ములుగు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్లు.. -- సమస్యల సాధన కోసం తన వంతు సహకారం అందిస్తానని ఎస్పీ హామీ ములుగు :ములుగు జిల్లా పోలీసు అధికారి సుధీర్ రాంనాథ్ కేకన్ ను బుధవారం మున్సిపల్ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిసారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో మాస్టర్ ప్లాన్ పనుల అమలు, జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా శాంతియుతంగా భక్తులు దర్శించుకునేలా సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను ఎస్పీని శాలువాతో సన్మానించి స్వీట్లు అందించారు. ఈ సందర్భంగా ములుగులో శాంతి భద్రతలు, ప్రజలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమస్యలను కౌన్సిలర్లు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎస్పీ సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళా కౌన్సిలర్లు అందరినీ అభినందించి సమస్యల సాధనలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గండ్రకోట వాణి కుమార్, బైకాని సునీత ఓదెలు, రేసోజు పద్మ వేణుగోపాలచారి, బైకానీ అనూష సాగర్, కోయిల లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ములుగు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్లు.. -- సమస్యల సాధన కోసం తన వంతు సహకారం అందిస్తానని ఎస్పీ హామీ ములుగు :ములుగు జిల్లా పోలీసు అధికారి సుధీర్ రాంనాథ్ కేకన్ ను బుధవారం మున్సిపల్ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిసారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో మాస్టర్ ప్లాన్ పనుల అమలు, జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా శాంతియుతంగా భక్తులు దర్శించుకునేలా సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను ఎస్పీని శాలువాతో సన్మానించి స్వీట్లు అందించారు. ఈ సందర్భంగా ములుగులో శాంతి భద్రతలు, ప్రజలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమస్యలను కౌన్సిలర్లు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎస్పీ సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళా కౌన్సిలర్లు అందరినీ అభినందించి సమస్యల సాధనలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గండ్రకోట వాణి కుమార్, బైకాని సునీత ఓదెలు, రేసోజు పద్మ వేణుగోపాలచారి, బైకానీ అనూష సాగర్, కోయిల లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
- వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శ్రీకాంత్‌పై అత్యాచారం కేసు నమోదైంది. కరీంనగర్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఆయన, 2025లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మహిళతో చాటింగ్ కొనసాగించాడు. ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకుని ఇటీవల వరంగల్‌కు వచ్చి లొకేషన్ తీసుకుని ఇంటికి వెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలి ఫిర్యాదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వరి కోసి పొలం నుండి వడ్లు జార గోడుతుండగా ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ రోడ్డు క్రిందకు పొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ సీట్లో ఉన్న యువరైతు కాటం కిషన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జెసిబి సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పంట చేతికందిన సమయంలో సంతోషించాల్సిన రైతు, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.2
- మరిపెడ మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్షా సమావేశంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో నిర్వహించిన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' మండల సబలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత గంజాయి మరియు ఇతర డ్రగ్స్ బారిన పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ స్థాయిలో సర్పంచులు, కౌన్సిలర్లు డ్రగ్స్ వినియోగంపై నిఘా ఉంచాలని, యువతకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఇప్పటికే డీ-అడిక్షన్ సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక, ఫోటో క్యాప్చర్ లేదా పేమెంట్ల విషయంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడినట్లు తేలితే పంచాయతీ సెక్రటరీలైనా, ఏఈలైనా తక్షణమే సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. "ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే అది పంచాయతీ సెక్రటరీ లేదా ఏఈ అయినా సరే ఇమ్మీడియట్‌గా సస్పెండ్ చేస్తాం. ఇది పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకం. ఇందులో ఎవరూ అనవసరంగా హైలైట్ కావద్దు (అవినీతికి పాల్పడొద్దు) అని అన్నారు." ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ ఏఈలు, సర్పంచులు మరియు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.1
- హుస్నాబాద్ సబ్ స్టేషన్ సమీపంలో కరీంనగర్ రహదారి పై ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.500 రూపాయల ట్యూషన్ ఫీజు కడితేనే హల్ టిక్కెట్లు ఇస్తానని కళాశాల ప్రిన్సిపాల్ బెదిరించినట్లు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకొని హాల్ టిక్కెట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు.ఆందోళన చేస్తున్న విద్యార్థులకు పోలీసులు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు.1
- lగన్నేరువరం: మండలం మైలారం గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈనెల 23న జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి రావాలి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ప్రజలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హిందువులందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.1
- బెజ్జంకి మండలంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల సభ గురువారం ముగిసింది. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ గేయాన్ని ఆలపించగా, అనంతరం మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, భువన చేయూత, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల అమలు తీరును అధికారులు వివరించారు. గ్రామ స్థాయిలో సమస్యలు, పరిష్కారాలపై సర్పంచులు, అధికారులు చర్చించారు. అంగన్వాడి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి భావన నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- Post by Solanke Ravi4
- వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పర్వతగిరి మండలం రావూరుకు చెందిన దామెర శ్రీనివాస్(34) అక్కడికక్కడే మృతి చెందాడు. కొత్తూరులోని మీసేవా కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆయన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్‌కు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉండగా, ఆయన అకాల మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.1