logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరెంట్ తీగల కారణంగా రైతు మృతి, కుటుంబం సభ్యులు మృతదేహంతో ఆందోళన వరంగల్: గీసుకొండ మండలం మొగిలిచర్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం పంట పొలానికి వెళ్లిన గాద శ్రీను అనే రైతు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పందులను అడ్డుకునేందుకు బండారు కొమురయ్య పొలంలో కరెంట్ తీగలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఘటనపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు మృతదేహంతో అతని ఇంటి ముందు ధర్నా చేపట్టారు. కేసు నమోదు చేసిన ఏనుమాముల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

2 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
2 hrs ago

కరెంట్ తీగల కారణంగా రైతు మృతి, కుటుంబం సభ్యులు మృతదేహంతో ఆందోళన వరంగల్: గీసుకొండ మండలం మొగిలిచర్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం పంట పొలానికి వెళ్లిన గాద శ్రీను అనే రైతు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పందులను అడ్డుకునేందుకు బండారు కొమురయ్య పొలంలో కరెంట్ తీగలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఘటనపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు మృతదేహంతో అతని ఇంటి ముందు ధర్నా చేపట్టారు. కేసు నమోదు చేసిన ఏనుమాముల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్–సరిత దంపతుల కుమారుడు సాయి చరణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు జ్ఞాపకాలను శాశ్వతంగా నిలుపుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అతని రూపంలో నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు. నేడు కుమారుడి జన్మదినం సందర్భంగా ఆ విగ్రహానికి కొత్త రంగులు వేసి పూలమాలలతో అలంకరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను భావోద్వేగభరితంగా నిర్వహించారు. కుమారుడు తమతోనే ఉన్నాడన్న భావనతో ప్రతి ఏడాది ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
    1
    వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్–సరిత దంపతుల కుమారుడు సాయి చరణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు జ్ఞాపకాలను శాశ్వతంగా నిలుపుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అతని రూపంలో నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు.
నేడు కుమారుడి జన్మదినం సందర్భంగా ఆ విగ్రహానికి కొత్త రంగులు వేసి పూలమాలలతో అలంకరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను భావోద్వేగభరితంగా నిర్వహించారు. కుమారుడు తమతోనే ఉన్నాడన్న భావనతో ప్రతి ఏడాది ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక రిటైర్డ్ మాస్టర్ తన పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు తిరుగుతుంటాడు. అయినప్పటికీ అధికారులు పింఛన్ మంజూరు చేయకుండా లంచం కోరుతున్నట్లు చూపించారు. ఆ సన్నివేశంలో చదువు చెప్పిన గురువును కూడా ఒక మాజీ విద్యార్థి కూడా లంచం అడిగే అధికారిగా కనిపించడం హృదయాన్ని కలచివేస్తోంది. గురువునే లంచం అడిగే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అవినీతిని సూచిస్తోందని వీడియో సందేశం ఇస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
    1
    ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక రిటైర్డ్ మాస్టర్ తన పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు తిరుగుతుంటాడు. అయినప్పటికీ అధికారులు పింఛన్ మంజూరు చేయకుండా లంచం కోరుతున్నట్లు చూపించారు.
ఆ సన్నివేశంలో చదువు చెప్పిన గురువును కూడా ఒక మాజీ విద్యార్థి కూడా లంచం అడిగే అధికారిగా కనిపించడం హృదయాన్ని కలచివేస్తోంది. గురువునే లంచం అడిగే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అవినీతిని సూచిస్తోందని వీడియో సందేశం ఇస్తోంది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • తాను మాట్లాడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ ను అంకుల్ అంటూ సంబోధించిన బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్ తేజస్విని...* *ఎమ్మెల్యే ను సభలో అంకుల్ అంటారా..!! రిలేషన్ ఉంటే బయట ఇక్కడ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ లు...* *నేను అంత తప్పేం మాట్లాడానంటూ ప్రతివాదనకు దిగిన కౌన్సిలర్ తేజస్విని, మద్దతుగా గొంతుకలిపిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లు...* సభ్యుల అరుపులతో రసాభాస.., వేడి పుట్టించిన "అంకుల్" సంబోధన..!!* పరిస్థితి మరింత గోల..గోలగా మారకుండా..!! ఇరువర్గాలకు సర్దిచెప్పి కూర్చోబెట్టిన సిపిఐ మున్సిపల్ ప్లోర్ లీడర్ అజయ్ సారధి....*
    1
    తాను మాట్లాడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ ను అంకుల్ అంటూ సంబోధించిన బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్ తేజస్విని...*
*ఎమ్మెల్యే ను సభలో అంకుల్ అంటారా..!! రిలేషన్ ఉంటే బయట ఇక్కడ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ లు...*
*నేను అంత తప్పేం మాట్లాడానంటూ ప్రతివాదనకు దిగిన కౌన్సిలర్ తేజస్విని, మద్దతుగా గొంతుకలిపిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లు...*
సభ్యుల అరుపులతో రసాభాస.., వేడి పుట్టించిన "అంకుల్" సంబోధన..!!*
పరిస్థితి మరింత గోల..గోలగా మారకుండా..!!  ఇరువర్గాలకు సర్దిచెప్పి కూర్చోబెట్టిన సిపిఐ మున్సిపల్ ప్లోర్ లీడర్ అజయ్ సారధి....*
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    15 min ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భజలాలు అడుగంటి సాగునీరు అందక రైతులు వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రుద్రంగి మండలంలో రైతులు వాటర్ ట్యాంకర్ తో నీరందిస్తున్నారు. కొందరు రైతులు నీరు లేక పోవడంతో చేసేదేమీలేక పంట పొలాలను పశువులకు మేతగా వదిలిపెట్టారు. రుద్రంగి లో అచ్చయ్యకుంట చెరువు, బతుకమ్మ కుంట చెరువు, నాగారం చెరువు, సూరమ్మ చెరువు ఉన్నప్పటికీ వాటిలో నీరు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. అలాగే వర్షాలు కూడా ఎక్కువగా పడలేదని రైతులు అంటున్నారు. కనీసం కాళేశ్వరం ఎల్లంపల్లి నీటితోనైనా పంటను కాపాడుకుందాం అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి నీటిని విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పంటలు ఎండిన తర్వాత నీరందించి ఏంలాభం అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అదే నీటిని జనవరి నెలలో విడుదల చేసి ఉంటే పంటలు ఎండక పోవునని అన్నారు. జనవరి నెలలోనే చేరువులన్ని కాళేశ్వరం నీటితో నింపి ఉంటే భూగర్భజలాలు పెరిగి రైతులకు ఇంతటి కష్టంనష్టం జరగకపోవునని తెలిపారు. ఇప్పటికైనా త్వరగా నీటిని విడుదల చేస్తే మిగిలిన పంటనైన రైతులు కపాడుకుంటామని రైతులు అంటున్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భజలాలు అడుగంటి సాగునీరు అందక రైతులు వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రుద్రంగి మండలంలో రైతులు వాటర్ ట్యాంకర్ తో నీరందిస్తున్నారు. కొందరు రైతులు నీరు లేక పోవడంతో చేసేదేమీలేక పంట పొలాలను పశువులకు మేతగా వదిలిపెట్టారు. రుద్రంగి లో అచ్చయ్యకుంట చెరువు, బతుకమ్మ కుంట చెరువు, నాగారం చెరువు, సూరమ్మ చెరువు ఉన్నప్పటికీ వాటిలో నీరు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. అలాగే వర్షాలు కూడా ఎక్కువగా పడలేదని రైతులు అంటున్నారు. కనీసం కాళేశ్వరం ఎల్లంపల్లి నీటితోనైనా పంటను కాపాడుకుందాం అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి నీటిని విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పంటలు ఎండిన తర్వాత నీరందించి ఏంలాభం అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అదే నీటిని జనవరి 
నెలలో విడుదల చేసి ఉంటే పంటలు ఎండక పోవునని అన్నారు. జనవరి నెలలోనే చేరువులన్ని కాళేశ్వరం నీటితో నింపి ఉంటే భూగర్భజలాలు పెరిగి రైతులకు ఇంతటి కష్టంనష్టం జరగకపోవునని తెలిపారు. ఇప్పటికైనా త్వరగా నీటిని విడుదల చేస్తే 
మిగిలిన పంటనైన రైతులు కపాడుకుంటామని రైతులు అంటున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    15 min ago
  • నల్గొండ జిల్లా.. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2k రన్ కార్యక్రమం.. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 2కె రన్.. 2k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.. స్థానిక రాజీవ్ చౌక్ నుండి హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు కొనసాగిన 2 కే రన్.. చెత్తరహిత మిర్యాలగూడగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపు.. పరిసరాల పరిశుభ్రత,పచ్చదనం పెంపొందించడం తమ లక్ష్యం.. వచ్చే రెండేళ్లలో మిర్యాలగూడ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.
    1
    నల్గొండ జిల్లా..
మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2k రన్ కార్యక్రమం..
99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 2కె రన్..
2k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..
స్థానిక రాజీవ్ చౌక్ నుండి హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు కొనసాగిన 2 కే రన్..
చెత్తరహిత మిర్యాలగూడగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపు..
పరిసరాల పరిశుభ్రత,పచ్చదనం పెంపొందించడం తమ లక్ష్యం..
వచ్చే రెండేళ్లలో మిర్యాలగూడ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.
    user_Deevana
    Deevana
    Local News Reporter నార్కెట్‌పల్లి, నల్గొండ, తెలంగాణ•
    8 hrs ago
  • జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సరైన సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారానే వెల్లడిస్తానని స్పష్టం చేశారు.
    1
    జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సరైన సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారానే వెల్లడిస్తానని స్పష్టం చేశారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్లిమిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళ యువకుడు గాయపడ్డ సంఘటన తెలిసిందే.
    1
    నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్లిమిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళ యువకుడు గాయపడ్డ సంఘటన తెలిసిందే.
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    3 hrs ago
  • హన్మకొండ నగరంలోని మాస్టర్ జి డిగ్రీ & పీజీ కళాశాలలో నార్కోటిక్స్ మరియు డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నార్కోటిక్స్ మరియు డ్రగ్స్‌పై ప్రత్యేక అధికారి గిరిధర్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, యువతపై వాటి ప్రభావం గురించి వివరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితం గడపాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    2
    హన్మకొండ నగరంలోని మాస్టర్ జి డిగ్రీ & పీజీ కళాశాలలో నార్కోటిక్స్ మరియు డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నార్కోటిక్స్ మరియు డ్రగ్స్‌పై ప్రత్యేక అధికారి గిరిధర్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, యువతపై వాటి ప్రభావం గురించి వివరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితం గడపాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.