logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పశువుల కొట్టంగా మారిన నూతన అంగన్వాడి కేంద్రం పట్టించుకోని అధికారులు ఆగస్టు 1 మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని చింతగూడ ఎస్సీ కాలనీలో నిర్మించిన అంగన్వాడి కేంద్రాన్ని పునాదుల నుండి స్లాబ్ వేసి బిల్లు రాలేదంటూ కాంట్రాక్టర్ చెప్తున్నాడు ఎప్పుడు పూర్తి చేస్తారు అని కాలనీ వాసులు అడగగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు వచ్చే బిల్లులు రాలేవని ఇప్పటికే అప్పులు చేసి అంగన్వాడి కేంద్రాన్ని కట్టుతున్నప్పటికీ బిల్లులు రాలేవని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు స్పందించడం లేదని బిల్లులు వచ్చాక అంగన్వాడి కేంద్రాన్ని పూర్తి చేస్తామని అంటున్నారు ఇదిలా ఉంటే నూతన అంగన్వాడి కేంద్రాన్ని కొంతమంది వ్యక్తులు పశువుల కొట్టంగా ఆవులను కట్టేసి వాడుకుంటున్నారు ఇప్పటికైనా మండల అధికారులు జిల్లా అధికారులు స్పందించి వెంటనే ఈ యొక్క అంగన్వాడి కేంద్రం పనులను తొందరగా పూర్తి చేయాలని అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు

2 hrs ago
user_కండ్లే శ్రావణ్ కుమార్
కండ్లే శ్రావణ్ కుమార్
మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
2 hrs ago
75733e2d-134c-4936-b77e-c87478c65db0

పశువుల కొట్టంగా మారిన నూతన అంగన్వాడి కేంద్రం పట్టించుకోని అధికారులు ఆగస్టు 1 మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని చింతగూడ ఎస్సీ కాలనీలో నిర్మించిన అంగన్వాడి కేంద్రాన్ని పునాదుల నుండి స్లాబ్ వేసి బిల్లు రాలేదంటూ కాంట్రాక్టర్ చెప్తున్నాడు ఎప్పుడు పూర్తి చేస్తారు అని కాలనీ వాసులు అడగగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు వచ్చే బిల్లులు రాలేవని ఇప్పటికే అప్పులు చేసి అంగన్వాడి కేంద్రాన్ని కట్టుతున్నప్పటికీ బిల్లులు రాలేవని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు స్పందించడం లేదని బిల్లులు వచ్చాక అంగన్వాడి కేంద్రాన్ని పూర్తి చేస్తామని అంటున్నారు ఇదిలా ఉంటే నూతన అంగన్వాడి కేంద్రాన్ని కొంతమంది వ్యక్తులు పశువుల కొట్టంగా ఆవులను కట్టేసి వాడుకుంటున్నారు ఇప్పటికైనా మండల అధికారులు జిల్లా అధికారులు స్పందించి వెంటనే ఈ యొక్క అంగన్వాడి కేంద్రం పనులను తొందరగా పూర్తి చేయాలని అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు

More news from తెలంగాణ and nearby areas
  • స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు బాగు చేసిన 28వ వార్డు యువకులు రోడ్లు అధ్వానంగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా, అటు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం, స్వచ్ఛంద సంస్థలు పట్టించుకోకపోవడంతో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డ్, పోలీస్ స్టేషన్ ను అనుకొని ఉన్న రహదారి గత కొంతకాలంగా గుంతలు పడి అద్వానంగా మారింది. దీంతో ఈదారి గుండా ప్రయాణించాలంటే 28వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలలో వాహనాలు ప్రయాణించడం వల్ల వాహనాలు వారానికి ఒకసారి రిపేర్లు వచ్చి ఆర్థికంగా జేబులకు చిల్లు పడుతుందని ప్రజలు వాపోయారు. రహదారి దుస్థితిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో 28వ వార్డుకు చెందిన యువకులు మూడెత్తుల శివశంకర్, రాళ్లబండి శ్రీనాథ్, మూడేత్తుల సాయిరాంలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిమెంట్, కంకరతో రోడ్డుకు మరమ్మతులు చేశారు. ప్రమాదాలను నివారించేందుకు యువకులు తమ సొంత డబ్బుతో గుంతలను పూడ్చి రోడ్లను బాగు చేయడం పట్ల వార్డ్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
    1
    స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు బాగు చేసిన 28వ వార్డు యువకులు 
రోడ్లు అధ్వానంగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా, అటు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం, స్వచ్ఛంద సంస్థలు పట్టించుకోకపోవడంతో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డ్, పోలీస్ స్టేషన్ ను అనుకొని ఉన్న రహదారి గత కొంతకాలంగా గుంతలు పడి అద్వానంగా మారింది. దీంతో ఈదారి గుండా ప్రయాణించాలంటే 28వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలలో వాహనాలు ప్రయాణించడం వల్ల వాహనాలు వారానికి ఒకసారి రిపేర్లు వచ్చి ఆర్థికంగా జేబులకు చిల్లు పడుతుందని ప్రజలు వాపోయారు. రహదారి దుస్థితిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో 28వ వార్డుకు చెందిన యువకులు మూడెత్తుల శివశంకర్, రాళ్లబండి శ్రీనాథ్, మూడేత్తుల సాయిరాంలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిమెంట్, కంకరతో రోడ్డుకు మరమ్మతులు చేశారు. ప్రమాదాలను నివారించేందుకు యువకులు తమ సొంత డబ్బుతో గుంతలను పూడ్చి రోడ్లను బాగు చేయడం పట్ల వార్డ్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
    user_Bellampalli news
    Bellampalli news
    Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    19 hrs ago
  • బహిరంగ మద్యం సేవనంపై నిషేధాజ్ఞలు : రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ప్రజలు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బహిరంగ మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు సిపి తెలిపారు.
    1
    బహిరంగ మద్యం సేవనంపై నిషేధాజ్ఞలు : రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా
ప్రజలు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బహిరంగ మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు సిపి తెలిపారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    13 hrs ago
  • ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: ఎమ్మెల్యే గంగుల కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లో విమర్శించారు.బీఆర్‌ఎస్ హయాంలో లైఫ్ ట్యాక్స్ మినహాయింపు,రూ.5 లక్షల ఉచిత ప్రమాద భీమా,చలాన్ల రద్దు అందించామని గుర్తుచేశారు.కాంగ్రెస్ ప్రకటించిన రూ.12 వేల సాయం,రూ.1,000 కోట్లతో సంక్షేమ బోర్డు హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ఆటో కార్మికులతో కలిసి ఆందోళనలు చేపడతామన్నారు.
    2
    ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: ఎమ్మెల్యే గంగుల
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లో విమర్శించారు.బీఆర్‌ఎస్ హయాంలో లైఫ్ ట్యాక్స్ మినహాయింపు,రూ.5 లక్షల ఉచిత ప్రమాద భీమా,చలాన్ల రద్దు అందించామని గుర్తుచేశారు.కాంగ్రెస్ ప్రకటించిన రూ.12 వేల సాయం,రూ.1,000 కోట్లతో సంక్షేమ బోర్డు హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ఆటో కార్మికులతో కలిసి ఆందోళనలు చేపడతామన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    33 min ago
  • మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం
జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది. అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.
    2
    కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది.
అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు.
కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బిసి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బిసి సంఘం ఆధ్వర్యంలో  కలెక్టరేట్ ముట్టడి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
  • సింగరేణి పరిరక్షణకు కార్మికులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం :BMS గత BRS ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి లో జోక్యం కారణంగా నష్ట పోతుందని bms నాయకులు ఆరోపించారు.
    1
    సింగరేణి పరిరక్షణకు కార్మికులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం :BMS 
గత BRS ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి లో జోక్యం కారణంగా నష్ట పోతుందని bms నాయకులు ఆరోపించారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    13 hrs ago
  • *మందమర్రి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్* వార్షిక తనిఖీలలో భాగంగా శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ బెల్లంపల్లి సబ్‌డివిజన్‌లోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తనిఖీ చేశారు స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, స్టేషన్‌లోని వివిధ రకాల కీలక రికార్డులు, శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిర్యాదులు,కేసులను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని, సీసీటీఎన్‌ఎస్‌లో నమోదులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. కోర్టులతో సమన్వయంతో పనిచేసి ఎక్కువ కేసుల్లో శిక్షలు అమలయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు రక్షణ, భద్రత కల్పించడం పోలీసుల ప్రాథమిక విధి,బాధ్యత అని పేర్కొన్నారు.సిబ్బంది విధులను నిరంతరం పర్యవేక్షిస్తూ,వారు సమర్థవంతంగా పనిచేసేలా వారి నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై నేరాల నివారణకు కృషి చేయాలని అన్నారు.ఈ తనిఖీలో మందమర్రి సీఐ పి. రమేష్, మందమర్రి ఎస్‌ఐ నరేష్, police station staff పాల్గొన్నారు.
    4
    *మందమర్రి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన బెల్లంపల్లి ఏసీపీ  కిరణ్ కుమార్*
వార్షిక తనిఖీలలో భాగంగా శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ బెల్లంపల్లి సబ్‌డివిజన్‌లోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తనిఖీ చేశారు స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, స్టేషన్‌లోని వివిధ రకాల కీలక రికార్డులు, శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఫిర్యాదులు,కేసులను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని, సీసీటీఎన్‌ఎస్‌లో నమోదులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. కోర్టులతో సమన్వయంతో పనిచేసి ఎక్కువ కేసుల్లో శిక్షలు అమలయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు రక్షణ, భద్రత కల్పించడం పోలీసుల ప్రాథమిక విధి,బాధ్యత అని పేర్కొన్నారు.సిబ్బంది విధులను నిరంతరం పర్యవేక్షిస్తూ,వారు సమర్థవంతంగా పనిచేసేలా వారి నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై నేరాల నివారణకు కృషి చేయాలని అన్నారు.ఈ తనిఖీలో మందమర్రి సీఐ పి. రమేష్, మందమర్రి ఎస్‌ఐ నరేష్, police station staff పాల్గొన్నారు.
    user_పవన్ చారి
    పవన్ చారి
    బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.