తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఖరీఫ్ సీజన్‌లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే లక్ష్యంతో జూన్ 23న కోనరావుపేట రైతువేదికలో విత్తన మేళా నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు తెలిపారు. ఈ మేళాలో ప్రభుత్వం సూచించిన ఏడు సన్నరకాల నాణ్యమైన వరి విత్తనాలను అందుబాటులో ఉంచనున్నట్లు, రైతులు వాటిని ఒకే వేదికపై కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు విత్తనాల ఎంపిక, శాస్త్రీయ సాగు పద్ధతులు, పంట నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. నాణ్యమైన విత్తనాల వినియోగం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు ఈ మేళా ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు. మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధునిక వ్యవసాయ పద్ధతులపై తమ అవగాహనను పెంపొందించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు. నాణ్యమైన విత్తనాలను పొందడానికి ఈ విత్తన మేళాను రైతులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు మరోసారి సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఖరీఫ్ సీజన్‌లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే లక్ష్యంతో జూన్ 23న కోనరావుపేట రైతువేదికలో విత్తన మేళా నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు తెలిపారు. ఈ మేళాలో ప్రభుత్వం సూచించిన ఏడు సన్నరకాల నాణ్యమైన వరి విత్తనాలను అందుబాటులో ఉంచనున్నట్లు, రైతులు వాటిని ఒకే వేదికపై కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు విత్తనాల ఎంపిక, శాస్త్రీయ సాగు పద్ధతులు, పంట నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. నాణ్యమైన విత్తనాల వినియోగం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు ఈ మేళా ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు. మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధునిక వ్యవసాయ పద్ధతులపై తమ అవగాహనను పెంపొందించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు. నాణ్యమైన విత్తనాలను పొందడానికి ఈ విత్తన మేళాను రైతులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు మరోసారి సూచించారు.
- కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నాడు సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి, ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో వర్షం పడితే నీరు నిలిచిపోయి చెరువును తలపిస్తుందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో నాలుగు ఎస్జీటీ ఉపాధ్యాయ పోస్టులు, ఒక అటెండర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని, ఉన్నత పాఠశాలలో మూడు ఉపాధ్యాయ పోస్టులు, ఒక అటెండర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంతవరకు ఈ పోస్టులను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. విద్యార్థుల కోసం అదనంగా రెండు తరగతి గదులను నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న మరో రెండు గదులను ఆధునికరించాలని ఆయన కోరారు. అలాగే, పాఠశాలలకు సరిపడా మున్సిపల్ నీటిని సరఫరా చేయాలని, పనిచేయని పాత బోరుబావి స్థానంలో కొత్త బోరుబావిని వేసి విద్యార్థులకు తగిన నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరంగా క్లాస్ రూమ్‌లపైకి చేరిన పెద్ద చెట్లను వెంటనే తొలగించాలని, గాలి దుమారం వస్తే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాటు చేసిన రెండు రేకుల షెడ్లు విరిగిపోయి శిథిలావస్థకు చేరాయని, వాటిని ఆధునికరించాలని వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ బడుల్లో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే చదువుతున్నారని, వారికి కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను పేదలకు అందకుండా కుట్రలు చేస్తున్నాయని, తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్దేశించబడుతుందన్న స్ఫూర్తిని పాలకులు విస్మరిస్తున్నారని వాసుదేవరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ, చదువులు కొనుక్కునే పరిస్థితిని పాలకులు తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వాసుదేవరెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు పుల్లెల మల్లయ్య, డి. నరేష్, శ్రీకాంత్, సూర్య, అరవింద్, భాస్కర్, ఇస్సాక్, ఆకాష్, సన్నీ, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.3
- మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి మండలంలోని 76 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తొలి విడతలో మండలానికి మంజూరైన 526 ఇళ్లలో 76 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టకపోవడంతో, వారి స్థానంలో కొత్త అర్హులను ఎంపిక చేసి ఈ పత్రాలను అందజేసినట్లు తెలిపారు. అర్హులందరికీ గృహాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఆయన వెల్లడించారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించి, మండలవ్యాప్తంగా మరింత మంది అర్హులకు లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 'డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల' పేరుతో కాలయాపన జరిగిందని విమర్శించిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.4
- నిత్యజీవితంలోని ఉరుకుల పురుగుల నుంచి ఒక్కరోజు విరామం తీసుకుని, సదాశివనగర్ మండలం వజ్జేపల్లి తాండా ప్రజలంతా కలిసి సరదాగా గడపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో, గ్రామంలోని సుమారు 120 కుటుంబాల వారు తమ ఇళ్లకు తాళాలు వేసి, గ్రామ సమీపంలో ఉన్న పంట చేనులో సామూహిక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన ఈ వేడుక సాయంత్రం వరకు కొనసాగింది, వజ్జేపల్లి తాండా ప్రజలందరికీ ఈ సందడి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది.1
- కరీంనగర్‌లోని గాంధీ రోడ్డు ప్రాంతంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. నల్లమచ సుగుణమ్మ (82) అనే వృద్ధురాలు తన ఇంట్లోని చేదబావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. ఈ విషయాన్ని కుటుంబీకులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఫైర్ రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, అప్పటికే వృద్ధురాలు మృతిచెందడంతో, సిబ్బంది మృతదేహాన్ని వెలికితీసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని దారి మళ్లించి దోపిడీకి పాల్పడిన ముఠాలోని మరో సభ్యుడిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. 8 మంది సభ్యులు గల ఈ ముఠాలో ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేయగా, తాజాగా రుద్రంగి మండలం కేంద్రానికి చెందిన గడ్డం నర్సారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. గడ్డం నర్సారెడ్డి, అప్పారెల్ పార్క్ గోదాముల వద్ద పనిచేస్తున్న విజయ్‌కుమార్, గణేష్‌లతో కలిసి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డాడు. గోదాముల్లో నిల్వల లెక్కలు సరిగా గుర్తించడం కష్టమనే అవకాశాన్ని ఆసరాగా చేసుకుని, వాస్తవంగా వడ్లు పంపకుండానే రైతుల పేర్లతో నకిలీ ట్రక్ చిట్టీలను సృష్టించారు. ఆన్‌లైన్‌లో ధాన్యం గోదాములకు చేరినట్లు నమోదు చేశారు. జూన్ 5న 378 క్వింటాళ్లు, జూన్ 9న 316 క్వింటాళ్ల ధాన్యం పంపినట్లు నకిలీ ట్రక్ చిట్టీలు రూపొందించగా, రైతుల ఖాతాల్లో ప్రభుత్వ నిధులు జమయ్యాయి. అనంతరం రైతులను మభ్యపెట్టి నగదు వసూలు చేసి, అందులో కొంత మొత్తాన్ని సహనిందితులకు బదిలీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, తాజాగా అరెస్ట్ అయిన గడ్డం నర్సారెడ్డి వద్ద నుండి ₹4 లక్షల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు.1
- కరీంనగర్ జిల్లాలోని అల్గనూర్ వద్ద నిన్న జరిగిన బస్సు దగ్ధం ప్రమాదంలో, కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోకు చెందిన బస్సు డ్రైవర్ బోయిని ప్రశాంత్ తన ధైర్య సాహసాలను ప్రదర్శించి 40 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా దగ్ధమవుతున్న సమయంలో, ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును ఆపి, ప్రయాణికులందరినీ కిందకు దించడంతో దాదాపు 40 మంది ప్రాణాలు దక్కాయని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో డ్రైవర్ బోయిని ప్రశాంత్‌ను సన్మానించి అభినందించారు. వారు మాట్లాడుతూ, ప్రశాంత్ సమయస్ఫూర్తితో స్పందించడం వల్లే ఇంతమంది ప్రాణాలు కాపాడుకోగలిగామని అన్నారు. ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సులు బయలుదేరే ముందు అన్ని విధాలా తనిఖీలు చేసిన తర్వాతే బయటికి పంపాలని, బస్సు కాలిపోవడానికి గల కారణాలను విచారించి ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్సు ప్రమాదాలకు దారితీసిన కారణాలపై ప్రభుత్వం విచారణ జరిపి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా నివారించాలని, ఆర్టీసీ బస్సు ప్రమాదాలను అరికట్టాలని తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వాన్ని కోరుతోందని గుంజపడుగు హరిప్రసాద్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆదివాసీ విభాగం అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, జంగ అపర్ణ సాగర్, బాసావేణి రజేందర్, నూతి చరణ్, యండి హుస్సేన్, గర్షకుర్తి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.1
- తంగళ్ళపల్లిలోని సిరిసిల్ల తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆమె ఆదేశించారు. తనిఖీలో భాగంగా, కలెక్టర్ మొదట డైనింగ్ హాల్‌కు వెళ్లి భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు, వారికి వడ్డించిన ఆహార పదార్థాలపై ఆరా తీశారు. ఆమె మెనూ చార్ట్‌ను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిచెన్ గోదాంలో బియ్యం, పప్పులు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారనే విషయంపై కూడా ఆరా తీశారు. ఆ తర్వాత వసతి గదులు, టాయిలెట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని స్పష్టం చేశారు. విద్యార్థులందరూ తరగతులకు హాజరయ్యేలా చూడాలని సూచించడంతో పాటు, విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.1
- కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల 'విద్యా మాఫియా' దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్‌వీ నాయకులు జిల్లా విద్యాధికారి (డీఈఓ)కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రైవేట్ సంస్థలు నోట్‌బుక్స్, యూనిఫామ్స్, స్టేషనరీల పేరుతో పేదలను నిలువునా దోచుకుంటున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న డిఫెన్స్ అకాడమీలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రెండు రోజుల్లో అక్రమ పుస్తక నిల్వల పూర్తి వివరాలను డీఈఓకు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే, తెలంగాణ ఉద్యమ తరహాలో శాంతియుత పోరాటాలు చేస్తామని, అవసరమైతే విద్యాసంస్థలపై దాడులకూ వెనకాడబోమని అనిల్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోవడం బాధాకరమని కూడా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల ఫీజుల్లో 100% రాయితీ కల్పించాలని డీఈఓను విజ్ఞప్తి చేశారు. దీనిపై డీఈఓ స్పందిస్తూ, జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజు రాయితీ ఇస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని, వీటిని ఉల్లంఘించే పాఠశాలలపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్‌వీ నాయకులు మధుసూదన్ రెడ్డి, చుక్క శ్రీనివాస్, బొంకూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.3
- కరీంనగర్‌లోని సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ షాపు చోరీ కేసులో పోలీసులు తాజాగా మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. దీనితో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 8కి చేరిందని సీపీ గౌస్ ఆలం ప్రకటించారు. పీఎంజే జ్యువెలరీ షాప్‌లో నేరుగా చోరీకి పాల్పడి, కాల్పులు జరిపిన ఐదుగురిలో ఇప్పటికే ఇద్దరు అరెస్టవ్వగా, ఇప్పుడు మూడో వ్యక్తి సూర్యమణి @ సనోజ్ కుమార్ (21)ను పట్టుకున్నారు. నిందితులకు కారు సమకూర్చి, తుపాకులను సరఫరా చేసిన బీహార్‌కు చెందిన ఎం.డి. ఆదిల్ ఖాన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బీహార్ జైల్లో ఉన్న ఆదిల్ ఖాన్‌ను కరీంనగర్‌కు తరలించేందుకు ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి పిస్టల్, మ్యాగజైన్, ఒక బైక్, దోపిడీ రోజు వారు ధరించిన ఐదు జతల బట్టలు, మూడు జతల బూట్లు, మూడు నకిలీ ఆర్‌సీ కార్డులు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అరెస్టయిన ఐదుగురు నిందితులు - A1 సుబోధ్ సింగ్, A2 రఘునాథ్, A3 రావిష్, A10 అమర్ సింగ్, A11 జైనుల్లాబ్దీన్‌లను కోర్టు అనుమతితో ఆరు రోజుల పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి కస్టడీ ఈ నెల 23న ముగుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. కస్టడీ విచారణలో నిందితుడు రఘునాథ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ నుంచి టీవీఎస్ అపాచీ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రామడుగు మండల శివారులోని ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్ వద్ద కీలక ఆధారాలను సేకరించారు. నేరం జరిగిన రోజు నిందితులు ధరించిన 5 జతల దుస్తులు, 3 జతల బూట్లు, మూడు నకిలీ టూ వీలర్ ఆర్‌సి కార్డులు, ఒక మొబైల్ ఫోన్, అక్కడ దాచిన ఒక పిస్టల్, ఒక మ్యాగజైన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. కాగా, ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఐదుగురిని త్వరలోనే పట్టుకుంటామని సీపీ గౌస్ ఆలం స్పష్టం చేశారు.4