Shuru
Apke Nagar Ki App…
hi good eving evrone all the best friends good luck bye
Mahesh Mahi
hi good eving evrone all the best friends good luck bye
More news from Telangana and nearby areas
- నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో దివ్యాంగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లు రవి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా: 44 మంది దివ్యాంగులకు వాహనాలు పంపిణీ చేశారు డిగ్రీ విద్యార్థులకు 17 ల్యాప్‌టాప్‌లు, 2 సెల్‌ఫోన్లు అందజేశారు 20 మంది బాలికలకు సైకిళ్లు ఇచ్చారు 6 మోటార్ వీల్‌చైర్లు, 10 బ్యాటరీ ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు ఒక బ్యాటరీ ఆటోను లబ్ధిదారునికి అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి దివ్యాంగులతో ప్రత్యక్షంగా ముచ్చటించి, వారి సమస్యలు, యోగక్షేమాలు తెలుసుకున్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో కూడా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దివ్యాంగుల పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, సమాన గౌరవం మరియు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దివ్యాంగుల జీవనోపాధి మెరుగుదల, స్వయం ఆధారిత జీవనానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అధికారులు తెలిపారు. అలాగే పెన్షన్లు, సాయం నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన కొనసాగుతోందని స్పష్టం చేశారు.3
- తేజస్వి సూర్య మాట్లాడిన దాంట్లో ఏ తప్పూ లేదు – బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్1
- కర్నూలు జిల్లా నందవరం మండలం, పూలచింత గ్రామంలో ఎస్సీ కాలనీ నివాసులకు గత నెల రోజుల నుండి నీటి కొరత ఉంది అని అధికారులను కోరిన పట్టించుకునే నాధుడు లేకుండా అయిపోయిందనీ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరి అదేవిధంగా అధికారులు కూడా కులవివక్షత చూపించడం ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించడం జరిగింది . వెంటనే కలెక్టర్ చొరవ తీసుకొని పంచాయతీ సెక్రెటరీను సస్పెండ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. మా సమస్యలను పరిష్కరించకపోతే మా దళిత సంఘాలను కలుపుకొని ధర్నాలు, రాస్తారోకోలు,చేస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు పోతురాజు భాస్కర్, చంటి, బుజ్జన్న ,ఏలిష్, తదితరులు పాల్గొన్నారు.1
- ఎమ్మెల్యే కీలక ఆదేశాలు1
- కల్లుకుంటలో తాగి నీటి సమస్య చాలా ఉంది కుళాయి మోటర్ చెడిపోయిందంట దాన్ని పట్టించుకునే నాధుడు ఎవరూ లేరు దాన్ని రిపేర్ చేయాలని కోరుకుంటున్నాం1
- పురోగామి పాత్రికేయ సంఘ్ (భారత్)లో చేరదలచిన వారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గజానన్ బిడ్కర్ గారిని లేదా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గౌరవ్ బిడ్కర్ గారిని సంప్రదించగలరు. మొబైల్ నంబర్లు: 9890476595, 7680092628.1
- సీఎం శ్రీధర్ బాబు అంటూ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన యాంకర్1
- బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు పురస్కరించుకొని బ్రహ్మంగారి కాలజ్ఞాన విశిష్టతపై సదస్సు నిర్వహించడం జరిగింది. ముందుగా బ్రహ్మంగారి చిత్రపటానికి పూలమాలవేసి బ్రహ్మానంద చారి ఆలయ పూజారి శ్రీనివాసులు పూజలు నిర్వహించారు. అనంతరం సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు. భూత భవిష్యత్తు వర్తమానం తెలియజేసిన దేవాది దేవుడు వీరబ్రహ్మేంద్రస్వామిని ఆయన ఆరాధనలు జయంతులు ప్రభుత్వపరంగా నిర్వహించాలని జిల్లాకు గాని ఒక యూనివర్సిటీ కి గాని ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రవ్వల కొండను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చింతమాను మఠం నేల మఠం అభివృద్ధికి కృషి చేయాలని, బ్రహ్మంగారి మఠాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, ప్రసాద పథకం కింద 150 కోట్లు కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రీనివాసులు, నటలయ్య గాలి, దూదేకుల ఉసేని, కుమ్మరి వెంకటేశ్వర్లు, నర్సమ్మ, కరెంటు రాజు, భక్త బృందం పాల్గొన్నారు.1
- మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు, ప్రీతి రెడ్డి తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ఇటీవల ప్రధాని మోదీని, తాజాగా బీజేపీ కార్యాలయంలో తివారీని కలవడం కేవలం ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవ ఆహ్వానం కోసమేనని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె వివరించారు. దీంతో ఆమె పార్టీ మారుతున్నారనే ప్రచారానికి తెరపడింది.1