logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

దండు గోపాలపురం పాఠశాల ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది కార్యక్రమం. గ్రామాల్లో 10వ తరగతి విజయోత్సవ కార్యక్రమాలు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజక వర్గం సంతబొమ్మాళి మండలం జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల దండుగోపాలపురము ఉపాధ్యాయులు సోమవారము నాడు దండుగోపాలపురము పరిసర ఆవాసప్రాంతము గ్రామాలలో బడిపిలుస్తుంది మరియు a SSC విజయోత్సవ కార్యక్రమము చేపట్టింది. ప్రత్యేక వాహనము ఏర్పాటు చేసి పదవతరగతి పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ప్లే-కార్డులు చేత బట్టుకొని,SSC పరీక్షా ఫలితాలు తెలియచెప్పే ఫ్లెక్సీ నీ ప్రదర్శిస్తూ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు గంగన్న మైకుసెట్టులో పాఠశాల పనితీరును ప్రభుత్వ విద్యా పథకాలను తెలియచెప్పుతూ, సర్కారు బడి పిలుస్తుంది అనే గీతమును వినిపిస్తూ, "ప్రైవేటు బడి దండగ - ప్రభుత్వ పాఠశాల ఉండగా" అని నినదిస్తూ దండుగోపాలపురము, వడ్డితాండ్ర, కొత్తూరు, కోటపాడు, కాశీపురము, బృందవనము, చెట్లతాండ్ర, మహాదేవుపురము, ఆరికివలస, రెయ్యిపేట, తాల్లవలస గ్రామాల్లో ఉదయము ఏడు గంటల నుండి పన్నెండు గంటలవరకు ప్రచారయాత్ర కొనసాగిస్తూ, పురజనులను, గ్రామపెద్దలను కలుస్తూ, చెరువు పనులు చేస్తున్న తల్లితండ్రుల వద్దకు కూడా వెళ్లి పాఠశాల సాధించిన విజయాలను తెలియజేసి వారి వారి పిల్లలను దండుగోపాలపురము పాఠశాలలో చేర్పించమని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార యాత్రపట్ల గ్రామపెద్దలు, యువత హర్షము వ్యక్తము చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కరరావు, తిరుపతిరావు, జె.శ్రీనివాసరావు, సూర్యప్రకాష్, నాగేశ్వరరావు, బి.శ్రీనివాసరావు, అన్నాజీ, శారదాంబ, లక్ష్మీనారాయణ, మురళీధర రాజు, రాము, శ్రీధర్, విజయలక్ష్మి, లక్ష్మున్నాయుడు, కొర్లాపు.శ్రీనివాసరావు, లక్ష్మణమూర్తి, నారాయణరావు డి.శ్రీనివాసరావు, దయాసాగర్, శ్రీధర్, మార్కండేయులు CRPగిరి పాల్గొన్నారు.

3 hrs ago
user_Pokala Nagesh Kumar
Pokala Nagesh Kumar
జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

దండు గోపాలపురం పాఠశాల ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది కార్యక్రమం. గ్రామాల్లో 10వ తరగతి విజయోత్సవ కార్యక్రమాలు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజక వర్గం సంతబొమ్మాళి మండలం జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల దండుగోపాలపురము ఉపాధ్యాయులు సోమవారము నాడు దండుగోపాలపురము పరిసర ఆవాసప్రాంతము గ్రామాలలో బడిపిలుస్తుంది మరియు a SSC విజయోత్సవ కార్యక్రమము చేపట్టింది. ప్రత్యేక వాహనము ఏర్పాటు చేసి పదవతరగతి పరీక్షలో

85a1962a-2dae-4414-87b3-85ed5dd125cd

ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ప్లే-కార్డులు చేత బట్టుకొని,SSC పరీక్షా ఫలితాలు తెలియచెప్పే ఫ్లెక్సీ నీ ప్రదర్శిస్తూ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు గంగన్న మైకుసెట్టులో పాఠశాల పనితీరును ప్రభుత్వ విద్యా పథకాలను తెలియచెప్పుతూ, సర్కారు బడి పిలుస్తుంది అనే గీతమును వినిపిస్తూ, "ప్రైవేటు బడి దండగ - ప్రభుత్వ పాఠశాల ఉండగా" అని నినదిస్తూ

aacd409e-077e-4ef3-a0ba-ed8e7f40cbd0

దండుగోపాలపురము, వడ్డితాండ్ర, కొత్తూరు, కోటపాడు, కాశీపురము, బృందవనము, చెట్లతాండ్ర, మహాదేవుపురము, ఆరికివలస, రెయ్యిపేట, తాల్లవలస గ్రామాల్లో ఉదయము ఏడు గంటల నుండి పన్నెండు గంటలవరకు ప్రచారయాత్ర కొనసాగిస్తూ, పురజనులను, గ్రామపెద్దలను కలుస్తూ, చెరువు పనులు చేస్తున్న తల్లితండ్రుల వద్దకు కూడా వెళ్లి పాఠశాల సాధించిన విజయాలను తెలియజేసి వారి వారి పిల్లలను దండుగోపాలపురము పాఠశాలలో చేర్పించమని విజ్ఞప్తి

2001d44a-258b-4912-8c7f-75f44d478851

చేశారు. ఈ ప్రచార యాత్రపట్ల గ్రామపెద్దలు, యువత హర్షము వ్యక్తము చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కరరావు, తిరుపతిరావు, జె.శ్రీనివాసరావు, సూర్యప్రకాష్, నాగేశ్వరరావు, బి.శ్రీనివాసరావు, అన్నాజీ, శారదాంబ, లక్ష్మీనారాయణ, మురళీధర రాజు, రాము, శ్రీధర్, విజయలక్ష్మి, లక్ష్మున్నాయుడు, కొర్లాపు.శ్రీనివాసరావు, లక్ష్మణమూర్తి, నారాయణరావు డి.శ్రీనివాసరావు, దయాసాగర్, శ్రీధర్, మార్కండేయులు CRPగిరి పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాజాం మండలం గడ్డవలసలో పిడుగుపడి మృతి చెందిన ముగ్గురు మహిళా కూలీల కుటుంబాలను ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్ పరామర్శించారు. ఆయన ఒక్కొక్కరికి రూ. 10 వేల వ్యక్తిగత ఆర్థిక సహాయం అందించి, ప్రభుత్వం నుండి పూర్తిస్థాయి సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
    1
    రాజాం మండలం గడ్డవలసలో పిడుగుపడి మృతి చెందిన ముగ్గురు మహిళా కూలీల కుటుంబాలను ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్ పరామర్శించారు. ఆయన ఒక్కొక్కరికి రూ. 10 వేల వ్యక్తిగత ఆర్థిక సహాయం అందించి, ప్రభుత్వం నుండి పూర్తిస్థాయి సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
    user_HARIBABU  TALADA
    HARIBABU TALADA
    Farmer రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించండి -పిల్లలను చేర్పించండి: కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి తమ పిల్లలను చేర్పించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తోందని తెలిపారు. వివిధ కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న 26 మంది విద్యార్థులు ఒకేసారి ప్రభుత్వ పాఠశాలలో చేరడం విశేషంగా నిలిచింది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులు ఈ పాఠశాలలో అడ్మిషన్ పొందారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా మౌలిక వసతులు, డిజిటల్ సదుపాయాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించగల నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచామని కలెక్టర్ గుర్తు చేశారు. అదేవిధంగా జిల్లాలో 60 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు.
    1
    ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించండి -పిల్లలను చేర్పించండి: కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి తమ పిల్లలను చేర్పించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తోందని తెలిపారు.
వివిధ కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న 26 మంది విద్యార్థులు ఒకేసారి ప్రభుత్వ పాఠశాలలో చేరడం విశేషంగా నిలిచింది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులు ఈ పాఠశాలలో అడ్మిషన్ పొందారు.
ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా మౌలిక వసతులు, డిజిటల్ సదుపాయాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించగల నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని పేర్కొన్నారు.
జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచామని కలెక్టర్ గుర్తు చేశారు. అదేవిధంగా జిల్లాలో 60 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు.
    user_Kumar
    Kumar
    Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో లారీ యార్డ్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు గుర్తించగా, పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
    2
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో లారీ యార్డ్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు గుర్తించగా, పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
    user_Shivaram
    Shivaram
    Apprenticeship Centre బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    8 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లక్ష్మీపురం లారీ యార్డు వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీహార్‌కు చెందిన కుందన్ సింగ్‌ను బండరాయితో కొట్టి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లక్ష్మీపురం లారీ యార్డు వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీహార్‌కు చెందిన కుందన్ సింగ్‌ను బండరాయితో కొట్టి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    8 hrs ago
  • ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్‌కే వర్సెస్ ఎల్‌ఎస్‌జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
    1
    ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్‌కే వర్సెస్ ఎల్‌ఎస్‌జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
    user_Jayateja
    Jayateja
    Hotel Vijayawada (Rural), Ntr•
    6 hrs ago
  • ఖమ్మం లో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన
    1
    ఖమ్మం లో త్రాగునీటి సమస్య 
పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన
    user_Sampathkumar neerudu
    Sampathkumar neerudu
    ఖమ్మం అర్బన్, ఖమ్మం, తెలంగాణ•
    4 min ago
  • పి ఓ డబ్ల్యు ఏపీ రాష్ట్ర 9వ మహాసభలు విజయవంతం చేయాలి. ప్రగతిశీల మహిళా సంఘం పిలుపు. బొడ్డపాడు లో అమరవీరుల స్మారక భవనం వద్ద సభల పోస్టర్ ఆవిష్కరణ. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు వద్ద ప్రగతిశీల మహిళా సంఘం పీ ఓ డబ్ల్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 9వ మహాసభలను జయప్రదం చేయండని ప్రగతిశీల మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం పిలుపునిచ్చింది. సోమవారం బొడ్డపాడు గ్రామంలోని అమరవీరుల స్మారక భవనంలో ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 9వ మహాసభల ప్రచార కార్యక్రమంలో భాగంగా కరపత్రం, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ప్రగతిశీల మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో బొడ్డపాడులో నిర్వహించారు. ఈ సందర్భంగా టి వి డబ్ల్యూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి. ఈశ్వరమ్మ , పి కుసుమలు మాట్లాడుతూ దేశంలో మహిళలపై పెరుగుతున్న హింస, అత్యాచారాలు, గృహహింస, మూఢనమ్మకాలు, వివక్ష, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై మహిళలు ఐక్య పోరాటాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ, ఉపాధి, విద్య, ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. మహిళా హక్కుల సాధన, సమానత్వ సమాజ నిర్మాణం కోసం ప్రగతిశీల మహిళా సంఘం నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తోందని తెలిపారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మరింత బలమైన ఉద్యమాలు నిర్మించేందుకు రాష్ట్ర మహాసభలు దోహదపడతాయని పేర్కొన్నారు. 2026 మే 23, 24 తేదీలలో గుంటూరులో జరగనున్న ప్రగతిశీల మహిళా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 9వ మహాసభలను విజయవంతం చేయడానికి ప్రజలు సహకరించాలని వారు కోరారు. మహిళలు, విద్యార్థినులు, యువతులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు బతకల ఈశ్వరమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ తో పాటు జిల్లా కోశాధికారి బర్ల జానకమ్మ, జిల్లా కమిటీ సభ్యులు రజిని, లత, ఢిల్లీశ్వరి, స్థానిక మహిళా సంఘ సభ్యులు మోహినమ్మ, వసంత, కుమారి, మహాలక్ష్మి, పద్మ తదితరులు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.
    1
    పి ఓ డబ్ల్యు ఏపీ రాష్ట్ర 9వ మహాసభలు విజయవంతం చేయాలి. ప్రగతిశీల మహిళా సంఘం పిలుపు. బొడ్డపాడు లో అమరవీరుల స్మారక భవనం వద్ద సభల పోస్టర్ ఆవిష్కరణ.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు వద్ద ప్రగతిశీల మహిళా సంఘం పీ ఓ డబ్ల్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 9వ మహాసభలను జయప్రదం చేయండని ప్రగతిశీల మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం పిలుపునిచ్చింది. సోమవారం బొడ్డపాడు గ్రామంలోని అమరవీరుల స్మారక భవనంలో ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 9వ మహాసభల ప్రచార కార్యక్రమంలో భాగంగా కరపత్రం, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ప్రగతిశీల మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో బొడ్డపాడులో నిర్వహించారు. ఈ సందర్భంగా టి వి డబ్ల్యూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి. ఈశ్వరమ్మ , పి కుసుమలు మాట్లాడుతూ దేశంలో మహిళలపై పెరుగుతున్న హింస, అత్యాచారాలు, గృహహింస, మూఢనమ్మకాలు, వివక్ష, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై మహిళలు ఐక్య పోరాటాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ, ఉపాధి, విద్య, ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని విమర్శించారు.
మహిళా హక్కుల సాధన, సమానత్వ సమాజ నిర్మాణం కోసం ప్రగతిశీల మహిళా సంఘం నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తోందని తెలిపారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మరింత బలమైన ఉద్యమాలు నిర్మించేందుకు రాష్ట్ర మహాసభలు దోహదపడతాయని పేర్కొన్నారు. 2026 మే 23, 24 తేదీలలో గుంటూరులో జరగనున్న ప్రగతిశీల మహిళా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 9వ మహాసభలను విజయవంతం చేయడానికి ప్రజలు సహకరించాలని వారు కోరారు. మహిళలు, విద్యార్థినులు, యువతులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు బతకల ఈశ్వరమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ తో పాటు జిల్లా కోశాధికారి బర్ల జానకమ్మ, జిల్లా కమిటీ సభ్యులు రజిని, లత, ఢిల్లీశ్వరి, స్థానిక మహిళా సంఘ సభ్యులు మోహినమ్మ, వసంత, కుమారి, మహాలక్ష్మి, పద్మ తదితరులు,  గ్రామ మహిళలు పాల్గొన్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • గోదావరి బాధిత కుటుంబాలకు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు పరామర్శ MLG: కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం గోదావరి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సోమవారం పరామర్శించారు. రోయ్యూరు గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కుటుంబ సభ్యులకు కలగాలని ఆకాంక్షిస్తూ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    గోదావరి బాధిత కుటుంబాలకు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు పరామర్శ
MLG: కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం గోదావరి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సోమవారం పరామర్శించారు. రోయ్యూరు గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కుటుంబ సభ్యులకు కలగాలని ఆకాంక్షిస్తూ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_MAHI
    MAHI
    ములుగు, ములుగు, తెలంగాణ•
    29 min ago
  • వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.
    2
    వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.
    user_Karam jeevan
    Karam jeevan
    Photographer మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.