Shuru
Apke Nagar Ki App…
మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చాటినప్పుడే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని సినీనటి రెజీనా పేర్కొన్నారు. డెమోక్రటిక్ సంఘం అధ్యక్షుడు బ్రహ్మచారి చైతన్య ఆధ్వర్యంలో కరీంనగర్ లోని కళాభారతిలో ఇటీవల ఎన్నికైన మహిళా వార్డుసభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. అనంతరం మహిళా వార్డు మెంబర్లను వారు సన్మానించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చాటినప్పుడే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని సినీనటి రెజీనా పేర్కొన్నారు. డెమోక్రటిక్ సంఘం అధ్యక్షుడు బ్రహ్మచారి చైతన్య ఆధ్వర్యంలో కరీంనగర్ లోని కళాభారతిలో ఇటీవల ఎన్నికైన మహిళా వార్డుసభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. అనంతరం మహిళా వార్డు మెంబర్లను వారు సన్మానించారు.
More news from Telangana and nearby areas
- వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు1
- Post by Ravi Poreddy1
- పులి సంచరిస్తోంది..జర పైలం జన్నారం మండలంలోని చింతగూడ, మొహమ్మదాబాద్ అడవిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం చింతగూడ అటవీలో పెద్దపులి అరుపులను అధికారులు గుర్తించారు. అలాగే మహమ్మదాబాద్ అడవిలో పులి సంచరిస్తుందని ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో చింతగూడ, మొహమదాబాద్, తపాలాపూర్ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అడవి వైపు ఎవరూ వెళ్లొద్దన్నారు. విద్యుత్ వైర్లు పెడితే వన్యప్రాణులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. పులి సంచారం దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎఫ్డిఓ రామ్మోహన్ కోరారు.1
- జనగామ జిల్లా చిల్పూర్‌లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పేరుతో భారీగా దోపిడీ జరిగిందని, ప్రభుత్వ పథకాలు, పదవులు, పనులను అమ్ముకున్న చరిత్ర గత పాలకులదని విమర్శించారు. బీ ఫారాలు, దళిత బంధు వంటి పథకాల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృమూర్తులు, విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను, మన సంస్కృతి–సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రిన్సిపాల్ కే. అమర్నాథ్ గారు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.4
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని వార్డులలో ఓటర్ల విభజనకు సంబంధించిన అంశంలో తీవ్ర అవకతవకలు నెలకొన్న నేపథ్యంలో గజ్వేల్ 6వ వార్డు నుంచి కమ్మరి శ్రీను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని కలిసి సంబంధిత ఆధారాలతో కూడిన వినతి రిప్రజెంటేషన్ పత్రాన్ని గజ్వేల్ పరిధిలోని వార్డులలో నివసిస్తున్న ఓటర్లను ఆయా వార్డులకు కాకుండా మిగతా వార్డులలో బదిలీ చేయడం అంశంపై తీవ్రమైన వ్యతిరేకతను తెలుపుతూ వినతి పత్రాన్ని అందజేసినారు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులలో నివసిస్తున్న ఓటర్లను అదే వార్డులో ఓటరుగా గుర్తించి ఆమోదించాలని తద్వారా ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులకు ఆయా వార్డులలోని నివసిస్తున్న ప్రజలకు పరిపాలన సౌలభ్యం మరియు సమస్యలపై ప్రశ్నించే అధికారం ఉంటుందని తెలిపారు. ఇట్టి విషయంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారం కోసమై ఆదేశాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇట్టి సమస్య పరిష్కరించబడని పరిస్థితులలో అవసరమైతే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మునిసిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో పాటు అవసరమైతే తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేసి ఓటర్లకు న్యాయం జరిగేంతవరకు న్యాయపోరాటం చేస్తాము ఆయన తెలియజేశారు.1
- రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం. ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులు గత 17 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్య దర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గత ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదని, కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని, బకాయి ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.1
- జగిత్యాల జిల్లా కొండగట్టులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.83,12,000 చెక్కులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. బాధితుల పునరావాసానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. టెంపుల్ సిటీ కారిడార్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం, అధికారులు పాల్గొన్నారు.2