logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పాండ్రంకి వెంకట రమణపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతుంది విజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు  విజయనగరం పట్టణంకు చెందిన పాండ్రంకి వెంకట రమణపై అనే వ్యక్తిపై ఇటీవల భోగాపురం మండలంలో ముంజేరు మరియు వివిధ గ్రామాలకు చెందిన కొంతమంది ఫిర్యాదు చేసి చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ని ఆశ్రయించారన్నారు. పాండ్రంకి వెంకట రమణ ముంజేరు గ్రామం డ్రైనేజీ కాలువ సమస్యపై గ్రామంలో అందరిని రెచ్చగొట్టి భోగాపురం మండల కేంద్రం వద్ద రిలే నిరాహార దీక్షలు చేయిస్తున్నాడని, ఈ విషయమై వివిధ శాఖల అధికారులను, రాజకీయ నాయకులను, వివిధ కంపెనీల వారిని బెదిరిస్తూ డబ్బులు వాసులు చేస్తున్నాడని, అదే విధంగా ముంజేరు గ్రామ ప్రజలను కూడా చందాలు ఇవ్వమని, లేకపోతే అట్రాసిటి కేసులు పెడతామని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్కడ లాడ్జి నిర్మాణం చేసి, అందులో దందాలు నడుపుతున్నాడని, “అంబేద్కర్ రైట్స్” పేరిట ఒక అనధికార సంస్థను ఏర్పాటు చేసుకొని, దానికి తానే అధ్యక్షుడినని చెప్పుకొంటూ సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ పోలీసు వారిని కూడా బెదిరిస్తుంటాడని, అదే విధంగా తన అనుచరులతో కలిసి భోగాపురం మండలంలో హేచరీలు,  కంపెనీలు వద్దకు వెళ్లి లక్షలలో డబ్బులు వసూలు చేస్తున్నాడన్నారు. ముంజేరు గ్రామంలో కూడా కొంతమందిని చందాలు ఇవ్వమని, దళితులనుండి ఏ సమస్య వచ్చినా తానూ చూసుకుంటానని, ఒక వేళ చందాలు ఇవ్వకపోతే తమపై అట్రాసిటి కేసులు పెడతామని బెదిరిస్తున్నాడని ఆరోపించారని బాధితులు తెలిపారు. ఈ విషయంపై విజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు విచారణ అధికారిగా నియమించారని తెలిపారు.  విజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు మాట్లాడుతూ - పాండ్రంకి వెంకట రమణ అనే వ్యక్తిపై అనేక ఆరోపణలతో వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టామని, కొంతమంది బాధితుల స్టేట్మెంట్లు నమోదుచేసామని, తేది.20.02.2026 న భోగాపురం పోలీస్ స్టేషన్ లో ఉదయం నుండి తాను అందుబాటులో ఉంటానని, ముంజేరు మరియు చుట్టు పక్కల గ్రామాల వారు ఈ విషయం గురించి  ఎవరైనా ఏదైనా చెప్పాలంటే తనను నిర్భయంగా కలిసి తమ బాధలు చెప్పుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే విచారణ పూర్తి చేసి నివేదికను పై అధికారులకు సమర్పిస్తానని తెలిపారు.

1 hr ago
user_Giridhar singh
Giridhar singh
రిపోర్టర్ విజయనగరం విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
5bc9e897-3f49-4987-b614-7d04b569dfb0

పాండ్రంకి వెంకట రమణపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతుంది విజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు  విజయనగరం పట్టణంకు చెందిన పాండ్రంకి వెంకట రమణపై అనే వ్యక్తిపై ఇటీవల భోగాపురం మండలంలో ముంజేరు మరియు వివిధ గ్రామాలకు చెందిన కొంతమంది ఫిర్యాదు చేసి చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ని ఆశ్రయించారన్నారు. పాండ్రంకి వెంకట రమణ ముంజేరు గ్రామం డ్రైనేజీ కాలువ సమస్యపై గ్రామంలో అందరిని రెచ్చగొట్టి భోగాపురం మండల కేంద్రం వద్ద రిలే నిరాహార దీక్షలు చేయిస్తున్నాడని, ఈ విషయమై వివిధ శాఖల అధికారులను, రాజకీయ నాయకులను, వివిధ కంపెనీల వారిని బెదిరిస్తూ డబ్బులు వాసులు చేస్తున్నాడని, అదే విధంగా ముంజేరు గ్రామ ప్రజలను కూడా చందాలు ఇవ్వమని, లేకపోతే అట్రాసిటి కేసులు పెడతామని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్కడ లాడ్జి నిర్మాణం చేసి, అందులో దందాలు నడుపుతున్నాడని, “అంబేద్కర్ రైట్స్” పేరిట ఒక అనధికార సంస్థను ఏర్పాటు చేసుకొని, దానికి తానే అధ్యక్షుడినని చెప్పుకొంటూ సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ పోలీసు వారిని కూడా బెదిరిస్తుంటాడని, అదే విధంగా తన అనుచరులతో కలిసి భోగాపురం మండలంలో హేచరీలు,  కంపెనీలు వద్దకు వెళ్లి లక్షలలో డబ్బులు వసూలు చేస్తున్నాడన్నారు. ముంజేరు గ్రామంలో కూడా కొంతమందిని చందాలు ఇవ్వమని, దళితులనుండి ఏ సమస్య వచ్చినా తానూ చూసుకుంటానని, ఒక వేళ చందాలు ఇవ్వకపోతే తమపై అట్రాసిటి కేసులు పెడతామని బెదిరిస్తున్నాడని ఆరోపించారని బాధితులు తెలిపారు. ఈ విషయంపై విజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు విచారణ అధికారిగా నియమించారని తెలిపారు.  విజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు మాట్లాడుతూ - పాండ్రంకి వెంకట రమణ అనే వ్యక్తిపై అనేక ఆరోపణలతో వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టామని, కొంతమంది బాధితుల స్టేట్మెంట్లు నమోదుచేసామని, తేది.20.02.2026 న భోగాపురం పోలీస్ స్టేషన్ లో ఉదయం నుండి తాను అందుబాటులో ఉంటానని, ముంజేరు మరియు చుట్టు పక్కల గ్రామాల వారు ఈ విషయం గురించి  ఎవరైనా ఏదైనా చెప్పాలంటే తనను నిర్భయంగా కలిసి తమ బాధలు చెప్పుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే విచారణ పూర్తి చేసి నివేదికను పై అధికారులకు సమర్పిస్తానని తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ప్రేమ, పెళ్ళి పేరుతో బాలికను తీసుకొనిపోయి మోసం చేసిన నిందితుడికి 20సం.ల కఠిన కారాగార శిక్ష, జరిమాన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ 🎯 *బాలికను మోసం చేసిన నిందితుడికి శిక్ష విధింపబడే విధంగా చర్యలు చేపట్టామన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ * 🎯 *నిందితుడికి 20 సం.లు కఠిన కారాగార శిక్ష, రూ.5వేలు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం మంజూరు చేసారన్న జిల్లా ఎస్పీ* 🎯 *బాలికలు మరియు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరోసారి తీవ్రంగా హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ విజయనగరం జిల్లా భోగాపురం పోలీసు స్టేషనులో 2024 సం. మే నెలలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు భోగాపురం మండలం ముంజేరు గ్రామానికి చెందిన రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) అనే వ్యక్తికి విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే.నాగమణి గారు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5,000/-లు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ. 5 లక్షలను మంజూరు చేయాలని ఫిబ్రవరి 18న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే.. భోగాపురం మండలం, ముంజేరు గ్రామంలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి తన కుమార్తె (మైనరు బాలిక) కనపడటం లేదని తేది.22.05.2024న భోగాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, భోగాపురం ఎస్ఐ పి.సూర్యకుమారి గర్ల్ మిస్సింగ్ క్రింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఆ బాలికను కనిపెట్టి తన నుండి స్టేట్మెంట్ నమోదుచేసిన భోగాపురం పోలీసులు. భోగాపురం మండలం ముంజేరు గ్రామానికి చెందిన రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) అనే వ్యక్తి  తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి విశాఖపట్నం మరియు హైదరాబాదు తిప్పి శారీరకంగా అనుభవించాడని తెలిపింది. ఆ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తే.25.07.2024దిన పోక్సో సెక్షన్స్ క్రింద కేసును ఆల్టర్ చేశారన్నారు. అనంతరం విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు కేసు దర్యాప్తు చేపట్టి, ముద్దాయిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించి, నిందితుడిపై న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. నిందితుడు రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు శ్రీమతి కె.నాగమణి నిందితుడికి 20 సంవత్సరాలు కఠిన కారాగారం మరియు రూ.5,000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షల మంజూరు చేస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసుల తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్జ్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటరు జి.సత్యం వాదనలు వినిపించారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసి, నిందితుడిని శిక్షించబడే విధంగా సమర్ధవంతంగా పని చేసిన విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, భోగాపురం సిఐ దుర్గా ప్రసాద్, ఎస్ఐ పి.సూర్యకుమారి, సి.ఎం.ఎస్. హెచ్సి సిహెచ్.రామకృష్ణ, కోర్టు కానిస్టేబులు వి.సత్యనారాయణ, ఎపిపి జి.సత్యంలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. గడిచిన 6నెలల కాలంలో 17 పోక్సో కేసులలో నిందితులకు కఠిన కారాగార శిక్ష పడిందని, జిల్లా ఎస్పీ తెలిపారు. మైనర్ బాలికలు మరియు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరోసారి తీవ్రంగా హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,
    1
    ప్రేమ, పెళ్ళి పేరుతో బాలికను తీసుకొనిపోయి మోసం చేసిన నిందితుడికి 20సం.ల కఠిన కారాగార శిక్ష, జరిమాన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్
🎯 *బాలికను మోసం చేసిన నిందితుడికి శిక్ష విధింపబడే విధంగా చర్యలు చేపట్టామన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ *
🎯 *నిందితుడికి 20 సం.లు కఠిన కారాగార శిక్ష, రూ.5వేలు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం మంజూరు చేసారన్న జిల్లా ఎస్పీ*
🎯 *బాలికలు మరియు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరోసారి తీవ్రంగా హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్
విజయనగరం జిల్లా భోగాపురం పోలీసు స్టేషనులో 2024 సం. మే నెలలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు భోగాపురం మండలం ముంజేరు గ్రామానికి చెందిన రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) అనే వ్యక్తికి విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే.నాగమణి గారు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5,000/-లు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ. 5 లక్షలను మంజూరు చేయాలని ఫిబ్రవరి 18న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.
వివరాల్లోకి వెళ్ళితే.. భోగాపురం మండలం, ముంజేరు గ్రామంలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి తన కుమార్తె (మైనరు బాలిక) కనపడటం లేదని తేది.22.05.2024న భోగాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, భోగాపురం ఎస్ఐ పి.సూర్యకుమారి గర్ల్ మిస్సింగ్ క్రింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఆ బాలికను కనిపెట్టి తన నుండి స్టేట్మెంట్ నమోదుచేసిన భోగాపురం పోలీసులు. భోగాపురం మండలం ముంజేరు గ్రామానికి చెందిన రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) అనే వ్యక్తి  తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి విశాఖపట్నం మరియు హైదరాబాదు తిప్పి శారీరకంగా అనుభవించాడని తెలిపింది. ఆ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తే.25.07.2024దిన పోక్సో సెక్షన్స్ క్రింద కేసును ఆల్టర్ చేశారన్నారు. అనంతరం విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు కేసు దర్యాప్తు చేపట్టి, ముద్దాయిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించి, నిందితుడిపై న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు.
నిందితుడు రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు శ్రీమతి కె.నాగమణి  నిందితుడికి 20 సంవత్సరాలు కఠిన కారాగారం మరియు రూ.5,000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షల మంజూరు చేస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసుల తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్జ్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటరు జి.సత్యం వాదనలు వినిపించారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసి, నిందితుడిని శిక్షించబడే విధంగా సమర్ధవంతంగా పని చేసిన విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, భోగాపురం సిఐ దుర్గా ప్రసాద్, ఎస్ఐ పి.సూర్యకుమారి, సి.ఎం.ఎస్. హెచ్సి సిహెచ్.రామకృష్ణ, కోర్టు కానిస్టేబులు వి.సత్యనారాయణ, ఎపిపి జి.సత్యంలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు.
గడిచిన 6నెలల కాలంలో 17 పోక్సో కేసులలో నిందితులకు కఠిన కారాగార శిక్ష పడిందని, జిల్లా ఎస్పీ తెలిపారు. మైనర్ బాలికలు మరియు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరోసారి తీవ్రంగా హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,
    user_Giridhar singh
    Giridhar singh
    రిపోర్టర్ విజయనగరం విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    57 min ago
  • పలాస: పలాసలోని రామకృష్ణాపురంలో బుధవారం, జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఒక మహిళ మెడలో చైన్ స్నాచింగ్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. మహిళ కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టుబడిన వ్యక్తి MPకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నారు.
    1
    పలాస: పలాసలోని రామకృష్ణాపురంలో బుధవారం, జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఒక మహిళ మెడలో చైన్ స్నాచింగ్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. మహిళ కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టుబడిన వ్యక్తి MPకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • వీ.ఆర్.ఏలకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద బుధవారం ఉదయం ఆందోళన చేశారు. నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, ప్రభుత్వ మొండివైఖరి నశించాలని నినాదాలు చేశారు. వీ‌ఆర్‌ఏలుగా ఎక్కువ సంఖ్యలో వెనకబడిన తరగతుల వారు విధులు నిర్వహిస్తున్నారని, ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, కేవలం రూ.10,500 జీతంతో కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలని ప్రశ్నించారు.
    1
    వీ.ఆర్.ఏలకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద బుధవారం ఉదయం ఆందోళన చేశారు.   నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, ప్రభుత్వ మొండివైఖరి నశించాలని నినాదాలు చేశారు. వీ‌ఆర్‌ఏలుగా ఎక్కువ సంఖ్యలో వెనకబడిన తరగతుల వారు విధులు నిర్వహిస్తున్నారని, ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, కేవలం రూ.10,500 జీతంతో కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలని ప్రశ్నించారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Post by APPARAO KONCHADA
    1
    Post by APPARAO KONCHADA
    user_APPARAO KONCHADA
    APPARAO KONCHADA
    Palakonda, Parvathipuram Manyam•
    20 hrs ago
  • హుకుంపేట: కొట్నాపల్లి-మారెల వెళ్లే దారిలోని ప్రయాణికుల విశ్రాంతి భవనం మందుబాబులకు అడ్డాగా మారింది. భవనం నిండా మందు సీసాలు, గ్లాసులు దర్శనమిస్తుండటంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కోసం నిర్మించిన భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
    1
    హుకుంపేట: కొట్నాపల్లి-మారెల వెళ్లే దారిలోని ప్రయాణికుల విశ్రాంతి భవనం మందుబాబులకు అడ్డాగా మారింది. భవనం నిండా మందు సీసాలు, గ్లాసులు దర్శనమిస్తుండటంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కోసం నిర్మించిన భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మర్రిపాడు గ్రామంలో ఎల్లమ్మ తల్లి ఆలయం విగ్రహాల పునప్రతిష్ట కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజ అలంకరణ సహస్ర కుంకుమార్చన మహా హోమాలు చండీ హోమాలు పూర్ణ హుతినిర్వహించారు. భక్తుల్లో అమ్మవారందరినీ ప్రత్యేకంగా దర్శించుకున్నారు అనంతరం మహానసమారాధన కార్యక్రమం నిర్వహించారు.
    3
    టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మర్రిపాడు గ్రామంలో ఎల్లమ్మ తల్లి ఆలయం విగ్రహాల పునప్రతిష్ట కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజ అలంకరణ సహస్ర కుంకుమార్చన మహా హోమాలు చండీ హోమాలు పూర్ణ హుతినిర్వహించారు. భక్తుల్లో అమ్మవారందరినీ ప్రత్యేకంగా దర్శించుకున్నారు అనంతరం మహానసమారాధన కార్యక్రమం నిర్వహించారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • టెక్కలికి 15 కోట్ల వ్యయంతో 50 పడగల ఆయుష్ హాస్పటల్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ,రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ల చిత్రపటాలకు టిడిపి శ్రేణులు బుధవారం పాలాభిషేకం చేశారు. టెక్కలి అన్నా క్యాంటీన్ జంక్షన్లో ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరిరావు మాట్లాడుతూ టెక్కలి అభివృద్ధికి కృషి చేస్తున్న అచ్చన్న నాయుడికి టెక్కలి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.
    1
    టెక్కలికి 15 కోట్ల వ్యయంతో 50 పడగల ఆయుష్ హాస్పటల్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ  సీఎం చంద్రబాబు నాయుడు ,రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ల చిత్రపటాలకు టిడిపి  శ్రేణులు బుధవారం పాలాభిషేకం చేశారు. టెక్కలి అన్నా క్యాంటీన్ జంక్షన్లో ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరిరావు మాట్లాడుతూ టెక్కలి అభివృద్ధికి కృషి చేస్తున్న అచ్చన్న నాయుడికి టెక్కలి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.
    user_Karri Sankara Reddy
    Karri Sankara Reddy
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • పార్వతీపురంలో నాటు సారాను అంతం చేయాలి. అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర. పార్వతీపురం: పార్వతీపురంలో నాటు సారాను పూర్తిగా అంతం చేసి అక్కడి యువతను సన్మార్గంలో నడిపించడానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ స్పీకర్ రామకృష్ణంరాజు అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ నవోదయ పథకం ద్వారా నాటుసారైనా అరికట్టడానికి 2019 ముందు తెలుగుదేశం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అయితే ఆ చర్యలు ఫలవంతం అవుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. ఆ ప్రాంతంలో ఓ ముఠా రెల్లి సామాజిక వర్గీయులతో నాటు సారా తయారు చేయించి విక్రయాలు సాగిస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారని విమర్శించారు. యువత రోజు ఐదారు వేల రూపాయలు సంపాదించడంతో అటువైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని సభకు వివరించారు. దీనిపై తాను వ్యక్తిగతంగా అనేకమార్లు పోరాటం చేసినప్పటికీ నాటు సారా వ్యవస్థను అరికట్టలేకపోతున్నామని పేర్కొన్నారు. కొందరు అధికారులు కంచే చేను మేస్తున్నట్లుగా వ్యవహరిస్తూ అక్రమాలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి ఆ ముఠా ఆటలను కట్టడి చేసి పార్వతీపురం యువతను సన్మార్గంలో నడిచేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. యువతకు మంచి ఉపాధి కల్పించడం ద్వారా వారిని నాటుసారా తయారీకి దూరంగా ఉంచవచ్చునని వెల్లడించారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రతిపాదనకు సభ్యులందరూ బల్లలు తరుస్తూ హర్షద్వానాలు వ్యక్తం చేశారు.
    1
    పార్వతీపురంలో నాటు సారాను అంతం చేయాలి. 
అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర. 
పార్వతీపురం: పార్వతీపురంలో నాటు సారాను పూర్తిగా అంతం చేసి అక్కడి యువతను సన్మార్గంలో నడిపించడానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ స్పీకర్ రామకృష్ణంరాజు అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ నవోదయ పథకం ద్వారా నాటుసారైనా అరికట్టడానికి 2019 ముందు తెలుగుదేశం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అయితే ఆ చర్యలు ఫలవంతం అవుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. ఆ ప్రాంతంలో ఓ ముఠా రెల్లి సామాజిక వర్గీయులతో నాటు సారా తయారు చేయించి విక్రయాలు సాగిస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారని విమర్శించారు. యువత రోజు ఐదారు వేల రూపాయలు సంపాదించడంతో అటువైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని సభకు వివరించారు. దీనిపై తాను వ్యక్తిగతంగా అనేకమార్లు పోరాటం చేసినప్పటికీ నాటు సారా వ్యవస్థను అరికట్టలేకపోతున్నామని పేర్కొన్నారు. కొందరు అధికారులు కంచే చేను మేస్తున్నట్లుగా వ్యవహరిస్తూ అక్రమాలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి ఆ ముఠా ఆటలను కట్టడి చేసి పార్వతీపురం యువతను సన్మార్గంలో నడిచేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. యువతకు మంచి ఉపాధి కల్పించడం ద్వారా వారిని నాటుసారా తయారీకి దూరంగా ఉంచవచ్చునని వెల్లడించారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రతిపాదనకు సభ్యులందరూ బల్లలు తరుస్తూ హర్షద్వానాలు వ్యక్తం చేశారు.
    user_Giridhar singh
    Giridhar singh
    రిపోర్టర్ విజయనగరం విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.