Shuru
Apke Nagar Ki App…
2025 డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐ విచారణ జరపాలి: వైసీపీ 2025 డీఎస్సీ నియామక ప్రక్రియలో జరుగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్య లింగం డిమాండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ శ్రేణులతో సోమవారం అరకులోయ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు నుండి స్ధానిక తాహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తలపెట్టి, రెవెన్యూ అధికారులకు వినతి ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలన్నారు. జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే ఫాల్గుణ తదితరులు పాల్గొన్నారు.
Venkatapplanaidu B
2025 డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐ విచారణ జరపాలి: వైసీపీ 2025 డీఎస్సీ నియామక ప్రక్రియలో జరుగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్య లింగం డిమాండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ శ్రేణులతో సోమవారం అరకులోయ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు నుండి స్ధానిక తాహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తలపెట్టి, రెవెన్యూ అధికారులకు వినతి ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలన్నారు. జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే ఫాల్గుణ తదితరులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కఠోర శ్రమతోనే విజయం సాధ్యం: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అమరావతి ఛాంపియన్‌షిప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు స్థానిక విజ్జి స్టేడియంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎఆర్ దామోదర్ ప్రారంభించారు. కఠోర శ్రమ, అంకితభావంతో క్రీడల్లో రాణించాలని కలెక్టర్ క్రీడాకారులకు సూచించారు. మేజర్ ధ్యాన్‌చంద్‌ను ఆదర్శంగా తీసుకుని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలను కలెక్టరేట్‌లో ఘనంగా సత్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో క్రీడా అధికారులు, అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.3
- రాజాం వైసిపి నిరసన ర్యాలీలో పాల్గొన్న డాక్టర్ తలే రాజేష్. రాజాం వైసిపి నిరసన ర్యాలీ డీఎస్సీ అక్రమాలపై, సిబిఐ విచారణ జరపాలి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి, అంటూ నినాదాలు చేశారు, నిరుద్యోగ భృతి చెల్లించాలని, ప్రభుత్వాన్ని డాక్టర్ తలే రాజేష్ డిమాండ్ చేశారు.1
- రాజాం ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో రాత్రిపూట పశువులు సంచారం.. రాజాం ప్రభుత్వం జూనియర్ కాలేజీ లో ఆవులు ఉంటుండగాఆదివారం రాత్రి ప్రధాన గేట్ కు సిబ్బంది తాళాలు వేశారు. నైట్ వాచ్ మెన్ లేకపోవడం తో కాలేజీ పశువులు ప్రతి రోజు ఉండిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి సమయంలో యువకులు కూడా గోడ దూకి లోనికి వెళ్లి వస్తుంటాయి. అని అంటున్నారు.కాలేజీ బిల్డింగులు గ్రౌండ్ పరిధిలో స్ట్రీట్ లైట్ ఏర్పాటు కూడా చేయాలని కోరుతున్నారు.1
- సముద్రం పక్కనే ఉన్న మహానగరం... కానీ విశాఖలో మంచినీటి కోసం మొదలైన కష్టాలు..! VSP...ఒకప్పుడు నీటితో కళకళలాడిన జలాశయాలు... ఇప్పుడు అడుగంటిపోతున్నాయి. విశాఖకు ప్రధాన నీటి వనరుల్లో ఒకటైన ముడసర్లోవ రిజర్వాయర్‌లో నీటి మట్టం భారీగా పడిపోయింది. దాదాపు 90 శాతం అడుగంటిపోయిన ముడసర్లోవ పరిస్థితి... నీటి కొరత తీవ్రతను కళ్లకు కడుతోంది. మన దగ్గరున్న డ్రోన్ విజువల్స్‌లో కూడా... విస్తారంగా కనిపించాల్సిన జలాశయం ఎంతగా వెలవెలబోయిందో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు... తాగునీటి అవసరాల కోసం మంచినీటి ట్యాంకర్లు వరుసగా రోడ్డెక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెందుర్తి పెద్ద చెరువులోనూ ఇదే పరిస్థితి. నీటి నిల్వలు తగ్గిపోవడంతో... భవిష్యత్తు నీటి అవసరాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక సింహాచలం అప్పన్న స్వామి వారి కోనేరు కూడా నీటి కష్టాలను తప్పించుకోలేకపోతోంది. విశాఖలో నీటి సమస్య ఇంకా ఎంత తీవ్రంగా మారనుందో చెప్పడానికి... ఈ దృశ్యాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. సముద్రం పక్కనే ఉన్న నగరం... కానీ తాగునీటి కోసం ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? వర్షాలు ఆలస్యం కావడం, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం... ఇవన్నీ కలిసి విశాఖకు రాబోయే రోజుల్లో మరింత పెద్ద నీటి సవాలుగా మారనున్నాయా..? ఇప్పటికైనా నీటి వనరుల సంరక్షణ, ప్రత్యామ్నాయ నీటి వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రస్తుత పరిస్థితి హెచ్చరిస్తోంది.1
- యువత విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటుంది నరసన్నపేట. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ నిరుద్యోగ యువత విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ గారు మండిపడ్డారు డీఎస్సీ నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలు ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని నిర్విరియం చేయడం నిరుద్యోగ భృతి చెల్లించకపోవడం నిరసిస్తూ వైఎస్ఆర్సిపి విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో ఈరోజు పోలీసులు ఎంతగానో మొహరించిన వాటిని దాటుకుంటూ అంబేద్కర్ జంక్షన్ వద్దకు తరలివచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు1
- గజపతినగరంలో వైసీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి గజపతినగరంలో ఉద్రిక్త వాతావరణం నడుమ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించడంతో పట్టణంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య ఏర్పడిన పరిస్థితులతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.1