నన్నయ యూనివర్సిటీలో 5వ రోజుకు చేరిన అవుట్‌సోర్సింగ్ సిబ్బంది నిరసన దీక్ష నన్నయ యూనివర్సిటీలో 5వ రోజుకు చేరిన అవుట్‌సోర్సింగ్ సిబ్బంది నిరసన దీక్ష టెండర్ నోటీసు రద్దు చేయాలి.. అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలి రాజానగరం, ఆగస్టు 10: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో నాన్‌టీచింగ్ అవుట్‌సోర్సింగ్ సిబ్బంది చేపట్టిన నిరసన దీక్షలు సోమవారం ఐదో రోజుకు చేరాయి. విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో సిబ్బంది తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరసన కొనసాగించారు. గత 20 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని సిబ్బంది డిమాండ్ చేశారు. ఇటీవల జారీ చేసిన టెండర్ నోటీసును వెంటనే రద్దు చేయాలని, ఏళ్ల తరబడి అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని కోరారు. తమ సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి చర్చలు జరిపి పరిష్కారం చూపాలని అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఐదు రోజులుగా నిరసన కొనసాగుతున్నప్పటికీ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన స్పందన లేకపోవడంతో సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రధాన డిమాండ్లు పరిష్కరించే వరకు నిరసన దీక్షలను కొనసాగిస్తామని నాన్‌టీచింగ్ అవుట్‌సోర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు. దీక్షకు వివిధ ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నాగారపు విజయబాబు, జనరల్ సెక్రటరీ వై. వీరభద్ర చౌదరి, వర్కింగ్ ప్రెసిడెంట్ పి. శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ వి.వి. రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

- వర్షాలు కురవాలని ముసలి కి పూజలు చేసినా పూజారి.......! గద్వాల జిల్లా బీచుపల్లిలో కృష్ణానది ఒడ్డుకు కొట్టుకొచ్చిన మొసలికి పురోహితుడు పూజలు చేసిన వీడియో వైరల్‌గా మారింది. మొసలిని వరుణదేవుడి వాహనంగా భావించి వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజలు చేసినట్లు పూజారి అనిల్‌శర్మ తెలిపారు. పూజల అనంతరం మొసలిని తిరిగి నదిలో విడిచిపెట్టారు.1
- చార్మినార్ సమీపంలో ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన వ్యక్తిని ఓ యువతి ధైర్యంగా ఎదుర్కొని అక్కడి నుంచి తరిమికొట్టింది. ఘటనను తన మొబైల్‌లో రికార్డ్ చేసిన ఆమె, ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ధక్కా మార్ కే లే జావో అబ్!” అంటూ ఆ యువతి నిందితుడిని గట్టిగా నిలదీసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.1
- 2025 డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐ విచారణ జరపాలి: వైసీపీ 2025 డీఎస్సీ నియామక ప్రక్రియలో జరుగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్య లింగం డిమాండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ శ్రేణులతో సోమవారం అరకులోయ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు నుండి స్ధానిక తాహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తలపెట్టి, రెవెన్యూ అధికారులకు వినతి ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలన్నారు. జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే ఫాల్గుణ తదితరులు పాల్గొన్నారు.1
- ఆదివాసీల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే : ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో మంత్రి సంధ్యారాణి అరకులోయ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ఆదివాసీ దినోత్సవంను సోమవారం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి.నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, పాడేరు ఐటీడీఏ పీఓ ఆదిత్య వర్మ స్ధానిక వేషధారణలో పాల్గొన్నారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వం తోనే సాధ్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. విద్యార్ధినుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టీడీపీ అరకు ఇంఛార్జ్, ఆర్టీసీ ప్రాంతీయ జోన్ చైర్మన్ దొన్నుదొర, పాడేరు ఇంఛార్జ్ గిడ్డి ఈశ్వరమ్మ, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్,ఆంధ్రప్రదేశ్ జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డా. వంపూరు గంగులయ్య, మాజీ ఎస్సీ, ఎస్టీ కమీషన్ సభ్యుడు సివేరి అబ్రహం, బీజేపీ నాయకుడు కురస ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.2
- తునిలో అంగన్వాడీ కేంద్రాలు చాలా అధ్వానంగా ఉన్నాయి రెండు కేంద్రాల్లో రిమూవ్ చేసిన చైర్మన్ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో సోమవారం నాడు ఏపీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ విస్తృత తనిఖీలు చేపట్టారు. గురుకుల పాఠశాలలు, జడ్పీహెచ్ఎస్ పాఠశాలలు, రేషన్ డిపోలు, అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేశారు. పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీ నిర్వహించగా చాలా అద్వానంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుని పట్టణములో ని అంగన్వాడీ కేంద్రాలు మరీ చాలా అద్వానంగా ఉన్నాయని స్టాక్ బుక్ మైంటైన్ చేయట్లేదని, పిల్లలు లేకుండానే వచ్చినట్లు హాజరు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల ను వెంటనే రిమూవ్ చేయాలని వాళ్లపై యాక్షన్ తీసుకోవాలని ఒత్తిళ్లకు తలొగ్గి యాక్షన్ తీసుకోకపోతే ఐసిడిఎస్ పైఅధికారుల నుండి కింద స్థాయి అధికారుల వరకు అందరిపైనా యాక్షన్ తీసుకుంటామని తెలిపారు.1