Shuru
Apke Nagar Ki App…
చింతకుంట గ్రామం సమీపంలో ప్రధాన రహదారిలో అదుపుతప్పి లారీ బోల్తా ముద్దనూరు మండల పరిధిలోని చింతకుంట గ్రామం సమీపంలో ప్రధాన రహదారిపై తీవ్ర ప్రమాదం తృప్తిలో తప్పింది. నెల్లూరు నుంచి కర్ణాటకలోని బళ్లారికి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.అయితే లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ ప్రాణపాయం నుంచి సురక్షితంగా బయటపడటంతో పాటు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
LAKKU SIVA SANKAR reddy
చింతకుంట గ్రామం సమీపంలో ప్రధాన రహదారిలో అదుపుతప్పి లారీ బోల్తా ముద్దనూరు మండల పరిధిలోని చింతకుంట గ్రామం సమీపంలో ప్రధాన రహదారిపై తీవ్ర ప్రమాదం తృప్తిలో తప్పింది. నెల్లూరు నుంచి కర్ణాటకలోని బళ్లారికి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.అయితే లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ ప్రాణపాయం నుంచి సురక్షితంగా బయటపడటంతో పాటు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- తక్కువ ధరకే బియ్యం.. స్కీమ్ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ AP: ప్రజలకు తక్కువ ధరకే బియ్యం అందించే పథకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ విజయవాడలో ప్రారంభించారు. కేజీ రూ.62 విలువ గల BPT సూపర్ ఫైన్ బియ్యం రూ.52కు, రూ.58 ధర పలికే గ్రేడ్-1 రా రైస్ రూ.50కి అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో విక్రయాలు కొనసాగుతాయి. ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కో కుటుంబానికి నెలకు 10 కిలోల బియ్యం ఇస్తారు.1
- కాణిపాకంలో పోటాపోటీ సత్యప్రమాణాలు.. రాజకీయాల్లో కలకలం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ కోనేరులో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత హర్షిత, టీడీపీ నేత, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం వేర్వేరుగా సత్యప్రమాణాలు చేశారు. ఎన్నికలకు ముందు షణ్ముగం వైసీపీ చిత్తూరు అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని హర్షిత స్వామి సాక్షిగా ఆరోపించారు. అయితే తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని షణ్ముగం కూడా అదే కోనేరులో సత్యప్రమాణం చేస్తూ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటన కాణిపాకం, చిత్తూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆరోపణలు, ఖండనలు సంబంధిత వ్యక్తుల వాదనలే; వాటిపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది. కాణిపాకంలో పోటాపోటీ సత్యప్రమాణాలు.. రాజకీయాల్లో కలకలం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ కోనేరులో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత హర్షిత, టీడీపీ నేత, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం వేర్వేరుగా సత్యప్రమాణాలు చేశారు. ఎన్నికలకు ముందు షణ్ముగం వైసీపీ చిత్తూరు అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని హర్షిత స్వామి సాక్షిగా ఆరోపించారు. అయితే తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని షణ్ముగం కూడా అదే కోనేరులో సత్యప్రమాణం చేస్తూ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటన కాణిపాకం, చిత్తూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆరోపణలు, ఖండనలు సంబంధిత వ్యక్తుల వాదనలే; వాటిపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది.1
- బద్వేలు, ఆగస్టు 01: స్మార్ట్ కిచెన్ పేరుతో బద్వేలు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కడుపులు మాడ్చుతున్నారని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) పట్టణ కార్యదర్శి ఎస్.కె.ఆదిల్, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకులు టి.నాగేంద్ర బాబు ఆరోపించారు.బద్వేలులోని స్థానిక ఎమ్మార్సీ వద్ద ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వేలాపాలా లేకుండా నాణ్యతలేని భోజనాన్ని ఇష్టారాజ్యంగా అందజేయడాన్ని నిరసిస్తూ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎస్.కె.ఆదిల్, ఎస్ఎఫ్ఐ నాయకులు టి.నాగేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అమలు చేసిన స్మార్ట్ కిచెన్ విధానంలో భాగంగా బద్వేలు మండల పరిధిలోని చిన్నకేశం పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్మార్ట్ కిచెన్ ను ఏర్పాటు చేశారన్నారు. స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసినప్పటి నుండి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. అలాగే సమయపాలన లేకుండా ఇష్టారాజ్యంగా భోజనాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలల షెడ్యూల్ ప్రకారం 12.15 నిమిషాలకు విద్యార్థులకు భోజనాన్ని అందజేయాల్సి ఉండగా పలు పాఠశాలల్లో 2 గంటలు దాటిన తర్వాత కూడా భోజనం సరఫరా చేస్తున్నారన్నారు. స్మార్ట్ కిచెన్ వారు భోజన సరఫరాకు తగినన్ని వాహనాలు, తగినన్ని వంట పాత్రలు ఏర్పాటు చేసుకోకపోవడం మూలాన దూర ప్రాంతాలకు చాలా ఆలస్యంగా భోజనం అందుతున్నదన్నారు. భోజనం ఆలస్యం కారణంగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తూ పలు పాఠశాలల్లో కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలున్నాయని ఆయన ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్తారని, భోజనం ఆలస్యమైనప్పుడు విద్యార్థులు ఇళ్లకు వెళ్లి తినే అవకాశం కూడా లేదన్నారు. బద్వేల్ మండలంలో స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఐదారుసార్లు మండల పరిధిలోని విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత భోజనం సరఫరా చేశారన్నారు. భోజనం కోసం పిల్లలు గంటలు గంటలు నిరీక్షించాల్సి రావడం దారుణమన్నారు. స్మార్ట్ కిచెన్ నిర్వాహకులు మెనూ కూడా సక్రమంగా అనుసరించడం లేదని, వారి ఇష్టారాజ్యంగా భోజనం పెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం స్మార్ట్ కిచెన్ ద్వారా నెరవేరడం లేదని పేర్కొన్నారు. రుచి లేని ఆహార పదార్థాలను విద్యార్థులకు వడ్డిస్తున్నారని వారు ఆరోపించారు. గంటలు గంటలు ఆలస్యం కావడం వల్ల పాఠశాలల్లో తరగతులు కూడా విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పత్రికల్లో కథనాలు వచ్చాయని, సాక్షాత్తు జిల్లా విద్యాశాఖ అధికారి ఆరోపణలపై విచారణకు వచ్చారని తెలిపారు. అయినప్పటికీ పరిస్థితులలో ఎలాంటి మార్పులు లేవని వారు ఆరోపించారు. మెనూ ప్రకారం వారంలో రెండు మార్లు గుడ్డు కూర, మూడు సార్లు ఉడకబెట్టిన గుడ్డును అందజేయాల్సి ఉండగా, గుడ్డు కూర ఇవ్వకుండా ఉడకబెట్టిన గుడ్డును అందజేస్తున్నారన్నారు. ఈ విషయంలో బద్వేలు మండల విద్యాశాఖ అధికారి సక్రమంగా స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకొని నాణ్యమైన భోజనాన్ని, కాలంలో అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్, విద్యా శాఖ మంత్రి కి ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి సి.సుధాకర్, నాయకులు రామాంజనేయులు, అబ్దుల్ రెహమాన్, రాజు, భాష తదితరులు పాల్గొన్నారు.1
- కాణిపాకం ఆలయంలో భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి వ్రతం నిర్వహణ కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆదివారం సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు.1
- చింతకుంట గ్రామం సమీపంలో ప్రధాన రహదారిలో అదుపుతప్పి లారీ బోల్తా ముద్దనూరు మండల పరిధిలోని చింతకుంట గ్రామం సమీపంలో ప్రధాన రహదారిపై తీవ్ర ప్రమాదం తృప్తిలో తప్పింది. నెల్లూరు నుంచి కర్ణాటకలోని బళ్లారికి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.అయితే లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ ప్రాణపాయం నుంచి సురక్షితంగా బయటపడటంతో పాటు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.1