📢 ప్రజాభిప్రాయ సర్వే – ప్రకటన తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని సమగ్రంగా తెలుసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సర్వే నిర్వహించబడుతుంది. ఈ సర్వేలో “ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి ఎన్నికలు జరగాలి” అనే అంశంపై ప్రజల అభిప్రాయాలు నమోదు చేయబడతాయి. సర్వే పరిధి ఈ సర్వే క్రింది స్థాయిలలో నిర్వహించబడుతుంది: ప్రతి గ్రామం – గ్రామ వార్డులు ప్రతి మండలం – మండల వార్డులు ప్రతి జిల్లా – జిల్లా వార్డులు సర్వే ఉద్దేశ్యం ప్రజల వాస్తవ అభిప్రాయాన్ని సంఖ్యాత్మకంగా నమోదు చేయడం ప్రాంతాల వారీగా అభిప్రాయ ధోరణులను అంచనా వేయడం ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల ఆశలను పత్రబద్ధం చేయడం పాల్గొనేవారికి సూచనలు సర్వే బృందానికి నిజమైన సమాచారం ఇవ్వండి మీ అభిప్రాయం గోప్యంగా నమోదు చేయబడుతుంది ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా స్పందించండి ఈ సర్వే ద్వారా తెలంగాణ ప్రజల సామూహిక అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయడం లక్ష్యం.
📢 ప్రజాభిప్రాయ సర్వే – ప్రకటన తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని సమగ్రంగా తెలుసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సర్వే నిర్వహించబడుతుంది. ఈ సర్వేలో “ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి ఎన్నికలు జరగాలి” అనే అంశంపై ప్రజల అభిప్రాయాలు నమోదు చేయబడతాయి. సర్వే పరిధి ఈ సర్వే క్రింది స్థాయిలలో నిర్వహించబడుతుంది: ప్రతి గ్రామం – గ్రామ వార్డులు ప్రతి మండలం – మండల వార్డులు ప్రతి జిల్లా – జిల్లా వార్డులు సర్వే ఉద్దేశ్యం ప్రజల వాస్తవ అభిప్రాయాన్ని సంఖ్యాత్మకంగా నమోదు చేయడం ప్రాంతాల వారీగా అభిప్రాయ ధోరణులను అంచనా వేయడం ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల ఆశలను పత్రబద్ధం చేయడం పాల్గొనేవారికి సూచనలు సర్వే బృందానికి నిజమైన సమాచారం ఇవ్వండి మీ అభిప్రాయం గోప్యంగా నమోదు చేయబడుతుంది ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా స్పందించండి ఈ సర్వే ద్వారా తెలంగాణ ప్రజల సామూహిక అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయడం లక్ష్యం.
- కామారెడ్డి జిల్లా బిచ్కుంద నగర పంచాయతీ తొలి మున్సిపల్ ఛైర్మన్గా సీమా శెట్కార్, వైస్ ఛైర్మన్గా భాగ్యలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణతో 10 వార్డుల్లో ఘనవిజయం సాధించి, ఏకగ్రీవ ఎన్నికను సుగమం చేశామన్నారు. నూతన పాలకవర్గం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టణ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.1
- మెదక్ లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.మాజీడిప్యూటీస్పికర్ పద్మదేవేందర్ రెడ్డి మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72 వ జన్మదిన వేడుకలు.జ, రిగాయి. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ కేసీఆర్ గారి 72వ జన్మదిన వేడుకలు మంగళవారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.మాజీ డిప్యూటీ స్పీకర్,జిల్లా పార్టీ అధ్యక్షురాలు యం పద్మ దేవేందర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేసి కెసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరంపార్టీ శ్రేణులు ఒకరికొకరు కేకు తినిపించుకున్నారు.ఈ సందర్భంగా యం. పద్మ దేవేందర్ రెడ్డిమాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం కోసం అనేక కష్టాలు నోచుకుని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల కల నెరవేరించింది కెసిఆర్ అని అన్నారు.10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణను 29వ రాష్ట్రం నుండి నెంబర్ వన్ స్థాయికి తెచ్చిన ఘనత కేసిఆర్ దే అని పేర్కొన్నారు. మెదక్ జిల్లా తరఫున బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరఫున కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు. రాబోయే కాలంలో తెలంగాణలో తప్పకుండా మళ్లీ ముఖ్యమంత్రిగా కెసిఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని,మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి,పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు,సెక్రటరీ. కృష్ణ గౌడ్ , బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ లు లలిత,స్వరూప,గంగామణి,ఉదయ్ కుమార్,జుబేర్ అహ్మద్, దీపక్,మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కొట్టాల. విశ్వం,ఆర్కే శ్రీనివాస్,మాయ.మల్లేశం, చంద్రకళ,విజయలక్ష్మి,మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యం.లావణ్య రెడ్డి ,మెదక్ మండల పార్టీ అధ్యక్షులు యం.అంజా గౌడ్, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి నాయకులు లింగ రెడ్డి,సురేందర్ గౌడ్,సంతోష్, మోచి. కిషన్,సాదిక్, కిషన్, ఇస్మాయిల్, లక్ష్మీనారాయణ, ఇందాద్, సాయిలు, సాప.సాయిలు, ఇలియాజ్ ,నరేందర్ రెడ్డి, సంజీవరెడ్డి, ప్రభాకర్, ఎంబిపూర్ మహేష్,రవి,మాజీ సర్పంచ్ లతోపాటు, మెదక్ పట్టణ, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కోడ్ ను అధికారులు ఎత్తివేశారు. రెండు వారాలు గా సాగిన మున్సి పోరు ప్రశాంతంగా ముగియడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి జిల్లాలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలు ఉండగా రామగుండం కార్పొరేషన్ తో పాటు 11 మున్సిపాలిటీలను కాంగ్రెస్, కరీంనగర్ కార్పోరేషన్ ను బిజేపి, సిరిసిల్ల జమ్మికుంట రాయికల్ మున్సిపాలిటీలను బిఆర్ఎస్ కైవసం చేసుకుంది. సోమవారం కోరం లేక వాయిదా పడ్డ సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారం నిర్వహించారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఏకపక్షంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు నేతృత్వంలో 12మంది కాంగ్రెస్ కౌన్సిలర్ లు ప్రత్యేక సమావేశానికి హాజరై కౌన్సెలర్ గా ప్రమాణ స్వీకారం చేసి చైర్మన్ వైస్ చైర్మన్ ను ఎన్నుకున్నారు. చైర్మన్ గా బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ గా అంతటి పుష్పలత ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన పాలక వర్గాన్ని ఎమ్మెల్యే తోపాటు అధికారులు అభినందించారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట వైపు అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న పులి రెండు రోజులుగా సంచరిస్తూ మూడు ఆవు దూడలను బలి తీసుకుంది. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పులిని అడవిలోకి తరలించే చర్యలు చేపట్టారు.2
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 17 ప్రజా తెలంగాణ న్యూస్/ ఆర్డిఓ చంద్రకళ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మున్సిపాలిటీలో గెలిచిన 20 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ అభ్యర్థులు ఎన్నుకోవడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన చైర్ పర్సన్ అభ్యర్థి గంగిశెట్టి చందనను 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కార్ పద్మాబాయి 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. 11 మంది బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు బిజెపి అభ్యర్థి ఒకరు, ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి కలిసి మద్దతు తెలపడం జరిగింది.2
- నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రత్యేక ఎన్నికల అధికారి ఎంపిక నిర్వహించగా ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. కాంగ్రెస్కు ఎంఐఎం మద్దతు తెలిపాడంతో మేయర్ పీఠం కాంగ్రెస్ దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమెను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, తోపాటుగా కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపారు.1
- కామారెడ్డి జిల్లా : ఎన్నికల వరకే రాజకీయాలు.. అభివృద్ధిలో అందరూ కలిసి రావాలి అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి CM రేవంత్ రెడ్డి రూ.300 కోట్ల ప్రత్యేక నిధులకు హామీ ఇచ్చారని షబ్బీర్ అలీ వెల్లడించారు. నిజామాబాద్ స్మార్ట్ సిటీ తరహాలోనే కామారెడ్డిని తీర్చిదిద్దుతామన్నారు. కొత్త పాలకవర్గం ప్రజల మెప్పు పొందేలా పనిచేయాలని కోరారు.1