Shuru
Apke Nagar Ki App…
ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకాలపై నిషేధం. . అమరావతి భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 258 గ్రామాల్లో కొత్త బోర్ల తవ్వకాలపై పూర్తిగా నిషేధం విధించింది. అలాగే భూగర్భ జలాల వినియోగాన్నీ పరిమితం చేసింది. ఈ జాబితాలో ప్రకాశం జిల్లాలోని 91 గ్రామాలు, శ్రీకాకుళం జిల్లాలో 76, శ్రీ సత్యసాయి జిల్లాలో 39 గ్రామాలు ఉన్నాయి. అదనంగా పల్నాడు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని మరికొన్ని గ్రామాలను కూడా చేర్చారు. తాగునీటి అవసరాల కోసం చేతి పంపుల ఏర్పాటు మినహా కొత్త బోర్లు, ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Raju Paragati

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గుంటూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తమ విజ్ఞాపనలను నేరుగా కలెక్టర్‌కు అందజేసి, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కోరారు.1
- ఖమ్మం లో పోగొట్టుకున్న బ్యాగ్ బాధితురాలికి అప్పగించిన ట్రాఫిక్ పోలీసులు, ఆటో డ్రైవర్1
- అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తుమ్మలవందలో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులతో స్థానికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది, వారి జీవనోపాధికి భరోసా లభించింది.1
- Post by N Nagaraju2
- బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం: రామన్నపేటలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో భారీ నిరసన మైనర్ బాలికను లైంగిక వేధింపులను గురి చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లక్ష్మీపురం లారీ యార్డు వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీహార్‌కు చెందిన కుందన్ సింగ్‌ను బండరాయితో కొట్టి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.1
- శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఓంకార జపం, శివ భజనలు. . అమరావతి: శ్రీ అమరేశ్వరస్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న “సోమనాథ స్వాభిమాన పర్వ్ – 1000 సంవత్సరాల అచంచల విశ్వాసం” కార్యక్రమంలో భాగంగా శివాలయంలో ఓంకార జపం,శివ భజనలు,భక్తి గీతాలు చేపట్టారు. “సోమనాథ సంకల్పం” కార్యక్రమం నిర్వహించి భక్తులతో సంకల్పం చేయించారు. మహిళల భాగస్వామ్యంతో కళశ యాత్రలు చేపట్టారు1
- ఖమ్మం లో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన1
- బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: సుభాషిని నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుభాషిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలో దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోతున్నామని అనేక మంది రైతులు చెబుతున్నారని, భూమి సారం కోల్పోవడం ద్వారా దిగుబడి తగ్గుతుందని అధికారులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో బత్తాయికి రేటు ఉందని తెలిపారు.1