Shuru
Apke Nagar Ki App…
బుక్కాపురం చలివేంద్రంలో తాగునీరు ఉందని వెళితే.. ఖాళీ కుండలు దర్శనం.. నిరాశ చెందిన ప్రజలు నంద్యాల జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామం ప్రధాన కూడలి వద్ద ఆర్భాటంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం అలంకారప్రాయంగా మారింది. ప్రారంభించిన రోజు మాత్రమే నీరు నింపారని, మరుసటి రోజు నుంచి కుండల్లో నీరు నింపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల దాహం తీర్చుకోవడానికి వచ్చేవారు ఖాళీ కుండలను చూసి నిరాశతో వెను తిరుగుతున్నారు. తూతూమంత్రంగా ఏర్పాటు చేసి వదిలేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండలంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం కేంద్రంలలో ఉన్న కుండలలో నీరు నింపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
Naga kanth
బుక్కాపురం చలివేంద్రంలో తాగునీరు ఉందని వెళితే.. ఖాళీ కుండలు దర్శనం.. నిరాశ చెందిన ప్రజలు నంద్యాల జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామం ప్రధాన కూడలి వద్ద ఆర్భాటంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం అలంకారప్రాయంగా మారింది. ప్రారంభించిన రోజు మాత్రమే నీరు నింపారని, మరుసటి రోజు నుంచి కుండల్లో నీరు నింపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల దాహం తీర్చుకోవడానికి వచ్చేవారు ఖాళీ కుండలను చూసి నిరాశతో వెను తిరుగుతున్నారు. తూతూమంత్రంగా ఏర్పాటు చేసి వదిలేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండలంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం కేంద్రంలలో ఉన్న కుండలలో నీరు నింపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- Post by Mahesh Mahi1
- నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో దివ్యాంగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లు రవి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా: 44 మంది దివ్యాంగులకు వాహనాలు పంపిణీ చేశారు డిగ్రీ విద్యార్థులకు 17 ల్యాప్‌టాప్‌లు, 2 సెల్‌ఫోన్లు అందజేశారు 20 మంది బాలికలకు సైకిళ్లు ఇచ్చారు 6 మోటార్ వీల్‌చైర్లు, 10 బ్యాటరీ ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు ఒక బ్యాటరీ ఆటోను లబ్ధిదారునికి అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి దివ్యాంగులతో ప్రత్యక్షంగా ముచ్చటించి, వారి సమస్యలు, యోగక్షేమాలు తెలుసుకున్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో కూడా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దివ్యాంగుల పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, సమాన గౌరవం మరియు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దివ్యాంగుల జీవనోపాధి మెరుగుదల, స్వయం ఆధారిత జీవనానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అధికారులు తెలిపారు. అలాగే పెన్షన్లు, సాయం నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన కొనసాగుతోందని స్పష్టం చేశారు.3
- బద్వేలు, ఏప్రిల్ 24: పట్టణంలోని జాంబవంత నగర్ కోదండ రామాలయం వీధిలో శ్రీకృష్ణ కోలాటం మాస్టర్ వెంకటేశ్వర్లు గురూజీ ద్వారా కోలాటం నేర్చుకుంటున్న కాలనీలోని చిన్నారులు.. త్వరలోనే శ్రీ కోదండరామలయం ప్రారంభోత్సవం కానున్న తరుణంలో చిన్నారులు ఊరేగింపు కోలాట ప్రదక్షణ చేయుటకు కోలాటం నేర్చుకోవడం జరుగుతుంది.1
- కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం లో పెట్రోల్ డీజిల్ కొరత ప్రజలను వినియోగదారులను వేధిస్తోంది.. మైదుకూరు పట్టణంలో ని అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.. జిల్లా కేంద్రం నుండి డీజిల్ పెట్రోల్ సరఫరా కాకపోవడం బంకు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. బుక్ చేసిన తర్వాత నాలుగు నుండి ఐదు రోజులు పడుతుంది ఈ పరిస్థితి ఏర్పడుతుందని యజమానులు తెలుపుతున్నారు.. పెట్రోల్ బంకుల ఎదుట వాహనదారులు క్యూ కట్టారు.. పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందన్న అనుమానంతో వాహనదారులు ఎగబడి క్యాన్లలో సైతం పెట్రోలు నింపుకొని వెళ్తున్న వినియోగదారులు .. ప్రభుత్వ అధికారులు స్పందించి డీజిల్ పెట్రోల్ కొత్తలేకుండా చూడాలని వినియోదారులు ప్రజలు వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు..1
- కర్నూలు జిల్లా.... ఆలూరు నియోజకవర్గం... త్రాగు నీటి కోసం పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన మహిళలు హోళగుoద మండల కేంద్రంలో త్రాగునీటిని అందించాలని కాలి బిందెలు తో నిరసన తెలిపిన మహిళలు. గుక్కెడు నీటి కోసం పడరాని పడుబాట్లు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం. తమకు నీరు అందించాలని డిమాండ్ చేసిన మహిళలు ....2
- అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బుసాని కురపల్లికి చెందిన బాతిన్నగారి చంద్రప్పకు చెందిన గొర్రెల షెడ్డులోకి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుక్కలు చొరబడి దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటనతో దాదాపు రూ.3.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న తనకు ఇది భారీ దెబ్బగా మారిందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.1
- బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు పురస్కరించుకొని బ్రహ్మంగారి కాలజ్ఞాన విశిష్టతపై సదస్సు నిర్వహించడం జరిగింది. ముందుగా బ్రహ్మంగారి చిత్రపటానికి పూలమాలవేసి బ్రహ్మానంద చారి ఆలయ పూజారి శ్రీనివాసులు పూజలు నిర్వహించారు. అనంతరం సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు. భూత భవిష్యత్తు వర్తమానం తెలియజేసిన దేవాది దేవుడు వీరబ్రహ్మేంద్రస్వామిని ఆయన ఆరాధనలు జయంతులు ప్రభుత్వపరంగా నిర్వహించాలని జిల్లాకు గాని ఒక యూనివర్సిటీ కి గాని ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రవ్వల కొండను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చింతమాను మఠం నేల మఠం అభివృద్ధికి కృషి చేయాలని, బ్రహ్మంగారి మఠాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, ప్రసాద పథకం కింద 150 కోట్లు కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రీనివాసులు, నటలయ్య గాలి, దూదేకుల ఉసేని, కుమ్మరి వెంకటేశ్వర్లు, నర్సమ్మ, కరెంటు రాజు, భక్త బృందం పాల్గొన్నారు.1
- ట్రాక్టర్ ట్రాలీ నుంచి పడి కూలీకి తీవ్ర గాయాలు మదనపల్లె మండలంలో ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పడి ఓ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. తట్టివారిపల్లెకు చెందిన ఆదినారాయణ(62) కూలీ పనుల కోసం ట్రాక్టర్‌తో మట్టి తరలింపులో పాల్గొన్నాడు. బైపాస్ రోడ్డులో వెళ్తుండగా ట్రాలీ డోర్ ఊడిపోవడంతో ఆయన కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.1
- *అటవీ భూముల్లో మట్టి మాఫియా పంజా..* *వెంకుపాలెంలో గ్రామస్థుల గర్జన!* **దిశ వినుకొండ:** అక్రమార్కుల ఆకలికి ప్రభుత్వ భూములు కరిగిపోతున్నాయి. కళ్లముందే కోట్లాది రూపాయల విలువైన సంపద దోపిడీకి గురవుతున్నా.. అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెం గ్రామం వద్ద అక్రమ మట్టి మాఫియా బరితెగించింది. సర్వే నంబర్ 1లోని సుమారు 89 ఎకరాల అటవీ భూముల్లో యథేచ్ఛగా సాగుతున్న తవ్వకాలను గ్రామస్థులు అడ్డుకుని నిరసన తెలిపారు. *కోట్లలో వ్యాపారం..* *సామాన్యులకు మాత్రం ఆంక్షలు!* వెంకుపాలెం గ్రామ సమీపంలోని అటవీ భూముల్లో ఉన్న మేలిరకం ఎర్రమట్టిపై మాఫియా కన్ను పడింది. భారీ జేసీబీలతో భూమిని తవ్వేస్తూ, టిప్పర్ల ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయిస్తూ అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు. "గ్రామ అవసరాల కోసం ఒక తట్ట మట్టి తీసుకెళ్లాలన్నా స్థానికులను వేధిస్తున్నారు.. కానీ, మాఫియా పగలు రేయి తేడా లేకుండా వేల టిప్పర్ల మట్టిని తరలిస్తుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా నిలిచిన టిప్పర్లే ఇక్కడ జరుగుతున్న దోపిడీకి సజీవ సాక్ష్యాలని వారు చూపుతున్నారు. *అధికారుల 'వాటాల' పర్వం.. అడ్డుకోకుంటే ఉద్యమమే!* ఈ స్థాయిలో దోపిడీ జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాఫియా నుంచి అధికారులకు భారీగా 'వాటాలు' అందుతున్నాయని, అందుకే ఈ అక్రమ రవాణాను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని గ్రామస్థులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దోపిడీని అడ్డుకోకపోతే, గ్రామస్థులంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.3