Shuru
Apke Nagar Ki App…
ఆత్మకూరులో వైయస్సార్ వర్ధంతి వేడుకలు: వైయస్సార్ చేసిన సేవలు మరువలేనివి ఆత్మకూరు మండలం నల్ల కాలువలో దివంగత నేత డాక్టర్ వైయస్సార్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం శ్రీశైలం నియోజకవర్గ నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ శృతి వనంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
Syed Rafi
ఆత్మకూరులో వైయస్సార్ వర్ధంతి వేడుకలు: వైయస్సార్ చేసిన సేవలు మరువలేనివి ఆత్మకూరు మండలం నల్ల కాలువలో దివంగత నేత డాక్టర్ వైయస్సార్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం శ్రీశైలం నియోజకవర్గ నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ శృతి వనంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రైతుల కోసం గొడ్డల పార్టీ నాయకులు డ్రామా అంటున్న MLA గిత్తజయసూర్య వెలుగోడు జలాశయం ముట్టడి పేరుతో వైసీపీ డ్రామాలు – నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య నంద్యాల: వెలుగోడు జలాశయం ముట్టడి పేరుతో వైసీపీ నేతలు చేస్తున్నది రైతుల కోసం పోరాటం కాదని, కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న డ్రామాలని నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య గారు తీవ్రంగా విమర్శించారు. బుధవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి తదితరులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం వల్లే సాగునీటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. నీటి లభ్యతపై ప్రభుత్వం ఆరు నెలల ముందుగానే స్పష్టమైన సమాచారం ఇచ్చినప్పటికీ, ఇప్పుడు రైతులను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి డ్రామాలు హడావుడి చేయడం సరికాదన్నారు. “రైతులపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం ఏం చేశారో ముందుగా చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రైతుల ప్రయోజనాల కోసం చేసిన పోరాటాలను వైసీపీ నేతలు మరిచిపోయారా?” అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలను మరియు రైతులను తప్పుదోవ పట్టించే రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ప్రస్తుతం నెలకొన్న సాగునీటి సమస్యపై కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని, రైతులకు సాధ్యమైనంత మేర సాగునీరు అందించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల ప్రయోజనాల దృష్టిలోనే ప్రతి నిర్ణయం తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు పేర్కొన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయ ఆరోపణలు, ప్రచారాలను రైతులు నమ్మవద్దని ఆయన కోరారు. రైతుల కోసం ఎన్డీయే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ప్రస్తుత పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.1
- ఆత్మకూరులో వైయస్సార్ వర్ధంతి వేడుకలు: వైయస్సార్ చేసిన సేవలు మరువలేనివి ఆత్మకూరు మండలం నల్ల కాలువలో దివంగత నేత డాక్టర్ వైయస్సార్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం శ్రీశైలం నియోజకవర్గ నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ శృతి వనంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.1
- తాడిపత్రిలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు... తాడిపత్రి పట్టణంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షిస్తూ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరై వేడుకలను1
- నేపాల్ భారత్‌లో విలీనం ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించారా? 1956లో నేపాల్‌ను భారత్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తిరస్కరించారని, నేపాల్ హిందూ దేశంగా ఉన్నందున దానికి బాహ్య మద్దతు ఉండకూడదనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనివల్ల నేపాల్ క్రమంగా చైనా, పాకిస్థాన్‌లకు దగ్గరవుతూ, తన ఆర్థిక అవసరాల కోసం మాత్రం భారత్‌పై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. చైనాను నమ్మిన నేపాల్ చివరకు నష్టపోయిందని, ప్రస్తుత పరిస్థితులకు గతంలో తీసుకున్న రాజకీయ నిర్ణయాలే కారణమని ఈ వాదనలో పేర్కొంటున్నారు. అయితే 1956లో నేపాల్ భారత్‌లో విలీనం కావాలని అధికారికంగా ప్రతిపాదించిందనే విషయానికి విశ్వసనీయ చారిత్రక ఆధారాలు ఉన్నాయా అనేది నిర్ధారించాల్సిన అంశం. వందే మాతరం 🇮🇳1
- శ్రీకృష్ణ కాల చక్రం పూజలు జిల్లా వనపర్తి మర్రికుంట లొ జరుపుకోవాలని మన ప్రియతమా నాయకుడు మేఘరెడ్డి గారు ప్రజలు క్షేమం కోసం పూజలు జరిపిచాటం చేస్తున్నారు శ్రీ కృష్ణ కాల చక్రం ప్రజలు అందరూ ఎళ్ళావేళ్ళాల ఆయురారోగ్యాలతో ఉండాలని శివుడుకి మరియు అమ్మవారికి పూజలు మరియు హోమం లు చేస్తున్నారు. అన్నదానం కార్యక్రమం. అమ్మవారికి కుంకుమ అర్చన కార్యక్రమంలో పాల్గోని ప్రజలు విక్షిస్తున్నారు.2
- వనపర్తి జిల్లా కేంద్రంలోని ఘనంగా బోనాల పండుగ సంబరాలు జరిగాయి. వనపర్తి పట్టణ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా జరిగాయి. బోనాల పండుగ పురస్కరించుకొని కుమ్మర్లు ఐక్యతతో ప్రతి సంవత్సరం వనపర్తి పాత బజార్ పాత బజార్ నుంచి అధిక సంఖ్యలో మహిళలు బోనం ఎత్తుకొని డప్పుల సందడితో బోనం కుండలో నైవేద్యంగా అమ్మవారికి, సమర్పించి చల్లగా చూడాలని చెప్పి ఆశీస్సులు ఆశీర్వాదాలు తీసుకుంటారు1
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సీడ్ బాల్స్ పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమం బద్వేలు, సెప్టెంబర్ 02: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ శాఖ మంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా బద్వేలులో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. బద్వేలు ఎఫ్.ఆర్.ఓ కె.ఎం. నయీమ్ అలీ ఆధ్వర్యంలో, వారి సిబ్బంది, శ్రీ లలితమ్మ ఆలయ కమిటీ చైర్మన్, కొత్త చెరువు గ్రామ పెద్దలు, బద్వేలు పబ్లిక్ స్కూల్, కొత్తవారిపేట ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి సీడ్ బాల్స్ (విత్తనపు ఉండలు) తయారీ మరియు తాటి విత్తనాలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. "తరగతి గదిలో ఒక చెట్టు" కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరినీ శ్రీ లలితమ్మ అభయకారిణి ఆలయం వద్దకు తీసుకెళ్లి తాటి చెట్ల ప్రాముఖ్యత, సీడ్ బాల్స్ తయారీ విధానం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మరియు అడవుల పెంపకం ఆవశ్యకతపై క్లుప్తంగా వివరించారు. విద్యార్థులు, ప్రజలతో కలిసి ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.3
- బద్వేలులో దుకాణంలో చోరీ - రూ.34 వేల సరుకు అపహరణ....... బద్వేలు, సెప్టెంబర్ 1: బద్వేలు పట్టణంలోని కెనరా బ్యాంక్ సమీపంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. జిరాక్స్, చిల్లర అంగడి నిర్వహిస్తున్న అంకయ్యకు చెందిన దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణంలో ఉన్న సుమారు రూ.34 వేల విలువైన సీక్రెట్ ప్యాకెట్లనుఅపహరించినట్లు బాధితుడుఆరోపిస్తున్నాడు. ఘటనపై బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీకి పాల్పడిన వారిని గుర్తించి, సొత్తును ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నాడు. పరిసర సీసీ కెమెరాలను పరిశీలిస్తే నిందితులను గుర్తించే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.2