Shuru
Apke Nagar Ki App…
కొర్రాయిలో ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం......... డుంబ్రిగూడ మండలంలోని కొర్రాయి గ్రామంలో మంగళవారం తహసీల్దార్ త్రివేణి ప్రభుత్వ పథకాలపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డు ఆఫ్ రైట్, సర్వే నివేదికలు, పబ్లిక్ గ్రీవెన్స్, సివిల్ సప్లయ్, పెన్షన్లు, అంగన్వాడీ టేక్ హోమ్ రేషన్ వంటి పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాలపై గ్రామస్తులతో చర్చించారు. పథకాలు పొందడంలో ఎదురయ్యే సమస్యలు, అధికారుల ప్రవర్తనపై గ్రామస్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Nava surya
కొర్రాయిలో ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం......... డుంబ్రిగూడ మండలంలోని కొర్రాయి గ్రామంలో మంగళవారం తహసీల్దార్ త్రివేణి ప్రభుత్వ పథకాలపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డు ఆఫ్ రైట్, సర్వే నివేదికలు, పబ్లిక్ గ్రీవెన్స్, సివిల్ సప్లయ్, పెన్షన్లు, అంగన్వాడీ టేక్ హోమ్ రేషన్ వంటి పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాలపై గ్రామస్తులతో చర్చించారు. పథకాలు పొందడంలో ఎదురయ్యే సమస్యలు, అధికారుల ప్రవర్తనపై గ్రామస్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
More news from Alluri Sitharama Raju and nearby areas
- పెదబయలు మండలంలోని గల్లెల, గోమంగి, కిముడుపల్లి పంచాయతీల పరిధిలోని గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసీలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించేలా ప్రత్యేకంగా షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ అల్లూరి సీతారామరాజు జిల్లా చైర్మన్ రామారావు దొర మాట్లాడుతూ, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఆదివాసీలకు పూర్తిగా అమలు కావాలని, స్థానికులకు న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు1
- Post by Shyam1
- విజయనగరం జిల్లా రామభద్రపురంలోని టి.బి.ఆర్ థియేటర్ సమీపంలో బుధవారం బస్సు–లారీ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు చిన్నపాటి గాయాలు అయ్యాయి. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని గాయపడిన వారికి సహాయం చేశారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు...2
- గ్రామ స్థాయి నుంచి జనసేనను బలోపేతం చేయాలి1
- మార్చి11శ్రీకాకుళంజిల్లాఆమదాలవలసపట్టణంలోఆముదాలవలస పట్టణ అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారాన్ని లక్ష్యంగా పెట్టుకొని నిర్వహిస్తున్న గుడ్ మార్నింగ్ విత్ ఆముదాలవలస కార్యక్రమంలో భాగంగా ఆముదాలవలస నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ బుధ వారం ఉదయం మున్సిపాలిటీ పరి ధిలోని పలు వార్డులను ప్రత్యక్షంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉదయం నుంచే వార్డుల్లో తిరుగుతూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు తమ ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజీ సమస్యలు, రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు చెప్పిన సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులకు తెలియజేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.4
- తన కళ్ళెదురుగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తన మానవత్వాన్ని చాటుకున్నారు.బుధవారం మండపేట నుండి ద్వారపూడి వైపు వెళుతున్న ఆటో, ద్వారపూడి నుండి మండపేట వస్తున్న మోటార్ సైకిల్ తాపేశ్వరం మలుపులో రెండూ ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఆటో పల్టీ కొట్టింది. దీంతో ఆటో లో వెళుతున్న ఆరుగురు, మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరూ గాయాలపాలయ్యారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ళ ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు. మరో ఆలోచన లేకుండా క్షతగాత్రులను తన కార్ లో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ సేవాభావాన్ని పలువురు ప్రశంసించారు.1
- *50శాతం అపరాధ రుసుము సబ్సిడీ తో మార్చి 31 వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం* *ఏపీ రెరా చైర్మన్ ఆర్. ఎస్.శివారెడ్డి* విజయనగరం, మార్చి 11: రాష్ట్రం లో 500 చదరపు మీటర్లు లేదా 8 అపార్ట్మెంట్ కంటే ఎక్కువగా కలిగిన ప్రతి హోసింగ్ ప్రోజెక్ట్ ఎ పి రెరా అథారిటీ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏపీ రెరా చైర్మన్ ఆర్. ఎస్.శివారెడ్డి తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, బాధ్యత మరియు వినియోగదారుల హక్కుల పరిరక్షణను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (APRERA) ఆధ్వర్యంలో రెరా చట్టం, 2016 నిబంధనలు, వాటి అమలు విధానం పై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం ఉదయం హోటల్ ఎస్‌విఎన్ లేక్ ప్యాలస్ లో నిర్వహించారు. అవగాహన సదస్సు కు విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలకు చెందిన రియల్ ఎస్టేట్ రంగ ప్రమోటర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది మరియు గృహ కొనుగోలుదారులు హాజరయ్యారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏపీ రెరా చైర్మన్ ఆర్. ఎస్. శివారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగం తరువాత అత్యధిక ప్రాధాన్యత కలిగిన ఆర్ధిక రంగం నిర్మాణరంగమని తెలిపారు. నిర్మాణదారులకు, కొనుగోలుదారులకు ఇబ్బందులు రాకుండా, కొనుగోలుదారుల సంక్షేమమే అంతిమలక్ష్యంగా రేరా అథారిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అయన తెలిపారు. రేరా చట్టం పై ప్రజలకు, నిర్మాణదారులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా 13 పాత జిల్లాలలో అవగాహన కార్యక్రమంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో నిర్మాణరంగం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. నిర్మాణరంగం అభివృద్ధికి, కొనుగోలుదారుల రక్షణ, సంక్షేమానికి రెరా చట్టం రూపొందించడం జరిగిందని అన్నారు. 500 చదరపు మీటర్లు విస్తీర్ణం లేదా ఎనిమిది అపార్ట్మెంట్లు పైబడిన ప్రతి ప్రాజెక్టు రేరా అథారిటీ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రేరా వద్ద రిజిస్ట్రేషన్ పొందని ప్రాజెక్టులపై ప్రాజెక్ట్ వ్యయంలో పది శాతం అపరాధం రుసుము విధించనున్నట్లు తెలిపారు. ఇప్పుడు వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోని ప్రాజెక్టులకు మార్చి 31 వరకు యాబది శాతం అపరాధ రుసుము సబ్సిడీతో రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించడం జరిగిందని, కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిర్మాణ రంగంలో వచ్చే సమస్యలు, ఫిర్యాదులు రేరా అథారిటీ ద్వారా మాత్రమే పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. నిర్మాణదారులు తాము చేపడుతున్న ప్రాజెక్టులలో వాస్తవంగా కల్పిస్తున్న సౌకర్యాలను మాత్రమే వినియోగదారులకు తెలియజేయాలని, అగ్రిమెంట్లో పొందుపరచుకోవాలని తెలిపారు. అగ్రిమెంట్లో పొందుపరిచిన విధంగా ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా, వసతులు కల్పించకపోయిన పోయినా ఫిర్యాదుల మేరకు రేరా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రెరా చట్టంపై నిర్మాణదారులు, కొనుగోలుదారులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రాజెక్టులు చేపట్టుటకు రిజిస్ట్రేషన్, త్రైమాసిక నివేదికలు సమర్పణ, ప్రాజెక్టు పూర్తయిన పిదప అపార్ట్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి వారికి అప్పగించడం ద్వారా రేరా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం జరుగుతుందన్నారు. అపార్ట్మెంట్ అప్పగించిన ఐదు సంవత్సరాల వరకు ఒప్పందం అమలులో ఉంటుందని తెలిపారు. 10 శాతం మార్టిగేజ్ స్థలం విడిపించుకోవాలన్నా, ప్రాజెక్టుకు బ్యాంకు రుణం పొందాలన్నా రేరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ తో పాటు రెరా అసిస్టెంట్ డైరెక్టర్ జివిజిఎస్ వరప్రసాద్, సభ్యులు రాజశేఖర్ రెడ్డి, కామేశ్వరరావు, శివారెడ్డి, వెంకటరత్నం, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, జె. కులదీప్ రెరా చట్టం–2016లోని ముఖ్య నిబంధనలు, ప్రాజెక్టుల నమోదు విధానం, సమయపాలన, ఆర్థిక పారదర్శకత, వినియోగదారుల హక్కులు మరియు బాధ్యతలు తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు. ప్రతినిధుల సందేహాలకు సమాధానాలు తెలిపారు.1
- 🙏😭1
- ఏడుల్ల బయ్యారం క్రాస్ రోడ్డు లో గల ఇంటి నెంబర్ 6-76/15 గల నల్లపు రమాదేవి ఇంటిని కిరాయికి తీసుకొని బేకరీనీ నడిపిస్తున్నాను నా వ్యాపారాన్ని చూసి జీర్ణించుకోలేక మా ఇంటి ఓనర్ ఏడుల్ల బయ్యారం గ్రామ పంచాయితీ సెక్రెటరీ జైపాల్ రెడ్డి ని బేకరీ వద్దకు పంపించి మీరు పంచాయతీ అనుమతి లేకుండా ఏ అర్హతతో మీరు షాపు నడుపుతున్నారు అని మీరు బేకరీ ని ఎలా నడుపుతారు నేను చూస్తా మీ అంతు చూడందే నేను మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ మాట్లాడినాడు ఇంటి ఓనర్ మరియు పంచాయతీ సెక్రెటరీ నేను ఒక తక్కువ కులం దానినీ అని కులవివక్షతో దుర్భాషలాడుతూ కులం పేరుతో నన్ను దూషించి ఆడపిల్ల అని కూడా చూడకుండా దుష్ప్రదజాలతో నాపై నా భర్త పై నా పిల్లలపై పంచాయతీ వాళ్ళని బేకరీ వద్దకి తీసుకొని వచ్చి దాడి చేసే సమయంలో బేకరీ సెటర్ని మూసివేసి షట్టర్ ముందు నిలబడి ఉండగా గుణపాలతో గొడ్డలితో దాడికి దిగినారు అదే క్రమంలో మేము అడ్డుకోగా పంచాయతీ సెక్రెటరీ నేను ఒక ప్రభుత్వ అధికారిని నాపై చేయి వేస్తారా నన్ను కొడతారా అంటూ మాపై తప్పుడు కేసు పెట్టి నా పిల్లలు చిన్న పిల్లలు అని చూడకుండా మమ్మల్ని భద్రాచలం సబ్ జైలుకి పంపినారు నేను నా భర్త 14 రోజులు రిమాండ్ లో ఉన్నాము మేము జైలు నుండి బయటకు వచ్చిన తరువాత నా బేకరీ షాప్ ని గుణపాలతో పగలగొట్టి బేకరీలో ఉన్న సామాన్లు మరియు విలువైన వస్తువులన్నీ ఇష్టానుసారంగా తీసేసినారు నా బేకరీ షాప్ లో ఉన్న సామాన్లన్నీ పోయినాయి అని పంచాయతీ సెక్రెటరీ గారిని అడగగా మీ సామాన్లు నేను ఇస్తాను నాది పూర్తి బాధ్యత అని మా పై అధికారులకు నా గురించి ఫిర్యాదు చేయవద్దు అని చెప్పి పంచాయతీ గుమస్తాతో తన దగ్గర ఉన్న పాత టీవీని పంపించినాడు పంచాయతీ సెక్రెటరీ తో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి ఇలా ఒక ప్రభుత్వ అధికారి అయినా ఏడూళ్ల బయ్యారం పంచాయతీ సెక్రెటరీ కులవివక్షతో తక్కువ కులం దాని అని నూటికి వచ్చినట్టు మాట్లాడిందే కాకుండా మా షాప్ ని గుణపాలతో పగలగొట్టి దానిలో ఉన్న విలువైన వస్తువులని తీసుకొని మాకు అన్యాయం చేసి నా కుటుంబం మొత్తం రోడ్డుపాలు చేసినారు మాకు జీవన ఉపాధి లేకుండా చేసినారు తక్షణమే ఏడూళ్ల బయ్యారం గ్రామపంచాయతీసెక్రటరీ జైపాల్ రెడ్డి పై ప్రభుత్వం చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను4