాహ్మణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్లు కృష్ణమోహన్, పద్మనాభుని మురళి, టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, లీల, వాసు, పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.2
- పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పెంకుల్లపాడు టిడ్ కో గృహాల సముదాయంలో వినాయక వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు.1
- ZPHS గొల్లవిల్లి లో విద్యార్థులు కి డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి అని అవగాహన సదస్సు గొల్లవిల్లి: విద్యార్థులు మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏరియా హాస్పిటల్ అమలాపురం డి-అడిక్షన్ సెంటర్, ఈగల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధులు సూచించారు. గొల్లవిల్లి జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి కొనుగోలు, విక్రయం, వినియోగం, సరఫరా వల్ల కలిగే నష్టాలు, NDPS చట్టం, సంబంధిత సెక్షన్లు, శిక్షలు, ఆపరేషన్ సేఫ్ జోన్, సైబర్ క్రైమ్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే డి-అడిక్షన్ సెంటర్ అందించే చికిత్స, కౌన్సెలింగ్ మరియు పునరావాస సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ కోఆర్డినేటర్ శ్రీనుబాబు, ఈగల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది రఘు, సత్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు G. కనకదుర్గ, ఉపాధ్యాయులు PET ఫణి తదితరులు పాల్గొన్నారు.1
- చింతలపూడి లోభారీ వర్షానికి నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు. చింతలపూడి లో నిన్న కురిసిన భారీ వర్షానికి మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. స్థానిక బైపాస్ రోడ్డు నుంచి పెద్ద చెరువు ప్రక్కన రియల్ ఎస్టేట్ ఫామ్ కు వేసిన విద్యుత్ స్తంభాలు. స్తంభాలు వేసేటప్పుడు బేస్ కాంక్రీట్ వేయని కాంట్రాక్టర్. దీనితో స్తంభాలు నెలకొరిగాయని స్థానికుల కథనం.1
- ఎన్టీఆర్ కాలనీలో అదరగొట్టిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీలు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కేవలం మూడు రోజుల్లో నేర్చుకున్న నృత్యాలను ప్రదర్శించి.. మేమేమీ తక్కువ కాదు అంటూ ఆటపాటలతో అలరించారు. విద్యార్థినీల నృత్యాలను చూసిన స్థానికులు చప్పట్లతో వారిని అభినందిస్తూ ఉత్సాహపరిచారు. విద్యార్థినీల ప్రతిభకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు స్థానిక ఉపాధ్యాయుడు నరసింహారావు విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహిస్తున్నారు. చదువుతో పాటు ఆటపాటలు.. ప్రతిభకు ప్రోత్సాహం అనే విధంగా ప్రభుత్వ పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్న నరసింహారావు ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.3
- వైసీపీ నాయకుల గోబెల్స్ ప్రచారం నమ్మే స్థితిలో ప్రజలు లేరు-శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సోమవారం మార్కాపురం పట్టణంలోని 10,11, 12 వార్డులలో తెలుగుదేశం నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో ప్రజలను అడిగి సమస్యలు ఏమున్నాయో అని వాకాబు చేసి అప్పటికప్పుడు కొన్ని సమస్యలకు పరిష్కారం చూపారు. వార్డుల్లో అప్పటికప్పుడు 15 th ఫైనాన్స్ నిధులు మరియు hybrid annuity model (HAM) నిధులతో కొన్ని సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ 10, 11,12 వ వార్డుల్లో పర్యటించానని ఈ సందర్భంగా ప్రజలు మార్కాపురం ప్రత్యేక జిల్లాతో తమ ఆస్తుల విలువ కొన్ని రేట్లు పెరిగాయని, వెలుగొండ ప్రాజెక్టు నుండి నీటి విడుదలతో తామంతా సంతోషంగా ఉన్నామని సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని ప్రజలు తెలిపారు అని అన్నారు.పోయిన వైసీపీ పాలనలో ఈ క్షణం ఏం జరుగుతుందో తెలియక వైసిపి పాలనలో దౌర్జన్యాలు, ఆస్తులు లాక్కోవడం, నిరుద్యోగ యువతకు మొండి చేయి, అప్పుల ఊభి లోకి వైసీపీ పాలకులు రాష్ట్రాన్ని నెట్టారు అని ఇప్పుడు ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు. వైసీపీ నాయకుల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు, ఆయా వార్డు తెలుగుదేశం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.1
- కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె ఆర్డీవోకి వినతిపత్రం ఇచ్చిన వీఆర్ఏ సంఘాలు తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం డివిజన్ లోని ఐదు మండలాల వీఆర్ఏలు సమ్మె నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ గోపాలకృష్ణ మాట్లాడుతూ నెలకు రూ.10వేల జీతంతో కుటుంబాన్ని పోషించడం గగనంగా మారుతుందన్నారు. ఎన్నో ఏళ్లుగా వీఆర్ఏలుగా పనిచేస్తున్నామని, అర్హులైన వారికి వీఆర్వోలుగా ప్రమోషన్, నామినీలకు ఉద్యోగావకాశం కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు పే స్కేల్ మాదిరిగా అదే విధంగా మాకు కూడా పే స్కేల్ ఇవ్వాలని కోరారు. ఆర్డిఓ మన్నే సూర్యరావు కి వీఆర్ఏల సంఘం వినతి పత్రాన్ని అందజేశారు. వీఆర్ఏ సంఘ ఐదు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు , మండలాల వారి వీఆర్ఏలు పాల్గొన్నారు.3
- పంటలు ఎండిపోతున్నాయని నీళ్లను అడిగినందుకు గల్లా పట్టుకుని రైతును ఈడ్చుకుని వెళ్తున్న పోలీసులు!1