Shuru
Apke Nagar Ki App…
దసరా ఉత్సవాలు కడియం
Shaik Abdul
దసరా ఉత్సవాలు కడియం
More news from Mandapeta and nearby areas
- 7 - 8 - 241
- మండపేట రైతు బజారు వద్ద ఉన్న శ్రీ విజయదుర్గా అమ్మవారి ఆలయం వద్ద దీపాలంకరణ ఉయ్యాల సేవ||M NEWS TELUGU1
- మా ఊరు మండపేట కధలు 45 మా కాలేజీ గ్రౌండ్. తెలతెల వారుతుండగా బంగారు సూర్యుడు పైకి లేస్తుండగా వేప పుల్లతోటో, కచిక బూడిద తోటో ప్రభల వారి ఎర్రపళ్ళపొడితోటో చేతి పంపులు దగ్గర పళ్ళు తోముకునే మొహాలు కడుక్కుని అమ్మమ్మో అమ్మ ఇచ్చే పాల గ్లాస్ కోసం ఎదురుచూస్తూ ఇచ్చిన పాలు గబగబా తాగేసి మా స్కూలు గ్రౌండ్ అక్కడే ఉందో ఎవరైనా పట్టుకుపోయారో చూసుకోవడానికి అందరూ పరిగెత్తుకు పోయేవారు. కొద్దిమంది ఉదయం సైకిల్ఉన్న వారు తొక్కుకుని గ్రౌండ్ కు పోగా మరి కొంతమంది నడుచుకుంటూ గ్రౌండ్ పోయేవారు. హై స్కూల్ గ్రౌండ్ లో ఉదయమే పరుగులు కబాడీ ఆటజరిగేవి. అదృష్టం బాగుంటే రెండు చెరుకు ముక్కలు కూడా తినేవాళ్ళం. 7:30 కల్లా ఇంటికి చేరుకొని చేతి పంపు దగ్గర, లేదా గిలకబావి గట్టుమీద దజ్జాగా స్నానాలు చేసేసి ఆవకాయ బద్ద పెరుగు చద్దన్నం తినేసి( ఇక్కడ భాషలో చద్దన్నం అంటే రాత్రి మిగిలిపోయిన అన్నం) పుస్తకాల సంచి తగిలించుకుని నిక్కర్లేసుకుని స్కూలుకు పరిగెత్తుకు పోయేవారు. మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో గ్రౌండ్లో ఆటలు, సాయంత్రం నాలుగు తర్వాత మళ్లీ గ్రౌండ్ లోకి పోయి పుస్తకాల సంచీలు ఒకచోట పెట్టుకొని విద్యార్థులు కథనరంగంలో దూకేవారు ఆటల కోసం. మా గ్రౌండ్ లో మూడు టీములు బాల్ బ్యాట్మెంటన్ ఆడుతుండగా, రెండు టీములు వాలీబాల్, మరో టీము పుడ్బాల్ ఆడేవాళ్ళం. కాలేజీ అన్నయ్యలు క్రికెట్ ఆడేవారు. ఓ మూల బాస్కెట్బాల్ కోర్టులో కొంతమంది బాస్కెట్బాల్ ప్రయత్నం చేసేవారు. సైకిళ్లు తొక్కుతూ కొంతమంది, ఏడు పెంకులాటతో కొంతమంది, నాపరాళ్ళ ముక్కలతో బచ్చాలాట మరి కొంతమంది, బాలుతో కొడితే వీపు సాపు అయ్యే జేబురు బాలు ఆట, కొన్ని గుంపులు కృష్ణ గురించి ఎన్టీఆర్ గురించి ఫైటింగులు డిస్కషన్ చేస్తూ గ్రౌండ్ అంతా కోలాహాలంగా ఉండేది. తలకి బొచ్చు తువ్వాలు బాగా చుట్టుకుని నిక్కరేసుకుని బలంగా ఉండి అభిమానంగా పలకరించే రాజు పుల్ల ఐసు సైకిల్ వేసుకొని వచ్చేవాడు .5 నయా పైసలకు ఒక అయిస్ అమ్ముతూ గ్రౌండ్ అంతా తిరిగేవాడు. ఎవరికి దాహం వేస్తే వాళ్ళ 5 పైసలు పెట్టి పుల్ల ఐస్ కొనుక్కొని ఈ ప్రపంచంతో సంబంధం లేదు ఆ ఐదు నిమిషాలు అన్నంత ఆనందంగా బతికే వాళ్ళం ఐస్ తింటూ. కాలేజీ గేటు దగ్గర గోవిందు కూల్ డ్రింకులు బండి మరో ప్రత్యేకత. ఐదు నయా పైసలకు కూల్డ్రింకు పది నయాబైస్తులకు సేమియా చేసి ఇచ్చేవాడు.గోవిందు డ్రింక్ ఒక అద్భుతం. కొంతమందికి హెల్పర్ గా ఉండడం బాగా ఇష్టంగా ఉండేది వాలీబాల్ ఫుట్బాల్ క్రికెట్ బాలు గాడి తప్పి గ్రౌండ్లో దూరంగా వచ్చినప్పుడు ఆటగాళ్లకు అందించడం ఆనందపడ్డాం అదో సరదాగా ఉండేది. మాలో కొంతమంది స్పెషలిస్టులు ఉండేవారు చెరుకు గడలు లాగడానికి ఏడిది నుంచి షుగర్ ఫ్యాక్టరీ కి వెళ్లే చెరుకు ట్రాక్టర్ నుంచి లారీల నుంచి గబగబా కొన్ని చెరుకు ముక్కలు లాగి కింద పాడవేయడంతో అవి భుజం మీద మోసుకొని వచ్చి గ్రౌండ్లో అందరం తినేవాళ్ళు. చెరుకు గడని నోటి పళ్ళు పెట్టి లాక్కొని ఆ ముక్కలు తింటే ఆ రసం ఆనందం వేరు ఆ తీపి మాధుర్యం ఒక అద్భుతం. ఎప్పుడైనా ఉన్నట్టుండి గాలి దుమ్ము వర్షం వచ్చినట్లయితే పరిగెత్తుకుని పోయి కెమిస్ట్రీ ల్యాబ్ లోకి దూరే వాళ్ళు. మా కాలేజీ గ్రౌండ్లో అప్పట్లో ట్యూబ్ లైట్ల లైటింగ్ తో పెద్ద వెలుగులో రాత్రి వాలీబాల్ కోర్టులో వాలీబాల్ ఆడేవారు. ఇక సెలవులు వస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రౌండ్ ఏ దిక్కు. ఏ పిల్లల కేరాఫ్ అడ్రస్ కావాల్సిన గ్రౌండ్లో దొరికేసేది. ఆటలు ఆడేటప్పుడు చొక్కాలు చిరిగిపోతాయని చొక్కాలు ముందుగానే తీసి బనీన్లు నిక్కర్లేసుకుని ఆడే రోజులు. కొంతమంది ప్రత్యేకించి పరుగు ప్రాక్టీస్ చేసేవారు. మంచినీళ్లు తాగాలంటే పైపులో కొట్టుకుని చేతులతో తాగేసి వాళ్ళము. కావలసినంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. క్వార్టర్లీ ఆఫ్ ఇయర్లీ పరీక్షలు సమయంలో పరీక్షలకు ముందు చిన్న వంతెన దగ్గర ఉన్న గానుగ చెట్టు కింద కూర్చుని ఉండేవారు. గానుగ పువ్వు నెత్తి మీద పడితే ఉన్న పరీక్ష ఊడిపోతుంది అని ఒక గొప్ప నమ్మకం ఉండేది. అందుకే తెలివిగా గానుగపువ్వు నెత్తి మీద పడకుండా అట్ట నెత్తి మీద పెట్టుకొని పరిగెత్తుకు పోయే వాళ్ళం. అయినా పువ్వు నెత్తి మీద పడేది పరీక్ష పోయేది. బహుమతిగా లెంపకాయలు వచ్చేవి. చదవలేదు అనే ఆలోచన కన్నా గానుగ పువ్వు నెత్తి మీద పడింది అందుకనే పరీక్ష పోయిందని నమ్మకం ఎక్కువ ఉండేది. మాకు గ్రౌండ్లో దెయ్యం భయం కూడా ఉండేది.రాత్రి 8 గంటలయితే గ్రౌండ్ వెనకాల వైపు కి ఎవరూ వెళ్లేవాళ్ళం కాదు. కానీ ఎప్పుడూ దెయ్యాన్ని మేము చూడకపోయినా భయం వేస్తూనే ఉండేది. నేను కూడా అప్పుడు దెయ్యాన్ని చూడలేదు చూసి ఉంటే ఈ కథ రాయడానికి ఉండేవాడిని కాదు. బ్యాట్మెంటన్ లో నారాయణ, సూపర్ నారాయణ, పనామా, హనుమాన్ బ్యాట్లు వాడేవాళ్ళం ఈ బ్యాట్ కి నెట్ అల్లడం ప్రత్యేకత కళ. తేడాగా నెట్ అల్లితే బ్యాట్ వంకర పోయేది. ఉన్న కొంతమంది విద్యార్థుల దగ్గర సైకిల్ హీరో, ఎవన్, రాయల్ బ్రాండ్ మాత్రం ఉండేవి. ఈరోజున ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసి, దేశ విదేశాల్లో అత్యుత్తమైన ఉద్యోగాల్లో ఉండి రిటైర్ అయ్యి, ఇప్పటికీ ఉన్నత ఉద్యోగాలు చేస్తూ వ్యాపారవేత్తలుగా బహుముఖ ప్రజ్ఞాశాలుగా, కవులుగా, రచయితలుగా, ప్రభుత్వ అధికారులుగా, వైద్యులుగా ప్రొవిషనల్స్ గా, సినిమా రంగాల్లోనూ అన్ని రంగాల్లోనూ ఉన్న వేలాది మంది మన కాలేజీ గ్రౌండ్లో ఎటువంటి అరమరికులు లేకుండా చిన్నదో పెద్దదో ఏదో ఆట ఆడిన వాళ్ళే. మన మండపేట హై స్కూల్ గ్రౌండ్ తో విడదీయలేని మమతా అనురాగాలు పంచుకున్నవారే . మన హై స్కూల్ గ్రౌండ్ చూసినప్పుడల్లా ఆనాటి విషయాలు గుర్తొస్తూనే ఉంటాయి. మర్చిపోదాం అని ప్రయత్నం చేసిన మరువలేని మధుర క్షణాలు మన మండపేట హై స్కూల్ గ్రౌండ్ ఆనాటి ఆటలు. మీరు ఎక్కడెక్కడ ఉన్నా ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్న మండపేట వచ్చినప్పుడు మన హై స్కూల్ గ్రౌండ్ ని మరిచిపోకండి. " మనబడి మన స్కూల్ గ్రౌండ్ పిలుస్తోంది రండి" ..........Bnsnmurthy.1
- 🙏🌺దుర్గమ్మ పడిపూజ రావులపాలెం 🙏🌺 please subscribe 🥰1
- Vodiy peravali1
- దసరా 4వారోజు కొవ్వూరు వారహిఅమ్మ అభిషేకం 🙏🙏1
- ఆలమూరు గ్రామ దేవత శ్రీ పల్లాలమ్మ తల్లి🙏💐1
- భక్తయోగ పడన్యాసి వారణాసి/జూ. DV సుబ్బారావు/KV పద్మావతి/చాగల్లు ప్రోగ్రాము1
- రంగంపేట గ్రామంలో, 20 సంవత్సరాలుగా రకరకాల సంస్కృతిక కార్యక్రమాలతో, ఘనత దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు.1