మిర్యాలగూడ ఇస్లాంపూర్ లో ఘనంగా ఇఫ్తార్ విందు... హాజరైన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని 47వ వార్డ్ ఇస్లాం పురం నందు మాజీ కౌన్సిలర్ *ఘని గారు* మరియు కౌన్సిలర్ *ఫరూక్ గారి* ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినం 24వ రోజు ఉపవాస దీక్షలలో భాగంగా నిర్వహించిన.. *ఇఫ్తార్ విందు* కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు.. ఈ సందర్భంగా *MLA -BLR గారు* మాట్లాడుతూ.. భక్తి శ్రద్దతలో నిర్వహించే పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలను 24 రోజులు విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసారు.. ప్రతిఒక్కరు ఈ పవిత్ర ఉపవాస దీక్షలను భక్తి శ్రద్దలతో పూర్తి చేసుకొని అల్లా ఆశీస్సులు పొందాలని అన్నారు.. మనం ఎల్లప్పుడూ మన మిర్యాలగూడలో కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో ఉంటూ.. ఇరు మతాలను గౌరవించుకుంటూ ఈ సమాజానికి ఆదర్శ వంతంగా ఉండాలని అన్నారు.. అలాగే మిర్యాలగూడ నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సోదరులకు అందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రస్ నాయకులు గుడిపాటి నవీన్, అబ్దుల్లా, ఇంద్ర కుమార్, రవి నాయక్, మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు..
మిర్యాలగూడ ఇస్లాంపూర్ లో ఘనంగా ఇఫ్తార్ విందు... హాజరైన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని 47వ వార్డ్ ఇస్లాం పురం నందు మాజీ కౌన్సిలర్ *ఘని గారు* మరియు కౌన్సిలర్ *ఫరూక్ గారి* ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినం 24వ రోజు ఉపవాస దీక్షలలో భాగంగా నిర్వహించిన..
*ఇఫ్తార్ విందు* కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు.. ఈ సందర్భంగా *MLA -BLR గారు* మాట్లాడుతూ.. భక్తి శ్రద్దతలో నిర్వహించే పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలను 24 రోజులు
విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసారు.. ప్రతిఒక్కరు ఈ పవిత్ర ఉపవాస దీక్షలను భక్తి శ్రద్దలతో పూర్తి చేసుకొని అల్లా ఆశీస్సులు పొందాలని అన్నారు.. మనం ఎల్లప్పుడూ మన మిర్యాలగూడలో కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో ఉంటూ.. ఇరు మతాలను గౌరవించుకుంటూ ఈ
సమాజానికి ఆదర్శ వంతంగా ఉండాలని అన్నారు.. అలాగే మిర్యాలగూడ నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సోదరులకు అందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రస్ నాయకులు గుడిపాటి నవీన్, అబ్దుల్లా, ఇంద్ర కుమార్, రవి నాయక్, మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు..
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మర్రిగూడ బైపాస్ వద్ద మరియు స్థానిక డిఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు.. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరణ... అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి” – మంత్రి... కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు... అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ...1
- నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారింది. గ్రామపంచాయతీలో సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చాల్సింది పోయి, డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ దహనం చేస్తున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సేగ్రిగేషన్ షెడ్డును వెంటనే వినియోగంలోకి తెచ్చి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని పెంచాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- ఈరోజు లింగాల ఘనపూర్ మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అమల సుమలత మరియు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు ముఖ్య నాయకులు అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సిద్ధవటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది4
- కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.1
- వరంగల్ జిల్లా లో: ఎన్ఐటి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. హనుమకొండ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న ఆటో, హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సును వెనుక నుంచి ఢీకొంది. దీంతో డ్రైవర్ ఆటోలోనే ఇరుక్కుపోగా, ఎడమ కాలు విరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి అతడిని బయటకు తీసి 30 నిమిషాల్లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.1
- ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన పరిపాలన భవనానికి అంబేద్కర్ ఫూలే పేరుపెట్టాలని, అదేవిధంగా వారి పేరు మీద ఫెలోషిప్లను కూడా అందజేయాలని ఓయూ జేఏసీ చైర్మన్, పీహెచ్డీ స్కాలర్ కొత్తపల్లి తిరుపతి కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిబిఎస్ఏ అధ్యక్షులు నలగంటి శరత్, బహుజన విద్యార్థి సంఘాల అధ్యక్షులు వేల్పుల సంజయ్, టిఎస్ఎఫ్ అధ్యక్షులు జంపాల రాజేష్ పాల్గొని ఈ మేరకు ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో 135 వ అంబేద్కర్ జయంతినీ పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ వద్ద ప్రభుత్వం నిర్మించబోయే జగ్జీవన్ రామ్, అంబేద్కర్ నాలెడ్జ్ పార్క్ ను విద్యార్థులుగా స్వాగతిస్తున్నామని, ఈ నాలెడ్జ్ సెంటర్ ను నిర్మించడానికి పూనుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. పొలిటికల్ జేఏసీ నరసింహ, డిబిఎస్ఏ నాయకులు జంగిలి దర్శన్, మధు, ఓయూ జెఏసి మరియు ఎన్టీవీఎస్ ప్రెసిడెంట్ చరణ్, ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి దరువు రమేష్, ఓయూ జేఏసీ నాయకులు రాజేందర్, ప్రవీణ్,సంజీవ్, అరుణ్,కరుణాకర్, ఉదయ్, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.5
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో హెడ్‌మాస్టర్ అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటన చోటుచేసుకుంది. హనుమాన్ మాల ధరించిన 7వ తరగతి విద్యార్థి ఓంకార్‌ను పాఠశాలలోకి రాకుండా హెడ్‌మాస్టర్ ఝాన్సీ రాణి అడ్డుకున్నట్లు సమాచారం. మాల తీసివేసి పాఠశాలకు రావాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులు ప్రశ్నించగా హెడ్‌మాస్టర్ దుర్భాషలాడినట్లు వారు ఆరోపించారు. హెడ్‌మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1