కోడిపందాలు, జూదం అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు - రావులపాలెం రూరల్ సిఐ సి.హెచ్.విద్యాసాగర్ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, పేకాట గుండాటలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని రావులపాలెం రూరల్ సిఐ సి.హెచ్.విద్యాసాగర్ హెచ్చరించారు. మంగళవారం రావులపాలెం రూరల్ సిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కోడి పందాలు జూదం అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లకుండా సంక్రాంతి పండుగను సాంప్రదాయ పద్దతిలో జరుపుకోవాలని సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు కొత్తపేట డిఎస్పీ సుంకర మురళీ మోహన్ పర్యవేక్షణలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నామని ప్రజలంతా సహకరించలని అన్నారు. రావులపాలెం రూరల్ సర్కిల్ పరిధిలోని ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు మండలాల్లో కోడిపందాలు జూదాలు నిర్వహించిన వారిపైనా, స్థల యాజమానులపైన కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని రూరల్ సిఐ విద్యాసాగర్ హెచ్చరించారు. ప్రజలంతా సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలన్నారు .శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు ప్రవర్తించిన వారు ఎంతటివరైనా సరే ఉపేక్షించేదిలేదన్నారు. మూడు మండలాల సర్కిల్ పరిధిలో సుమారు 100 బైండెవరు కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు ఎవరైనా జూదం కోడి పందాలు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే సిఐ విద్యాసాగర్ ( 9440796527), ఆత్రేయపురం ఎస్సై ఎస్ రాము ( 9440904839), ఆలమూరు ఎస్సై జి నరేష్ (9440904849), కొత్తపేట ఎస్సై జి సురేంద్ర (9440904842)లకు సమాచారం అందించాలన్నారు.

- #sankranthi #bhogi #sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi1
- 🙏🙏1
- 🙏🙏2
- 🙏🙏1
- పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- వెనుక నుంచి,ముందు నుంచి బండి తగిలిందని చిన్న గీత పడితే గొడవ చేసుకుని తలలు పగల కోలుగోట్టుకునే వారిని మనం చూస్తున్నాం .అయితే బంగ్లాదేశ్లో బస్సులు.. రాసుకుని పూసుకొని పెద్ద పెద్ద గీతలు పడిన బస్సు లోని పార్టులు ఊడిపోయినా ఏమి లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు... అక్కడి వారు...అది చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి రా బాబు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు1
- ముత్తోజిపేటలో మున్సిపాలిటీ అయినా శుభ్రత జాడలే లేవు...నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట కాలనీలో ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముత్తోజిపేట మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా రోడ్ల శుభ్రత, సైడ్ కాలువల శుభ్రపరిచే పనులు, శానిటేషన్ వర్కులు జరగకపోవడం స్థానికుల ఆవేదనకు కారణమవుతోంది. చెత్త పేరుకుపోవడం, కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉండటం అభివృద్ధికి మార్గం కావాల్సిన చోట, ముత్తోజిపేట వాసులకు అది శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శుభ్రత, శానిటేషన్ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.1
- 🙏🙏1