నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ ఘనంగా నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో దివ్యాంగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లు రవి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా: 44 మంది దివ్యాంగులకు వాహనాలు పంపిణీ చేశారు డిగ్రీ విద్యార్థులకు 17 ల్యాప్‌టాప్‌లు, 2 సెల్‌ఫోన్లు అందజేశారు 20 మంది బాలికలకు సైకిళ్లు ఇచ్చారు 6 మోటార్ వీల్‌చైర్లు, 10 బ్యాటరీ ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు ఒక బ్యాటరీ ఆటోను లబ్ధిదారునికి అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి దివ్యాంగులతో ప్రత్యక్షంగా ముచ్చటించి, వారి సమస్యలు, యోగక్షేమాలు తెలుసుకున్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో కూడా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దివ్యాంగుల పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, సమాన గౌరవం మరియు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దివ్యాంగుల జీవనోపాధి మెరుగుదల, స్వయం ఆధారిత జీవనానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అధికారులు తెలిపారు. అలాగే పెన్షన్లు, సాయం నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన కొనసాగుతోందని స్పష్టం చేశారు.
నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ ఘనంగా నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో దివ్యాంగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లు రవి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా: 44 మంది దివ్యాంగులకు
వాహనాలు పంపిణీ చేశారు డిగ్రీ విద్యార్థులకు 17 ల్యాప్‌టాప్‌లు, 2 సెల్‌ఫోన్లు అందజేశారు 20 మంది బాలికలకు సైకిళ్లు ఇచ్చారు 6 మోటార్ వీల్‌చైర్లు, 10 బ్యాటరీ ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు ఒక బ్యాటరీ ఆటోను లబ్ధిదారునికి అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి దివ్యాంగులతో ప్రత్యక్షంగా ముచ్చటించి, వారి సమస్యలు, యోగక్షేమాలు తెలుసుకున్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో కూడా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు
మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దివ్యాంగుల పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, సమాన గౌరవం మరియు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దివ్యాంగుల జీవనోపాధి మెరుగుదల, స్వయం ఆధారిత జీవనానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అధికారులు తెలిపారు. అలాగే పెన్షన్లు, సాయం నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన కొనసాగుతోందని స్పష్టం చేశారు.
- నంద్యాల జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామం ప్రధాన కూడలి వద్ద ఆర్భాటంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం అలంకారప్రాయంగా మారింది. ప్రారంభించిన రోజు మాత్రమే నీరు నింపారని, మరుసటి రోజు నుంచి కుండల్లో నీరు నింపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల దాహం తీర్చుకోవడానికి వచ్చేవారు ఖాళీ కుండలను చూసి నిరాశతో వెను తిరుగుతున్నారు. తూతూమంత్రంగా ఏర్పాటు చేసి వదిలేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండలంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం కేంద్రంలలో ఉన్న కుండలలో నీరు నింపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.1
- కేసీఆర్ ఉన్నప్పుడు మమ్మల్ని దేవుడిలాగా ఆదుకున్నాడు.. గతంలో కేసీఆర్ నా ఆటో ఫిట్‌నెస్ డబ్బులు మాఫీ చేశాడు రూ.35000 ఆటో ఫిట్‌నెస్ డబ్బులు కడదామని నా భార్య బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుపోతే పోతే.. కేసీఆర్ మాఫీ చేస్తున్నాడని అధికారి చెప్తే నేను చాలా సంతోషించాను కానీ రేవంత్ రెడ్డి మమ్మల్ని రోడ్డు మీద పడేశాడు నిన్న ఆర్టీసీ వాళ్ళతో మంత్రులందరూ మాట్లాడారు.. మరి మాతో మాట్లాడరా, మా కన్నీళ్లు తుడవరా మీరు ఇస్తాను అన్న రూ.12 వేలు మాకొద్దు.. డిస్ట్రిక్ట్ ఆటో హైదరాబాద్ సిటీలోకి రాకుండా చేయండి చాలు రాహుల్ గాంధీ పెద్ద చోర్.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు రేవంత్ రెడ్డిది కూడా రాను రాను మా బ్రతుకే అవుతుంది.. ఆయనని ప్రజలు రాళ్లతో కొడతారు రాగానే కంచెలు బద్దలు కొట్టాము మీరు ధర్నా చేసుకోవచ్చు అని చెప్పాడు.. ఇప్పుడు ధర్నా చేస్తుంటే పోలీసులు ఈడ్చుకెళ్తున్నారు - హైదరాబాద్ ఆటో డ్రైవర్1
- ఎమ్మెల్యే కీలక ఆదేశాలు1
- పురోగామి పాత్రికేయ సంఘ్ (భారత్)లో చేరదలచిన వారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గజానన్ బిడ్కర్ గారిని లేదా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గౌరవ్ బిడ్కర్ గారిని సంప్రదించగలరు. మొబైల్ నంబర్లు: 9890476595, 7680092628.1
- నర్సాపూర్ మున్సిపాలిటీ నగరాభివృద్ధికి అభివృద్ధికి రూ.15కోట్లు *ప్రజల శ్రేయస్సే లక్ష్యం – ప్రజాప్రతినిధులు సేవాభావంతో పనిచేయాలి* సంబరంగా ఇందిరమ్మ గృహప్రవేశాలు నారాయణపూర్ గ్రామాల్లో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నర్సాపూర్ మున్సిపాలిటీ 04 ,6 వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నర్సాపూర్ పర్యటనలో తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భ శాస్త్ర మంత్రిత్వ శాఖల మంత్రివర్యులు మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటన నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భ శాస్త్ర మంత్రిత్వ శాఖల మరియు మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి ,జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ , మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ రాజ యాదవ్ , గ్రంధాలయ చైర్మన్ చిలె మల సుహాసినిరెడ్డి, మెదక్ ఆర్డీవో రమాదేవి, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజి రెడ్డి ప్రజా ప్రతినిధులతో కలిసి, మంత్రి పాల్గొన్నారు మొదటిగా నగర అభివృద్ధి పథకం కింద నర్సాపూర్ మున్సిపాలిటీ లో 15 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మ రెడ్డి తో మెదక్ కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు పర్యటనలో భాగంగా మంత్రి నర్సాపూర్ 04,,06 వ వార్డులలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వార్డ్ (4th) దుద్దాల దుర్గమ్మ భర్త అశోక్ 6th వార్డు మహమ్మద్ షకీరా బేగం భర్త యూసఫ్ ఉద్దీన్ గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని, పూజలు నిర్వహించి లబ్ధిదారులతో కలిసి గృహాలను ప్రారంభించారు. అనంతరం నారాయణపూర్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమ సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా బడిబాట కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు సూచించారు. . మున్సిపాలిటీ నగరాభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాజకీయాలకు అతీతంగా అందరికీ సమానంగా అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేయాలని సూచించారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు ప్రతిరోజూ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలతో నిత్యం ఉంటూ ఉదయం, సాయంత్రం సమయం కేటాయిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం పని చేస్తుందని, ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతగా ప్రజలకు సేవ చేయాలని మంత్రి కోరారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు అధికారులతో సమన్వయం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందించే విధంగా విద్యావ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు .ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తున్నామని నమోదు పెంచుకోవాలని ఆ దిశలో జరిగే బడిబాట కార్యమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దారులు, జ1
- కల్లుకుంటలో తాగి నీటి సమస్య చాలా ఉంది కుళాయి మోటర్ చెడిపోయిందంట దాన్ని పట్టించుకునే నాధుడు ఎవరూ లేరు దాన్ని రిపేర్ చేయాలని కోరుకుంటున్నాం1
- కర్నూలు జిల్లా నందవరం మండలం, పూలచింత గ్రామంలో ఎస్సీ కాలనీ నివాసులకు గత నెల రోజుల నుండి నీటి కొరత ఉంది అని అధికారులను కోరిన పట్టించుకునే నాధుడు లేకుండా అయిపోయిందనీ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరి అదేవిధంగా అధికారులు కూడా కులవివక్షత చూపించడం ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించడం జరిగింది . వెంటనే కలెక్టర్ చొరవ తీసుకొని పంచాయతీ సెక్రెటరీను సస్పెండ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. మా సమస్యలను పరిష్కరించకపోతే మా దళిత సంఘాలను కలుపుకొని ధర్నాలు, రాస్తారోకోలు,చేస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు పోతురాజు భాస్కర్, చంటి, బుజ్జన్న ,ఏలిష్, తదితరులు పాల్గొన్నారు.1
- తేజస్వి సూర్య మాట్లాడిన దాంట్లో ఏ తప్పూ లేదు – బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్1
- మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు, ప్రీతి రెడ్డి తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ఇటీవల ప్రధాని మోదీని, తాజాగా బీజేపీ కార్యాలయంలో తివారీని కలవడం కేవలం ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవ ఆహ్వానం కోసమేనని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె వివరించారు. దీంతో ఆమె పార్టీ మారుతున్నారనే ప్రచారానికి తెరపడింది.1