Shuru
Apke Nagar Ki App…
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం, మ్యాన్‌హోల్‌లో పడి వృద్ధుడు గల్లంతు హైదరాబాద్ –మియాపూర్ వైశాలి నగర్ వద్ద ఉన్న రైల్వే అండర్‌పాస్ వద్ద తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి గల్లంతైన బాలయ్య(70) అనే వృద్ధుడు ఈ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా నాలా పనులు జరుగుతుండగా, మ్యాన్‌హోల్ మూసివేయకుండా వదిలేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF) రక్షక దళాలు
GB MAHENDAR
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం, మ్యాన్‌హోల్‌లో పడి వృద్ధుడు గల్లంతు హైదరాబాద్ –మియాపూర్ వైశాలి నగర్ వద్ద ఉన్న రైల్వే అండర్‌పాస్ వద్ద తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి గల్లంతైన బాలయ్య(70) అనే వృద్ధుడు ఈ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా నాలా పనులు జరుగుతుండగా, మ్యాన్‌హోల్ మూసివేయకుండా వదిలేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF) రక్షక దళాలు
More news from తెలంగాణ and nearby areas
- శస్త్రచికిత్స లేకుండానే ప్రాణాపాయ రక్తస్రావానికి చెక్.. 41 ఏళ్ల మహిళ గర్భాశయాన్ని కాపాడిన మెడికోవర్ వైద్యులు శస్త్రచికిత్స లేకుండానే ప్రాణాపాయ రక్తస్రావానికి చెక్.. 41 ఏళ్ల మహిళ గర్భాశయాన్ని కాపాడిన మెడికోవర్ వైద్యులు మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ నిపుణులు అత్యాధునిక, మినిమల్లీ ఇన్వేసివ్ విధానంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 41 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స అందించి, గర్భాశయాన్ని తొలగించకుండా కాపాడారు. తీవ్రమైన యోని రక్తస్రావంతో బాధపడుతున్న మహిళకు సంప్రదాయ శస్త్రచికిత్స అవసరం లేకుండా "నో సర్జరీ – నో స్కార్" విధానంలో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సాంకేతికతను ఉపయోగించి రక్తస్రావాన్ని నియంత్రించారు. దీంతో గర్భాశయాన్ని తొలగించే అవసరం లేకుండా రోగి ప్రాణాలను, గర్భాశయాన్ని సురక్షితంగా కాపాడగలిగారు. ఈ సందర్భంగా మెడికోవర్ వైద్య నిపుణులు మాట్లాడుతూ, అసాధారణమైన యోని రక్తస్రావాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదించాలని సూచించారు. ఆధునిక ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా అనేక గైనకాలజీ సమస్యలకు శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. ఈ విధానంలో శరీరంపై పెద్ద కోతలు లేకుండా, మచ్చలు లేకుండా చికిత్స అందించడంతో పాటు రోగులు తక్కువ సమయంలోనే కోలుకుని సాధారణ జీవితానికి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుందని వైద్యులు వివరించారు. ఈ విజయవంతమైన చికిత్సకు సంబంధించిన వివరాలను హైటెక్ సిటీలోని మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆధునిక వైద్య సాంకేతికతతో మహిళల ఆరోగ్య సంరక్షణలో మెడికోవర్ అందిస్తున్న సేవలను వివరించారు.1
- చెరువుల పరిరక్షణే లక్ష్యంగా.. శేరిలింగంపల్లిలో హైడ్రాకు భారీ మద్దతు! హైదరాబాద్‌లోని తమ్మిడికుంట చెరువు వద్ద హైడ్రా (HYDRAA) చేపడుతున్న చర్యలకు ప్రజా మద్దతు మరింత పెరుగుతోంది. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ చేస్తున్న సాహసోపేతమైన ప్రయత్నాలకు సంఘీభావంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్-ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘం చైర్మన్ మేట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆక్రమణల చెర నుంచి జలవనరులను కాపాడుతూ, నగర భవిష్యత్తు కోసం హైడ్రా అడుగులు వేయడం అభినందనీయమని నాయకులు కొనియాడారు. ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జాలపై హైడ్రా ముద్రించే కఠిన చర్యలు నిరంతరం కొనసాగాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.4
- మైనంపల్లి హనుమంతరావు టూ ప్లస్ టు సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మైనంపల్లి హన్మంతరావు ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశాడని, ఏ తీవ్రవాద సంస్థ, ఏ మావోయిస్టులు ఆయనను టార్గెట్ చేశారని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు? కొండా మురళీ ఎమ్మెల్సీ కాదు, కార్పొరేషన్ చైర్మన్ కాదు. ఆయనకు 2+2 సెక్యూరిటీ ఇచ్చారు.. ఆయనకు ఏ హోదా ఉందని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు? ఏనుముల తిరుపతి రెడ్డి, ఏనుముల కొండల్ రెడ్డిలు ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశారని, ఏ ఉగ్రవాద సంస్థతో ముప్పు ఉందని, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక సెమీ ఆటోమేటెడ్ వెపన్స్ ఇచ్చారు? సునీతా మహేందర్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్‌పర్సన్. ఆమెకు గన్‌మెన్లను ఇచ్చారు సత్యవతి రాథోడ్ గారు తెలంగాణ రాష్ట్రంలో తొలి గిరిజన మహిళా మంత్రి.. ఆమె ఇప్పుడు మాజీ మంత్రి. ఆమె గన్‌మెన్లను తీసేశారు జోగు రామన్న మాజీ మంత్రి. ఆయన గన్‌మెన్లను తొలగించారు.. అదే జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డికి 2+2 గన్‌మెన్లను ఇచ్చారు ఎందుకు? కుందూరు జానారెడ్డి ప్రస్తుత హోదా ఏంటి? ఆయనకు 2+2 గన్‌మెన్లను ఇచ్చి, అత్యాధునిక బుల్లెట్‌ప్రూఫ్ వాహనం ఇచ్చారు జానారెడ్డి మాజీ మంత్రి అయితే సత్యవతి రాథోడ్, జోగు రామన్న కూడా మాజీ మంత్రులే కదా. మరి వీళ్లకు ఎందుకు సెక్యూరిటీ తొలగించారు? బీఆర్ఎస్ నాయకులకు ఒక న్యాయం.. కాంగ్రెస్ నాయకులకు ఒక న్యాయమా? దీని మీద డీజీపీ సమాధానం చెప్పాలి - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్1
- JAI BC ✊ SELF-RESPECT - POWER - Share 🔥 JAI TEENMAAR MALLANNA TRP Flag Unveiling Ceremony by Teenmar Mallanna in Mahabubnagar || Telangana Rajyadhikara Party1
- వెల్దుర్తి మండలంలో కురుస్తున్న వర్షాలతో జోరందుకున్నా వరి నాట్లు వెల్దుర్తి మండలంలో కురుస్తున్న వర్షాలతో వరి నాట్ల పనులు జోరందుకున్నాయి. అయితే స్థానికంగా వ్యవసాయ కూలీల కొరత తీవ్రంగా ఉండటంతో రైతులు ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలను ఆశ్రయిస్తున్నారు. బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన కూలీలు గ్రామాలకు చేరుకుని వరి నాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు. 12 మంది సభ్యులతో ఒక బృందంగా పనిచేస్తున్న ఈ వలస కూలీలు ఎకరానికి రూ.4,500 చొప్పున పారితోషికం తీసుకుంటున్నట్లు తెలిపారు. అనుభవంతో వేగంగా పనిచేస్తూ రోజుకు 6 ఎకరాలకు పైగా వరి నాట్లు పూర్తి చేస్తున్నామని చెప్పారు. వర్షాలు అనుకూలంగా ఉండటంతో సాగు ఆలస్యం కాకుండా ఉండేందుకు రైతులు కూడా వీరినే ఎక్కువగా ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా కూలీలు అందుబాటులో లేకపోవడంతో వలస కూలీల రాక ఈ సీజన్‌లో వ్యవసాయ పనులకు ఊతమిచ్చిందని రైతులు పేర్కొంటున్నారు.1
- మల్కాజిగిరి పరిధిలోని చిన్మయ మార్గ్–మిర్జల్‌గూడలో వర్షపు నీటి ముప్పు మల్కాజిగిరి పరిధిలోని చిన్మయ మార్గ్, మిర్జల్‌గూడ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కాలనీల్లోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు ఏరులై పారుతోంది. దీంతో రహదారులు జలమయంగా మారి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో దిగువ ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి నిల్వ, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోందని వారు పేర్కొన్నారు. వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులు ప్రాంతాన్ని పరిశీలించి, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1