logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బాన్సువాడ మండలం : తాడ్కోల్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ అందే రమేష్ కుమార్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్లో ఎన్ఆర్ఆజీఎస్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి సర్పంచ్ అందే రమేశ్ కుమార్ సోమవారం భూమి పూజ నిర్వహించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాజిద్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, వార్డ్ మెంబర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

7 hrs ago
user_Narmala Swapna
Narmala Swapna
Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
7 hrs ago

బాన్సువాడ మండలం : తాడ్కోల్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ అందే రమేష్ కుమార్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్లో ఎన్ఆర్ఆజీఎస్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి సర్పంచ్ అందే రమేశ్ కుమార్ సోమవారం భూమి పూజ నిర్వహించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాజిద్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, వార్డ్ మెంబర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పన్ను చెల్లింపుదారులకు ఒక శుభవార్త. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఏప్రిల్ 30వ తేదీ లోపు చెల్లించినట్లయితే, 5 శాతం రాయితీ లభిస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు. పన్ను చెల్లింపుదారులు మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండానే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఆన్లైన్లో సులభంగా పన్ను చెల్లించవచ్చని ఆమె సూచించారు.
    1
    కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పన్ను చెల్లింపుదారులకు ఒక శుభవార్త. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఏప్రిల్ 30వ తేదీ లోపు చెల్లించినట్లయితే, 5 శాతం రాయితీ లభిస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు. పన్ను చెల్లింపుదారులు మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండానే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఆన్లైన్లో సులభంగా పన్ను చెల్లించవచ్చని ఆమె సూచించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • ప్రజావాణి విజ్ఞప్తులను సత్వర పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వివిధ సమస్యలపై ప్రజల నుండి 98 దరఖాస్తుల స్వీకరణ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు, విజ్ఞప్తులకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ , జడ్పీ సీఈఓ ఎల్లయ్య, లతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వస్తున్న ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారుడికి తెలియజేస్తూ లిఖితపూర్వక వివరణ అందజేయాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 98 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
    1
    ప్రజావాణి విజ్ఞప్తులను సత్వర పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
వివిధ సమస్యలపై ప్రజల నుండి 98 దరఖాస్తుల స్వీకరణ
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు, విజ్ఞప్తులకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ , జడ్పీ సీఈఓ ఎల్లయ్య, లతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వస్తున్న ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.
ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారుడికి తెలియజేస్తూ లిఖితపూర్వక వివరణ అందజేయాలన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం  98 దరఖాస్తులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు , తదితరులు  పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా లోని యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లోగో పోస్టర్ ను సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ఆవిష్కరించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ . ఈ సందర్భంగా మీడియాతో వినోద్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో రెండు మున్సిపాలిటీల నుండి 157 జట్లు 175 మ్యాచులు 2512 మంది క్రీడాకారులతో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ఈ నెల 15 నుండి 25 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో ఉన్న క్రికెట్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.క్రీడాకారులను ప్రోత్సహించాలన్న సంకల్పం తో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసుకుని ముందుకు పోతున్న తరుణం లో ఎన్నికల్లో తమ ప్రభుత్వం రాలేదని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలని ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయని అన్నారు.యువత చెడు వ్యసనాలకు గురికాకుండా క్రీడల వైపు ప్రస్తహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడిన ఘటనను గుర్తు చేస్తూ కేసీఆర్ ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా లోని యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లోగో పోస్టర్ ను సిరిసిల్ల తెలంగాణ భవన్ లో  ఆవిష్కరించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ . ఈ సందర్భంగా మీడియాతో వినోద్ కుమార్ మాట్లాడుతూ  జిల్లాలో రెండు మున్సిపాలిటీల నుండి 157 జట్లు 175 మ్యాచులు 2512 మంది క్రీడాకారులతో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ఈ నెల 15 నుండి 25 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో ఉన్న క్రికెట్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.క్రీడాకారులను ప్రోత్సహించాలన్న సంకల్పం తో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసుకుని ముందుకు పోతున్న తరుణం లో ఎన్నికల్లో తమ ప్రభుత్వం రాలేదని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలని ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయని అన్నారు.యువత చెడు వ్యసనాలకు గురికాకుండా క్రీడల వైపు ప్రస్తహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడిన ఘటనను గుర్తు చేస్తూ కేసీఆర్ ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడికి నిరసనగా ఈరోజు గజ్వేల్ బంద్‌కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ, బంద్‌లో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైఠాయించిన గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు పార్టీ శ్రేణులు....
    1
    గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడికి నిరసనగా ఈరోజు గజ్వేల్ బంద్‌కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ,
బంద్‌లో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైఠాయించిన గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు పార్టీ శ్రేణులు....
    user_Mulugu Vijay Kumar
    Mulugu Vijay Kumar
    Actor Siddipet Rural, Telangana•
    9 hrs ago
  • గజ్వేల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మరియు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి
    4
    గజ్వేల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి  మరియు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    21 hrs ago
  • జగిత్యాల: లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో పెగడపెల్లి గ్రామ పంచాయతీ సమీపంలో రేకుర్తి కంటి ఆసుపత్రి, లయన్ చిదుర సురేష్ (PDG) సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రోగ్రామ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. పెగడపెల్లి లో మా అమ్మమ్మ పుట్టిన ఊరని, ఇక్కడ సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్ సదుపాయం కల్పించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇది ఉపయోగకరమైంది.
    4
    జగిత్యాల: లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో పెగడపెల్లి గ్రామ పంచాయతీ సమీపంలో రేకుర్తి కంటి ఆసుపత్రి, లయన్ చిదుర సురేష్ (PDG) సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రోగ్రామ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు.
ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. పెగడపెల్లి లో మా అమ్మమ్మ పుట్టిన ఊరని, ఇక్కడ సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్ సదుపాయం కల్పించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇది ఉపయోగకరమైంది.
    user_Boga naga bhushanam
    Boga naga bhushanam
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • మాజీ CM కెసిఆర్ గారి మీద చేసిన అనుచ్చిటతవాక్యాలకు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ గాజ్వెల్ ఈ రోజు బందుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం గాజ్వెల్ అసెంబ్లీ ఇంచార్జ్ వట్టేరు ప్రతాపన్న గారి ఆధ్వర్యంలో భారీ రైలీ తీయడం జరిగింది
    2
    మాజీ CM కెసిఆర్ గారి మీద చేసిన అనుచ్చిటతవాక్యాలకు  వెంటనే క్షమాపణ చెప్పాలంటూ గాజ్వెల్ ఈ రోజు బందుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం గాజ్వెల్ అసెంబ్లీ  ఇంచార్జ్ వట్టేరు ప్రతాపన్న గారి ఆధ్వర్యంలో భారీ రైలీ తీయడం జరిగింది
    user_KingstarAshok KSR
    KingstarAshok KSR
    జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    10 hrs ago
  • కామారెడ్డి జిల్లా క్రైం : జూదం అనేది కేవలం ఒక ఆట కాదని, అది జీవితాలను చిన్నాభిన్నం చేసే ఒక మహమ్మారని, క్షణికమైన ఆశతో, కష్టపడకుండా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో జూదం వైపు అడుగులు వేసే వారు తమ బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. ఒక్క రూపాయి గెలిస్తే వంద రూపాయిలు పోగొట్టుకునే ఈ వ్యసనం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. సమాజంలో గౌరవాన్ని కోల్పోవడమే కాకుండా, మానసిక ప్రశాంతతను, ఆర్థిక స్థిరత్వాన్ని జూదం దూరం చేస్తుంది. ముఖ్యంగా యువత ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి, కష్టార్జితాన్ని నమ్ముకున్నప్పుడే గౌరవప్రదమైన మరియు సుఖమయమైన జీవితం సాధ్యమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు దేవునిపల్లి పోలీసులు జూదరులపై ఉక్కుపాదం మోపారు. విశ్వసనీయ సమాచారం మేరకు కల్కి నగర్ ప్రాంతంలో జూదం స్థావరంపై స్పెషల్ టీమ్, దేవునిపల్లి పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో జూదం ఆడుతున్న 9 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో నిందితుల నుండి భారీగా నగదు,వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారి వద్ద నుండి రూ. 26,770 నగదుతో పాటు, 9 మొబైల్ ఫోన్లు, 6 స్కూటీలు, 2 కార్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితులందరినీ దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారిపై కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఏ రూపంలోనైనా సరే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని తెలిపారు. జూదం, పేకాట, బెట్టింగ్ వంటి అసాంఘిక పనులు ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీయడమే కాకుండా సామాజిక అశాంతికి కారణమవుతున్నాయని జిల్లా ఎస్పీ అన్నారు. ముఖ్యంగా యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో తప్పుదారులను ఎంచుకుని తమ విలువైన భవిష్యత్తును పాడుచేసుకోవద్దని, కష్టపడకుండా ఏదీ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాలపై పోలీసు యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచి ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఎక్కడైనా ఇలాంటి పనులు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
    1
    కామారెడ్డి జిల్లా క్రైం : జూదం అనేది కేవలం ఒక ఆట కాదని, అది జీవితాలను చిన్నాభిన్నం చేసే ఒక మహమ్మారని, క్షణికమైన ఆశతో, కష్టపడకుండా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో జూదం వైపు అడుగులు వేసే వారు తమ బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. ఒక్క రూపాయి గెలిస్తే వంద రూపాయిలు పోగొట్టుకునే ఈ వ్యసనం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. సమాజంలో గౌరవాన్ని కోల్పోవడమే కాకుండా, మానసిక ప్రశాంతతను, ఆర్థిక స్థిరత్వాన్ని జూదం దూరం చేస్తుంది. ముఖ్యంగా యువత ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి, కష్టార్జితాన్ని నమ్ముకున్నప్పుడే గౌరవప్రదమైన మరియు సుఖమయమైన జీవితం సాధ్యమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా ఎస్పీ  రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు దేవునిపల్లి పోలీసులు జూదరులపై ఉక్కుపాదం మోపారు. విశ్వసనీయ సమాచారం మేరకు కల్కి నగర్ ప్రాంతంలో  జూదం స్థావరంపై స్పెషల్ టీమ్, దేవునిపల్లి పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో జూదం ఆడుతున్న 9 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో నిందితుల నుండి భారీగా నగదు,వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారి వద్ద నుండి రూ. 26,770 నగదుతో పాటు, 9 మొబైల్ ఫోన్లు, 6 స్కూటీలు,  2 కార్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితులందరినీ దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారిపై కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ జిల్లాలో ఏ రూపంలోనైనా సరే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని తెలిపారు. జూదం, పేకాట, బెట్టింగ్ వంటి అసాంఘిక పనులు ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీయడమే కాకుండా సామాజిక అశాంతికి కారణమవుతున్నాయని జిల్లా ఎస్పీ అన్నారు. ముఖ్యంగా యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో తప్పుదారులను ఎంచుకుని తమ విలువైన భవిష్యత్తును పాడుచేసుకోవద్దని, కష్టపడకుండా ఏదీ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
అక్రమ కార్యకలాపాలపై పోలీసు యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచి ఉంటుందని ఎస్పీ  తెలిపారు. ఎక్కడైనా ఇలాంటి పనులు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.