logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆకట్టుకున్న విదేశీ యువకుల హరినామ సంకీర్తన నరసన్నపేట: నరసన్నపేట పట్టణంలో కూర్మ ఆశ్రమ ఆధ్వర్యంలో విదేశీ యువకులు గురువారం సాయంత్రం చేపట్టిన హరినామ సంకీర్తన ర్యాలీ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. మండల పరిషత్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పాత బస్టాండ్, కొత్త బస్టాండు, కాంప్లెక్స్ మీదుగా పెద్దపేట వరకు కొనసాగింది. అనంతరం స్థానిక కళ్యాణ మండపంలో భగవద్గీత ప్రసంగం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

12 hrs ago
user_Dr.Gangu Manmadharao
Dr.Gangu Manmadharao
జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
12 hrs ago

ఆకట్టుకున్న విదేశీ యువకుల హరినామ సంకీర్తన నరసన్నపేట: నరసన్నపేట పట్టణంలో కూర్మ ఆశ్రమ ఆధ్వర్యంలో విదేశీ యువకులు గురువారం సాయంత్రం చేపట్టిన హరినామ సంకీర్తన ర్యాలీ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. మండల పరిషత్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పాత బస్టాండ్, కొత్త బస్టాండు, కాంప్లెక్స్ మీదుగా పెద్దపేట వరకు కొనసాగింది. అనంతరం స్థానిక కళ్యాణ మండపంలో భగవద్గీత ప్రసంగం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఖాదర్ షా దర్బార్ లో.. రంజాన్ తొలి ఇఫ్తార్ విందు.. విజయనగరం: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం బాబామెట్ట హజరత్ ఖాదర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్ లో ముతవల్లి డాక్టర్ ముహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ(ఖలీల్ బాబు) ఆధ్వర్యంలో తొలి ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ప్రేమ, త్యాగం, ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక, మానవత్వానికి ప్రతీకగా పవిత్ర రంజాన్ పర్వదినాలను గురువారం నుంచి ముప్పై రోజుల పాటు ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠోరమైన ఉపవాస దీక్షలను ఆచరించడం రంజాన్ లో గల ఆధ్యాత్మిక విశిష్టత. సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్షను వీడిన దీక్షాదారులకు పోషక విలువలతో కూడని పసందైన ఆహారంతో ఇఫ్తార్ విందు ను ఖలీల్ బాబు అందిస్తూ వస్తున్నారు. ప్రతీ ఏటా ఖాదర్ బాబా దర్గార్ షరీఫ్ లో జరిగే ఈ ఇఫ్తార్ విందులో అధిక సంఖ్యలో ఉపవాస దీక్షకులు పాల్గొని ఇఫ్తార్ ను స్వీకరిస్తూ ఉంటారు.
    1
    ఖాదర్ షా దర్బార్ లో..
రంజాన్ తొలి ఇఫ్తార్ విందు..
విజయనగరం: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని 
గురువారం సాయంత్రం బాబామెట్ట హజరత్ ఖాదర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్ లో ముతవల్లి డాక్టర్ ముహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ(ఖలీల్ బాబు) ఆధ్వర్యంలో తొలి ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ప్రేమ, త్యాగం, ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక, మానవత్వానికి ప్రతీకగా పవిత్ర రంజాన్ పర్వదినాలను గురువారం నుంచి ముప్పై రోజుల పాటు ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠోరమైన ఉపవాస దీక్షలను ఆచరించడం రంజాన్ లో గల ఆధ్యాత్మిక విశిష్టత. సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్షను వీడిన దీక్షాదారులకు  పోషక విలువలతో కూడని పసందైన ఆహారంతో ఇఫ్తార్ విందు ను ఖలీల్ బాబు అందిస్తూ వస్తున్నారు. ప్రతీ ఏటా ఖాదర్ బాబా దర్గార్ షరీఫ్ లో జరిగే ఈ ఇఫ్తార్ విందులో అధిక సంఖ్యలో ఉపవాస దీక్షకులు పాల్గొని ఇఫ్తార్ ను స్వీకరిస్తూ ఉంటారు.
    user_Giridhar singh
    Giridhar singh
    రిపోర్టర్ విజయనగరం విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • దేవీపట్నం మండలంలో ఆశ్రమ పాఠశాలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జి రెడ్డి పరిశీలించారు. గురువారం దామనపల్లి ఆశ్రమ స్కూల్, శరభవరం గిరిజన సంక్షేమ పాఠశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న బోధన పద్ధుతులు, మధ్యాహ్న భోజన పథకం వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవసరమైన వసతులు కల్పించాలని ఆయన సూచించారు. పాఠశాల రిజిస్టర్‌లు పరిశీలించారు.
    1
    దేవీపట్నం మండలంలో ఆశ్రమ పాఠశాలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జి రెడ్డి పరిశీలించారు. గురువారం దామనపల్లి ఆశ్రమ స్కూల్, శరభవరం గిరిజన సంక్షేమ పాఠశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న బోధన పద్ధుతులు, మధ్యాహ్న భోజన పథకం వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవసరమైన వసతులు కల్పించాలని ఆయన సూచించారు. పాఠశాల రిజిస్టర్‌లు పరిశీలించారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • మూడు పూటలా అన్నం కోసం మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏
    1
    మూడు పూటలా అన్నం కోసం మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    2 hrs ago
  • Post by Srinivas Y
    1
    Post by Srinivas Y
    user_Srinivas Y
    Srinivas Y
    జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • రాయవరం మండలం కూర్మాపురంలో పట్టుబడిన పెద్దపులిని పాపికొండల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. పట్టుకున్న అనంతరం తొలుత విశాఖ జూకు తరలించి, ఆరోగ్యం కుదుటపడ్డాక దాని సహజసిద్ధ నివాసమైన అడవిలోకి విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన అప్పటి డ్రోన్ వీడియోను అధికారులు తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చర్కర్లు కొడుతుంది.
    1
    రాయవరం మండలం కూర్మాపురంలో పట్టుబడిన పెద్దపులిని పాపికొండల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. పట్టుకున్న అనంతరం తొలుత విశాఖ జూకు తరలించి, ఆరోగ్యం కుదుటపడ్డాక దాని సహజసిద్ధ నివాసమైన అడవిలోకి విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన అప్పటి డ్రోన్ వీడియోను అధికారులు తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చర్కర్లు కొడుతుంది.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • అముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ అసెంబ్లీలో పలు కీలక ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ శాఖలలో ఉద్యోగుల సిబ్బంది కొరత, జీతభత్యాల సమస్యలను పరిష్కరించాలని కోరారు. మున్సిపాలిటీల పరిధిలోని చెరువుల పూడికతీత పనులు వేగవంతం చేయాలని, మైనర్ ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు.
    1
    అముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ అసెంబ్లీలో పలు కీలక ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ శాఖలలో ఉద్యోగుల సిబ్బంది కొరత, జీతభత్యాల సమస్యలను పరిష్కరించాలని కోరారు. మున్సిపాలిటీల పరిధిలోని చెరువుల పూడికతీత పనులు వేగవంతం చేయాలని, మైనర్ ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • *International Fleet Review &Milan -2026 "అంతర్జాతీయ నౌకాదళ సమీక్షలో "ఎంపీ కలిశెట్టి* రామకృష్ణ బీచ్, విశాఖపట్నం, తేది. 19.02.2026. ⭐ విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు గౌరవ అతిథిగా ఈరోజు విశాఖపట్నం రామకృష్ణ బీచ్ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ& మిలాన్-2006 నౌకదళ విన్యాసాలలో పాల్గొన్నారు. ⭐ గౌరవ ఎంపీ గారు IFR గురించి మాట్లాడుతూ గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్షకు విశాఖపట్నం రెండోసారి వేదిక కావడం, నిన్న గౌరవనీయులు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 70కి పైగా స్వదేశీ, విదేశీ యుద్దానౌకలను సమీక్షించడం మన దేశానికీ,రాష్ట్రానికి గర్వకారణం అని హర్షాన్ని వ్యక్తపరుస్తూ.......... ⭐ సుమారు 50కి పైగా దేశాల నౌకదళాలు పాల్గొన్న ఈ IFR-2026లో రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే వేదిక కావడం, అలాగే విదేశాలతో ద్వైపాక్షిక, బహుపాక్షిక బలోపేతం చేస్తూ సముద్ర భద్రత, విపత్తుల నిర్వహణపై ఉమ్మడి వ్యూహాలను రూపొందించే బహుళ- దేశ నౌకాదళ విన్యాసాలకు వేదిక మన విశాఖపట్నం కావటం అభినందనీయమని, ఈ కార్యక్రమం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క "మహాసాగర్" విజన్ ను సాకారం చేస్తుందని, ముఖ్యంగా "మేక్ ఇన్ ఇండియా " సామర్థ్యన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేడుకకు హాజరవ్వటం చాలా ఆనందాన్ని ఇచ్చిందని, ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ & నౌకాదళ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపిన విజయనగరం పార్లమెంటు సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు.
    1
    *International Fleet Review &Milan -2026 "అంతర్జాతీయ నౌకాదళ సమీక్షలో "ఎంపీ కలిశెట్టి* 
రామకృష్ణ బీచ్,
విశాఖపట్నం,
తేది. 19.02.2026.
⭐ విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు గౌరవ అతిథిగా ఈరోజు విశాఖపట్నం రామకృష్ణ బీచ్ వేదికగా  జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ& మిలాన్-2006 నౌకదళ విన్యాసాలలో  పాల్గొన్నారు.
⭐ గౌరవ ఎంపీ గారు IFR గురించి మాట్లాడుతూ గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్షకు విశాఖపట్నం రెండోసారి వేదిక కావడం, నిన్న గౌరవనీయులు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 70కి పైగా స్వదేశీ, విదేశీ యుద్దానౌకలను సమీక్షించడం మన దేశానికీ,రాష్ట్రానికి గర్వకారణం అని హర్షాన్ని వ్యక్తపరుస్తూ..........
⭐ సుమారు 50కి పైగా దేశాల నౌకదళాలు  పాల్గొన్న ఈ IFR-2026లో రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే వేదిక కావడం, అలాగే విదేశాలతో ద్వైపాక్షిక, బహుపాక్షిక బలోపేతం చేస్తూ సముద్ర భద్రత, విపత్తుల నిర్వహణపై ఉమ్మడి వ్యూహాలను  రూపొందించే బహుళ- దేశ నౌకాదళ విన్యాసాలకు వేదిక మన విశాఖపట్నం కావటం అభినందనీయమని, ఈ కార్యక్రమం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క "మహాసాగర్" విజన్ ను సాకారం చేస్తుందని, ముఖ్యంగా "మేక్ ఇన్ ఇండియా " సామర్థ్యన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేడుకకు హాజరవ్వటం చాలా ఆనందాన్ని ఇచ్చిందని, ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ & నౌకాదళ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని  తెలిపిన విజయనగరం పార్లమెంటు సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు.
    user_Giridhar singh
    Giridhar singh
    రిపోర్టర్ విజయనగరం విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • మహిళలు, పిల్లలపై జరుగుతున్న దాడులను అప్రమత్తంగా ఎదుర్కోవాలని పాడేరు ఏఎస్పీ అభిషేక్ సూచించారు. పాడేరులో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం సమాజంలో మహిళలు బాలికలపై దాడులు జరుగుతున్నాయని వాటితో పాటు సైబర్ నేరాలు అధికమయ్యాయని తెలిపారు. వాటన్నింటిని అవగాహనతోనే ఎదుర్కోవచ్చని తెలిపారు. మహిళలు , బాలలకు రక్షణ కల్పించి వారిని అన్ని రంగాల్లో రాణించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
    1
    మహిళలు, పిల్లలపై జరుగుతున్న దాడులను అప్రమత్తంగా ఎదుర్కోవాలని పాడేరు ఏఎస్పీ అభిషేక్ సూచించారు. పాడేరులో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం సమాజంలో మహిళలు బాలికలపై దాడులు జరుగుతున్నాయని వాటితో పాటు సైబర్ నేరాలు అధికమయ్యాయని తెలిపారు. వాటన్నింటిని అవగాహనతోనే ఎదుర్కోవచ్చని తెలిపారు. మహిళలు , బాలలకు రక్షణ కల్పించి వారిని అన్ని రంగాల్లో రాణించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.