Shuru
Apke Nagar Ki App…
చింతలపూడి లోభారీ వర్షానికి నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు. చింతలపూడి లో నిన్న కురిసిన భారీ వర్షానికి మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. స్థానిక బైపాస్ రోడ్డు నుంచి పెద్ద చెరువు ప్రక్కన రియల్ ఎస్టేట్ ఫామ్ కు వేసిన విద్యుత్ స్తంభాలు. స్తంభాలు వేసేటప్పుడు బేస్ కాంక్రీట్ వేయని కాంట్రాక్టర్. దీనితో స్తంభాలు నెలకొరిగాయని స్థానికుల కథనం.
Mogaparthi.Devakrupavaram
చింతలపూడి లోభారీ వర్షానికి నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు. చింతలపూడి లో నిన్న కురిసిన భారీ వర్షానికి మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. స్థానిక బైపాస్ రోడ్డు నుంచి పెద్ద చెరువు ప్రక్కన రియల్ ఎస్టేట్ ఫామ్ కు వేసిన విద్యుత్ స్తంభాలు. స్తంభాలు వేసేటప్పుడు బేస్ కాంక్రీట్ వేయని కాంట్రాక్టర్. దీనితో స్తంభాలు నెలకొరిగాయని స్థానికుల కథనం.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- చింతలపూడి లోభారీ వర్షానికి నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు. చింతలపూడి లో నిన్న కురిసిన భారీ వర్షానికి మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. స్థానిక బైపాస్ రోడ్డు నుంచి పెద్ద చెరువు ప్రక్కన రియల్ ఎస్టేట్ ఫామ్ కు వేసిన విద్యుత్ స్తంభాలు. స్తంభాలు వేసేటప్పుడు బేస్ కాంక్రీట్ వేయని కాంట్రాక్టర్. దీనితో స్తంభాలు నెలకొరిగాయని స్థానికుల కథనం.1
- పెనుబల్లి మండలం లో గంగదేవిపాడు గ్రామంలో సరైన వర్షాలు లేకపోవడం వలన రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులు మర్రికుంట చెరువులో నీరు లేక ఎండిపోయిన పరిస్థితి పంట పొలాలకు సరైన నీరు లేక ఆవేదన చెందుతున్న రైతులు ఆవేదన.. పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా లో గల గంగదేవిపాడు గ్రామంలో గల రైతుల పంట పొలాలకు పంట పొలాల మీద ఆధారపడే రైతులు ఈ సంవత్సరం మరికుంట చెరువు లో సరైన నీరు చేరక సరేనా వర్షాలు లేకపోవడం వలన చెరువు చుట్టూ ప్రక్కల ఉన్న రైతులు ఈ సంవత్సరము పంటలు పండుతాయో లేదో అన్న ఆందోళనతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు ప్రభుత్వమే ఆదుకొని వారికి సహాయం అందించాలని రైతులు ఆవేదన చెందుతున్నారు...4
- మారెళ్లపాడు లిఫ్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు •ఈ నెల 23 న మంత్రుల చేతుల మీదగా ప్రారంభోత్సవం •16,180 ఎకరాలకు సాగునీరు.. •తీరనున్న దశాబ్దాల రైతుల కల •ఎమ్మెల్యే పాయం ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవం లో పాల్గొననున్న మంత్రి తుమ్మల •ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు: మణుగూరు, అశ్వాపురం మండలాల రైతుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది. గోదావరి జలాలను ఆయకట్టుకు తరలించే మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. . స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు పాల్గొనున్నారు..రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఇప్పటికే ట్రయల్‌రన్ విజయవంతం కావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వరప్రదాయినిగా మారెళ్లపాడు సీతారామ ప్రాజెక్టుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా సీతారామ ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి ఆయకట్టుకు అందించేలా ఈ పథకాన్ని చేపట్టారు. మణుగూరు, అశ్వాపురం మండలాల్లోని సుమారు 16,180 ఎకరాలకు సాగునీరు అందనుంది. పథకంలో భాగంగా హెడ్‌వర్క్స్‌కు రూ.25 కోట్లు, కాలువల నిర్మాణానికి రూ.113.17 కోట్లు, భూసేకరణకు రూ.42.30 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రూ.25 కోట్లతో పంప్‌హౌస్ మెఘా ఇంజినీరింగ్ సంస్థ రూ.25 కోట్లతో పంప్‌హౌస్ నిర్మాణాన్ని చేపట్టగా, పనులు దాదాపు పూర్తయ్యాయి. 1.80 మెగావాట్ల సామర్థ్యం గల రెండు మోటార్ల ద్వారా 46 మీటర్ల ఎత్తు నుంచి 85 మీటర్ల ఎత్తు వరకు, అంటే సుమారు 39 మీటర్ల మేర 180 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. పంప్‌హౌస్ నుంచి 2.4 కి.మీ. దూరంలో కొండ కింద డెలివరీ సిస్టర్న్‌ను నిర్మించారు. అక్కడి నుంచి నీరు కాలువల్లోకి చేరుతుంది. కాలువలు.. ఆయకట్టు వివరాలు సిస్టర్న్ నుంచి 10.070 కి.మీ. మేర రెండు ప్రధాన కాలువలు నిర్మించాల్సి ఉంది. 9.650 కి.మీ. పొడవైన కుడి కాలువ ద్వారా 11,915 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 420 మీటర్ల ఎడమ కాలువ ద్వారా తుమ్మల చెరువు నిండనుండగా, దాని కింద ఇప్పటికే ఉన్న 4,266 ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ కానుంది. మొత్తం 16,180 ఎకరాల్లో సుమారు 11 వేల ఎకరాలు కొత్త ఆయకట్టు కావడం విశేషం. తొలిదశలో 7 వేల ఎకరాలు ప్రధాన కాలువ పనులు ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయి. అందుకే తొలిదశలో లిఫ్ట్ ద్వారా తుమ్మల చెరువుకు నీటిని తరలించి, ఆ చెరువు కింద 5 వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. మరో 2 వేల ఎకరాలకు కూడా నీరందుతుంది. కాలువ పనులు పూర్తయితే మొత్తం 16,180 ఎకరాలకు నీరు అందుతుంది. తొమ్మిది గ్రామాలు, పది చెరువులకు లబ్ధి ఈ పథకం ద్వారా తొమ్మిది గ్రామాలు, పది చెరువులకు ప్రయోజనం చేకూరనుంది. అమెర్దాలో 1,877, అమ్మగారిపల్లిలో 958, అశ్వాపురంలో 2,474, గొందిగూడెంలో 8, కేశవాపురంలో 23, కుమ్మరిగూడెంలో 90, నెల్లిపాకలో 4,281 ఎకరాలకు సాగునీరు అందనుంది. మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ ప్రాజెక్టు ప్రతిపాదనల దశ నుంచి పనుల పురోగతి వరకు మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ చూపారు. పనుల పరిశీలనకు ఇప్పటివరకు అనేక సార్లు ప్రాజెక్టు వద్దకు వచ్చారు. అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఆయన చొరవతో పనులు వేగంగా పూర్తయి ట్రయల్‌రన్ సఫలమైంది. ఎమ్మెల్యే పాయం పర్యవేక్షణ మంత్రి సూచనల మేరకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పనులను నిరంతరం పర్యవేక్షించారు. దాదాపు 20 రోజుల పాటు రేయింబవళ్లు ప్రాజెక్టు వద్దే ఉండి, ఎదురైన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. దీంతో నిర్దేశిత గడువులోగా ట్రయల్‌రన్ పూర్తయింది. రైతన్నల్లో హర్షం గోదావరి జలాలు కాలువల్లోకి చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలతో బీడు భూములు పచ్చని పొలాలుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు1
- వైసీపీ బూతుల బ్రాండ్ అంబాసిడర్.. బెజవాడ 60వ డివిజన్ ప్రెసిడెంట్ గారి లీలలు పేరు: షేక్ ఫాతిమా పదవి: వైసీపీ విజయవాడ 60వ డివిజన్ అధ్యక్షురాలు, పార్టీ స్థాయికి తగ్గ అర్హత ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్: భర్తపై పోలీస్ స్టేషన్లలో కేసులు.. పిల్లల చదువులు, ఉద్యోగాలంటూ పబ్లిక్ లో హైడ్రామా మంచితనానికి, సంస్కారానికి వైసీపీలో తావు లేదనడానికి ఈ మేడమే లేటెస్ట్ ఉదాహరణ. పదవి రావాలంటే మినిమమ్ బూతుల బ్యాక్ గ్రౌండ్ ఉండాలనే పార్టీ రూల్‌ను అక్షరాలా పాటిస్తూ రోడ్డెక్కిన ఈ లేడీ లీడర్ అసలు చరిత్రేంటో ఈ వీడియో చూసి మీరే డిసైడ్ చేయండి. మరి ఇలాంటి ఘనత వహించిన నాయకులను భుజాన వేసుకుంటున్న ఆ పార్టీ తీరు చూస్తుంటే నవాబుల కాలం నాటి రౌడీ రాజ్యాంలాగే ఉందిగా.1
- ఎస్సీ ఎస్టీల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య భరోసా భద్రాచలంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు *ఎస్సీ, ఎస్టీల సమస్యలపై బక్కి వెంకటయ్య భరోసా* *సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు సారపాకలో ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్న ఎస్సీ, ఎస్టీ సమీక్ష సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన తొలుత భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సారపాకలోని అవినాశ్ రెసిడెన్సీ అధినేత పాటి అశోక్ ఆహ్వానం మేరకు అక్కడికి చేరుకున్న బక్కి వెంకటయ్యను ఎస్సీ, ఎస్టీ యువత కలుసుకుని తమ సమస్యలను వివరించారు. వారి సమస్యలను సావధానంగా విన్న ఆయన, పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. తదుపరి ఐటీసీ అతిథి గృహానికి చేరుకున్న కమిషన్ చైర్మన్‌ను సారపాక ఎస్టీ కాలనీ, మోతే పట్టి నగర్, చింతకుంట గ్రామాలకు చెందిన పెద్దలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను వివరిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు. ఆయా ప్రాంతాల ప్రజలు తమకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని బక్కి వెంకటయ్యను కోరారు. ప్రజల వినతులపై స్పందించిన బక్కి వెంకటయ్య మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తానని హామీ ఇచ్చారు.2
- రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తొలి దశలో 25 లేబర్ అడ్డాలను ఏర్పాటు ,.రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ మరో 200 లేబర్ అడ్డాలు రాష్ట్రంలో ఏర్పాటుకు అవకాశం తాడేపల్లిగూడెం , గణేష్ నగర్ లో రూ.26లక్షలు ఏర్పాటు చేస్తున్న లేబర్ అడ్డా పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే, తాడేపల్లిగూడెంలో ఎక్కువ మంది కార్మికులు ఉండటంతో ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాపీ, వడ్రంగి, ప్లంబర్, ఎలక్ట్రికల్ కార్మికులంతా ఒక్క చోటకు చేరుకునే ప్రాంతమే లేబర్ అడ్డా అని పేర్కొన్నారు. లేబర్ అడ్డా ముఖ్యోద్దేశాన్ని లేబర్ కమిషనర్, ఇతర అధికారులు రూపొందించడం జరిగిందన్నారు. తమిళనాడులో ముందుగా 50 లేబర్ అడ్డాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లేబర్ అడ్డా నమూనాకు సీఎం చంద్రబాబు రూపకల్పన చేశారన్నారు. మరో 200 లేబర్ అడ్డాలు రాష్ట్రంలో ఏర్పాటుకు అవకాశం కల్పించారన్నారు. లేబర్ అడ్డాలలో ఒక కంప్యూటర్ ఆపరేటర్, కోఆర్డినేటర్, ముగ్గురు వాచ్ మెన్ , వ్యాను, డ్రైవర్, స్వీపర్ ఉంటారన్నారు. లేబర్ అడ్డాకు సంబంధించి ప్రత్యేకమైన యాప్ రూపొందించినట్లు తెలిపారు. ప్రజలు తమ అవసరాలకు యాప్ ద్వారా కార్మికులను వినియోగించుకోవచ్చన్నారు. లేబర్ అడ్డా ప్రారంభానికి ముందుగానే విధివిధానాలు త్వరలో తెలియజేస్తామన్నారు. సీఎం సమక్షంలో జరిగే సమీక్ష సమావేశంలో విషయాలను వెల్లడిస్తారన్నారు. రాజమహేంద్రవరం, మంగళగిరిలో లేబర్ అడ్డాలు సిద్ధమయ్యాయని బాబ్జీ వివరించారు. సీఎం అపాయింట్ మెంట్ రాగానే 25 లేబర్ అడ్డాలను ప్రారంభిస్తామన్నారు. ప్రధానంగా లేబర్ అడ్డాలలో రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాలు, కార్మికుల గుర్తింపు కార్డు నవీకరణ, నైపుణ్య శిక్షణ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడును స్పూర్తిగా తీసుకొని మిగిలిన రాష్ట్రాల్లో లేబర్ అడ్డాలు ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారన్నారు. లేబర్ అడ్డాల ద్వారా తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలు మన రాష్ట్రం అమలుకు ఏపీబీవోసీడబ్ల్యూడబ్ల్యూ బోర్డు, కార్మిక శాఖ మంత్రి సుభాష్, కమిషనర్, సెక్రటరీ తరపున కృషి చేస్తామన్నారు. ఇక్కడ మంచి స్థలం సమకూర్చిన తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక శాఖ అధికారి గోపి కుమార్, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, బ్రాహ్మణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్లు కృష్ణమోహన్, పద్మనాభుని మురళి, టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, లీల, వాసు, పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.2
- ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి చర్లలో పోస్టర్ ఆవిష్కరణ.. రైతులు, మహిళలకు ఏఐకేఎంఎస్ నాయకుల పిలుపు చర్ల, సెప్టెంబర్ 21: ఖమ్మంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) 4వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం డివిజన్ నాయకులు మట్ట నరసింహారావు పిలుపునిచ్చారు. మహాసభల ప్రచారంలో భాగంగా చర్ల మండల కేంద్రంలో రైతులు, మహిళలతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మట్ట నరసింహారావు మాట్లాడుతూ రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. మొక్కజొన్నకు క్వింటాకు రూ.3,000, పత్తికి క్వింటాకు రూ.15,000 ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. మహాసభలకు రైతులు, కూలీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఖమ్మంలో సెప్టెంబర్ 28న భారీ బహిరంగ సభ, 29, 30 తేదీల్లో ఏఐకేఎంఎస్ 4వ జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు తాజా స్థానిక వార్తా నివేదికలు కూడా పేర్కొంటున్నాయి. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు కుంజ జోగారావు, సంతపూరి సురేష్, గొంది మూయన్న, కొండస్వామి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.1
- గుంతకల్లులో దోపిడీ దొంగల బీభత్సం ఇంట్లో ఉన్న వివాహితను బెదిరించి 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు అపహరణ వివాహిత నివేదితపై కారం చల్లి కత్తులతో బెదిరించిన దుండగులు గుంతకల్లు పట్టణంలోని ఏబీ ఫంక్షన్ హాలు ఏరియాలో ఘటన1