Shuru
Apke Nagar Ki App…
కాలభైరవ స్వామి ముత్యాలమ్మ బోనాల సందర్భంగా మొక్కులు చెల్లించిన కాంగ్రెస్ నాయకులు జనగామ జిల్లా కొడకండ్ల మండలకేంద్రంలోని పురాతన కాలభైరవ స్వామి–ముత్యాలమ్మ ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ సర్పంచ్ దూలం మమత సతీష్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధారావత్ సురేష్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నం శ్రీనివాస్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు తదితరులు ఆలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా కాలభైరవ స్వామికి, ముత్యాలమ్మ అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని, అమ్మవారిని ప్రార్థించినట్లు నాయకులు తెలిపారు.
Shareef pasha
కాలభైరవ స్వామి ముత్యాలమ్మ బోనాల సందర్భంగా మొక్కులు చెల్లించిన కాంగ్రెస్ నాయకులు జనగామ జిల్లా కొడకండ్ల మండలకేంద్రంలోని పురాతన కాలభైరవ స్వామి–ముత్యాలమ్మ ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ సర్పంచ్ దూలం మమత సతీష్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధారావత్ సురేష్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నం శ్రీనివాస్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు తదితరులు ఆలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా కాలభైరవ స్వామికి, ముత్యాలమ్మ అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని, అమ్మవారిని ప్రార్థించినట్లు నాయకులు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- మహాదేవపూర్ బీఆర్‌ఎస్ మాజీ ఉపసర్పంచ్ సల్మాన్ ఖాన్ మృతి.. కన్నీటి వీడ్కోలు పలికిన నాయకులు, అభిమానులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మాజీ ఉపసర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకుడు సల్మాన్ ఖాన్ మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, స్థానిక నాయకుల్లో విషాదం నెలకొంది. మంథని నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుట్ట మధుకర్ సల్మాన్ ఖాన్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. సల్మాన్ ఖాన్ మృతి పార్టీకి, స్థానిక ప్రజలకు తీరని లోటని పుట్ట మధుకర్ పేర్కొన్నారు. అంతిమయాత్రలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు. గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.1
- జనగామ బస్టాండ్లో దొంగల హల్చల్ : ప్రయాణికుడి డబ్బు మాయం జిల్లా కేంద్రమైన జనగామ బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద 20 వేల 6 వందల నగదు అపహరణకు గురైంది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ సంఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేసిన ఫలితం లేకపోవడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- తెలంగాణ ఆర్టీసీ బస్సు లో 80 మంది మహిళలు ఇద్దరే పురుషులు కండక్టర్ వీడియో వైరల్ *బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్* మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు. #తెలంగాణా1
- బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- 4 కాళ్లు.. 4 చేతులతో శిశువు జననం, వైరల్ అవుతున్న వీడియో మధ్యప్రదేశ్‌లోని లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు. అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్‌లో జబల్‌పూర్‌కు తరలించారు.1
- ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఫ్రెష్ బస్) ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు బ్రేకింగ్ న్యూస్: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఫ్రెష్ బస్).. ఆరుగురు మృతి, 20 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా కోదాడ మండలం ద్వారకుంట వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ కోసం గాలిస్తున్న సూర్యాపేట జిల్లా పోలీసులు.1
- మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి1